Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Mar 2023 09:21 IST

1. గన్నవరం ఎటు..?

ప్రముఖుల రాకపోకలు, విమానాశ్రయం భద్రత నేపథ్యంలో ఎన్టీఆర్‌ కమిషనరేట్‌లో విలీనంపై ఉన్నత స్థాయిలో సమాలోచనలు సాగుతున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే సర్వే కూడా నిర్వహించారు. కమిషనరేట్‌లో కలపడంపై మొగ్గు చూపినట్లు తెలిసింది. జిల్లాల విభజనలో భాగంగా మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్న గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం కృష్ణా జిల్లాలోకి వెళ్లింది. గతంలో నగర కమిషనర్‌ అజమాయిషీలో ఉండే గన్నవరం సర్కిల్‌ జిల్లా పోలీసు యూనిట్‌లో విలీనమైంది. విజయవాడకు గన్నవరం సమీపంలో ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ముంగిట ఉగాది.. ఇంటికి దారేది?

వరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో ఆపసోపాలు పడుతోంది. ఉగాది నాటికి కొన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి గృహ ప్రవేశాలు చేయించాలని పెట్టుకున్న లక్ష్యం క్షేత్రస్థాయిలో నెరవేరడం లేదు. క్షేత్రస్థాయి యంత్రాంగం లబ్ధిదారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నా నిర్మాణాల్లో ప్రగతి అంతంత మాత్రమే. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అనుకున్న మేరకు ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మెడలో మెరిస్తే మాయమే!

ర్ధరాత్రి వేళ మహిళ ధైర్యంగా నడిచే రోజుల మాటేమిటోగాని పట్టపగలైనా ఆ పరిస్థితి కనిపించని దుస్థితి. మెడలో బంగారు హారం మెరిస్తే చాలు దొంగలు వెంటాడుతున్నారు. ద్విచక్రవాహనంపై వేగంగా వచ్చి అంతే వేగంతో బంగారు గొలుసును తస్కరిస్తున్నారు. ఇటీవల రాచకొండ, హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఇలాంటి ఘటనలు తీవ్రమవుతున్నాయి. కొందరు యువకులు జల్సాలకు ఇలాంటి చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కారులో అసమ్మతి సెగలు

అధికార పార్టీలో అసమ్మతి సెగలు ముఖ్యనేతలకు తలనొప్పిగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపించే వేళ పాలమూరులో అసమ్మతి రాగం రోజురోజుకు పెరుగుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని సగం నియోజకవర్గాల్లో అధికార పార్టీలో బహిరంగంగానే ముఖ్య ప్రజాప్రతినిధులపై భారాస శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏకంగా మీడియా ముందుకొచ్చి మాట్లాడుతుండటంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ ప్రమోషన్స్‌.. తమ్మారెడ్డిపై రాఘవేంద్రరావు ఆగ్రహం

టాలీవుడ్‌ సీనియర్‌ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ(Tammareddy Bharadwaj)పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (Raghavendra Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) ఆస్కార్‌ ప్రమోషన్స్‌ను ఉద్దేశిస్తూ తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ప్రపంచవేదికపై మన సినిమా సత్తా చాటుతున్నందుకు గర్వపడాలన్నారు. సరైన సమాచారం లేకుండా ఖర్చుల గురించి ఎలా కామెంట్స్‌ చేస్తారని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఎండల్లో బుజ్జాయి భద్రమిలా..

ఎండలు తెచ్చే తంటాలు అన్నీ ఇన్నీ కావు. చిరాకు, చెమట, చర్మ సంబంధిత సమస్యలు ఉఫ్‌... ఒకటా రెండా చెబుతుంటే ఓ పెద్ద జాబితానే తయారవుతుంది. మరి మనమే ఆపసోపాలు పడితే చిన్నారుల పరిస్థితేంటి అంటారా? వారికి ఉపశమనం అందించే సూచనలివిగో... పలుచటి దుస్తులే మేలు... దుస్తులకు ఎన్ని లేయర్స్‌ ఉంటే శిశువులు అంత బొద్దుగా, అందంగా కనిపిస్తారని భావించేవారు పెరిగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. విజయ డెయిరీలో మరో కుంభకోణం

ఉమ్మడి ఖమ్మం జిల్లా ‘విజయ డెయిరీ’ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పలు రకాల కుంభకోణాలతో సంస్థ పరిస్థితి దారుణంగా ఉంది. పాల అమ్మకాల బకాయిలు రూ.లక్షల్లో పేరుకుపోయాయి. నిర్వహణ ఖర్చులు సరైన సమయంలో విడుదల కాకపోవటంతో రోజువారీ కార్యక్రమాలకూ ఇబ్బందికరంగా ఉంది. నిత్యం పాల అమ్మకాలు జరుపుతున్న పంపిణీదారులు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో ఇప్పుడు సుమారు రూ.23 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పెండింగు బకాయిలు సంస్థకు గుదిబండగా మారాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పాటిద్దాం.. ఈ పెట్టుబడి సూత్రాలు

ఆర్థిక లక్ష్యాల సాధనలో పెట్టుబడులు ఎంతో కీలకం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, దాన్ని చేరుకునేందుకు ఏం చేయాలనే  ప్రణాళిక ఉండాల్సిందే. అదే సమయంలో కొన్ని సూత్రాలూ పాటించాల్సిన అవసరం ఉంది. అప్పుడే అనుకున్న ఆర్థిక గమ్యాన్ని చేరుకునేందుకు మార్గం దొరుకుతుంది. ఆ సూత్రాలేమిటో చూద్దామా.. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ఒక ముఖ్యమైన అంశం. వ్యక్తులు స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మగ + మగ = సంతానం.. ఎలుకల్లో జపాన్‌ శాస్త్రవేత్తల అరుదైన సృష్టి

మానవుల్లో ప్రత్యుత్పత్తి ప్రక్రియను కొత్త పుంతలు తొక్కించే దిశగా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. తొలిసారిగా రెండూ మగ ఎలుకలనే ఉపయోగించి సంతానాన్ని ఉత్పత్తి చేశారు. భవిష్యత్తులో ఇద్దరు పురుషులు కలిసి పిల్లల్ని పొందేందుకు ఈ విధానం దోహదపడే అవకాశాలున్నాయి. తాజా పరిశోధనలో భాగంగా జపాన్‌లోని క్యుషు, ఒసాకా విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు తొలుత మగ ఎలుక చర్మ కణాలను తీసుకున్నారు. ఇండ్యూస్డ్‌ ప్లూరీపొటెంట్‌ స్టెమ్‌ (ఐపీఎస్‌) కణాలను సృష్టించేందుకు ఆ చర్మకణాలను మూలకణాల స్థితికి చేర్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘ఇంటి’పనికి వేతనం!.. 25ఏళ్ల సేవలకు రూ.1.75 కోట్లు

కొందరు మహిళలు కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ.. తమకు నచ్చినట్లుగా జీవితాన్ని డిజైన్‌ చేసుకుంటారు. వారి ఆర్థిక స్థిరత్వానికి ఢోకా ఉండదు. మరికొందరు కుటుంబం కోసం కెరీర్‌ను త్యాగం చేస్తారు. అనుక్షణం భర్తకు అండగా ఉంటూ.. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతుంటారు. కుటుంబమే లోకంగా జీవిస్తున్న వీరి వివాహ బంధం ముక్కలైతే.. ఇన్నేళ్ల దాంపత్యంలో ఆర్థిక వివరాలు తెలిసుండకపోతే.. ఉన్నపళంగా బయటకు వెళ్లిపోవాల్సి వచ్చిన ఆ మహిళ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు