Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. ఏడాది చిన్నారి మెదడులో పిండం!
చైనాలోని షాంఘైలో ఏడాది చిన్నారి మెదడులో నుంచి ఓ పిండాన్ని వైద్యులు బయటకు తీశారు. ఇలాంటి అరుదైన కేసును ‘ఫీటస్ ఇన్ ఫీటు’ అంటారని వైద్యులు చెబుతున్నారు. మొదట.. చిన్నారికి అనారోగ్యంగా ఉందని తల్లిందండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ చిన్నారి తలకు సంబంధించిన పలు సమస్యలతో బాధపడుతోందని వైద్యులు గుర్తించారు. దీంతోపాటు శరీర కండరాల్లో కదలికలు సరిగా లేవని గుర్తించారు. వెంటనే సిటీ స్కాన్ చేసి చూడగా.. మెదడులో పిండం ఉందని బయటపడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ఇక రేషన్ దుకాణాల్లో ఆధార్ నవీకరణ
ఆధార్ కార్డు నవీకరణ(అప్‌డేషన్) తప్పనిసరి కావడంతో ప్రజల చెంతకే వెళ్లి ఆ ప్రక్రియను పూర్తి చేసేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చౌకధరల(రేషన్) దుకాణాలకు వచ్చే కార్డుదారులే లక్ష్యంగా నవీకరణకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, గాదిగూడ, బోథ్ మండల కేంద్రాల్లో శుక్రవారం కార్డుదారుల నుంచి ఆయా పత్రాలను చూసి వారి ఆధార్ నవీకరించారు. రేషన్ దుకాణాలకు వచ్చేది పేదలే కావడం.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. కారు కంటే ఆటోనే ఖరీదు
గ్రేటర్‌లో కొత్త ఆటో కొనడంకంటే అదే ధరకు కొత్త కారు లేదా మంచి కండిషన్‌లో ఉన్న సెకండ్‌హ్యాండ్ కారు కొనవచ్చు. ఇది నిజం. ఇదంతా ఆటో పర్మిట్లలో జరుగుతున్న దందా. బహిరంగ మార్కెట్‌లో కొత్త ఆటో రూ.2-2.25 లక్షలుంటే గ్రేటర్‌లో కొనాలంటే రూ.4.5-5 లక్షల వరకు చెల్లించాల్సిందే. ఇందులో కేవలం పర్మిట్ కోసమే రూ.2.5 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. కొందరు దళారులు పర్మిట్లను తమ గుప్పిట్లో పెట్టుకొని నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. లోటు పోటు..
రాష్ట్రంలో రెవెన్యూలోటు భయపెడుతోంది. ప్రతిసారీ రెవెన్యూ లోటును నియంత్రిస్తామని చెబుతున్నా అది సాధ్యం కాకపోగా.. అంచనాలు మించిపోతోంది. గడిచిన అయిదేళ్లలో ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతూనే ఉంది. తాజా పరిస్థితుల్లో రాష్ట్రంలో మరో సరళి ప్రబలిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వరంగ కార్పొరేషన్ల నుంచి రుణాలు తెచ్చి కొన్ని కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. వాటిని తీర్చేందుకు రాష్ట్ర ఆదాయాన్ని మళ్లిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. రెండు గంటల్లో రక్తశుద్ధి..
మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నవారికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) చేపట్టిన పరిశోధన కొంత ఉపశమనం కలిగించనుంది. పూర్తిగా దేశీయ సాంకేతికతతో పరిశోధకులు పాలి సల్ఫోన్ హ్యాలో ఫైబర్స్ ఆధారంగా హీమోడయాలసిస్ మెంబ్రేన్ మాడ్యుల్‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం జంతువులపై ప్రయోగాల దశలో ఉన్న పరిశోధన.. క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుంటే డయాలసిస్ చికిత్సకు పట్టే సమయం, ఖర్చు సగానికి సగం తగ్గనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. సంచుల నిండా... వెండి బిస్కెట్లు
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల ప్రచారం ముగింపు దశలో వెలుగులోకి వచ్చిన వీడియోలు సంచలనం రేపాయి. వైకాపా అభ్యర్థి సీతంరాజు సుధాకర్ కార్యాలయంగా పేర్కొంటున్న ఫ్లాట్‌లో భారీగా వెండి బిస్కెట్లు (ఒక్కొక్కటి 15 గ్రాములు) సంచుల్లో నింపుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేశాయి. దీంతో పీడీఎఫ్, తెదేపా నేతలు అప్రమత్తమయ్యారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో జరిగిన పరిణామాలు సైతం చర్చనీయాంశమయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. మరో చెత్త నిర్ణయం!
చెత్త పన్ను వసూలుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకొనేలా లేరు. ఇప్పటికే ప్రభుత్వం అనేక మార్గాలను అనుసరించగా తాజాగా సరికొత్త నిర్ణయాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. పన్ను వసూలు కోసం పలు రూపాల్లో ప్రజలను ఇబ్బంది పెడుతూ వచ్చినా ససేమిరా అంటున్నారు. చెత్తకు పన్ను వసూలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సచివాలయం, మహిళా సంఘాలకు లక్ష్యాలను నిర్ధేశించినా ఆశించిన మేరకు వసూలు కావడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఏనగరానికైనా.. సై
గన్నవరం విమానాశ్రయం నుంచి శిర్డీకి మార్చి 26న ప్రారంభం కానున్న సర్వీసులో ఇప్పటికే సగం సీట్లు నిండిపోయాయి. విజయవాడ నుంచి శిర్డీకి రైలులో వెళితే ఒక రోజు పడుతుంది. విమానంలో కేవలం రెండున్నర గంటల్లో శిర్డీలో దిగిపోవచ్చు. మధ్యాహ్నం 12.25కు గన్నవరంలో బయలుదేరి 3 గంటలకు చేరుకుంటుంది. శిర్డీ నుంచి కూడా మధ్యాహ్నం 2.20కు మరో సర్వీసు బయలుదేరి గన్నవరానికి సాయంత్రం 4.26కు వస్తుంది. టిక్కెట్ ధర రూ.4,639 నిర్ణయించడంతో ఎక్కువ మంది విమాన టిక్కెట్లను బుక్ చేసుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. సొంతింట్లో ఉగాది లేనట్లే!
పాలకొల్లుకు చెందిన టిడ్కో ఇంటి లబ్ధిదారు ఎ.సత్యవతి 26వ వార్డులో అద్దెకు ఉంటున్నారు. దాన్ని ఖాళీ చేసి సొంతింటికి వెళ్తే తిన్నా తినకపోయినా గడిచిపోతుందని భావించారు. మూడేళ్లుగా అదిగో ఇదిగో అని చెప్పడం మినహా నేటికీ సొంతింటి యోగం కలగలేదని ఆమె ఆవేదన చెందుతున్నారు. ఒక్క సత్యవతే కాదు పట్టణంలో రూ.వేలకు వేలు అద్దె చెల్లించి పరాయి పంచన ఉంటున్న అనేక మంది లబ్ధిదారుల వ్యధ ఇది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. మాట్టిచ్చాను.. మాట్లాడొద్దు!
అక్కడో బస్ షెల్టరు ఉండేది.. బస్సుల కోసం నిరీక్షించే ప్రయాణికులు అందులో సేదతీరేవారు. కొన్నాళ్లుగా అక్కడ బస్సులు నిలపడం మానేశారు. నేరుగా ఆ పక్కనున్న మార్గం గుండా బస్సులు వెళ్తున్నాయి.. షెల్టరు ఖాళీగా ఉండడంతో.. ఆ స్థలంపై పొరుగు జిల్లా అధికార పక్ష నేత అనుచరుల కన్ను పడింది.. ఇక అడ్డేముంది.. స్థానిక నేత అండతో ఆక్రమించే ప్రయత్నం చేశారు. బస్ షెల్టరు కూలదోసి.. ఆ స్థలాన్ని చదును చేసేశారు. ఆక్రమణకు సిద్ధమవుతున్న క్రమంలో.. ఎక్కడ్నుంచో వచ్చి ఇక్కడ పాగా వేయడం ఏమిటని స్థానిక చోటా నాయకులు కొందరు అడ్డుతగిలారు. దీంతో స్థానిక నేత జోక్యం చేసుకుని.. మాటిచ్చేశాను.. అతని జోలికి వెళ్లొద్దని సముదాయించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Revanth reddy: పేపర్ లీకేజీ కేసు.. సిట్ నోటీసులకు భయపడేది లేదు: రేవంత్‌రెడ్డి
-
Politics News
Chandrababu: ఇది ఆరంభమే.. వచ్చే సునామీలో వైకాపా కొట్టుకుపోవడం ఖాయం: చంద్రబాబు
-
General News
TSRJC CET: టీఎస్ఆర్జేసీ సెట్‌కు దరఖాస్తు చేశారా? మార్చి 31 లాస్ట్!
-
India News
Modi-Kishida: భారత పర్యటనలో జపాన్ ప్రధాని కిషిదా.. మోదీతో భేటీ..!
-
India News
Supreme court: ఇక సీల్డ్ కవర్లు ఆపేద్దాం: ఓఆర్ఓపీ కేసులో ఘాటుగా స్పందించిన సుప్రీం
-
World News
Saddam Hussein: నియంత విలాస నౌక.. నేటికీ సగం నీళ్లలోనే!