Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. తెలంగాణలో 16 తర్వాత వర్షాలు
రాష్ట్రంలో కొన్ని రోజులు వేడి నుంచి ఉపశమనం లభించనుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి ఏర్పడింది. దేశంలోని తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలోకి దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. 16వ తేదీ అనంతరం పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని సూచిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ‘ఈ టీచర్ మాకొద్దు’
బూర్జ మండలం పాలవలస ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సాంఘిక శాస్త్ర విభాగ ఉపాధ్యాయిని తమకు వద్దంటూ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. పిల్లల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం ప్రధానోపాధ్యాయురాలు వై.మాలతి అధ్యక్షతన పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశారు. పరీక్షల సమయం వస్తున్నందున తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలపాలని హెచ్‌ఎం కోరారు. దీంతో ముక్తకంఠంతో వారంతా సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయిని బి.ప్రసన్నకుమారి తమకు వద్దంటూ తేల్చి చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. చోరీకి వచ్చి నిద్రలోకి జారుకున్న దొంగ
చోరీకి వెళ్లిన ఓ వ్యక్తి మద్యం మత్తులో అక్కడ ఉన్న చాక్లెట్లు, ఆహారం తినేసి నిద్రలోకి జారుకున్న ఘటన చెన్నైలో జరిగింది. పోలీసులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం... ఇక్కడి అడయారు ప్రాంతంలోని ఓ భవనం మూడో అంతస్తులో కార్తీక్ నరేన్ అనే వ్యక్తి నివసిస్తుండగా, రెండో అంతస్తులోని మరో ఫ్లాట్‌లో ఉంటున్న అతడి తల్లిదండ్రులు కొన్ని రోజుల క్రితం తీర్థయాత్రలకు వెళ్లారు. ఈ నెల 9న వారు తిరిగి వస్తుండటంతో నరేన్ వారి ఇంటి తాళం తీసి తన ఫ్లాట్‌కి వెళ్లిపోయాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ఆస్కార్ బరి... వీళ్లకు తొలిసారి
అందరిలాగే వీళ్లూ ఆస్కార్ కల కన్నారు. విచిత్రంగా అందరికీ తొలిసారే ఆ కల నెరవేరే అవకాశం దక్కింది. ఇదంతా 95వ ఆస్కార్ రేసులో ఉత్తమ నటుడు విభాగంలో నామినేషన్ దక్కించుకున్న ఐదుగురు నటుల గురించే. ఇందులో 27 ఏళ్ల పాల్ మెస్కల్ నుంచి 73 ఏళ్ల బిల్ నైజీ వరకూ పోటీ పడుతున్నారు. చివరికి పురస్కారం ఎవరిని వరించినా అందరూ తమ పాత్రలకు మాత్రం మంచి ప్రశంసలు అందుకున్నవారే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.. ప్రమాదమా.. ఆత్మహత్యా?
పేద కుటుంబంలో జన్మించినా.. చదువులో రాణించిన కుమారుడికి విదేశాల్లో ఉన్నతవిద్యను అందించాలన్న కన్నవారి కలలు కల్లలయ్యాయి. కన్న కొడుకు నిర్జీవంగా ఇంటికి రావడంతో ఆ కుటుంబీకుల రోదనలను ఆపడం ఎవరి తరమూ కాలేదు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళికి చెందిన గోవాడ నాగసాయి గోపి అరుణ్‌కుమార్ (23)కు ఉన్నతవిద్యపై ఉన్న మక్కువను గుర్తించిన తల్లిదండ్రులు.. తమ ఆస్తులను కుదువ పెట్టి మరీ అమెరికాలో ఎంఎస్ చేసేందుకు ఏడు నెలల క్రితం పంపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. పదేళ్ల తర్వాతే యాజమాన్య హక్కులా?
పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం పరిధిలో ఉన్నట్లు గుర్తించిన మిగులు భూముల క్రమబద్ధీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మరోసారి వివాదాస్పదమైంది. ఈ భూముల క్రమబద్ధీకరణకు గతంలో నిర్ణయించిన ఫీజుల్లో కాస్త వెసులుబాటు ఇస్తూనే... పదేళ్ల తర్వాతే యాజమాన్య హక్కుల బదలాయింపునకు అనుమతిస్తామని ప్రభుత్వం పేర్కొనడంపై విమర్శలు వస్తున్నాయి. కిందటేడాది జనవరిలో జారీ చేసిన జీఓ 36లో స్థల విస్తీర్ణంతో సంబంధం లేకుండా బేసిక్ విలువకు ఒకటిన్నర రెట్లు ఫీజు చెల్లించాలని షరతు విధించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. చదివింది మరిచిపోతున్నాం!
రాష్ట్రంలో 15వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 9.51 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అయితే.... పరీక్షల సమయం దగ్గరపడేకొద్దీ విద్యార్థులను భయం వెంటాడుతోంది. పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అందుకు టెలీ-మానస్ 14416 టోల్‌ఫ్రీ నంబరుకు వస్తున్న ఫోన్లే నిదర్శనం. చదివింది మరిచిపోతున్నామని, ఒత్తిడిని భరించలేకపోతున్నామని సైకాలజిస్టులకు వారు మొర పెట్టుకుంటున్నారు. పరీక్షల భయం, మానసిక ఒత్తిడి తదితర సమస్యలుంటే ఫోన్ చేయాలని ఇటీవల ఇంటర్ బోర్డు ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. నా తండ్రి రాత్రి ఇంటికొస్తే భయమేసేది
కన్నతండ్రి లైంగిక వేధింపులకు గురిచేశాడని ప్రముఖ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ఇటీవల ప్రకటిస్తే.. తాజాగా దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) ఛైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ కూడా తానూ ఆ తరహా వేధింపులకు గురైన బాధితురాలినేనని పేర్కొన్నారు. తండ్రి లైంగిక వేధింపులు భరించలేక, మంచం కింద దాక్కొన్న సందర్భాలు ఉన్నాయని చెప్పారు. నాలుగో తరగతి వరకు తనపై వేధింపులు కొనసాగాయని తెలిపారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. 80 ఏళ్లు దాటితే ‘ఇంటి నుంచే ఓటు’
ఇంటి నుంచే ఓటు (వీఎఫ్‌హెచ్) విధానాన్ని ఈ ఏడాది జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి అమలు చేయనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఆయన శనివారం బెంగళూరులో మాట్లాడుతూ పోలింగ్ కేంద్రానికి రాలేని దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. పోలింగ్‌కు అయిదు రోజులు ముందుగా వెలువరించే నోటిఫికేషన్‌ను అనుసరించి అర్హత ఉన్నవారు ‘ఫార్మ్ 12డి’ ద్వారా పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఇన్‌ఫ్లుయెంజాతో జాగ్రత్త: కేంద్రం
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇన్‌ఫ్లుయెంజా సంబంధ అనారోగ్యం(ఐఎల్‌ఐ)వ్రమైన శ్వాస సంబంధ ఇన్‌ఫెక్షన్(ఎస్‌ఏఆర్‌ఐ) ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తం కావాలని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌భూషణ్ హెచ్చరించారు. కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖరాశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
NTR: ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం.. త్వరలో మార్కెట్లోకి
-
World News
Nowruz: గూగుల్ డూడుల్ ‘నౌరుజ్ 2023’ గురించి తెలుసా?
-
General News
Amaravati: అమరావతిలో మళ్లీ అలజడి.. ఆర్ 5జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ
-
Sports News
MIW vs RCBW: ముంబయి ఇండియన్స్ చేతిలో ఆర్సీబీ చిత్తు..
-
India News
Amritpal Singh: ‘ఆపరేషన్ అమృత్‌పాల్’కు పక్షం రోజులు ముందే నిశ్శబ్దంగా ఏర్పాట్లు..!
-
Movies News
RRR: ‘ఆస్కార్’కు అందుకే వెళ్లలేదు.. ఆ ఖర్చు గురించి తెలియదు: ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత