టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

ఉత్కంఠ వీడలేదు. అనిశ్చితి తొలగిపోలేదు. అమెరికా తదుపరి అధ్యక్షుడెవరన్న ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం దొరకలేదు..

Updated : 25 Mar 2023 16:16 IST

1. వీడని పీఠముడి

ఉత్కంఠ వీడలేదు. అనిశ్చితి తొలగిపోలేదు. అమెరికా తదుపరి అధ్యక్షుడెవరన్న ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం దొరకలేదు. కీలకమైన మిషిగన్‌ను దక్కించుకోవడం ద్వారా డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌ తాజాగా మరో 16 ఎలక్టోరల్‌ ఓట్లను తన ఖాతాలో వేసుకున్నారు. తద్వారా అధ్యక్ష పీఠానికి మరింత చేరువయ్యారు. అయితే- ట్రంప్‌కూ ఇంకా విజయావకాశాలు మిగిలే ఉన్నాయి. ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతున్న రాష్ట్రాలన్నింటిలో విజయం సాధిస్తే.. అధ్యక్ష పదవిలో మరో నాలుగేళ్లపాటు ఆయనే కొనసాగుతారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఏదైనా ఆ 8 లోపే..

2. ఇలా అయితే మనుగడకే ముప్పు

అక్రమ నిర్మాణాలను ఇలాగే కొనసాగిస్తూ పోతే 2050 నాటికి పరిస్థితి చేయి దాటిపోతుందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో చెరువుల్లో నిర్మాణాలు చేపట్టాలంటే భయంగా ఉండేదని, ఇప్పుడు లేక్‌ వ్యూ అంటూ నిర్మాణాలు చేపడుతున్నారని వ్యాఖ్యానించింది. చెరువులు, నాలాల్లో నిర్మాణాల కారణంగానే వరదలు వస్తున్నాయంది. జీవో 111కు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోలేదంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. లీగల్‌ ఓట్లు లెక్కిస్తే విజయం నాదే: ట్రంప్‌

లీగల్‌ ఓట్లు లెక్కిస్తే విజయం తమదేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే తనదే విజయం అని బుధవారం ప్రకటించుకున్న తర్వాత తొలిసారి శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ, మెయిల్‌-ఇన్‌-బ్యాలెట్‌ పద్ధతి, ప్రత్యర్థి డెమొక్రాటిక్‌ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తనని రెండోసారి అధికారంలోకి రానివ్వకుండా పెద్ద కుట్రే జరుగుతోందని ఆరోపించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* బైడెన్‌ నెగ్గిన అన్ని చోట్లా కేసులు

4. సీటు బెల్ట్‌, హెల్మెట్‌ పెట్టుకోకుంటే లైసెన్స్‌ రద్దు

శిరస్త్రాణం (హెల్మెట్‌) లేకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్నారా? సీటు బెల్ట్‌ ధరించకుండా వాహనం డ్రైవింగ్‌ చేస్తున్నారా? అయితే రవాణాశాఖ అధికారులు, పోలీసులు పట్టుకుంటే డ్రైవింగ్‌ లైసెన్స్‌ను శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉంటుంది. తొలిసారి అయితే మూడు నెలలపాటు లైసెన్స్‌ సస్పెండ్‌ చేస్తారు. రహదారి భద్రతలో భాగంగా సుప్రీంకోర్టు నియమించిన కమిటీ చేసిన సూచనల మేరకు కేంద్రం మోటారు వాహన చట్టంలో సవరణలు చేయగా, అవి గతేడాది సెప్టెంబరు నుంచి అమల్లోకి వచ్చాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలకే ప్రమాదం!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా రెండో దశ ఇప్పుడు భారత్‌నూ భయపెడుతోంది. దేశ రాజధానిలో ఇప్పటికే మొదలైన సెకండ్‌ వేవ్‌తో భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా తెలంగాణ రాష్ట్రంలోనూ ఇదే పునరావృతమవుతుందని హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయోలజీ(సీసీఎంబీ) హెచ్చరిస్తోంది. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణలో కొత్తగా 1,602 కరోనా కేసులు

6. మోసాలకు ఆస్కారం!

రణి పోర్టల్‌ ప్రారంభానికి ముందు మ్యుటేషన్లు పూర్తికాని భూయజమానులు ప్రస్తుతం కలవరపాటుకు గురవుతున్నారు. ధరణిలో ఉండే భూసమాచారమే అంతిమం కావడం, దాని ఆధారంగానే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేస్తుండటం, పాత వివరాలు పరిశీలించడానికి వీలుగా ధరణిలో ఐచ్ఛికం లేకపోవడమే దానికి కారణం. ఇది జగదీశ్‌ ఒక్కరి సమస్య కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వాళ్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.  ఉదాహరణకు కొత్త రెవెన్యూ చట్టం కోసం సెప్టెంబరు 8వ తేదీ నుంచి రెవెన్యూ సేవలు నిలిపివేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రిజిస్ట్రేషన్‌లో ఐరిస్‌కూ అవకాశం

7. లేఖను బయటపెట్టడం కోర్టు ధిక్కరణే

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో పాటు, ఆయన ముఖ్య సలహాదారు అజేయకల్లంపై కోర్టు ధిక్కరణ ప్రక్రియ మొదలుపెట్టడానికి తనకు అనుమతివ్వాలని అటార్నీ జనరల్‌ (ఏజీ) కేకే వేణుగోపాల్‌కు సుప్రీంకోర్టు న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏజీకి ఆయన గురువారం మరో లేఖ రాశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) పరిధిలో ఉన్నది జగన్‌ రాసిన లేఖే తప్ప.. అది కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తుందంటూ తాను చేసిన ఫిర్యాదు కాదని, అందువల్ల కోర్టు ధిక్కరణ ప్రక్రియకు అనుమతివ్వాలని ఆయన కోరారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రుణ భారం.. వదిలించుకుందాం...

ఆర్థిక నిర్వహణ అంటే.. పొదుపు చేయడం లేదా పెట్టుబడులు పెట్టడం అనే అనుకుంటారు చాలామంది. కానీ, ఆర్థిక నిర్వహణ అంటే.. పొదుపు, మదుపులతోపాటు భవిష్యత్తులో వచ్చే ఖర్చులకు సిద్ధంగా ఉండటం... అప్పులు లేకుండా ప్రతి రూపాయి మన ఖాతాలోనే ఉండటం.. చిన్న చిన్న ప్రణాళికలను అమలు చేస్తూ.. రుణాల మీద కట్టే వాయిదాలను, సాధారణ ఖర్చులనూ సమతౌల్యం చేసుకోవడం ముఖ్యం. దీనిద్వారా చేరుకోవాలనుకున్న లక్ష్యాలను సులువగా సాధించడం.. ఇవన్నీ ఆర్థిక నిర్వహణలో భాగమే. ముఖ్యంగా అప్పుల భారాన్ని తగ్గించుకోవడంపైన దృష్టి సారించాలి. అందుకోసం ఏం చేయాలో చూద్దామా..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. జనం జబ్బుపడినా.. మాకు డబ్బే ముఖ్యం!!

కొవిడ్‌ ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో కొన్నినెలల తర్వాత తెరిచిన హోటళ్లలో పెద్దఎత్తున అతిక్రమణలు చోటుచేసుకున్నాయి. సొమ్ము చేసుకునేందుకు గడువు దాటిన ఆహారం సైతం ప్రజలకు వడ్డిస్తున్న దారుణమైన పరిస్థితులు వెలుగులోకొచ్చాయి. ఆహారభద్రత అధికారులు బుధవారం ఆరంభించిన తనిఖీలు గురువారం కూడా ముమ్మరం చేశారు. నమూనాల్ని హైదరాబాద్‌లోని ప్రయోగశాలకు పంపించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 2016.. మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తారా?

ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ దాకా ఉత్కంఠే. టైటిల్‌ రేసులో ఉంటుందో లేదోనన్న చింతే! ఏమైతేనేం.. ముంబయిపై వీరవిహారం చేసిన హైదరాబాద్‌ పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. వరుసగా ఐదోసారి ప్లేఆఫ్స్‌కు చేరిన మూడో జట్టుగా రికార్డు సృష్టించింది. బెంగళూరుతో ఎలిమినేటర్‌ పోరుకు సిద్ధమైంది. గతంలోనూ ఇలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొన్న డేవిడ్‌ వార్నర్‌ సేన.. 2016 మ్యాజిక్‌ను రిపీట్‌ చేసేనా? తెలుగు అభిమానులను మురిపించేనా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* దంచేసి దర్జాగా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు