Top Ten News @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 31 May 2021 09:11 IST

1. చోక్సీని రప్పించేందుకు రంగం సిద్ధం!

బ్యాంకులను మోసగించి, విదేశాలకు పరారైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీని డొమినికా నుంచి భారత్‌కు రప్పించేందుకు కసరత్తు మొదలైంది. ఇందుకు అవసరమైన పత్రాలను ఒక ప్రైవేటు విమానంలో భారత ప్రభుత్వం పంపిందని ఆంటిగ్వా అండ్‌ బార్బుడా ప్రధాన మంత్రి గాస్టన్‌ బ్రౌన్‌ తెలిపారు. మరోవైపు గాయాలతో కారాగారంలో ఉన్న చోక్సీ ఫొటోలు తాజాగా బయటకొచ్చాయి. అతడిని రప్పించేందుకు భారత ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు చర్యలు ముమ్మరం చేశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Immunity: రూ.50 ఖర్చు.. వైరస్‌ను భయపెట్టు!

కొవిడ్‌ భయం జనాన్ని వెంటాడుతోంది. రాబోయే కాలంలో కొత్త వైరస్‌ రకాలు(వేరియంట్‌) పుట్టుకొస్తాయనే అంచనాలూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మనముందున్న మార్గం వాటిని ఎదుర్కొనేలా శరీరాన్ని సిద్ధం చేయడమేనని వైద్య నిపుణులు అభిప్రాయడుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా కరోనా సహా అన్ని వైరస్‌ సంబంధ వ్యాధులకు ఎదురు నిలవవచ్చని, పోషకాహారమే దానికి సరైన పరిష్కారమని సూచిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కరోనా.. చైనా సృష్టే!

3. తర్వాత ఏంటి?

చిత్రసీమలో కొత్త దర్శకులదే జోరంతా. హిట్టు మాట వినిపించడమే ఆలస్యం.. వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేసే ప్రయత్నం చేస్తుంటారు. వీలైనంత వేగంగా స్టార్‌ కథా నాయకుల దృష్టిలో పడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటారు. కరోనా - లాక్‌డౌన్‌ పరిస్థితులతో వచ్చిన ఈ విరామ సమయంలో అటు అగ్ర దర్శకులు.. ఇటు కుర్ర డైరెక్టర్ల నుంచి చాలా కొత్త కబుర్లు వినిపించాయి. అయితే హిట్టు కొట్టీ.. కొత్త సినిమాల విషయంలో స్పష్టత ఇవ్వని దర్శకులు చిత్రసీమలో పలువురు ఉన్నారు. ఇప్పుడు వాళ్ల కబురు కోసం సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. TS Lockdown: అంతర్రాష్ట్ర సర్వీసులు నడవవు

 రాష్ట్ర మంత్రిమండలి ఆదేశాల మేరకు తెలంగాణలో లాక్‌డౌన్‌ పొడిగింపుపై ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు అన్ని రకాల ప్రజారవాణాకు అనుమతించిన ప్రభుత్వం.. అంతర్రాష్ట్ర సర్వీసులను రద్దు చేసింది. అత్యవసర సేవలు మినహా ఇతర విభాగాల్లో 50 శాతం సిబ్బందితో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే ప్రభుత్వ కార్యాలయాలు పని చేయనున్నాయి. జాతీయ రహదారులపై ఉన్న పెట్రోల్‌ బంకులు మినహా.. మిగతావి మధ్యాహ్నం ఒంటి గంట వరకే తెరచి ఉంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పోస్టాఫీసుల్లో ఉచితంగా టీకా రిజిస్ట్రేషన్‌

5. Raghurama: నన్ను త్వరగా డిశ్ఛార్జి చేసేందుకు కుట్ర

తనను సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రి నుంచి తొందరగా డిశ్ఛార్జి చేయడానికి దాని రిజిస్ట్రార్‌ కేపీరెడ్డి డాక్టర్లపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని పేర్కొంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఆయన నివాసంలో సుమారు 20 నిమిషాలపాటు భేటీ అయ్యారు. తితిదే జేఈవో ధర్మారెడ్డి, గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డితో కలిసి కేపీరెడ్డి కుట్రపన్ని తనను ఆసుపత్రి నుంచి బలవంతంగా డిశ్ఛార్జి చేయించి, ఆ వెంటనే పోలీసులు పట్టుకుపోయేలా ఎత్తులు వేశారని ఆరోపించారు. ఈ మొత్తం ఉదంతంపై ఆయన  ఫిర్యాదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తాళి కట్టి ధైర్యం చెప్పినా.. కాటేసిన కరోనా!

కరోనా ఎన్నో బంధాలను బలితీసుకుంటోంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని, అంతులేని శోకాన్ని మిగుల్చుతోంది. ఆప్తులు, ఆత్మీయులను కోల్పోయి.. వారి జ్ఞాపకాలతో జీవచ్ఛవాలుగా బతుకుతున్న వారెందరో..! ఇలాంటిదే ఈ విషాద ఘటన. సంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి జీవితంపై ఎన్నో కలలు కంది. ఉన్నత చదువులు చదివి, ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడిని ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించాలనుకుంది. అంతలోనే ఆమెకు కరోనా సోకింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కరోనా మృతదేహాన్ని నదిలోకి విసిరేశారు

7. Cyber Crime: ఇంటి గుట్టు..వీధిలో!

నం మధ్యాహ్నం ఏం తింటున్నామో! ఇంటి సరకులు ఎక్కడ తీసుకుంటున్నామో! శుభకార్యాలకు ఏమేమి కొనుగోలు చేస్తున్నామో! ఎక్కడెక్కడికి ప్రయాణాలు చేస్తున్నామో! అక్కడ ఎన్నిరోజులు గడిపాం..ఏఏ హోటళ్లలో బస చేశామో! ఒకటేమిటి సగటు వినియోగదారుల ప్రతి కదలికా సైబర్‌ నేరస్థులకు ఇట్టే తెలిసిపోతోంది. అదెలా అనుకుంటున్నారా? సాంకేతిక యుగంలో మనీ యాప్‌లు, ఫోన్‌ ద్వారా చేస్తున్న నగదు బదిలీలు, లావాదేవీల ద్వారానే. ఆ సమాచారం కోసం ప్రస్తుతం సైబర్‌ నేరగాళ్లు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు సంస్థలు, దుకాణాలు, ఫుడ్‌ డెలివరీ సంస్థలపై గురిపెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Black Fungus: బ్లాక్‌ ఫంగస్‌పై ఆయుష్‌ అస్త్రం

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు కొద్దిగా తగ్గుముఖం పడుతున్నా.. బ్లాక్‌ ఫంగస్‌(మ్యూకర్‌ మైకోసిస్‌) మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. కొవిడ్‌, బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సల్లో ప్రధానంగా అలోపతి వైద్యంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో ప్రత్యామ్నాయ వైద్యంలోనూ కొవిడ్‌, బ్లాక్‌ ఫంగస్‌లను ఎదుర్కొనే సమర్థమైన చికిత్సలున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖతో పాటు రాష్ట్ర ఆయుష్‌ శాఖ కూడా ఈ మహమ్మారి వ్యాధులను నయం చేయడానికి అవసరమైన చికిత్స విధానాలను ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మేటి ఉద్యోగాలకు ఏఎఫ్‌ క్యాట్‌

వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు ఆశించేవారు రాయాల్సిన పరీక్షల్లో ఏర్‌ఫోర్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏఎఫ్‌ క్యాట్‌) ముఖ్యమైంది. ఈ పరీక్షలో నెగ్గినవారు పైలట్‌ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ విభాగాల్లో కీలక కొలువుల్లో సేవలు అందించే వీలుంది. మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనం, ప్రోత్సాహకాలు సొంతమవుతాయి. భవిష్యత్తులో అత్యున్నత స్థాయిని చేరుకునే అవకాశమున్న ఈ పోస్టులకు గ్రాడ్యుయేట్లు పోటీ పడవచ్చు. తాజాగా వెలువడిన     ఏఎఫ్‌ క్యాట్‌ 2021 (2) వివరాలు చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Eatala: జేపీ నడ్డాతో ఈటల భేటీ నేడు

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ దిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించిన అనంతరం ఆయన భాజపాలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం రాత్రి దిల్లీ వచ్చారు. ఆయనతో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, భాజపా నేత జి.వివేక్‌ వెంకటస్వామి ఉన్నారు. దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సోమవారం ఈటల భేటీ కానున్నారు. హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సోమవారం దిల్లీ చేరుకోనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు