Updated : 01 Jun 2021 09:13 IST

Top Ten News @ 9 AM

1. తెరాస, భాజపా చేతులు కలిపితే.. మా పరిస్థితి ఏమిటి?

మాజీమంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాతో దిల్లీలో సమావేశమయ్యారు. పార్టీలో చేరితే తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరడంతో పాటు, తెరాస-భాజపా సంబంధాలపై పలు సందేహాలను ఈటల లేవనెత్తినట్లు సమాచారం. రాష్ట్రంలో తెరాస, భాజపా మధ్య రాజకీయ పోరు కొనసాగుతుందని స్పష్టం చేసిన నడ్డా.. రాజేందర్‌కు సముచిత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో చేరికపై త్వరగా నిర్ణయానికి రావాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Corona: భిన్న వేరియంట్లకు ఒకే ఔషధంతో కళ్లెం!

తీవ్రస్థాయి కొవిడ్‌-19 బారినపడకుండా కాపాడే కొత్త ఔషధాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఇది సత్తా చాటిందని వారు తెలిపారు. కరోనా వైరస్‌లోని అనేక వేరియంట్లను ఎదుర్కోనే సామర్థ్యం దీనికి ఉందని చెప్పారు. అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. కొవిడ్‌ కట్టడికి సమర్థ యాంటీవైరల్స్‌ను అభివృద్ధి చేయడం ఇప్పుడు అత్యవసరమైంది. ముఖ్యంగా వైరస్‌లో ప్రమాదకరమైన రకాలు వచ్చిపడుతున్న నేపథ్యంలో ఆ ఔషధాలు తప్పనిసరయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

బ్రిటన్‌లో మొదలైన మూడో ఉద్ధృతి!

3. USA: వీసా ఉంటే ఆగస్టు నుంచి అమెరికాకు

‘అమెరికాలో చదువుకోవాలనుకునే వారిపైనా కరోనా మహమ్మారి ప్రభావం చూపుతోంది. ఇప్పటికే వీసా ఉన్న వారు ఆగస్టు ఒకటో తేదీ లేదా ఆ తరవాత నుంచి అమెరికా వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందీ లేదు. ప్రస్తుతం అత్యవసరంగా వెళ్లాల్సిన వారికి మాత్రమే వీసాలు జారీ చేస్తున్నాం. కరోనా తీవ్రత తగ్గిన తరవాత వీసా ప్రక్రియను వేగవంతం చేయాలని యోచిస్తున్నాం. అమెరికా వెళ్లే విద్యార్థులకు కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అవసరమా? లేదా? అన్నది ఆయా రాష్ట్రాలు, విశ్వవిద్యాలయాలదే తుది నిర్ణయం’ అని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయెల్‌ రీఫ్మాన్‌ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
4. Black Fungus: బాధితుల్లో 63% మంది మధుమేహులే

కొవిడ్‌ కంటే దాని పర్యవసానాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా మహమ్మారిని జయించామన్న ఆనందాన్ని బ్లాక్‌ఫంగస్‌ వ్యాధి.. ఆవిరి చేసేస్తోంది. ముక్కు, నోట్లో తలెత్తే మ్యూకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) మధుమేహులకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులను, రోగనిరోధశ శక్తి తక్కువగా ఉన్నవారినీ కబళిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,179 బ్లాక్‌ఫంగస్‌ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సోమవారం వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Vaccine: క్యాన్సర్‌ రోగులూ టీకా తీసుకోవచ్చు

5. బూతు మెసేజ్‌లు చేస్తాడు!

నా భర్తకు 35 ఏళ్లు. చాలా ప్రతిభావంతుడు. ప్రముఖ సంస్థలో మంచి స్థాయిలో ఉన్నాడు. మర్యాదస్తుడిలా ఉంటాడు. కానీ మహిళలంటే చిన్నచూపు. సహోద్యోగినులకు బూతు మెసేజీలు పంపుతుంటాడు. వాళ్లు చూడగానే తీసేస్తాడు. లేదా ద్వంద్వార్థాలతో మెసేజ్‌ చేస్తాడు. వాళ్లేమో క్షోభపడుతూ ఉంటారు. ఎవరికీ చెప్పుకోలేరు. ఫిర్యాదు చేయడానికి ఆధారాలు ఉండవు. ఒకరిద్దరు నాతోనే చెప్పి ఏడ్చారు. ఎందుకిలా చేస్తాడో అర్థం కావడంలేదు. ఈ దురలవాటు ఎవరికి ఏం ముప్పు తెచ్చిపెడుతుందోనని భయంగా ఉంది. ఈ మనిషిని మార్చేదెలా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కోర్టునే మోసం చేయాలని చూస్తారా?

 భాజపా ఎంపీ గౌతం గంభీర్‌ కరోనా మందుల సేకరణపై ఔషధ నియంత్రణ అధికారి (డ్రగ్‌ కంట్రోలర్‌) సమర్పించిన నివేదికను దిల్లీ హైకోర్టు సోమవారం తీవ్రంగా తప్పుపట్టింది. ‘న్యాయస్థానాన్ని మోసం చేయలేరు. ఏమి చెప్పినా అమాయకంగా నమ్ముతామని మీరు భావిస్తున్నట్లయితే అది తప్పు’ అంటూ జస్టిస్‌ విపిన్‌ సంఘి, జస్టిస్‌ జస్మీత్‌ సింగ్‌లతో కూడిన ధర్మాసనం మండిపడింది. ఫాబిఫ్లూ మందును పెద్ద మొత్తంలో గంభీర్‌ సేకరించిన విధానంపై కోర్టుకు సమర్పించిన పరిశీలన నివేదిక సరిగాలేదని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నేడు మార్కెట్లోకి యాంటీబాడీస్‌ పరీక్ష కిట్‌

7. రైతన్నకు అండగా నానో యూరియా

 అన్నదాతలకు పెట్టుబడి ఖర్చును తగ్గించి, దిగుబడులను పెంచే దిశగా త్వరలో సరికొత్త యూరియా అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ‘నానో యూరియా’ను భారత రైతుల ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) సోమవారం ప్రవేశపెట్టింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ నానో యూరియా.. ద్రవ రూపంలో ఉంటుంది. 500 మిల్లీలీటర్ల బాటిల్‌ ధర కేవలం రూ.240. సంప్రదాయ యూరియా బస్తా ధరతో పోలిస్తే ఇది 10 శాతం తక్కువ రేటుకే దొరుకుతుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. త్వరగా మేల్కోండి!

అధిక బరువుతో ఉన్నారా? ఊబకాయులా? అయినా మధుమేహం, గుండెజబ్బు ముప్పులు తగ్గించుకోవచ్చు. అదీ చాలా తేలికగా. అదెలా అంటారా? రోజూ వీలైనంత త్వరగా నిద్ర లేచి.. ఇంటి పనులు, వ్యాయామాలకు ఉపక్రమిస్తే చాలు. ఆలస్యంగా నిద్రలేచే ఊబకాయులతో పోలిస్తే త్వరగా నిద్రలేచే వారికి మధుమేహం, గుండెజబ్బు వచ్చే అవకాశం తక్కువగా ఉంటున్నట్టు ఊబకాయంపై వార్షిక యూరోపియన్‌ కాంగ్రెస్‌లో ప్రస్తావనకు వచ్చిన పరిశోధన పేర్కొంటోంది. ఇందులో ఊబకాయులను మూడు రకాలుగా విభజించి పరిశీలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పరీక్షల వాయిదా... చక్కటి ఫాయిదా

9. హీరో అనే విషయాన్నే మరిచిపోయా

తెరపైనే కాదు... నిజ జీవితంలోనూ హీరో అనిపించుకున్నారు నిఖిల్‌. రెండో దశ కరోనా విపత్తులో ఎంతోమంది బాధితులకి అండగా నిలిచాడీ యువకిశోరం. వైద్యం కోసం ఆర్థిక సాయం చేశారు. స్వయంగా ఆస్పత్రులకి వెళ్లారు. బాధితులకి అవసరమైన వైద్య సదుపాయాలు... ఔషధాలు అందేలా చేశారు. ఎంతోమంది కన్నీళ్లని తుడిచారు.మంగళవారం నిఖిల్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో ‘ఈనాడు  సినిమా’  ముచ్చటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆ చేప ధర 72 లక్షలు

అదృష్టమంటే.. పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని గ్వాదర్‌ తీరానికి చెందిన మత్స్యకారుడు సాజిద్‌ హాజీ అబాబాకర్‌దే. ఒకే ఒక చేప పట్టాడు. ఏకంగా రూ.72 లక్షలు సంపాదించాడు. అయితే అబాబాకర్‌ పట్టింది మామూలు చేప కాదు. అరుదైన అట్లాంటిక్‌ క్రోకర్‌ జాతికి చెందినది. అందుకే 48 కేజీల బరువైన ఈ చేపకు వేలంలో ఏకంగా రూ.72 లక్షల ధర పలికింది. యూరప్‌, చైనాల్లో ఈ క్రోకర్‌ జాతికి అత్యధిక డిమాండ్‌ ఉంది. చాలా చేపల విలువ వాటి మాంసం ఆధారంగా నిర్ణయమవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కావేరి వైపు గోదారి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని