Updated : 02 Jun 2021 09:29 IST

Top Ten News @ 9 AM

1. China: తొలిసారి ఓ వ్యక్తికి ‘హెచ్‌10ఎన్‌3 బర్డ్‌ ఫ్లూ’

చైనాలో తొలిసారిగా ఓ వ్యక్తికి ‘హెచ్‌10ఎన్‌3 రకం బర్డ్‌ ఫ్లూ’ సోకిన కేసు బయటపడింది. జియాంగ్‌సూ ప్రావిన్స్‌లోని ఝెంజియాంగ్‌లో 41 ఏళ్ల వ్యక్తి దీనిబారిన పడినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ మంగళవారం తెలిపింది. ఆ రోగి మే 28న ‘హెచ్‌10ఎన్‌3 ఎవియన్‌ ఇన్‌ఫ్లుయాంజా వైరస్‌’ బారిన పడినట్లు పేర్కొంది. అయితే అతనికి ఈ ఇన్‌ఫెక్షన్‌ ఎలా సోకిందన్నది మాత్రం వెల్లడించలేదు. ఇంతకు మునుపెన్నడూ ప్రపంచంలో మనుషులకు ‘హెచ్‌10ఎన్‌3’ సోకిన దాఖలాలు లేవని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మిజోరంలో ‘ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌’

2. Petrol Prices: బతుకు ఛిద్రం

పెట్రోలు రోజుకు పెరిగేది పావలానే.. అయితే ఏడాది తిరిగే సరికి లీటరుకు రూ.25కి పైగా ఎగసింది. డీజిల్‌ అయితే ఒక అడుగు ముందుకేసి రూ.26కు పైగా పెరిగింది. రోజురోజుకూ భారంగా మారుతున్న ఇంధన ధరలతో రవాణా రంగం కుదేలవ్వగా.. రైతుల పెట్టుబడులూ పెరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాలపై కూరగాయలు, పండ్లు అమ్ముకునే వారితోపాటు గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లి పాలు పోసేవారు.. ఇతర వస్తువులు విక్రయించే వారిపై ఏడాదికి రూ.15,000 చొప్పున భారం పడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Corona: వైద్యం అందిస్తూ.. మహమ్మారికి చిక్కి..

కొవిడ్‌ బాధితులెందరికో సేవలందించి ప్రాణాలు కాపాడిన ఓ వైద్యుడు... ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. రోగులకు సేవలందించే క్రమంలో ఆయన కరోనా బారిన పడ్డారు. ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. తక్షణమే వాటిని మార్చాలని, ఇందుకు రూ.కోటిన్నరకు పైగా ఖర్చవుతుందని వైద్యనిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఉన్నదంతా వైద్యానికి వెచ్చించడంతో... ఏం చేయాలో తెలియక ఆ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గంగాతీరంలో.. మానవత్వం చచ్చిపోయింది

ఉత్తరాఖండ్‌లోని గంగానది ముఖ్య పాయల్లో ఒకటైన భాగీరథి నదీతీరాన కేదార్‌ఘాట్‌లో మృతదేహాలను వీధికుక్కలు పీక్కుతింటున్న వీడియో దృశ్యాలు వైరల్‌గా మారి కలకలం రేపుతున్నాయి. పరీవాహక ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలతో నది నీటిమట్టం పెరిగి సగం కాలిన మృతదేహాలు, మానవ శరీరభాగాలు తీరానికి కొట్టుకు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ‘నిన్న నదీతీరంలో నేను పెయింటింగు పని చేసుకొంటున్నా. సగం కాలిన మృతదేహాలు కొన్ని తీరానికి కొట్టుకురాగా.. వీధికుక్కలు పోట్లాడుకుంటూ వాటిని పీక్కుతినడం చూశా’ అని స్థానికుడైన ఓ వ్యక్తి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

CoronaVaccine: ప్రస్తుతానికి మిశ్రమ డోసుల్లేవు

5. Mobile Phone: ఫోన్‌ పోయిందా?

ఫోన్‌ పోయిందంటే సర్వమూ పోయినట్టే! అతిశయోక్తిగా అనిపించినా ప్రస్తుత పరిస్థితి ఇదే. ఎన్నో కాంటాక్టులు, ఎన్నో మెసేజ్‌లు, మరెన్నో ఫొటోలు, వీడియోలు! బ్యాంకు ఖాతాలైనా, చెల్లింపు యాప్‌లైనా, సామాజిక మాధ్యమాలైనా అన్నీ ఫోన్‌తో ముడిపడినవే. కాబట్టే ఒక్క క్షణం ఫోన్‌ కనిపించకపోయినా గుండె గుభేలుమంటుంది. ఇక ఎవరైనా దొంగిలిస్తే చెప్పేదేముంది? చేతులు కట్టేసినట్టే అవుతుంది. మన వ్యక్తిగత సమాచారమంతా రట్టయిపోతుంది. అయితే అంత గాబరా పడాల్సిన పనిలేదు. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో నిక్షిప్తమై ఉండే టూల్స్‌తో ఫోన్‌ని గుర్తించే మార్గాలు లేకపోలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. TS News: ద్వితీయ ఇంటర్‌ కూడా..!

 సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఇంటర్‌మీడియట్‌ రెండో సంవత్సరం పరీక్షలను రద్దు చేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. పరీక్షల నిర్వహణకు వీలులేకుంటే వాటిని రద్దు చేసి తొలి ఏడాదిలో సాధించిన మార్కులనే రెండో ఏడాదిలోనూ ఇవ్వాలని ఇంటర్‌బోర్డు నెలన్నర క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

TS News: వచ్చే సంవత్సరమూ పాత ఫీజులే!

7. బంగారాన్ని విడిపించుకోవడం లేదు

కొవిడ్‌-19 పరిణామాల నేపథ్యంలో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణం తీసుకుంటున్న వారి సంఖ్య కొన్ని రెట్లు పెరిగింది. అయితే.. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లతో పాటు, బంగారాన్ని తాకట్టు పెట్టుకుని రుణం ఇచ్చే సంస్థలకూ ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. బంగారాన్ని కుదవపెట్టి, అప్పు తీసుకుంటున్న వారిలో బాకీలు తీర్చని కేసులు పెరుగుతున్నాయి. మణప్పురం ఫైనాన్స్‌ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఏకంగా టన్ను బంగారాన్ని వేలం వేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. covid నయమైన 2-6 వారాల్లో.. చిన్నారులకు ముప్పు!

కొవిడ్‌ వచ్చి తగ్గిపోయిన చిన్నారులకు 2-6 వారాల మధ్య లేదా ఆ తర్వాత పలు అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ పేర్కొన్నారు. సమస్యలను వెంటనే గుర్తించి, వారికి చికిత్స అందించాలన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడారు. ‘‘చాలామంది చిన్నారులకు కరోనా సోకినా లక్షణాలు కనిపించడం లేదు. వైరస్‌ సంక్రమణ, ప్రవర్తనలో మార్పులొస్తే... వారిలోనూ కొవిడ్‌ తీవ్రత పెరిగే ప్రమాదముంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 Super Foods: ఈ ఆరూ.. పిల్లల సూపర్‌ ఫుడ్స్‌

9. S. S. Rajamouli: హాలీవుడ్‌ స్థాయి కథతో..

‘బాహుబలి’ సినిమాలతో తెలుగు చిత్రసీమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు   దర్శకుడు రాజమౌళి. తన దర్శకత్వ ప్రతిభతో ప్రపంచ సినీప్రియుల్ని మెప్పించారు. అందుకే ఇప్పుడాయన నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు.. దేశంతో పాటు ప్రపంచ సినీప్రియులంతా ఇటు వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. ఈ సినిమా అన్ని భారతీయ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల కానున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Cricket News: ఛాంపియన్స్‌ ట్రోఫీ మళ్లీ వచ్చింది

అగ్రశ్రేణి వన్డే జట్ల మధ్య నిర్వహించే ఛాంపియన్స్‌ ట్రోఫీని పునఃప్రారంభించాలని ఐసీసీ నిర్ణయించింది. ఒక పద్ధతి లేని టీ20 ప్రపంచకప్‌ను ఇకపై రెండేళ్లకోసారి నిర్వహించనుంది. వచ్చే ఎనిమిదేళ్లలో జరిగే ఐసీసీ టోర్నీల వివరాలతో కూడిన భవిష్య పర్యటన ప్రణాళిక (ఎఫ్‌టీపీ)ను వెల్లడించింది. 2027 నుంచి జరిగే ప్రపంచకప్‌లలో 14 జట్లు ఉంటాయని ఐసీసీ తెలిపింది. ‘‘2024-2031 వరకు ఐసీసీ ఈవెంట్లను ఐసీసీ బోర్డు ధ్రువీకరించింది. టీ20, వన్డే ప్రపంచకప్‌లు రెండింటిలోనూ జట్లు పెరుగుతాయి. ఛాంపియన్‌ ట్రోఫీని తిరిగి ప్రవేశపెడతాం’’ అని ఐసీసీ మంగళవారం ఓ ప్రకటనలో చెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని