Top Ten News @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Jun 2021 09:12 IST

1. పది పరీక్షలా? ఇంటరా?

విజయవాడకు చెందిన స్వాతి పదో తరగతి పూర్తి చేసింది. కరోనా కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలు పూర్తికాకుండానే ప్రైవేటు ఇంటర్‌ కళాశాలలు జేఈఈ, నీట్‌ కోచింగ్‌ ఆన్‌లైన్‌ పాఠాలు ప్రారంభించాయి. ఇప్పుడు కోచింగ్‌ తరగతులకు హాజరు కావాలా? పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం కావాలా? అనే దానిపై తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఇది ఒక్క స్వాతి విషయమే కాదు. దాదాపు రాష్ట్రంలో మూడు లక్షలకుపైగా విద్యార్థులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది 15 రోజుల ముందు సమాచారం ఇస్తామని ఇటీవల ప్రభుత్వ పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* 1 నుంచి ఇంజినీరింగ్‌ చివరి పరీక్షలు

2. నా ఫోన్‌తో తప్పుడు సందేశాలు

ఎంపీ రఘురామకృష్ణరాజు ఫోన్‌ నంబరు నుంచి తనకు, తన కుటుంబానికి వాట్సప్‌ సందేశాలు వస్తున్నాయని మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన నేపథ్యంలో.. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ దిల్లీ పార్లమెంటు స్ట్రీట్‌ డీసీపీకి ఎంపీ ఫిర్యాదు చేశారు. మే 14న తనను అరెస్టు చేసినప్పుడే ఏపీ సీబీసీఐడీ పోలీసులు తన సెల్‌ఫోన్‌ తీసేసుకున్నారని, అప్పటి నుంచి అనధికారికంగా వారి వద్దనే ఉందని వివరించారు. ఏపీ సీబీసీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌ ఆ ఫోన్‌ ద్వారా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మానింది మందు... బతికింది ఊరు

స్థాన వైద్యుడి నివాసానికి రాజభటులు పరుగున వచ్చారు. ‘రాణీగారికి అనారోగ్యం... వెంటనే దివాణానికి దయచేయాలని ప్రభువుల ఆజ్ఞ’ అని మనవి చేశారు. రాణివాసం వద్ద పరిచారికలు ఎదురొచ్చారు. ‘అమ్మగారికి జలుబు పడిసెం రొంప...’ అన్నారు కంగారుగా రొప్పుతూ. నాడి పరీక్షించాడు వైద్యుడు. చుట్టూ పరికించాడు. గంభీరంగా తల పంకించాడు. ‘తప్పదు, ప్లాసెబో పడిపోవాల్సిందే’ అని ప్రకటించాడు. ‘మూడు పూటలా వాడండి’ అంటూ పరిచారికలకు పథ్యం వివరించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Corona: మిస్సీ కష్టం!

4. AP News: నడిరోడ్డుపై పోలీసులకు యువతి ప్రతిఘటన

కర్ఫ్యూ సమయంలో బయట తిరిగేందుకు అనుమతి ఉన్న తన వాహనానికి అపరాధ రుసుం విధించారంటూ విశాఖ నగరానికి చెందిన ఒక ఆసుపత్రి మహిళా ఉద్యోగిని పోలీసులను నడిరోడ్డుపైనే నిలదీశారు. దీనిపై వాగ్వాదం జరిగి, అది తీవ్రమవడంతో పోలీసులు ఆమెను స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. ఆమె తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. ఈ దృశ్యాలన్నీ శనివారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయి.  విశాఖలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో టైపిస్ట్‌గా పనిచేస్తున్న లక్ష్మీ అపర్ణ ఉదయం ఆటోలో ఆసుపత్రికి వెళ్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. టీ20 ప్రపంచకప్‌ యూఏఈలో!

అక్టోబరు-నవంబరులో భారత్‌ ఆతిథ్యమివ్వాల్సిన టీ20 ప్రపంచకప్‌ను యూఏఈకి తరలించడం దాదాపు ఖాయమైపోయింది. కరోనా కారణంగా దేశంలో పరిస్థితులు అనుకూలంగా లేని నేపథ్యంలో యూఏఈలో టోర్నీ నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఐసీసీతో బీసీసీఐ చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘భారత్‌లో టీ20 నిర్వహణపై నిర్ణయం తీసుకోవడానికి నెల రోజుల సమయం కావాలని ఇటీవల ఐసీసీ సమావేశంలో బీసీసీఐ కోరింది. కానీ అదే సమయంలో టోర్నీని యూఏఈ తరలించినా అభ్యంతరం లేదని చెప్పింది’’ అని ఓ బీసీసీఐ సీనియర్‌ అధికారి చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Cricket News: యువ బృందం లంకను చిత్తుచేస్తుంది!

6. చాయ్‌ బిస్కెట్‌...ఇద్దరు స్నేహితుల కథ!

హైదరాబాదీలు దోస్తులొస్తే చాయ్‌ బిస్కెట్‌ ఇప్పిస్తారు. మరీ దగ్గరి స్నేహితులైతే సింగిల్‌ చాయ్‌లో చెరో బిస్కెట్‌ ముంచుకుని తింటారు. అందుకేనేమో తమ దోస్తీతో పుట్టిన వినోదాల వెబ్‌సైట్‌కి ‘చాయ్‌ బిస్కెట్‌’ అని పేరుపెట్టారు అనురాగ్‌, శరత్‌. ఈ సైట్‌కంటే ముందు, తెలుగు సినిమా పరిశ్రమకి తొలిసారి డిజిటల్‌ మార్కెటింగ్‌ని పరిచయం చేసిన ఘనత ఈ కుర్రాళ్లది. మామూలు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వీళ్లు ఇప్పుడు నిర్మాతలుగా మారి రెండు సినిమాలు తీస్తున్నారు. అడివి శేష్‌ ‘మేజర్‌’ చిత్రం అందులో మొదటిది. వాళ్ల జర్నీ ఇది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. AP News: న్యాయవాదికి రూ.96 లక్షల ఫీజా?

సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డికి రూ.96 లక్షలు ఫీజుగా చెల్లించేందుకు పరిపాలన అనుమతి ఇస్తూ ఈ ఏడాది మే 24న ప్రభుత్వం జారీ చేసిన జీవో 239ని సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఏపీ న్యాయవాదుల రుసుముల నిబంధన-43 ఉల్లంఘించేదిగా ఆ జీవో ఉందని హైకోర్టు న్యాయవాది చింతల విజయ్‌కుమార్‌ తరఫున న్యాయవాది వై.కమలారాణి ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ జీవో చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించి, కొట్టేయాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆ గాలి... చంపేస్తుంది..!

8. TS News: 57 రకాల పరీక్షలు ఉచితం

రాష్ట్రంలో సోమవారం నుంచి 19 జిల్లా ఆసుపత్రుల్లో ఉచిత రోగనిర్ధారణ పరీక్ష (డయాగ్నొస్టిక్‌) కేంద్రాలు ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, జనగామ, ములుగు, మహబూబాబాద్‌, భద్రాద్రి, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్‌, నిర్మల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, గద్వాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని కేంద్ర ఆసుపత్రుల్లో ఇందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వీటిలో కరోనాతో పాటు రక్త, మూత్ర పరీక్షలు సహా బీపీ, షుగర్‌, గుండెజబ్బులు, ఎముకలు, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, థైరాయిడ్‌ సంబంధిత 57 రకాల టెస్టులు చేస్తారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మరో కథ సిద్ధమైందా?

గ్ర కథానాయకుడు బాలకృష్ణతో సినిమాలు చేయడం కోసం యువ దర్శకులు పోటీపడుతున్నారు. ఇప్పటికే గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమాకి పచ్చజెండా ఊపారు బాలయ్య. త్వరలోనే పట్టాలెక్కనున్న ఆ చిత్రం కోసం నిజ జీవిత సంఘటనలతో ఓ స్క్రిప్టు సిద్ధమవుతోంది. మరో యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి కూడా బాలయ్య కోసం కథ సిద్ధం చేశారు. తాజాగా ఆ వరసలో మరో దర్శకుడు చేరినట్టు తెలిసింది. వరుసగా ప్రేమకథల్ని తెరకెక్కించిన ఆ దర్శకుడు బాలకృష్ణ కోసం కథ సిద్ధం చేసినట్టు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వంటల ఛానెల్‌తో లక్షలు సంపాదిస్తున్న రోజు కూలీ!

10. Corona: కొండంత భారం మోపిన కొవిడ్‌!

కొవిడ్‌ వల్ల కార్యాలయాల్లో, ఇంట్లో మహిళలపై విపరీతమైన భారం పెరిగిందని ఇది వారిపై తీవ్ర ప్రభావం చూపుతోందని డెలాయిట్‌ సంస్థ అధ్యయనంలో తెలుస్తోంది. కొవిడ్‌ సమయంలో మహిళల ఉద్యోగ సంతృప్తి, మానసిక ఆరోగ్యం విపరీతంగా దెబ్బతిన్నాయన్నది డెలాయిట్‌ నివేదిక సారాంశం. గత నవంబర్‌, ఈ ఏడాది మార్చిల్లో ఈ సర్వేను నిర్వహించారు. ప్రతి 10 మందిలో ఏడుగురు (69 శాతం) భారతీయ మహిళలు కొవిడ్‌కు ముందు తమ ఉద్యోగం చాలా బాగుందని లేదా బాగుందని చెప్పారు. కానీ ప్రస్తుతం 28 మాత్రమే ఈ సమాధానాన్ని మళ్లీ ఇవ్వగలిగారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని