Top Ten News @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 Jun 2021 09:55 IST

1. CoronaVirus: కరోనా పాపం చైనాదే

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ చైనాలోని వుహాన్‌ ప్రయోగశాలలోనే పుట్టిందని పుణెకు చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్‌ మొనాలీ రాహల్కర్‌, డాక్టర్‌ రాహుల్‌ బాహులికర్‌ అభిప్రాయపడ్డారు. తాము చేసిన పరిశోధనల్లో లభించిన ఆధారాలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయని చెప్పారు. గనిలో దొరికిన ఓ వైరస్‌ జన్యుక్రమంలో చైనా శాస్త్రవేత్తలు మార్పులు చేస్తున్న క్రమంలో కరోనా ఉద్భవించి ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: ఆమె శరీరంలో 32 రకాల మ్యుటేషన్స్‌

2. TS Lockdown: సాయంత్రం 5 వరకు లాక్‌డౌన్‌ సడలింపు?

లాక్‌డౌన్‌ను మరింత సడలించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు జనసంచారాన్ని అనుమతించాలని యోచిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో నిర్వహించనున్న మంత్రి మండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. లాక్‌డౌన్‌ మూడో విడతపై గత నెల 30న మంత్రి మండలి సమావేశమైంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెసులుబాటు కల్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. షేర్లు తెగ కొనేస్తున్నారు

కవైపు కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్నా.. స్టాక్‌మార్కెట్లు దూసుకెళ్లడంతో పలువురు కొత్త మదుపర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. 2020 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు ప్రతి నెలా సరాసరిన 13 లక్షల కొత్త డీమ్యాట్‌ ఖాతాలు ప్రారంభమైట్లు బీఎస్‌ఈ అధికారిక గణాంకాలు వెల్లడించడమే ఇందుకు నిదర్శనం. గత 14 నెలలుగా బ్రోకరేజీ సంస్థలు, ఎక్స్ఛేంజీలు సరాసరిన 12-15 లక్షల మంది చొప్పున (మొత్తం 1.8 కోట్ల) కొత్త మదుపర్లను జత చేసుకుంటూ వెళ్లాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

విజయ డయాగ్నొస్టిక్‌ ఐపీఓ

4. Rat Magawa: మందుపాతరలపై ‘ఎలుకె’త్తింది..!

ఘర్షణల్లో భాగంగా దశాబ్దాల కిందట నేలలో పాతిపెట్టిన పేలుడు పదార్థాలు అనేక దేశాల్లో యమపాశాలుగా మారాయి. వీటిని అనుపానులను పసిగట్టడానికి అధునాతన సాధనాలు, సుశిక్షిత జాగిలాలను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ అసమాన సామర్థ్యం శునకాలకే కాదు.. తనకూ ఉందని ఓ ఎలుక రుజువు చేసుకుంది. ఈ అల్పజీవి.. కంబోడియాలో అనేక బాంబులను పట్టించింది. తద్వారా ఆ దేశంలో ‘హీరో ర్యాట్‌’గా గుర్తింపు పొందింది. అనేక పతకాలను గెల్చుకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. టీకాల ప్రక్రియలో కేంద్రం వైఫల్యం

కేంద్ర ప్రభుత్వ తప్పిదాల వల్లనే దేశంలో కొవిడ్‌ టీకాల కొరత ఏర్పడిందని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు విమర్శించారు. దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా నిల్వ చేయకుండా ఎగుమతులు చేయడం, తయారీ సంస్థలకు అనుమతుల్లో జాప్యం వంటి లోపాలను ఆయన ఎత్తి చూపారు. అమెరికా, ఇజ్రాయెల్‌ లాంటి దేశాలు సగానికి పైగా జనాభాకు టీకాలను అందించగా... మన దేశంలో  కనీసం 10 శాతం కూడా వేయలేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఆ రాష్ట్రాల వల్లే టీకాల మందగమనం

6. భారత్‌ నుంచి పారిపోలేదు

భారత్‌ నుంచి పారిపోలేదని, తాను చట్టానికి కట్టుబడే వ్యక్తినని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీ తెలిపారు. ఈ మేరకు డొమినికా హైకోర్టులో 8 పేజీల ప్రమాణపత్రం దాఖలు చేశారు. తనను విచారించుకోవచ్చని భారత్‌ అధికారులకు గతంలోనే తెలిపానని పేర్కొన్నారు. అమెరికాలో వైద్యం చేయించుకోవడానికి భారత్‌ విడిచి వెళ్లినప్పుడు తనపై ఎలాంటి వారెంట్‌ లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Corona: అతిగా ఆవిరి పట్టడం అనర్థం

‘‘రోజులో నాలుగయిదు సార్లు ఆవిరిపట్టటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ముక్కులో వైరస్‌ను అడ్డుకోవటానికి రోమాలుంటాయి. ఎక్కువ ఆవిరి పట్టడం వల్ల అవి దెబ్బతింటాయి. ముక్కులో ఉండే సహజమైనవాతావరణాన్ని మార్చటం వల్ల వైరస్‌లు, ఫంగస్‌లు లోపలికి చొచ్చుకుపోతాయి’’ అని పల్మనాలజీ వైద్యనిపుణుడు, హైదరాబాద్‌ చెస్ట్‌ హాస్పిటల్‌ మాజీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శుభాకర్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రూపానికి లోపం లేకుండా!

8. బాబూ.. ఇది బాంబూ బీర్‌

దేశీయ పానీయాలకు పేరు గాంచిన ప్రదేశం త్రిపుర. బియ్యంతో తయారు చేసే ‘రైస్‌ బీర్‌’ ఇక్కడ ఎంతో ప్రాచుర్యం పొందింది. తాజాగా అదే కోవలో.. ఈ ప్రాంతానికే చెందిన సమీర్‌ జమాతియా అనే ఓ వెదురు సాంకేతిక నిపుణుడు.. సరికొత్త బీర్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. అదే వెదురు నుంచి తయారు చేసిన బీర్‌. దీనికి ‘బాంబూ బీర్‌’ అని పేరు పెట్టారాయన. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నేనెందుకు కోచ్‌ కాలేనంటే..

 తానెప్పుడూ కోచ్‌గా పని చేయడం గురించి కనీసం ఆలోచించలేదని భారత క్రికెట్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ చెప్పాడు. అపార క్రికెట్‌ పరిజ్ఞానం ఉన్నా గావస్కర్‌ ఎప్పుడూ కోచ్‌గా పని చేయలేదు. బిషన్‌సింగ్‌ బేడి, వాడేకర్‌, కపిల్‌ దేవ్‌ లాంటి కోచ్‌లుగా మారినా అతడు ఏనాడూ కోచ్‌ పదవిపై ఆసక్తిని ప్రదర్శించలేదు. అందుకు కారణమేంటన్నది ఇప్పుడు వివరించాడు సన్నీ. తాను కోచ్‌గా సరిపోనని అతనన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* బుడగలో.. 104 రోజులు

10. TS News: పెళ్లి చేసుకొని.. పారిపోదామ‌ని

మూడేళ్లుగా ఆ యువతి ఒకరిని ప్రేమించింది. తరవాత పెద్దలు కుదిర్చిన పెళ్లికి సిద్ధపడింది. అయితే.. ఉదయం పెళ్లి చేసుకుని అర్ధరాత్రి ప్రియుడితో వెళ్లిపోవాలని భావించింది. పెళ్లి పీటలపై నుంచి కూడా ప్రియుడితో చాటింగ్‌ చేసింది. అనుమానం వచ్చి బంధువులు నిలదీయడంతో విషయం పోలీస్‌ స్టేషన్‌కు చేరింది.. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని