Top Ten News @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Jun 2021 09:15 IST

1. Modi: కరోనా విపత్తు వేళ యోగా ఆశా కిరణం

యోగా ద్వారా ప్రతి దేశం, సమాజం స్వస్థత పొందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యోగాను ఆరోగ్య ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.  యోగా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లామని తెలిపారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా మోదీ ప్రసంగించారు. ‘కరోనాతో భారత్‌ సహా పలు దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. దేశంలోని ప్రతి మూలా లక్షలాది మంది యోగా సాధకులుగా మారారు. కరోనాపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉంది’ అని ప్రధాని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సమస్యలకు యోగాతో సవాల్‌

2. wuhan: అమెరికా చేతిలో వుహాన్‌ రహస్యాలు?

చైనా ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి అధికారి ఒకరు ప్లేటు ఫిరాయించి, అమెరికా పంచన చేరినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. వుహాన్‌లోని వివాదాస్పద వైరాలజీ ల్యాబ్‌ నుంచి కరోనా వైరస్‌ లీకైందనడానికి ఆధారాలనూ జో బైడెన్‌ సర్కారుకు అందించినట్లు ప్రచారం జరుగుతోంది. అందువల్లే ఈ మహమ్మారి మూలాలపై అమెరికా కొత్తగా దృష్టి పెట్టి, విచారణకు ఆదేశించినట్లు సమాచారం. సదరు అధికారికి చైనాలోని గూఢచర్య విభాగాలు, భద్రత వ్యవస్థలతో గట్టి సంబంధం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కరోనాతో సుదీర్ఘ పోరాటం.. కన్నీళ్లతో ప్రాణత్యాగం..

కరోనాతో సుదీర్ఘ కాలం పోరాడిన ఆ యోధుడు అలసిపోయాడు. బయటి ప్రపంచానికి దూరంగా ఆసుపత్రిలోని నాలుగు గోడలకే పరిమితమైన ఆ వ్యక్తి.. ఇక జీవన్మరణ పోరాటం చేయలేనంటూ విరమించుకున్నాడు. స్వచ్ఛందంగా చికిత్స నుంచి తప్పుకుని తనువును వదిలేశాడు. బ్రిటన్‌కు చెందిన 49 ఏళ్ల  జేసన్‌ కెల్క్‌ దీనగాథ ఇది. కెల్క్‌ బ్రిటన్‌లో అత్యధిక కాలం(14 నెలలు) కరోనాతో పోరాడిన వ్యక్తిగా వార్తల్లోకెక్కారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. MMTS: ఎంఎంటీఎస్‌ రైళ్లు వచ్చేస్తున్నాయ్‌!

గర ప్రయాణికులకు శుభవార్త..! ఎట్టకేలకు ఎంఎంటీఎస్‌ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. కరోనా కారణంగా సరిగ్గా 15 నెలల ముందు ఆగిపోయిన ఎంఎంటీఎస్‌ రైళ్లు ఈనెల 23 (బుధవారం) నుంచి పట్టాలెక్కనున్నాయి. ప్రజారవాణా అంతా పరుగులు పెడుతున్నా.. ఎంఎంటీఎస్‌ రైళ్లు ఎందుకు నడపడం లేదని తలలు పట్టుకున్న నగర ప్రయాణికులకు ఇది తీపి కబురు. బుధవారం నుంచి 10 ఎంఎంటీఎస్‌లు నడపడానికి రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నేటి నుంచి ఆర్టీసీ అంతరరాష్ట్ర సర్వీసులు

5. శాన్వి కోసం చేతులు కలుపుతారా..

ఒకే ఒక్క ఇంజక్షన్‌... సాంత్వననిస్తుంది... సత్తువనిస్తుంది. ఆ బిడ్డ తన కాళ్లపై తాను నిలబడేలా చేస్తుంది. కానీ దాన్ని పొందడం ఆషామాషీకాదు. ఎందుకంటే.. దాని ఖరీదు అక్షరాలా రూ.16 కోట్లు. ఒక సగటు మనిషి కలలో కూడా ఊహించలేని మొత్తం. అంత డబ్బు సమకూర్చుకోలేక, ఆ చిన్నారి పడే నరకాన్ని చూడలేక మౌనంగా రోదిస్తున్నారా తల్లిదండ్రులు.. సాయం చేయాలనుకునే వారు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబరు: 8008055788 పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జూనియర్లకే జీతాలు ఎక్కువ!

సీనియర్‌ స్టాఫ్‌ నర్సుల నెల వేతనం రూ.22,500. జూనియర్‌ స్టాఫ్‌ నర్సుల వేతనం రూ.34,000. వైద్య, ఆరోగ్యశాఖ ఆసుపత్రుల్లో పని చేసే స్టాఫ్‌ నర్సులకు చెల్లించే జీతాల్లో కనిపిస్తున్న తేడా ఇది. విధులు, పని వేళలు ఒకటే. కానీ సీనియారిటీకి తగ్గ వేతనం, ఉద్యోగ భద్రత కనిపించడం లేదని స్టాఫ్‌ నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఒప్పంద విధానంలో 11,820 మంది స్టాఫ్‌ నర్సులు విధుల్లో చేరగా వీరిలో 7,867 మందికి నెలకు వేతనం కింద రూ.22,500 చెల్లిస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కలబంద రసాయనంతో మెమరీ చిప్‌లు!

కలబంద (అలోవెరా) మొక్కలో ఔషధ గుణాలు అపారం. దీన్ని సౌందర్య లేపనాలు, వివిధ రకాల ఆయింట్‌మెంట్లలో విరివిగా వాడుతుంటారు. ఇందులోని ఒక రసాయనానికి ఎలక్ట్రానిక్‌ మెమరీ సామర్థ్యం కూడా ఉందని ఇండోర్‌లోని ఐఐటీ శాస్త్రవేత్తలు తేల్చారు. ఎలక్ట్రానిక్‌ మెమరీ చిప్‌లు, ఇతర డేటా నిల్వ సాధనాలను తయారుచేయడానికి ఇది ఉపయోగపడుతుందని వివరించారు. పరిశోధనలో భాగంగా కలబంద రసంలోకి విద్యుత్‌ను పంపినప్పుడు ఈ లక్షణం బయటపడిందని రాజేశ్‌ కుమార్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* విదేశీ విద్యకు... అంతా అనుకూలం!

8. ప్రత్యర్థిదే పైచేయి

టీమ్‌ఇండియా తడబడింది. రెండో రోజు పోరాటాన్ని వృథా చేసుకుంటూ.. మూడో రోజు బ్యాటుతో నిరాశపరిచింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌దే కాస్త మెరుగైన పరిస్థితి. పేసర్‌ జేమీసన్‌ విజృంభణతో కోహ్లీసేనను అనుకున్న దాని కంటే తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ఆ జట్టు.. కాన్వే చక్కని బ్యాటింగ్‌తో తన తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరుపై కన్నేసింది. అయితే భారత్‌ కాస్త ఆలస్యంగానైనా రెండు వికెట్లు పడగొట్టి పోటీలోకి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అమితాబ్‌ లేఖ రాశారు

‘మళ్లీ రావా’, ‘దేవదాస్‌’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కథానాయిక ఆకాంక్ష సింగ్‌. ప్రస్తుతం హిందీలో ‘మే డే’ చిత్రంలో నటిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ నటిస్తూ బిజీగా గడుపుతోంది. ‘క్లాప్‌’, ‘శివుడు’ చిత్రాలతో సందడి చేయనుందీమె. ఈ సందర్భంగా ఆకాంక్షతో ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా ముచ్చటించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కాబోయే భర్తను కట్టేసి యువతిపై అత్యాచారం

రదాగా నదీ తీరంలోని ఇసుక తిన్నెలపై సేద తీరుదామని వెళ్లడమే వారి పాలిట శాపమైంది..అక్కడే మాటువేసిన దుండగులు ఒక్కసారిగా మీదపడే సరికి దిక్కుతోచని స్థితి ఎదురైంది. క్రూరత్వం నిండిన దుర్మార్గుల చేతిలో యువతి అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురైంది.అడ్డుకునేందుకు అవకాశం లేకుండా ఆమె కాబోయే భర్త ముందే అఘాయిత్యం చేసిన తీరు కలచివేసింది. ముఖ్యమంత్రి అధికార నివాసానికి కిలోమీటరున్నర దూరంలోనే జరిగిన ఈ సంఘటన భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కాలకూట విషం విచ్చలవిడి విక్రయం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని