Updated : 22 Jun 2021 09:08 IST

Top Ten News @ 9 AM

1. ఇ కామర్స్‌ ఫ్లాష్‌ సేల్‌ కుదరదు

దేశంలో ఇ కామర్స్‌ సంస్థలు వస్తు, సేవల ఫ్లాష్‌ సేల్‌ నిర్వహించడానికి వీల్లేకుండా నిబంధన విధించాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రతిపాదించింది. కొన్నేళ్లుగా ఇ కామర్స్‌ సంస్థలు, కొత్త తరహా వ్యాపార విధానాలు అనుసరిస్తున్న నేపథ్యంలో వినియోగదారుల హక్కుల సంరక్షణ చట్టానికి సవరణలను కేంద్ర వినియోగ వ్యవహారాలశాఖ ప్రతిపాదించింది. జులై 6లోపు దీనిపై సూచనలు, సలహాలు తెలిపే వీలుంది. దీని ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* మార్కెట్‌ మరింత ముందుకే

2. కశ్మీర్‌ పరిష్కారమైతే... అణ్వాయుధాలక్కర్లేదు: ఇమ్రాన్‌

అమెరికా మనసు పెట్టి, తలచుకుంటే.. కశ్మీర్‌ సమస్య పరిష్కారమవుతుందని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు. ఒక్కసారి కశ్మీర్‌ పరిష్కారమైతే.. పాకిస్థాన్‌కు అణ్వాయుధాలు అక్కర్లేదన్నారు. కేవలం స్వీయరక్షణ కోసమే పాకిస్థాన్‌ అణ్వాయుధాలను సమకూర్చుకుందన్నారు. హెచ్‌బీఓ టీవీ కార్యక్రమానికిచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ విషయాలు వెల్లడించినట్లు.. పాక్‌ పత్రిక డాన్‌ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. WTC Final: తుదిపోరు డ్రా అయితే..? 

సౌథాంప్టన్‌ వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిస్తే.. విజేతను ప్రకటించడానికి ఐసీసీ ఒక సూత్రాన్ని కనుగొనాలని టీమ్‌ఇండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు జట్ల మధ్య ఆసక్తికరంగా సాగుతున్న మ్యాచ్‌లో వరుణుడు పదేపదే అంతరాయం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* 35 ఏళ్లు మగాడిగా.. ఆపై మహిళగా..

4. ఓఎంసీ కేసులో ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి చివరి అవకాశం

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నిందితురాలైన ఏపీ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌లో వాదనలు వినిపించడానికి చివరిగా ఓ అవకాశం ఇస్తున్నట్లు సీబీఐ కోర్టు తెలిపింది. ఈ నెల 29న వాదనలు వినిపించని పక్షంలో ఏకపక్షంగా విచారణ చేపట్టి ఉత్తర్వులు వెలువరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఓబుళాపురం గనుల అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై సీబీఐ దాఖలు చేసిన కేసులో సోమవారం సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్‌.మధుసూదన్‌రావు విచారణ చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. విడతల వారీగా బడులు

పాఠశాలల్లో తరగతులను విడతల వారీగా ప్రారంభించాలని విద్యాశాఖ యోచిస్తోంది. పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ (ప్రత్యక్ష తరగతులు) అవకాశం కల్పిస్తారు. ఏ విధానంలో హాజరు కావాలన్నది విద్యార్థుల ఇష్టం. జులై 1వ తేదీ నుంచి 8, 9, 10 తరగతులను, 20వ తేదీ నుంచి 6, 7 తరగతులను మొదలుపెట్టాలని, ఆగస్టు 16వ తేదీ నుంచి 3, 4, 5 తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించాలని భావిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆగస్టు 4 నుంచి ఎంసెట్‌

6. మిషన్‌ 2024

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జాతీయ రాజకీయాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ప్రస్తుతం భాజపా, కాంగ్రెస్‌లు కేంద్రాలుగా రాజకీయాలు సాగుతున్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమి ఏర్పాటుకు చాలారోజుల తర్వాత విభిన్న రాజకీయ పార్టీలు ఒక వేదిక మీదికి వస్తున్నాయి. రాజకీయాల్లో అత్యంత సీనియర్లుగా ఉన్న ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌, ఇటీవల తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హాలు సంయుక్తంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కరోనాకు చెక్‌పెట్టే బ్యాక్టీరియా

 కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను బ్యాక్టీరియాతో అంతమొందించే దిశగా దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. మనుషుల పేగుల్లో నివసించే ఒకరకం సూక్ష్మజీవులకు ఈ సామర్థ్యం ఉందని గుర్తించారు. ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి వ్యాధి లక్షణాలు కలిగిన కొవిడ్‌ బాధితులు కొందరిలో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన రుగ్మతలు కూడా కనిపించినట్లు ఇప్పటికే వెల్లడైంది. మిగతావారిలో మాత్రం ఊపిరితిత్తులకే ఈ ఇన్‌ఫెక్షన్‌ పరిమితమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కొవిడ్‌తో వచ్చే మధుమేహానికి మూలికా చికిత్స

8. Tollywood news: కొత్తకొత్తగా.. డిష్యుం డిష్యుం

కొత్తదనం అనేది ఇప్పుడు కథలు.. కలయికలకే పరిమితం కావడం లేదు. పాటలు.. ఫైట్ల విషయంలోనూ సినీప్రియులు కొత్తదనం కోరుకుంటున్నారు. ముఖ్యంగా పోరాట ఘట్టాల విషయంలో ఇప్పుడు లెక్కలన్నీ మారిపోయాయి. సినిమాలో ఎన్ని ఫైట్‌ సీక్వెన్స్‌లు ఉన్నాయన్న దానికన్నా.. వాటిని ఎంత కొత్తగా చూపిస్తున్నారన్న దాని గురించే చర్చించుకుంటున్నారు. ఇక ఇందుకోసం కథానాయకులు కొత్త యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నారని తెలిస్తే చాలు.. ప్రేక్షకుల కళ్లన్నీ ఆ సినిమాలపైనే ఉంటున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. vaccine: సంతాన సాఫల్యతకు టీకాతో ముప్పు లేదు

కరోనా టీకా తీసుకునే పురుషులు, మహిళలు వంధ్యత్వం బారిన పడే ముప్పుందంటూ వస్తున్న వార్తలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఖండించింది. వ్యాక్సిన్‌ వేయించుకున్నవారిలో సంతాన సాఫల్యత సంబంధిత సమస్యలు తలెత్తుతాయని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలేవీ లేవని పునరుద్ఘాటించింది. కొందరు వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, నర్సుల్లో ఉన్న మూఢనమ్మకాలు, అపనమ్మకాలకు.. మీడియాలోని కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వకంగా విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయని ఓ ప్రకటనలో వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* nutritious food: కొవిడ్‌ కొమ్ములు విరిచేలా..

10. Ts news: శస్త్ర చికిత్స తారుమారు

ప్రసవం కోసం శస్త్రచికిత్స చేయాల్సింది ఒక మహిళకయితే పొట్టకోసింది మరో మహిళకు... ఆమె అప్రమత్తమై అరవడంతో నాలుక్కరుచుకున్న వైద్యులు కుట్లు వేసి పంపించారు. కరీంనగర్‌ మాతాశిశు సంరక్షణ కేంద్రంలో  ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి భర్త నరోత్తమరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్‌కు చెందిన మాలతి, నరోత్తమరెడ్డి దంపతులు. మాలతి ఏడు నెలల గర్భవతి. నీరసంగా ఉండటం, కడుపునొప్పి రావడంతో గురువారం కరీంనగర్‌లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని