Updated : 04 Jul 2021 09:29 IST

Top Ten News @ 9 AM

1. డెల్టా వేరియంట్‌లో ఆగని ఉత్పరివర్తన

వేగంగా వ్యాప్తి చెందే డెల్టా వంటి కరోనా వైరస్‌ వేరియంట్లతో ప్రపంచం గడ్డు దశలో ఉందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ చెప్పారు. తక్కువ వ్యాక్సినేషన్‌ జరిగిన దేశాల్లో ఆస్పత్రులు మరోసారి నిండిపోతున్నాయంటూ శుక్రవారం ఆయన హెచ్చరించారు. ‘‘డెల్టా వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తుండటంతో చాలా దేశాల్లో వైరస్‌ విజృంభిస్తోంది. ఏ దేశమూ దీన్నుంచి బయటపడలేదు. ఈ వేరియంట్‌లో ఉత్పరివర్తన (మ్యుటేషన్‌) జరుగుతూనే ఉండటంతో మరింత ప్రమాదకరంగా మారుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇవి... వైరస్‌ను అడ్డుకుంటాయి!

2. మమతకూ ప్రమాద ఘంటికే!

కరోనా తీసుకువచ్చిన తంటాలు ఇప్పుడు ముఖ్యమంత్రుల పీఠాలకూ పరోక్షంగా ఎసరు పెడుతున్నాయి. అసెంబ్లీలో సభ్యులుగా లేనివారు సీఎంగా ఎన్నికైతే గరిష్ఠంగా ఆరు నెలల్లోగా సభకు ఎన్నిక కావాలనేది రాజ్యాంగ నిబంధన. ఉత్తరాఖండ్‌లో అలాంటి అవకాశం లేక తీరథ్‌ సింగ్‌ రావత్‌ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన వైదొలగడానికి ఇదో ప్రధాన కారణం. ఇప్పుడు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విషయంలోనూ ఇలాంటి ప్రమాద ఘంటికలే మోగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 19 వేల పోలీస్‌ కొలువులు!

రాష్ట్ర పోలీస్‌ శాఖలో మరో భారీ నోటిఫికేషన్‌ రాబోతోంది. 19 వేల పైచిలుకు కొలువుల్ని భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదివారం వాటి భర్తీ గురించి ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సిరిసిల్ల పర్యటనలో భాగంగా ఆయన ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే తెలంగాణలో పోలీస్‌ కొలువులకు సంబంధించి ఇదే భారీ నోటిఫికేషన్‌ కానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నీటి వాటా 50:50

4. భూగర్భ పార్కింగ్‌ కుదరదు

రాష్ట్రంలో ఇకపై ఎకరా.. ఆపైన విస్తీర్ణంలో నిర్మితమయ్యే బహుళ అంతస్తుల సముదాయాల్లో భూగర్భ పార్కింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. మొదటి అయిదు అంతస్తుల వరకు పార్కింగ్‌ కోసం వాడుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీనినే పోడియం పార్కింగ్‌గా పేర్కొంటున్నారు. ముంబయి నగరంలో ఈ వ్యవస్థ ఇప్పటికే ఉంది. ఒక వేళ రెండు అంతస్తుల్లోనే సరిపోతే ఆ మేరకే ఉపయోగించాలని ప్రభుత్వం పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 14 రోజులైనా చిక్కని నిందితులు

సీతానగరం పుష్కర ఘాట్‌వద్ద ఎస్సీ యువతిపై సామూహిక అత్యాచారం జరిగి 14 రోజులు గడుస్తున్నా పోలీసులు ఇప్పటివరకూ నిందితుల్ని పట్టుకోలేకపోయారు. ఈ దురాగతానికి పాల్పడిన వారెవరో నిర్ధారణకొచ్చినప్పటికీ వారిని ఇప్పటి వరకూ అదుపులోకి తీసుకోలేకపోయారు. నిందితులుగా అనుమానిస్తున్న వారి సమగ్ర వివరాలు, చిత్రాలు, చిరునామా, గత నేర చరిత్ర తదితర సమాచారమంతా అందుబాటులో ఉన్నా సరే ఇంకా వారెక్కడున్నారో గుర్తించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఫీజుల ఖరారు ఎప్పుడో?

6. నింగిలోకి ఒకేసారి 88 ఉపగ్రహాలు

ఒకే రాకెట్‌ ద్వారా పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను ప్రయోగించే కసరత్తును అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ ‘స్పేస్‌ఎక్స్‌’ కొనసాగిస్తోంది. తాజాగా ‘ట్రాన్స్‌పోర్టర్‌-2’ మిషన్‌లో భాగంగా ఒకేసారి 88 ఉపగ్రహాలను రోదసిలోకి పంపింది. పాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిపింది. 2021లో ఈ సంస్థకు ఇది 20వ ప్రయోగం కావడం గమనార్హం. వీటి ద్వారా 900 ఉపగ్రహాలను రోదసిలోకి పంపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అదరగొట్టేస్తున్న యూట్యూబ్‌ ‘స్టార్స్‌’

ప్రస్తుతం సోషల్‌ మీడియా ట్రెండ్‌ నడుస్తోంది. అభిమానగణం, ఆదాయం రెండూ ఇక్కడ సులువుగా సాధించొచ్చు. అందుకే సెలబ్రిటీలు సైతం వెండితెర మీదే కాదు వెబ్‌సిరీస్‌లు, వ్లాగ్స్‌తో టీవీ, మొబైల్‌ స్క్రీన్‌ల మీదా దర్శనమిస్తున్నారు. ప్రత్యేకించి సొంత యూట్యూబ్‌ ఛానెల్స్‌తో సందడి చేస్తున్నారు. తరచూ వీడియోలు పెడుతూ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అనుష్క అంటే ఇష్టం

8. రాయిలా మారుతున్న చిన్నారి శరీరం

బుజ్జి బుజ్జి పాదాలు...చిన్ని చిన్ని చేతులు కదిలిస్తూ చిన్నారులు చేసే కేరింతలు..లేలేత పెదాలపై విరబూసే బోసి నవ్వులు.. సంతోషాల సంబరాన్ని అందిస్తాయి. అలాంటి బుజ్జాయి..అరుదైన, చికిత్సలేని వ్యాధిబారిన పడితే.. ఇక ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు బ్రిటన్‌కు చెందిన అలెక్స్‌, దవె దంపతులు. అత్యంత అరుదైన రుగ్మతతో బాధపడుతున్న వారి ఐదు నెలల చిన్నారి లెక్సి రాబిన్స్‌ శరీరం రాయిలా మారుతోంది. వైద్యుల వద్దకు తీసుకెళితే చివరకు ఫైబ్రోడిస్‌ప్లాసియా ఓసిఫికన్స్‌ ప్రొగ్రెస్సివా(ఎఫ్‌ఓపీ) అని తేల్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సముద్రంలో పండించేస్తున్నారు..!

వానలు కురవడం లేదన్న దిగులుండదు... ఒకవేళ ఎక్కువగా కురిసినా వరదలొస్తాయన్న చింత ఉండదు... పంటకి తెగుళ్లొస్తాయని కానీ పెట్టుబడి ఖర్చు పెరిగిపోతోందని కానీ ఆందోళన అక్కర్లేదు... సీజన్‌తో నిమిత్తం లేకుండా ఏ పంట కావాలంటే ఆ పంట పండించొచ్చు... ఎక్కడుందీ అలాంటి బంగారులోకం అంటే- సముద్రం లోపల..! అవును... ఆ ఉప్పునీటిలోనే చేపలూ రొయ్యలతోపాటు కాయగూరలూ పండుతున్నాయి..!  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పని సరి...

10. తలొగ్గిన గూగుల్‌, ఫేస్‌బుక్‌

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) నిబంధనలకు అంతర్జాతీయ సామాజిక మాధ్యమ సంస్థలు గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సహా ఇతర సంస్థలూ తలొగ్గాయి. భారీ స్థాయిలో అభ్యంతరకర కంటెంట్‌ను తమ వేదికల నుంచి తొలగించాయి. ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకొని, తొలి నెలవారీ నివేదికలను ప్రచురించాయి. ఈ పరిణామంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.  ‘‘ఫేస్‌బుక్‌, గూగుల్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. తదితర సంస్థలు కొత్త ఐటీ నిబంధనల ప్రకారం అభ్యంతరకర పోస్టులను స్వచ్ఛందంగా తొలగించి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని