Top Ten News @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 23 Feb 2024 12:09 IST

1. 15 నుంచి చెత్తపన్ను!

రాష్ట్రంలో రెండు దశల్లో పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమాన్ని అమలు చేసేందుకు పురపాలకశాఖ సన్నాహాలు చేస్తోంది వ్యర్థాల సేకరణపై ప్రజల నుంచి వసూలు చేసే ప్రతిపాదిత రుసుముల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. మొదటి దశలో 16 నగరపాలక సంస్థలు, 29 పురపాలక సంఘాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రెండో దశలో మిగతా పురపాలక సంఘాల్లో అమలు చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నిస్సత్తువపై.. నిర్లక్ష్యం వద్దు

కొవిడ్‌.. కోలుకున్నా వదిలిపెట్టడం లేదు. నీరసం, నిస్సత్తువ, కొంచెం దూరమూ నడవలేని దుస్థితి.. కొందరిలో హఠాత్తుగా గుండెపోటు. అంతేనా! మెదడు, ఊపిరితిత్తులు, జీర్ణకోశం, కాలేయం, కిడ్నీ, చెవి, ముక్కు, గొంతు, ఎముకలు.. తదితర అవయవాలు అన్నింటిపైనా దుష్ప్రభావం పడుతోంది.  కరోనా నుంచి బయటపడడం ఊరటనిచ్చే అంశమైతే.. చికిత్సానంతర సమస్యలను ఎదుర్కోవడమే ఇప్పుడు అతి పెద్ద సవాల్‌గా మారింది. అందుకే కొవిడ్‌ నుంచి కోలుకున్నా ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల వైద్య నిపుణులు, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ) ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Corona: సమర్థ రక్షణ కల్పించే నేసల్‌ స్ర్పే

3. సైనిక సంస్కరణలపై దుమారం

ప్రభుత్వ శాఖల మధ్య సాధారణంగా కనిపించే ఆధిపత్య పోరుకు రక్షణ బలగాలూ అతీతం కాదనిపిస్తోంది! త్రిదళాధిపతి (సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌  ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ఆర్మీలో శతఘ్ని, ఇంజినీరింగ్‌ విభాగాల మాదిరిగా వాయుసేన సైతం ఓ సహాయ దళం’ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆ తరవాత కొద్దిసేపటికే వాయు సేనాధిపతి ఆర్కేఎస్‌ బదౌరియా స్పందిస్తూ ‘అది సరికాదు... దేశ రక్షణలో వాయుసేన విస్తృత పాత్ర పోషిస్తోంది’ అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. విశ్వ గవాక్షం నుంచి పుడమి వీక్షణం అద్భుతం

అంతరిక్షం నుంచి భూమిని వీక్షించడం అద్భుతమైన, జీవితాంతం గుర్తుండిపోయే అనుభవమని భారత-అమెరికన్‌ వ్యోమగామి బండ్ల శిరీష పేర్కొన్నారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌, మరో నలుగురితో కలిసి ఆదివారం రోదసిలోకి వెళ్లొచ్చిన ఆమె తాజాగా తన అనుభూతిని పంచుకున్నారు. భవిష్యత్‌లో అంతరిక్ష యాత్రల ధరలు మరింత తగ్గుతాయని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* జీవశాస్త్రాల దిక్సూచి జినోమ్‌వ్యాలీ

5. Tollywood: తారలు దిగిన వేళ

చాలా రోజుల తర్వాత సినిమా లొకేషన్లు కళకళలాడాయి. చిత్రసీమలో అసలు సిసలు సందడి కనిపించింది. ఒకే రోజు పలువురు అగ్రతారల సినిమాలు పట్టాలెక్కడమే అందుకు కారణం! రెండో దశ కరోనా వల్ల ఏప్రిల్‌ మాసంలోనే సెట్స్‌పైనున్న పలు సినిమాలు ఆగిపోయాయి. దాదాపు రెండు నెలలుగా చిత్రీకరణలు లేక సినీ పరిశ్రమ కళతప్పింది. ఎట్టకేలకి కరోనా తగ్గుముఖం పట్టడంతో చిత్రీకరణలు ఇటీవల మళ్లీ ఊపందుకున్నాయి. ఈ నెల ఆరంభం నుంచే పలు చిత్రాలు పట్టాలెక్కాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భర్త తరఫు కుటుంబానికే ఆస్తి హక్కులా?

హిందూ వారసత్వ చట్టంలోని లింగ వివక్షకు కారణమవుతున్న సెక్షన్‌ 15 రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ వేసిన పిటిషన్‌పై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ చట్టంలోని నిబంధన కారణంగా.. మరణించిన హిందూ మహిళ తన సొంత నైపుణ్యంతో ఆస్తిని సంపాదించినా.. ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోతే ఆ మొత్తం భర్త కుటుంబానికి దక్కుతోందని పిటిషన్‌వేసిన మంజు నారాయణ్‌ పేర్కొన్నారు. మహిళ తరఫు కుటుంబానికి ఎలాంటి హక్కులు ఉండడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పేటీఎం రూ.16,600 కోట్ల ఐపీఓ

7. అలా బిగిస్తే.. ఇలా ఇల్లు!

ల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అని జగమెరిగిన సామెత. ఆ రెండు పనులు సంక్లిష్టమైనవని.. చాలా సమయం, ఖర్చుతో కూడుకున్నవని అభిప్రాయం నెలకొంది. అందులో ఇల్లు కట్టడమనేది చాలా వీజీ పని.. అన్నట్టుగా చేసి చూపించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన 36 ఏళ్ల నాగేశ్‌. ఈయన మెదక్‌ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి నివసిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో సొంత ఇంటిని తక్కువ సమయంలో నిర్మించుకోవాలని తలపోశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మోకాళ్ల నొప్పి తగ్గడం లేదేం?

మీరు ముందుగా గ్రహించాల్సింది- వ్యాయామం నొప్పికి పరిష్కారమే గానీ కారణం కాదు. మోకాళ్ల నొప్పులకు మందులు కొంతవరకు పనిచేయొచ్చు గానీ ఫిజియోథెరపీయే కీలకం. బలహీనంగా, బద్ధకంగా ఉన్న కండరాలు వ్యాయామంతో ఉత్తేజితమవుతాయి. కాబట్టి మొదట్లో నొప్పి కాస్త ఎక్కువగా ఉండొచ్చు. దీనికి భయపడాల్సిన పనిలేదు. వ్యాయామాలను ఆపటానికి లేదు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తుంటే కండరాల నొప్పులేవీ వేధించవు. వ్యాయామాలతో మోకాళ్లకు దన్నుగా ఉండే కండరాలు బలోపేతమవుతాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

శక్తి మూలకం!

9. Tokyo olympics: 12 ఏళ్లకే ఒలింపిక్స్‌కు

టోక్యోలో ఈసారి అందరి దృష్టి హెంద్‌ జజాపైనే. ఎందుకంటే  ఈ ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న అత్యంత పిన్న వయసు అథ్లెట్‌ ఆమే. సిరియా టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి హెంద్‌ 12 ఏళ్లకే ఒలింపిక్స్‌లో పాల్గొనబోతోంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 155వ స్థానంలో ఉన్న జజా.. జోర్డాన్‌లో గత ఫిబ్రవరిలో జరిగిన పశ్చిమ ఆసియా టీటీ అర్హత టోర్నీలో టైటిల్‌ ద్వారా టోక్యో బెర్తు సంపాదించింది. బెర్తు దక్కించుకునే సమయానికి ఆమె వయసు 11 ఏళ్లే కావడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. TS News: భార్య హేళన చేసిందని బరితెగించాడు!

 సంసారానికి పనికి రావంటూ భార్య అవహేళన చేసిందని మహిళలపై కోపం పెంచుకున్నాడు.. కామవాంఛ తీర్చాలని ఒంటరి మహిళలను వేధించేవాడు. చివరకు చిన్నారులను కాటేయడం మొదలుపెట్టాడు. ఒడిశాకు చెందిన అభిరాందాస్‌ అలియాస్‌ అభి(40)కి సంబంధించి రాచకొండ పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలోని దమ్మాయిగూడకు చెందిన నాలుగేళ్ల చిన్నారిని అభి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కొవిడ్‌ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం: 50 మంది మృతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని