Top Ten News @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 14 Jul 2021 09:09 IST

1. NEET: ప్రశ్నలను ఎంచుకునే విధానం

నీట్‌ వైద్యవిద్య 2021-22లో తొలిసారిగా ప్రశ్నలను ఎంపిక చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. గతంలో మొత్తం 180 ప్రశ్నలుండగా.. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉండేది. ఈ ఏడాది మరో 20 ప్రశ్నలను చేర్చారు. మొత్తం 200 ప్రశ్నలు ఉన్నా.. రాయాల్సింది మాత్రం 180 ప్రశ్నలే. ఈ మేరకు నీట్‌లో తాజాగా స్వల్ప మార్పులు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Corona: నకిలీ వైరస్‌తో కరోనాకు అసలైన దెబ్బ

మానవ శరీరాల్లోకి చొరబడి నక్క జిత్తులతో కణ యంత్రాంగాలను ఏమార్చి, ఇన్‌ఫెక్షన్‌ను కలుగజేస్తున్న కరోనా వైరస్‌ను అంతే యుక్తిగా బోల్తా కొట్టించే కొత్త విధానాన్ని అమెరికా శాస్త్రవ్తేతలు కనుగొన్నారు. ఇందుకోసం లోపాలతో కూడిన కృత్రిమ కరోనా వైరస్‌ను తెరపైకి తెచ్చారు. ఇది అసలు వైరస్‌ను అంతం చేయడంతోపాటు తానూ అంతర్థానమవుతుంది. కరోనా వైరస్‌ మానవ కణ ఉపరితలానికి అతుక్కొని, ఆ తర్వాత తన జన్యు పదార్థాన్ని అందులోకి చొప్పిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే పూత

3. రోదసిలోకైనా వెళ్లొచ్చు.. ఈ ఊర్లకు వెళ్లలేం

రోదసిలోకి మనుషులు సురక్షితంగా వెళ్లివస్తున్న ఈ రోజుల్లోనూ.. రాష్ట్రంలో దాదాపు 289 గ్రామాల ప్రజలు వర్షాల సమయంలో ఊరు దాటి బయటకు వెళ్లలేని దుస్థితి. బయటివారు గ్రామంలోకి రాలేని పరిస్థితి. పొంగిపొర్లే వాగులు, వంకలను ధైర్యం చేసి దాటుతున్నవారు ప్రమాదాల బారిన పడడం, కొన్నిసార్లు ప్రాణాలు పోగొట్టుకోవడం ఇక్కడ సాధారణమైపోయింది.  కాన్పు కోసం ఆసుపత్రికి వెళ్లాల్సిన గర్భిణులు, తక్షణ వైద్యం అవసరమైన వారు సైతం.. దేవుడిపైనే భారంవేసి కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. నిత్యావసర వస్తువుల సరఫరాపైనా ప్రభావం పడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 6 నెలలు దాటితే ఆటోమేటిక్‌గా జరిమానా!

మీకు బైకు, కారు వంటి వాహనాలు ఉన్నాయా? మీ వాహన కాలుష్యం పరిమితిలోనే ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం (పీయూసీ) ఉందా? కాలుష్య పరీక్ష చేయించి చాన్నాళ్లయ్యిందా? ఇక నుంచి జాప్యం చేస్తే కుదరదు. ఒక్కరోజు ఆలస్యమైనా మీ వాహనంపై జరిమానా పడిపోతుంది. ఎందుకంటే ‘ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ కమిటీ’ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించింది. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ మొదలైంది. నూతన విధానంలో వాహన కాలుష్య పరీక్షలు, ఫలితాల్ని ఆన్‌లైన్‌ చేయబోతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Rajasthan: ఏడాదికి 300 రోజులు నిద్రలోనే!

‘కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది’ అనుకుంటాం. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ డివిజన్‌, భద్వా గ్రామానికి చెందిన పుర్ఖారామ్‌కు మాత్రం అలా కాదు! అరుదైన అతినిద్ర వ్యాధి (హెచ్‌పీఏ యాక్సిస్‌ హైపర్‌సోమ్నియా)తో బాధపడుతున్న ఆయన... ఏడాదిలో 300 రోజులు నిద్రలోనే ఉంటాడు. చిరు వ్యాపారం చేసే పుర్ఖారామ్‌కు ఇప్పుడు 42 ఏళ్లు. 19 ఏళ్ల వయసు నుంచే ఈ వ్యాధితో బాధపడుతున్నాడట. ఒకసారి పడుకుంటే ఏకధాటిగా 25 రోజులపాటు మంచానికే అతుక్కుపోతున్నాడని, మధ్యలో మెలకువ రావడం చాలా అరుదని అతని భార్య లిచ్మి దేవి చెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మూడు తలల శిశువు జననం!

6. South Africa: ఇదో ‘జుప్తా’ కథ!

దక్షిణాఫ్రికా అట్టుడుకుతోంది! మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమాకు జైలు శిక్ష విధించటంతో ఆయన మద్దతుదారులు రెచ్చిపోయి విధ్వంసం సృష్టిస్తున్నారు. నల్లజాతి సూరీడు నెల్సన్‌ మండేలా స్ఫూర్తితో దక్షిణాఫ్రికా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, ఆ తర్వాత దేశాధ్యక్షుడైన జాకబ్‌ జుమా ఇప్పుడు ఎందుకని జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తోందో చూస్తే వెనకాల బోలెడంత కథ... అందులో మన భారతీయ అన్నదమ్ములు (గుప్తా బ్రదర్స్‌) ముగ్గురి కీలక పాత్ర ఎంతో ఆసక్తికరం! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆత్మాభిమానాన్ని ఆన్‌లైన్‌లో దోచేశారు!

అప్పులు తీర్చేందుకు మూత్రపిండాలు అమ్ముకోవడం మినహా మరో మార్గం లేదని భావించి.. వాటిని కొనేవారి కోసం ఆన్‌లైన్‌లో అన్వేషించిన దంపతులకు సైబర్‌ మోసగాళ్లు మాయమాటలు చెప్పి రూ.40.38 లక్షల వరకు కాజేశారు. దీనిపై బాధిత దంపతులు బుధవారం సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉండే మోది వెంకటేశ్‌, లావణ్య దంపతులు స్థానికంగా స్టేషనరీ, బ్యాంగిల్‌ స్టోర్‌ నిర్వహిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ‘గీతా ఆర్ట్స్‌’ చెంత మహిళ హడావుడి.. అరెస్టు

8. రసగుల్లా రాజకీయాలు

పశ్చిమ్‌ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దర్శకత్వంలో ముకుల్‌ రాయ్‌ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన తాజా రాజకీయ చిత్ర విశేషాలివి! తొండాటల్లో తలపండిపోయిన నాయకరత్నాలే దిమ్మెరపోయేంత అపూర్వ కథాకథనాలతో దీన్ని దీదీ రక్తికట్టించిన విధంబెట్టిదనగా... శాసనసభ ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) అధ్యక్ష పదవిని ప్రధాన ప్రతిపక్షానికి కట్టబెట్టడం ఆనవాయితీ. దాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తున్నామంటూ పశ్చిమ్‌ బంగలో ముకుల్‌రాయ్‌కు ఆ అధ్యక్ష కిరీటం తొడిగేశారు! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బాక్సింగ్‌ వదిలేద్దామనిపించింది

తనకు ఒలింపిక్స్‌ అర్హత పోటీల్లో పాల్గొనే అవకాశం కూడా ఇవ్వకపోవడంపై బాక్సర్‌ స్వీటీ బోరా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఆటనే వదిలేద్దామన్న ఆలోచన కలిగిందని ఆమె పేర్కొంది. 2014 ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన స్వీటీకి ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌లో పాల్గొనే అవకాశం దక్కలేదు. ‘‘శిక్షణ శిబిరం నుంచి నేను ఇంటికకి వెళ్లిపోయా. ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌లో పోటీ పడే అవకాశం కూడా నాకు దక్కలేదు. అలాంటపుడు నేను ఈ ఆటలో కొనసాగడం ఎందుకు? ’’ అని స్వీటీ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఈసారైనా.. పతక కరవు తీరేనా?

10. పాస్‌వర్డ్‌ పదిలంగా..

ఈ-మెయిళ్లకైనా, సామాజిక మాధ్యమాలకైనా, బ్యాంకు లావాదేవీలకైనా ప్రతిదానికీ పాస్‌వర్డ్‌లే. ఇన్నేసి సంకేత పదాల కోసం ఎన్ని తిప్పలు పడుతుంటామో. ఒకోదానికి ప్రత్యేకమైన పదాలను సృష్టించుకోవటం దగ్గర్నుంచి గుర్తుపెట్టుకోవటం వరకూ అన్నీ ఇబ్బందులే. చివరికి ఏదో ఒక పాస్‌వర్డ్‌ దగ్గర ఆగిపోతుంటాం. ఇక అన్నింటికీ దీన్నే ఎంచుకుంటాం. ఆన్‌లైన్‌ భద్రతకు ఇదే పెద్ద ముప్పు. హ్యాకర్‌ ఒక పాస్‌వర్డ్‌ను ఛేదిస్తే చాలు. మొత్తం సమాచారం రట్టయినట్టే.  మరి దీన్ని అధిగమించటమెలా? ఇందుకోసం క్రోమ్‌ వాడేవారికి ఇన్‌బిల్ట్‌గా ఎన్నో అవకాశాలున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని