Updated : 19 Jul 2021 09:09 IST

Top Ten News @ 9 AM

1. TS News: రేవంత్‌ రెడ్డి గృహనిర్బంధం

రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శన, ధర్నాకు కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. భూముల సందర్శనకు కాంగ్రెస్‌ నేతలు, శ్రేణులు వెళ్లకుండా అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు.  తెల్లవారుజామున మూడు గంటల నుంచే రేవంత్ ఇంటి వద్ద పోలీసులు మకాం వేశారు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మార్కుల మంత్రం.. సమయపాలనే!

3. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు తెలుగులో పరీక్షలు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌, ఇతర నియామక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే అన్నిరకాల పోటీ పరీక్షలకు ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు కోరారు. తెలుగు సహా ఇతర భాషల్లోనూ వాటిని నిర్వహించాలని అభ్యర్థించారు. ప్రస్తుతం ప్రాంతీయ భాషలను అనుమతించకపోవడం వల్ల ఆయా రాష్ట్రాల అభ్యర్థులు ఉద్యోగాలను పొందలేకపోతున్నారని తెలిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. చెల్లిని వంచించి.. అక్కతో రహస్య వివాహం

బాలికను బెదిరించి అత్యాచారం చేసి నగ్నవీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేసి బంగారు వస్తువులు, రూ.లక్షలు వసూలు చేశాడు. ఆమె సోదరితో ప్రేమాయణం నడిపి రహస్యంగా వివాహం చేసుకున్న యువకుడిని గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీసులు అరెస్టుచేశారు. గుంటూరు సౌత్‌ డీఎస్పీ జెస్పీ ప్రశాంతి ఆదివారం ఈ కేసు వివరాలను విలేకరులకు తెలిపారు. చేబ్రోలుకు చెందిన వేములపల్లి జోషిబాబు ఇంజినీరింగ్‌ చదివి పొన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* చిన్ననాటి ప్రేమికుడితో... భర్తను చంపించింది!

5. కేంద్ర మంత్రులు, జర్నలిస్టుల ఫోన్ల హ్యాక్‌?

దేశంలో మళ్లీ హ్యాకింగ్‌ కలకలం చెలరేగింది. పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లు వెల్లడైంది! తాజాగా లీక్‌ అయిన ఓ డేటాబేస్‌లో వారందరి ఫోన్‌ నంబర్లు ఉన్నాయి. ఇజ్రాయెల్‌లోని ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ కంపెనీకి చెందిన ‘పెగాసస్‌’ అనే స్పైవేర్‌ సాయంతో ఈ హ్యాకింగ్‌ తంతు సాగినట్లు తెలుస్తోందని ‘ది వైర్‌’ వార్తాసంస్థ ఓ కథనంలో వెల్లడించింది. వాస్తవానికి ఈ స్పైవేర్‌ ప్రభుత్వాల వద్దే అందుబాటులో ఉంటుంది. నిఘా కార్యకలాపాల కోసం దాన్ని ప్రభుత్వ సంస్థలకు ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ విక్రయిస్తుంటుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Sanchaita: ‘బాబాయ్‌... మీకిది తగునా?’

‘అశోక్‌ బాబాయ్‌.. మీ అన్నగారి జయంతి రోజున ప్రభుత్వ ఉద్యోగి అయిన మాన్సాస్‌ ఈవోపైకి సిబ్బందిని రెచ్చగొట్టి పంపించడం మీకు తగునా..?’ అంటూ మాన్సాస్‌ పూర్వ ఛైర్మన్‌ సంచైత ప్రస్తుత ఛైర్మన్‌, కేంద్ర మాజీమంత్రి అశోక్‌గజపతిరాజును ప్రశ్నించారు. ట్విటర్‌ వేదికగా ఆమె స్పందించారు. ‘మీ వైఖరి వల్ల ఈవో పరుగులు తీయాల్సి వచ్చింది. సిబ్బందిని తప్పుదోవ పట్టించి, రెచ్చగొట్టి పంపారు. మీ రాజకీయ చదరంగానికి మాన్సాస్‌ను వాడుకోకండి’ అని ఆమె అందులో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

విద్రోహ డ్రోన్లపై సంధించిన విల్లు

7. ఆధార్‌లో చిరునామా మార్పు సులభమే

ధార్‌ కార్డులో చిరునామ మార్పులను కేంద్ర ప్రభుత్వం సరళతరం చేసిందని ఆధార్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఎస్‌.గోపాలన్‌ చెప్పారు. గెజిటెడ్‌ ఆఫీసర్‌ ధ్రువీకరణ పత్రం ద్వారా చిరునామాను మార్చుకోవచ్చని వివరించారు. ‘‘గెజిటెడ్‌ అధికారి సంబంధిత వ్యక్తుల చిరునామాను ధ్రువీకరిస్తూ లేఖ ఇస్తే దాన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నాం. రేషన్‌కార్డు, వంట గ్యాస్‌ బిల్లు, అద్దె ఇంటి యజమానితో చేసుకున్న ఒప్పందం పత్రం (రెంటల్‌ అగ్రిమెంట్‌)ను కూడా ఆమోదిస్తున్నాం’’ అని వివరించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బ్యాంక్‌ల్లోనూ థియేటర్లు కడతారు

రానున్న పదేళ్ల కాలంలో సినీ ప్రదర్శన రంగంలో పెను మార్పులు జరుగుతాయి’’ అన్నారు ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు. ఇప్పుడున్న విధానం మారిపోయి  అపార్ట్‌మెంట్లలోనూ... బ్యాంక్‌ల్లోనూ యాభై సీట్లతో కూడిన థియేటర్లు ఏర్పాటయ్యే  అవకాశాలు  ఉంటాయని చెబుతున్నారు. ఇటీవల ఆయన కలైపులి ఎస్‌.థానుతో కలిసి ‘నారప్ప’ చిత్రాన్ని నిర్మించారు. వెంకటేష్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం  అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సురేష్‌బాబు ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Tokyo olympics: శృంగారం కట్టడికి అట్టలతో మంచాలు!

ఒలింపిక్స్‌లో శృంగారం కట్టడికి నిర్వాహకులు వినూత్నమైన చర్యలు చేపట్టారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో క్రీడాకారులు ఒకరితో ఒకరు కలవకుండా.. శృంగార కార్యకలాపాల్లో పాల్గొనకుండా తక్కువ సామర్థ్యమున్న మంచాలను సిద్ధం చేశారు. క్రీడాగ్రామంలోని అథ్లెట్ల గదుల్లో అట్టలతో తయారు చేసిన మంచాలను వేశారు. ఒలింపిక్స్‌ ముగిసిన తర్వాత ఈ అట్టల్ని రీసైక్లింగ్‌ ద్వారా కాగితపు ఉత్పత్తులుగా మారుస్తారు. ఒక్కో మంచం గరిష్టంగా 200 కిలోల బరువు ఆపుతుందని నిరుడు జనవరిలో నిర్వాహకులు ప్రకటించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

దంచి కొట్టారు...

10. దేవ్‌బా అడుగులు ఎటువైపు?

నేపాల్‌ రాజకీయ అనిశ్చితికి ముగింపు పలుకుతూ దిగువ సభను ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం పునరుద్ధరించింది. ఫలితంగా నేపాల్‌- భారత్‌ బంధం మరోమారు తెరపైకి వచ్చింది. కొత్తగా ఎన్నికైన ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా సారథ్యంలో ఇరు దేశాల మైత్రి ఏవైపునకు అడుగులు వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయన్ని ప్రధాని పదవిలో ఉంచేందుకు ఆ దేశ రాష్ట్రపతి విద్యాదేవీ భండారీ విశ్వప్రయత్నాలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని