Top Ten News @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 20 Jul 2021 09:14 IST

1. నాడులకూ కొవిడ్‌ కష్టాలు

తీవ్ర కొవిడ్‌ బాధితుల్లో సుమారు 1-2% మంది పక్షవాతం బారినపడుతున్నారు. మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టటం, రక్తనాళాలు చిట్లి మెదడులో రక్తస్రావం కావటం.. ఇలా రెండు రకాలుగా పక్షవాతం రావొచ్ఛు సాధారణంగా 60 ఏళ్లు పైబడ్డవారిలో పక్షవాతం రావటం చూస్తుంటాం. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, గుండె జబ్బులు, మితిమీరి మద్యం తాగటం, తగినంత శారీరక శ్రమ చేయకపోవటం వంటివి దీనికి దారితీస్తుంటాయి. కానీ కొవిడ్‌-19 మహమ్మారి దీన్ని మార్చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* సూపర్‌ యాంటీబాడీ!

2. మిస్డ్‌కాల్‌తో మింగేస్తుంది!

ఎవరో వచ్చి కాలింగ్‌బెల్‌ నొక్కుతారు. మీరు తలుపు తెరవగానే దాడి చేసి లోపలికి చొరబడటం ఒకెత్తు.కానీ తలుపు తెరవాల్సిన పనిలేకుండా, కేవలం కాలింగ్‌ బెల్‌ నొక్కటంతోనే మీ ఇంట్లోకి చొరబడితే? చొరబడిన విషయం కూడా మీకు తెలియకుంటే? ఇదేదో అదృశ్య శక్తిరూపంలో పాతకాలపు విఠలాచార్య సినిమాలో దృశ్యంలానో ఉందనిపిస్తోంది కదూ. తాజాగా దుమారం రేపుతున్న ఇజ్రాయెల్‌    నిఘా సాఫ్ట్‌వేర్‌ పెగాసస్‌ అచ్చం అలాంటి  అదృశ్యశక్తిలాంటిదే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. చిరంజీవి, పవన్‌ కన్నా నాకే ప్రజాదరణ ఎక్కువేమో!

రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్రపన్ని ఓ మీడియా సంస్థ నుంచి తాను మిలియన్‌ యూరోలు తీసుకున్నట్లు ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయడాన్ని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారు. డబ్బుల బదిలీల అలవాటున్న వారు యూరోల్లో బదిలీ చేశారేమో, అందుకే ఆ పదప్రయోగాన్ని ఇక్కడ వాడినట్లు ఉందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కుట్రదారులను కనిపెట్టడానికే జయలలితకు దూరమయ్యా

4. తొలిఏకాదశి ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని ‘శయన ఏకాదశి’ అని కూడా అంటారు. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి, ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Narappa Review: రివ్యూ: నారప్ప

వయసుకు తగిన పాత్రలను ఎంచుకుంటూ అటు కుటుంబ ప్రేక్షకులకు, ఇటు యువతకు ఎప్పుడూ దగ్గరగా ఉండే అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌. ఇక క్లాస్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘నారప్ప’. తమిళ సూపర్‌హిట్‌ ‘అసురన్‌’ రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీ బాట పట్టింది. ఈ విషయం కాస్త వివాదమైనా నిర్మాతలు ఓటీటీకే మొగ్గు చూపారు. మరి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలైన ‘నారప్ప’ ఎలా ఉంది? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Raj kundra:అశ్లీల చిత్రాల కేసులో శిల్పా శెట్టి భర్త అరెస్ట్‌

6. అమరావతి భూముల కొనుగోళ్లలో.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదు

 రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌లో ఎటువంటి మెరిట్స్‌ లేవని వ్యాఖ్యానించింది. భూముల కొనుగోళ్ల అంశంలో హైకోర్టు అన్ని వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని తీర్పిచ్చిందని.. దానిలో ఎటువంటి లోపం లేదని తేల్చిచెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Lionel Messi: ఒక్క ఫొటో.. 2 కోట్ల లైక్‌లు

రొనాల్డో, మెస్సి.. ప్రస్తుత తరం ఫుట్‌బాల్‌ ఆటగాళ్లలో దిగ్గజాలు. ఈ ఇద్దరిలో ఎవరు ఆల్‌టైమ్‌ అత్యుత్తమ ఆటగాడు అనే చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రొనాల్డో నెలకొల్పిన ఓ రికార్డును మెస్సి బద్దలుకొట్టాడు. అయితే అది మైదానంలో కాదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇటీవల కోపా అమెరికా టోర్నీలో అర్జెంటీనాను విజేతగా నిలిపిన మెస్సి.. ఆ ట్రోఫీతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఫొటోకు 2 కోట్లకు (20 మిలియన్లకు) పైగా లైక్‌లు వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

భారత్‌కు ఎదురుందా?

8. నేడు రోదసిలోకి బెజోస్‌

అంతరిక్షంలోకి మరో శ్రీమంతుడు ప్రవేశించబోతున్నారు. అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ రోదసియాత్రకు రంగం సిద్ధమైంది. స్వీయ సంస్థ ‘బ్లూ ఆరిజిన్‌’కు చెందిన ‘న్యూ షెపర్డ్‌’ వ్యోమనౌకలో ఆయన మంగళవారం నింగిలోకి పయనమవుతున్నారు. రోదసి పర్యాటకాన్ని ప్రోత్సాహించే దిశగా ఈ యాత్ర సాగుతుంది. బుడిబుడి అడుగులు వేస్తున్న ఈ రంగానికి సంబంధించి ఈ నెలలోనే ఇది రెండో పెద్ద ఘట్టం! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చదువు రాకపోయినా... బ్యాంకు ఛైర్‌పర్సన్‌ అయింది!

భర్త చనిపోయే నాటికి ఆమెకి నిండా 18 ఏళ్లు లేవు...  చేతిలో నెల వయసున్న పసిపాప... చంకన నాలుగేళ్ల చిన్నారితో... ఒంటరి పోరాటం మొదలుపెట్టింది అక్షరం ముక్కరాని శారదమ్మ. కష్టాలకీ, కన్నీళ్లకి కుంగిపోకుండా జీవితానికి ఎదురీదింది. ఆ మనోధైర్యమే నేడామెను బ్యాంక్‌ ఛైైర్‌పర్సన్‌ని చేసింది... విశాఖపట్నంలోని చింతపల్లి మండలం, తాజంగి గ్రామం లోచలి శారదమ్మ సొంతూరు. తోటి గిరిజన మహిళల్లానే అక్షరజ్ఞానం లేదామెకి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కుమారుడు కేంద్ర మంత్రయినా.. కూలి పనులకే

10. ఆయన్ను వదిలి ఉండలేను!

మా పెళ్లై రెండేళ్లు అయింది. పెళ్లైన తర్వాత ఆయన సంసారానికి పనికి రారనే నిజం తెలిసింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నారు. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు. నేను పెద్దగా చదువు కోలేదు. పుట్టింటి పరిస్థితీ అంతంత మాత్రమే. ఆయన దగ్గరే ఉండి ఒక పాపనో బాబునో తెచ్చి పెంచుకుంటే సరిపోతుంది అనుకుంటున్నా. జీవితాంతం ఎందుకు ఇబ్బంది అంటున్నారు స్నేహితులు. నిజానికి ఆయన చేసింది తప్పే అయినా చాలా మంచివారు. ఆయన్ని వదిలి ఉండలేను. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts