Updated : 23 Jul 2021 09:14 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. మాకు జ్ఞానోదయమైంది

‘‘మాకు ఇప్పుడు జ్ఞానోదయమైంది. (వియ్‌ ఆర్‌ వైజర్‌ నౌ). హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతించాలని ప్త్రార్థిస్తున్నాం. హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసే ఉద్దేశంలో ఉన్నాం’’ అని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపు న్యాయవాది మహఫూజ్‌ నజ్కీ విన్నవించారు. రాజధాని భూముల కొనుగోళ్ల కేసుల విషయంలో మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ తదితరులపై సిట్‌ విచారణను నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గతేడాది  
సెప్టెంబరు 15న స్టే ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* బృహత్తర గండం

2. ‘పది’లో రెండుసార్లు బోర్డు పరీక్షలు!

కొత్త విద్యాసంవత్సరం(2021-22)లో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. సీబీఎస్‌ఈ విధానాన్ని స్వల్ప మార్పులు చేర్పులతో రాష్ట్రంలోనూ అమలు చేయడంపై రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ), ప్రభుత్వ పరీక్షల విభాగం(ఎస్‌ఎస్‌సీ బోర్డు) అధికారులు కసరత్తును ప్రారంభించనున్నారు. విద్యార్థుల అభ్యసన ఫలితాల మదింపు విధానంలో మార్పులు చేయాలని, తూతూమంత్రంగా పరీక్షలుజరిపి ఇష్టారాజ్యంగా మార్కులు/గ్రేడ్‌లు ఇవ్వొద్దని ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ ఆయా రాష్ట్రాలకు సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రాష్ట్రమంతటా కుంభవృష్టి

రాష్ట్రంలో కుంభవృష్టి కురిసింది. కుమురం భీం జిల్లా వాంకిడిలో 27.30 సెంటీమీటర్ల వాన పడింది. 150 మండలాల్లో ముసురు కొనసాగు తోంది. వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్‌, భైంసా పట్టణాలు నీటమునిగాయి. గోదావరిలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి. శ్రీరామసాగర్‌ నుంచి మేడిగడ్డ వరకు నీటిని దిగువకు వదులుతున్నారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో పురపాలక యంత్రాంగం అప్రమత్తమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* 11 గంటల్లోనే 27 సెంటీమీటర్లు

4. పింఛను పాలసీ.. తీసుకుంటున్నారా?

పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారికి వచ్చే సాధారణ సందేహం.. రిటైరయ్యాక.. క్రమం తప్పని ఆదాయం రావాలంటే ఏం చేయాలి? దీనికి సరైన సమాధానం యాన్యుటీ పాలసీలని చెప్పొచ్చు. బీమా సంస్థలు అందించే ఈ పథకాల నుంచి పదవీ విరమణ తర్వాత పింఛను రూపంలో హమీతో కూడిన ఆదాయాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ యాన్యుటీ పథకాల్లో వెంటనే పింఛను వచ్చేవి, ఇప్పటి నుంచి మదుపు చేస్తూ వెళ్తే.. తర్వాత పింఛను ఇచ్చేవి.. ఫ్యామిలీ పింఛను ప్లాన్లు.. ఇలా అనేక రకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ప్రపంచం ఏకమై ఆటే లోకమై..

లింపిక్స్‌ ఆరంభం కాబోతుండగా భారత క్రీడాభిమానులను తొలిచే ప్రశ్న.. ఈసారి మనకెన్ని పతకాలు వస్తాయి? ఒకప్పుడు ఒలింపిక్స్‌కో పతకం అన్నట్లుగా గెలుస్తూ వచ్చిన భారత్‌.. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో మూడు పతకాలతో మురిపించింది. అందులో ఓ స్వర్ణం కూడా ఉండటం విశేషం. తర్వాతి ఒలింపిక్స్‌లో పతకాల సంఖ్య రెట్టింపైంది. రియోలో పతకాలు ఇంకా పెరుగుతాయని, రెండంకెల సంఖ్యలో వచ్చేస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ రెండే పతకాలకు పరిమితమై అందరినీ తీవ్ర నిరాశకు గురి చేసింది భారత బృందం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Olympics: తొలి వ్యక్తిగత పతకం అందించిన జాదవ్‌ గుర్తున్నాడా?

6. దూరం..దూరం జరిగింది.. పేదకు భారం అయ్యింది

సాధారణ ప్రయాణికులపై రెట్టింపు భారాన్ని మోపింది దక్షిణ మధ్య రైల్వే. ప్యాసింజర్‌ రైళ్లను ఈ నెల 19 నుంచి ‘అన్‌రిజర్వుడ్‌ ఎక్స్‌ప్రెస్‌’లుగా నడుపుతూ.. టికెట్‌ ధరను దాదాపుగా రెట్టింపు చేసింది. ఆ మేర ప్రయాణ సమయాన్ని మాత్రం తగ్గించలేదు. కొన్ని రైళ్లకు కేవలం 5, 10 నిమిషాల ఊరట కల్పించింది. కొన్నింటికి ప్రయాణ సమయం పెరగడం విస్మయం కలిగించే అంశం. మరోవైపు రైళ్లు ఆగే స్టేషన్లని (హాల్ట్‌) సగానికి సగం తగ్గించి.. అందరికీ అందుబాటులో లేకుండా చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఈ చేపను అస్సలు వదలొద్దు!

అక్వేరియాల్లో బుద్ధిగా ఉండే ఈ బంగారు చేపలు బాహ్య ప్రపంచంలోని చెరువులు, సరస్సుల్లోకి వెళ్లగానే రౌడీల్లా మారిపోతున్నాయి. మిగతా చేపలు పద్ధతిగా దోమల లార్వాలు, చిన్న చిన్న పురుగులు, నత్తల్ని తిని కడుపు నింపుకుంటాయి. కానీ ఇవేమో ఏకంగా ఇతర చేపల గుడ్లను హాంఫట్‌ చేసేస్తున్నాయి. దీంతో మిగతా చేపల సంతతి తగ్గిపోతోంది. అదే సమయంలో ఈ గోల్డ్‌ఫిష్‌లు తమ సంఖ్యను వేగంగా పెంచుకుంటున్నాయి. నీటిని కూడా విపరీతంగా కలుషితం చేస్తున్నాయి. అంతటితో ఆగకుండా చాలా నీటిమొక్కల వేర్లను తినేసి.. వాటికీ నష్టం కలిగిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఉపాధిగా మారిన సాహసం

8. త్వరలో డిజిటల్‌ కరెన్సీ

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తన సొంత డిజిటల్‌ కరెన్సీని దశల వారీగా ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సమీప భవిష్యత్‌లో టోకు, రిటైల్‌ విభాగాల్లో ప్రయోగాత్మకంగా డిజిటల్‌ కరెన్సీ తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ పనిచేస్తోందని గురువారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో బ్యాంక్‌ డిప్యూటీ గవర్నర్‌ టి.రవిశంకర్‌ తెలిపారు. పలు దేశాల్లో టోకు, రిటైల్‌ విభాగాల్లో ‘సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)లు ఇప్పటికే అమలవుతున్నాయని ఆయన గుర్తు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆడి ఇ ట్రాన్‌ 

జర్మనీ విలాసవంత కార్ల తయారీ సంస్థ ఆడి.. భారత్‌లో 2025 కల్లా మొత్తం విద్యుత్తు వాహన విక్రయాల్లో 15 శాతం వాటా నమోదు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇ-ట్రాన్‌ శ్రేణిలో మూడు పూర్తి స్థాయి విద్యుత్‌ ఎస్‌యూవీలను విడుదల చేసింది. ఇ-ట్రాన్‌ 50, ఇ-ట్రాన్‌ 55, ఇట్రాన్‌ స్పోర్ట్‌ బ్యాక్‌ 55లను వరుసగా రూ.99.99 లక్షలు; రూ.1.16 కోట్లు; రూ.1.18 కోట్ల ధరలతో ఆవిష్కరించింది.మూడేళ్ల బైబ్యాక్‌ ఆఫర్‌తో పాటు, ఈ ఏడాదే కొనుగోలు చేస్తే 11 కిలోవాట్‌ ఛార్జర్‌తో పాటు ఉచితంగా వాల్‌ బాక్స్‌ ఏసీ ఛార్జర్‌ ఇస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నేడే జొమాటో షేర్ల నమోదు

10. ఒలింపిక్చర్స్‌

ఇప్పుడందరి కళ్లు టోక్యో ఒలింపిక్స్‌ పైనే ఉన్నాయి. బ్యాడ్మింటన్‌లో సింధు స్వర్ణ పతకంతో సత్తా చాటుతుందా? ఆర్చరీలో దీపిక కుమారి బంగారు లక్ష్యాన్ని సాధిస్తుందా? మేరీకోమ్‌ తన పంచ్‌ పవర్‌తో మరో పతకం కొల్లగొడుతుందా? ఎక్కడా విన్నా ఇవే చర్చలు. విశ్వ క్రీడల్లో విజయదరహాసం చేసి.. మువ్వన్నెల జెండా రెపరెపలాడించే ఆటగాళ్లెవరని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ ఆటల సందడి విశ్వవేదికపైనే కాదండోయే.. బాక్సాఫీస్‌ బరిలోనూ కనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని