Updated : 30 Jul 2021 09:35 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. R factor: ఆర్‌-ఫ్యాక్టర్‌ పెరుగుతోంది సుమా!

కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి వేగాన్ని తెలియజెప్పే ఆర్‌-ఫ్యాక్టర్‌ (రీ ప్రొడక్షన్‌ రేట్‌) దేశంలో క్రమేపీ పెరుగుతోంది. ఇది 1కి చేరువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా కేరళతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. మెట్రో నగరాలైన పుణె, దిల్లీల్లోనూ ఆర్‌-ఫ్యాక్టర్‌ పెరుగుతున్నట్లు చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ పరిశోధకులు తెలిపారు. దేశంలో కొవిడ్‌ రెండో ఉద్ధృతి అత్యంత తీవ్రదశలో ఉన్నప్పుడు (మార్చి 9 - ఏప్రిల్‌ 21 మధ్య) ఆర్‌-ఫ్యాక్టర్‌ 1.37గా ఉండేది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సింధూ సాగిపో..

మెరుపు వేగం.. కచ్చితత్వంతో షాట్లు.. పదునైన స్మాష్‌లు.. ఎదురులేని స్ట్రోక్‌లు.. షటిల్‌పై సంపూర్ణ నియంత్రణ. మొత్తంగా ఆల్‌రౌండ్‌ విన్యాసం. ఒక్కమాటలో చెప్పాలంటే సింధు తన అత్యుత్తమ ప్రదర్శన చేసింది. అదిరిపోయే ఆటతో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో చోటు కోసం శుక్రవారం జపాన్‌ క్రీడాకారిణి అకానె యమగూచితో అమీతుమీ తేల్చుకోనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కుర్రాళ్లు బ్యాట్లెత్తేశారు

3. చదువు పూర్తయ్యాక.. విదేశీ విద్యార్థులను అమెరికాలో ఉండనివ్వొద్దు

చదువు పూర్తయ్యాక కూడా విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉండేందుకు అనుమతిస్తున్న ‘ఆపరేషనల్‌ ప్రాక్టీస్‌ ట్రెయినింగ్‌ (ఓపీటీ)’ కార్యక్రమాన్ని రద్దు చేసేందుకుగాను ప్రతినిధుల సభలో కొందరు చట్టసభ్యులు బిల్లు ప్రవేశపెట్టారు. ‘ఫెయిర్‌నెస్‌ ఫర్‌ హై-స్కిల్డ్‌ అమెరికన్స్‌ యాక్ట్‌’గా తాజా బిల్లును పిలుస్తున్నారు. ఇది చట్టరూపం దాలిస్తే.. అగ్రరాజ్యంలో విద్యనభ్యసిస్తున్న వేల మంది భారతీయులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. హెచ్‌-1బీ వీసాలపై పరిమితి విధించడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఓపీటీ తుంగలోకి తొక్కుతోందని చట్టసభ్యుడు పాల్‌ ఎ గోసర్‌ ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. థియేటరూ ఊపిరి పీల్చుకో...

తొలి దశ కరోనా తర్వాత తెలుగు సినిమా రంగం గురించి ప్రపంచంలోని అన్ని పరిశ్రమలు మాట్లాడుకున్నాయి. ఏ భాషలో లేని రీతిలో తెలుగులో సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. విజయాలు అందుకున్నాయి. రెండో దశ కరోనా వచ్చినా తెలుగు సినిమా పరిశ్రమ ధైర్యంగానే కనిపించిందంటే కారణం అదే. లాక్‌డౌన్‌ తర్వాత మళ్లీ ప్రేక్షకులు థియేటర్లకి వరుస కడతారని భావించారంతా. పైపెచ్చు ఈసారి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. థియేటర్లు తెరిస్తే ప్రేక్షకులు ఇదివరకటి కంటే ఎక్కువ సంఖ్యలో వస్తారనే నమ్మకంతోనే పరిశ్రమ సినిమాల్ని సిద్ధం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఆ నమ్మకంతోనే వస్తున్నాం

5. సరదాగా మొదలుపెడితే 80 ప్రాజెక్టులయ్యాయి!

ఇది మగ పని, ఇది ఆడ పని అంటూ ప్రత్యేకంగా ఉండవు... ఆసక్తి ఉండాలే కానీ ఏ రంగంలోనైనా రాణించవచ్చు అనే పద్మజ రెడీమేడ్‌ హోమ్‌ ఇన్‌స్టలేషన్స్‌ తయారీలోకి మూడేళ్ల క్రితం అడుగుపెట్టారు. తన సృజనాత్మకత, సామర్థ్యాలతో దిగ్గజాలను పక్కకు నెట్టి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌, ఐఐఎస్‌సీ సహా ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఇంటీరియర్స్‌ సరఫరా చేసే స్థాయికి ఎదిగారు. వ్యాపకాన్ని వ్యాపారంగా మలచుకుని కోట్ల టర్నోవర్‌ని సాధిస్తున్నారు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల్లో ఫీజుల మోత

విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అందించే సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల ఫీజులు భారీగా పెరగనున్నాయి. కోర్సులను బట్టి 20-100 శాతం వరకూ రుసుములు పెంచుతూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా బుధవారం రాత్రి మార్గదర్శకాలతో జీఓను జారీ చేశారు. ఇప్పటివరకూ ప్రభుత్వ వర్సిటీల్లో రెగ్యులర్‌ బీటెక్‌ కోర్సు ఫీజు ఏడాదికి రూ.18 వేలు ఉండగా.. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులకు రూ.35 వేలు వసూలు చేస్తున్నారు. తాజాగా సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సు ఫీజును రూ.45 వేలుగా నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

క‘రుణ’ చూపరా!

7. ఇంటి రుణం.. ఇవన్నీ చూశాకే...

సొంతింటి కోసం చూస్తున్న వారికి ప్రస్తుతం అనుకూల పరిస్థితులే ఉన్నాయని చెప్పొచ్చు. స్థిరాస్తి మార్కెట్లో ఇళ్లపై కొంత రాయితీలు లభిస్తుండంతోపాటు, వడ్డీ రేట్లూ గతంతో పోలిస్తే అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. గృహరుణం కోసం బ్యాంకు లేదా గృహరుణ సంస్థలను ఎంపిక చేసుకునేటప్పుడు ఒక్క తక్కువ వడ్డీ రేటునే ప్రామాణికంగా తీసుకోవడం ఎప్పుడూ సరికాదు.  గమనించాల్సిన ఇతర విషయాలూ అనేకం ఉంటాయి. అవేమిటో తెలుసుకుందాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. AP News: ఏపీలో 3 విమానాశ్రయాలకు అనుమతి

ఆంధ్రప్రదేశ్‌లో మూడు గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలకు కేంద్రం సూత్రప్రాయ అనుమతులు ఇవ్వగా.. అందులో ఒకటి ఇప్పటికే ప్రారంభమైనట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి జనరల్‌ వీకే సింగ్‌ తెలిపారు. గురువారం లోక్‌సభలో ఎంపీ రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇప్పటివరకు భోగాపురం, ఓర్వకల్లు, దగదర్తి విమానాశ్రయాలకు అనుమతులు ఇచ్చామని, అందులో ఓర్వకల్లులో కార్యకలాపాలు 2021 మార్చిలోనే ప్రారంభమయ్యాయని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సగం సీట్లు స్థానికులకే

9. AP News : గుంటూరు జిల్లాలో అనుమానాస్పదస్థితిలో ఆరుగురి మృతి

గుంటూరు జిల్లాలో అనుమానాస్పదస్థితిలో ఆరుగురు మృతి చెందారు. రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో ఓ రొయ్యల చెరువు వద్ద కాపలాదారులుగా ఉన్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. విద్యుదాఘాతంతో వీరు మరణించి ఉంటారని స్థానికులు చెబుతున్నారు.  రొయ్యల చెరువు వద్ద రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను ఒడిశా వాసులుగా గుర్తించారు. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. క్రెడిట్‌ స్కోరును తక్కువ చేయొద్దు..

తీసుకున్న రుణాన్ని మీరు ఎలా చెల్లిస్తున్నారు... ఇదే భవిష్యత్తులో మీరు తీసుకోవాలనుకున్న కొత్త రుణ అవకాశాలను నిర్ణయిస్తుంది. ఆ చెల్లింపుల తీరు వివరించే క్రెడిట్‌ స్కోరు ఇప్పుడు ప్రతి సందర్భంలోనూ కీలకంగా మారింది. ఈ మూడంకెల సంఖ్య 750కి మించి ఉంటే.. మీకు రుణ పరపతి బాగా ఉన్నట్లు లెక్క. అంతకు తగ్గితే.. కొత్త రుణాలు, క్రెడిట్‌ కార్డులు తీసుకునే సందర్భంలో కొన్ని చిక్కులు తప్పవు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కాగ్నిజెంట్‌లో 1.30లక్షల ఉద్యోగాలు

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts