Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 12 Aug 2022 16:18 IST

1. Crime News:రోజుకో అమ్మాయి కావాలంతే..

‘నువ్వొక్కదానివి నాకు సరిపోవు. రోజుకో అమ్మాయి కావాలి. తీసుకొస్తే తీసుకురా. లేదంటే నిన్ను వదిలేస్తా అంటూ నన్ను బెదిరించేవాడు. అందుకే అతను చేసే అఘాయిత్యాలకు నేను సహకరించేదాన్ని. ఒప్పుకుంటే లైంగిక దాడి చేసేవాడు. ప్రతిఘటిస్తే నరకం చూపించేవాడు. పోలీసులకు ఫిర్యాదు చేయరనుకుంటే వదిలేసేవాడు. ఒకవేళ చేస్తారని అనిపిస్తే అత్యంత కిరాతకంగా చంపేసేవాడు’ అంటూ ఆమె చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* HYD News: ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు?

2. భారత్‌ బయోటెక్‌ నుంచి త్వరలో కొవిడ్‌-19కు చుక్కలమందు టీకా

కొవిడ్‌-19 వ్యాధి నిరోధం కోసం ముక్కు ద్వారా ఇచ్చే చుక్కలమందు టీకా త్వరలో భారత్‌ బయోటెక్‌ నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టీకాపై నిర్వహిస్తున్న క్లినికల్‌ పరీక్షలకు సంబంధించిన సమాచారం వచ్చే రెండున్నర నెలల్లో వెల్లడవుతుందని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల వివరించారు. ఇప్పటికే భారత్‌ బయోటెక్‌ విడుదల చేసిన కొవాగ్జిన్‌ టీకా ఇంజక్షన్‌తో ఇచ్చేది. ముక్కు ద్వారా, చుక్కల మందు రూపంలో టీకా ఇవ్వడం ఎంతో సౌకర్యంగా ఉండటంతో పాటు పంపిణీ ఎంతో సులువు అవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆగస్టులో అమెరికాకు రెట్టింపు విమాన సర్వీసులు

అమెరికా వెళ్లే విద్యార్థులకు ఊరటనిచ్చేలా ఎయిర్‌ ఇండియా తాజా ప్రకటన చేసింది. ఆగస్టు తొలి వారం నుంచి అమెరికాకు రాకపోకలు సాగించే విమాన సర్వీసులను రెట్టింపు చేస్తున్నట్లు వెల్లడించింది. ఉన్నత చదువుల కోసం వెళ్లేందుకు ఈమధ్య కాలంలో చాలామంది విద్యార్థులు సిద్ధం కాగా ఎయిర్‌ ఇండియా విమానాలను రీషెడ్యూల్‌ చేయడంతో వారంతా అసంతృప్తికి లోనయ్యారు. సామాజిక మాధ్యమాల వేదికగా దీన్ని వెలిబుచ్చిన నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా స్వాగతించదగ్గ ప్రకటన చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

హెచ్‌-1బి వీసాలకు లాటరీ

4. చదరపు గజం రూ.పదివేల నుంచి..

నగరంలో రూ.పదివేలకు గజం స్థలం ఎక్కడైనా దొరుకుతుందా..? అవుటర్‌ రింగ్‌రోడ్డు గ్రోత్‌ కారిడార్‌ బయట ఈ ధరలకు స్థలాలు అందుబాటులో ఉన్నాయి. కొత్త వెంచర్లలో రూ.12వేల నుంచి చెబుతుంటే.. పాత వెంచర్లలో రూ.పదివేలు, అంతకంటే తక్కువ ధరకే కొన్ని ప్రాంతాల్లో స్థలాలు దొరుకుతున్నాయి. వచ్చే ఐదు పదేళ్లలో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి,  పిల్లల భవిష్యత్తు దృష్ట్యా దీర్ఘకాలానికి పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, బట్జెట్‌ శ్రేణిలో స్థలాలు గ్రోత్‌ కారిడార్‌ వెంట అందుబాటులో ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి ‘ఈనాడు’ అందిస్తున్న ప్రత్యేక కథనం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Corona: కొవిడ్‌ మహమ్మారి మళ్లీ విశ్వవిజృంభణ

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ప్రధానంగా కరోనా వైరస్‌ ‘డెల్టా’ రకం వ్యాప్తి తీవ్రంగా ఉంది. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో జపాన్‌ ‘వైరస్‌ ఎమర్జెన్సీ’ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. రాజధాని టోక్యోలో ఇప్పటికే ‘అత్యవసర పరిస్థితి’ ఉండగా మరో 4 ప్రాంతాల్లోనూ అమలుకు శుక్రవారం నిర్ణయించింది. టోక్యో సమీపంలోని సైతమా, కనగావా, చిబాలతో పాటు ఒసాకా నగరం పశ్చిమ ప్రాంతాల్లోనూ ‘ఎమర్జెన్సీ’ విధిస్తున్నట్లు జపాన్‌ ప్రధాని యోషిహిదే సుగా ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* చికెన్‌పాక్స్‌ తరహాలో డెల్టా విజృంభణ

6. మీ ఆట బంగారం కానూ..!

అయిదేళ్ల కిందట.. రియోలో.. ఒకటి.. రెండు.. మూడు.. అనుకుంటూ రోజులు లెక్క పెట్టుకుంటూ నైరాశ్యంతో భారంగా అడుగులు వేస్తున్న వేళ.. పన్నెండు రోజులు గడిచాక కానీ పతక కరవు తీరలేదు. అప్పుడు దేశం ఆశల్ని నిలబెట్టింది ఇద్దరమ్మాయిలు. రెజ్లర్‌ సాక్షి మలిక్‌ కాంస్యం గెలిచి హమ్మయ్య అనిపిస్తే.. షట్లర్‌ సింధు రజతం సాధించి ఆనందాన్ని రెట్టింపు చేసింది. అప్పుడే కాదు.. ఇప్పుడు టోక్యోలోనూ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. లావైపోయింది.. బ్రేకప్‌ చెప్పేయనా?

నేనొక అమ్మాయిని ప్రేమించాను. చాలా అందంగా ఉండేది తను. రెండేళ్లు ఆమె వెనకాలే తిరిగి నా ప్రేమను ఓకే చేయించుకోగలిగాను. నాకు మంచి ఉద్యోగం ఉంది, తనకన్నా మేం స్థితిమంతులం. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాం. పెద్దలూ ఒప్పుకున్నారు. సమస్య ఏంటంటే మూడు నెలల కిందట తనకి కరోనా వచ్చి కోలుకుంది. అప్పట్నుంచి బాగా లావైపోయింది. తరచూ ఆయాసం వస్తోందంటోంది. నేను తన అందం చూసే ప్రేమించాను. ఇప్పుడిలా మారిపోయాక నాకు ఆమెపై ఆసక్తి తగ్గుతోంది. బ్రేకప్‌ చెప్పొచ్చా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. HYD: వేలల్లో ప్రజలు.. వందల్లో డోసులు

మహానగరంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో జనం టీకా కేంద్రాలకు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా రెండో డోసు కోసం ప్రజలు ఆయా కేంద్రాల వద్ద బారులుతీరుతున్నారు. వేలాది మంది వస్తుండడంతో పలు కేంద్రాల్లో తొక్కిసలాట జరిగి గాయపడుతున్న ఘటనలూ ఉన్నాయి. వెస్టు మారేడుపల్లిలో శుక్రవారం వేలాదిగా టీకాల కోసం తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. కొంతమంది స్వల్పంగా గాయపడ్డారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా కనీస సమాచారం లేకుండా టీకాలు వేస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Covid Vaccine: మిశ్రమ డోసు సురక్షితమే..

9. సొగసరుల సాగుబాట!

కరోనా విజృంభణతో విధించిన లాక్‌డౌన్‌.... ప్రతి ఒక్కరినీ ప్రకృతిపై దృష్టి పెట్టేలా చేసింది. ఇందుకు సెలబ్రిటీలూ మినహాయింపు కాదు. వాళ్లూ ఖాళీ సమయంలో మట్టితో చెలిమి చేశారు. వంటిల్లు, మిద్దెలు, పెరట్లో... మొక్కల్ని పెంచుతూ ఆరోగ్యకర జీవనశైలికి బాటలు వేసుకుంటూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలా నిలిచిన తారల గురించి తెలుసుకుందామా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చిదిమేసినా.. శిక్షలేవీ?

పక్క చిత్రంలోని చిన్నారి రమ్య గుర్తుందా..? 2016 జులై 1న పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌ సమీపంలో ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి మద్యం తాగి అతివేగంగా కారు నడుపుతుండగా అది అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఎగిరి అటువైపు వస్తున్న రమ్య కుటుంబం ప్రయాణిస్తున్న కారుపై పడింది. అంతే తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఆ చిరు నవ్వులకు నూరేళ్లు నిండాయి. రమ్య తాతయ్య, బాబాయి దుర్మరణం పాలయ్యారు. తల్లి, మరో బాబాయి తీవ్ర గాయాల పాలయ్యారు. వీరి చికిత్సలకు ప్రభుత్వం నుంచి పరిహారంగా ఇచ్చిన డబ్బు పోను మరో రూ.30 లక్షల వరకు ఖర్చయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని