- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
1. పిల్లల్లో కొవిడ్ కాలేయవాపు!
కొవిడ్-19 పిల్లలను పెద్దగా ఇబ్బందేమీ పెట్టటం లేదు. కానీ కొందరిలో గుండె, రక్తనాళాలు, కళ్లు, చర్మం వంటి అవయవాలను ప్రభావితం చేస్తోంది. దీన్నే మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ (మిస్సీ) అంటున్నాం. కొవిడ్-19 అనర్థాలు దీంతోనే ఆగటం లేదు. ఇది పిల్లల్లో కాలేయవాపు (హెపటైటిస్) సైతం తెచ్చిపెడుతున్నట్టు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) అధ్యయనం పేర్కొంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. పెద్ద తలలు తప్పించుకునేందుకే పన్నాగం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు కొందరు పెద్దనాయకులు తన అన్నని ఇరికిస్తున్నారని ఇదే కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్‌కుమార్ యాదవ్ తమ్ముడు కిరణ్‌కుమార్ యాదవ్ ఆరోపించారు. ఆ పెద్దవాళ్లు, సీబీఐ అధికారుల నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు. ఈమేరకు సోమవారం సాయంత్రం పులివెందులలోని తమ నివాసంలో విలేకరులతో కిరణ్ మాట్లాడుతూ... వివేకాను హత్య చేసిందోవరో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి, ప్రజలందరికీ తెలుసన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. సినిమాకు తొందరేమీ లేదు
బయోపిక్‌ల కాలమిది. ఒలింపిక్ స్వర్ణంతో దేశాన్ని ఊపేసిన నీరజ్ చోప్రా జీవితకథను తెరకెక్కించడానికి చాలా మంది ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు. కానీ అందుకు తొందరేమీ లేదని అంటున్నాడు నీరజ్. ‘‘ఇప్పుడు నా దృష్టంతా నా ఆటపైనే. బయోపిక్‌కు తొందరేమీ లేదు. నేను రిటైరయ్యాక నాపై సినిమా తీయొచ్చు. నేనింకా చాలా సాధించాలనుకుంటున్నా. దేశానికి మరింత కీర్తిని తేవాలనుకుంటున్నా. అథ్లెట్‌గా మరింత గౌరవం సంపాదించాలనుకుంటున్నా. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* Tokyo Olympics: కొరికినందుకు క్షమించమన్నాడు: రవి కుమార్ దహియా
4. కథ వింటున్నప్పుడే కంటతడి పెట్టేశా
‘‘నేనెప్పుడూ చేసే సినిమా నా కెరీర్‌కు ఎలా ప్లస్ అవుతుంది.. నాకెలాంటి ఫలితాన్ని అందిస్తుంది?’ అని లెక్కలేసుకుని రంగంలోకి దిగను. మనసుకు నచ్చిన పాత్ర చేస్తున్నానా లేదా? అనే చూసుకుంటా’’ అంది నటి నివేదా పేతురాజ్. నటనా ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ..తెలుగు వారికి దగ్గరైంది నివేద. ఈ ఏడాది సంక్రాంతికి ‘రెడ్’ చిత్రంతో సందడి చేసిన ఆమె.. ఇప్పుడు విష్వక్ సేన్ హీరోగా నటించిన ‘పాగల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈనెల 14న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది నివేదా పేతురాజ్. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. బోగస్ ఓట్లకు ఆధార్‌తో చెక్!
బోగస్ ఓట్లకు త్వరలో చెక్ పడనుంది. ఆధార్ వివరాలతో ఓటర్ల జాబితాను అనుసంధానం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. బోగస్ ఓటర్లను గుర్తించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారులు రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఆ సాఫ్ట్‌వేర్‌తో ఒకే పేరుతో, ఒకే ఇంటి పేరు, ఒకే తండ్రి పేరుతో పలు ప్రాంతాల్లో ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* పెగాసస్‌పై పెదవి విప్పిన కేంద్రం
6. తనిఖీలు వద్దనుకుంటే..ఒక్కొక్కరు రూ.15 వేలివ్వాలి
తనిఖీలు చేయకుండా ఉండాలంటే తనకు లంచం ఇవ్వాలంటూ ఎరువులు, పురుగుమందుల దుకాణదారులతో బేరసారాలకు దిగిన మండల వ్యవసాయాధికారి అనిశాకు పట్టుబడ్డాడు. అనిశా డీఎస్పీ ఎస్వీ రమణమూర్తి ఆ వివరాలు వెల్లడించారు. ఏ నెలలో ఎవరు? ఎంతెంత? లంచాలు ఇవ్వాలో సమాచారం ఇచ్చేందుకు సదరు అధికారి ఏకంగా వాట్సప్ గ్రూప్ ఏర్పాటుచేసినట్టు తెలుసుకున్న అనిశా అధికారులు నోరెళ్లబెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఓయో రూ.9000 కోట్ల ఐపీఓ!
యూనికార్న్ సంస్థ ఓయో హోటల్స్ అండ్ రూమ్స్ తన ప్రతిపాదిత భారీ పబ్లిక్ ఇష్యూ కోసం ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. జేపీ మోర్గాన్, కోటక్ మహీంద్రా క్యాపిల్, సిటిలు ఈ జాబితాలో ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న ముగ్గురు వ్యక్తులను ఉటంకిస్తూ ఒక ఆంగ్లపత్రిక వెల్లడించింది. ‘ఈ మూడు బ్యాంకులు ఇటీవలే ఇష్యూకు సంబంధించిన పనిని ప్రారంభించాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* మహీంద్రా & మహీంద్రా కొత్త లోగో
8. గ్యాస్ కనెక్షన్ కావాలా? 8454955555కు మిస్డ్‌కాల్ ఇవ్వండి
దేశంలో అతిపెద్ద ఇంధన సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సరికొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. కొత్త ఇండేన్ వంటగ్యాస్ (ఎల్‌పీజీ) కనెక్షన్ కోసం 8454955555 నెంబరుకు మిస్డ్‌కాల్ ఇవ్వడం ద్వారా నమోదు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ప్రస్తుత వినియోగదారులు నమోదిత ఫోన్ నంబరు నుంచి ఈ నెంబరుకు మిస్డ్‌కాల్ ఇవ్వడం ద్వారా గ్యాస్ సిలిండర్ రీఫిల్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. దేశంలో ఎక్కడైనా మిస్డ్‌కాల్‌తో కొత్త ఎల్‌పీజీ కనెక్షన్ పొందే సౌకర్యాన్ని సోమవారం ఐఓసీ ఛైర్మన్ ఎస్‌ఎం వైద్య ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. భారత్ మండుతోంది!
భారత్‌లో భూతాపం ప్రభావం తీవ్రంగా ఉంది. మిగతా వాటికన్నా... హిందూ మహాసముద్రంలోనే ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. దీనివల్ల భారత్‌లో భీకర వర్షాలు, వరదలు తప్పవు. ఉష్ణోగ్రతలూ హెచ్చుస్థాయిలోనే నమోదవుతాయి. దక్షిణాసియాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. దీన్ని తక్షణమే అడ్డుకోవాలి. లేదంటే భవిష్యత్తులో ఇక మనం కట్టడి చేయలేం! పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఎక్కువ పతకాలు ఎలా ఆశిస్తాం?
దేశంలో క్రీడా వ్యవస్థ జాతీయ ప్రయోజనాల కోణంలో ఉండాలని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. సరైన వ్యవస్థ, నిర్మాణం లేకుండా ఒలింపిక్స్‌లో ఎక్కువ సంఖ్యలో పతకాలు ఆశించడం సరికాదని తెలిపాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఏడు పతకాల ప్రదర్శన.. భవిష్యత్ కార్యాచరణపై గోపీచంద్‌తో ఇంటర్వ్యూ ‘ఈనాడు’కు ప్రత్యేకం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
KTR: మోదీజీ.. చిత్తశుద్ధి ఉంటే ఆ విషయంలో జోక్యం చేసుకోండి: కేటీఆర్
-
Sports News
Jemimah Rodrigues : ఆ విషయంలో.. ధోనీ, కోహ్లీ సరసన నేనూ చేరిపోయా: రోడ్రిగ్స్
-
Movies News
Naga Chaitanya: ఆ నటి అంటే నాకెంతో ఇష్టం: నాగచైతన్య
-
India News
Meira Kumar: 100ఏళ్ల క్రితం మా నాన్న జగ్జీవన్రామ్నూ ఇలాగే కొట్టారు..
-
Sports News
SKY : సూర్యకుమార్‌ను పాంటింగ్ అలా పోల్చడం తొందరపాటే అవుతుంది!
-
Movies News
Liger: అసలు ఏమిటీ ‘లైగర్’ ఫైట్..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Hrithik Roshan: హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- Hyderabad News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/08/2022)
- IND vs ZIM : జింబాబ్వే వంటి జట్లతో ఆడటం.. ప్రపంచ క్రికెట్‌కు మంచిది!
- Offbeat: 99ఏళ్ల బామ్మ.. 100వ మునిమనవడిని కలిసిన వేళ!
- TSRTC: హైదరాబాద్‌లో ఇకపై ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం..
- Dhanush: ధనుష్ రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా?