Updated : 15 Aug 2021 09:14 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Independence day: ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ

శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని ప్రధాని ,నరేంద్రమోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే సమృద్ధ భారత నిర్మాణం అవుతుందని చెప్పారు. 75వ స్వాతంత్ర్య అమృత ఉత్సవాల సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని ఎగురవేశారు. తొలుత ఎర్రకోట వద్దకు చేరుకున్న మోదీ.. త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. రాహుల్‌పై సీసా బిరడాలు

లార్డ్స్‌ మైదానంలో అభిమానుల దుష్ప్రవర్తన కారణంగా భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య రెండో టెస్టులో మూడో రోజు ఆటకు రెండుసార్లు అంతరాయం కలిగింది. లంచ్‌ విరామానికి ముందు బౌండరీ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న కేఎల్‌ రాహుల్‌ లక్ష్యంగా సీసా బిరడాలు మైదానంలో పడ్డాయి. ఇన్నింగ్స్‌ 69వ ఓవర్‌ను షమి బౌలింగ్‌ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. షాంపైన్‌ సీసా బిరడాలు తన దగ్గర పడటంపై రాహుల్‌ ఫిర్యాదు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఆటల దేశంగా మారుద్దాం

3. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 వచ్చేసింది

మహీంద్రా అండ్‌ మహీంద్రా సరికొత్త ఎస్‌యూవీ మోడల్‌ ‘ఎక్స్‌యూవీ 700’ను విపణిలోకి ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ.11.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). ఏడు సీట్లు, అయిదు సీట్ల వేరియంట్లలో ఎక్స్‌యూవీ 700 లభించనుంది. డీజిల్‌, పెట్రోల్‌, గ్యాసోలిన్‌ వెర్షన్‌లను కంపెనీ అందుబాటులో ఉంచింది. పండగల సీజన్‌కు ముందు బుకింగ్‌లు ‌ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. మహీంద్రా ‘ట్విన్‌ పీక్స్‌’ లోగోతో వచ్చిన మొట్టమొదటి ఎస్‌యూవీ ఇదే కావడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అనాథ చిన్నారులకు కేంద్రం రూ.10 లక్షల సాయం

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ చిన్నారులకు కేంద్రం రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించనుంది. పీఎం కేర్స్‌ చిల్డ్రన్స్‌ పథకం కింద ఈ సాయాన్ని ఇస్తుంది. ఈ మొత్తాన్ని నేరుగా చిన్నారుల బ్యాంకు ఖాతాల్లోకి డిపాజిట్‌ చేయనుంది. 18 ఏళ్లలోపు వారికి ఇది వర్తిస్తుంది. ఈ మేరకు కేంద్ర మహిళాశిశు సంక్షేమశాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ తరహా చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.10 లక్షల సాయానికి ఇది అదనం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నా అప్పులను సీఎం తీర్చాలి

5. స్వాతంత్య్ర సంగ్రామంలో సినీమాతరం

దాదాపు 200 సంవత్సరాల పరాయి పాలనకు చరమగీతం పాడేదాకా సాగిన భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కళలు, కళాకారుల పాత్ర ఎన్నదగ్గది. ఈ ఉద్యమం పతాకస్థాయికి చేరుకున్న దశలోనే భారతీయ సినిమా మాటలు నేర్చింది. ఈ దశలో నాటి భారతీయ సమాజంలో వేళ్లూనుకుపోయి ఉన్న మూఢాచారాల నుంచి ప్రజలను  చైతన్యపరుస్తూ స్వాతంత్య్ర పోరాటం దిశగా వారిని   కార్యోన్ముఖులను చేసేలా చిత్రాలు వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బొల్లారంలో చంపేసి.. శనిగరం గుట్టల్లో పూడ్చేసి..

వివాహేతర సంబంధం తాళి కట్టిన భర్తను హత్య చేయించింది. ప్రియుడితో కలిసి తన భర్తను.. ఆలి అంతమొందించింది. తర్వాత మృతదేహాన్ని పాతిపెట్టింది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బొల్లారం పోలీసులు శనివారం తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌లోని బొల్లారం ప్రాంతానికి చెందిన చౌహాన్‌ ప్రపూన్‌(29) ఆటోడ్రైవర్‌. తన భార్య జ్యోతితో కలిసి ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మరో ఆటోడ్రైవర్‌ కృష్ణతో సన్నిహితంగా ఉండేవాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* డెల్టా ప్లస్‌లో మూడు ఉప రకాలు

7. Earthquake: హైతీలో 7.2 తీవ్రతతో భూకంపం: 304కు చేరిన మృతుల సంఖ్య 

కరీబియన్‌ దేశమైన హైతీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై 7.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే చెప్పింది. దీంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఇప్పటివరకు 304 మంది మృతి చెందినట్లు అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొదట సునామీ హెచ్చరికలు జారీ చేసిన యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే అనంతరం ఉపసంహరించుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వర్తకమన్నారు... స్వేచ్ఛను దోచారు..!

మిరియాలూ దాల్చిన చెక్కా ఏలకులూ లవంగాలూ పసుపూ అల్లమూ... ఇప్పుడివన్నీ వంటింటి అల్మారాలో డబ్బాల నిండా ఉంటాయి కానీ, ఒకప్పుడు వీటికోసం దేశదేశాలనుంచీ వ్యాపారులు వచ్చేవారు. వాటి బదులుగా బంగారమో వెండో ఇచ్చి మరీ కొనుక్కెళ్లేవాళ్లు. క్రీ.శ.ఒకటో శతాబ్దంలోనే ప్లినీ ద ఎల్డర్‌ అనే రోమన్‌ చరిత్రకారుడు మసాలా దినుసుల కోసం ప్రపంచ బంగారాన్నంతా మనదేశంలో కుమ్మరించేస్తున్నారని రాశాడు. అలా మొదలైన ఈ సుగంధ ద్రవ్యాల వాణిజ్యం కేవలం వ్యాపారవేత్తలకు లాభాలు తెచ్చిపెట్టడంతో ఆగలేదు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఈ సమరయోధులు... గూఢచారులు!

9. తూర్పు వెళ్లే రైలు.. చకచకా

సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య కీలక ప్రాంతంలో ప్రత్యామ్నాయ రైలుమార్గం సిద్ధమవుతోంది. విజయవాడ-భీమవరం-నిడదవోలు డబ్లింగ్‌ విద్యుదీకరణ పనులు తుది దశకు చేరాయి. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్‌, చెన్నైల నుంచి విశాఖపట్నం, కోల్‌కతా వైపు రాకపోకలు మరింత సులభమవుతాయి. హైదరాబాద్‌ నుంచి ఏపీలోని కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు రైలు అనుసంధానత పెరుగుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. డీపీఆర్‌కు అవసరమైన దానికంటే ఎక్కువ పని

రాయలసీమ ఎత్తిపోతల పథకంలో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీకి అవసరమైన దానికంటే ఎక్కువ పని జరిగిందని కృష్ణా నదీ యాజమాన్యబోర్డు పేర్కొంది. తమ పర్యటన సమయంలో ప్రాజెక్టు వద్ద నిర్మాణ కార్యకలాపాలేమీ లేవని, రెండు బ్యాచింగ్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతోపాటు కంకర, ఇసుక నిల్వలు ఉన్నాయని తెలిపింది. డీపీఆర్‌ తయారీకి 2010లో కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు ఇచ్చిందని, వీటి ప్రకారం అవసరమైన పని కంటే ఎక్కువ జరిగిందని తేల్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* అక్కడంతా మామూలే!

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని