Updated : 18 Aug 2021 09:14 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. అమెరికా రగిలించిన రావణకాష్ఠం

వరి ఊహలకూ అందనంత తుపాను వేగంతో అఫ్గానిస్థాన్‌ను తాలిబన్‌ సాయుధ మూకలు హస్తగతం చేసుకొన్నాయి. దాంతో అమెరికా మద్దతుతో ఇరవై ఏళ్లుగా కొనసాగుతున్న పౌర ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయి. అంతకు మునుపే అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ దేశం విడిచిపెట్టేశారు. రక్తపాతాన్ని నివారించేందుకే తాను ఆ నిర్ణయం తీసుకొన్నానని సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అఫ్గాన్‌ సౌధాల్లో మన స్వేదం

2. దేశంలోనే తొలి ‘పాడ్‌ హోటల్‌’

ముంబయి సెంట్రల్‌లో ప్రయాణికుల కోసం అధునాతన ‘పాడ్‌ హోటల్‌’ నిర్మాణానికి  భారత రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) శ్రీకారం చుట్టింది. స్టేషన్‌ మొదటి అంతస్తులోని రెండు నాన్‌ ఏసీ గదులను జపాన్‌ తరహా క్యాప్సుల్‌ హోటల్‌గా మారుస్తోంది. అందులో ప్రయాణికులకు రాత్రివేళ బస కల్పించడానికి మొత్తం 30 గదులుంటాయని అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 25 వేల ఇళ్ల రద్దు

 ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద మొదటి విడతలోని 15.10 లక్షల నిర్మాణాల్లో 1.29 లక్షల గృహాల విషయంలో ప్రభుత్వం మార్పులు చేసింది. అనర్హులు, చనిపోయినవారు, ఇంటి నిర్మాణానికి సమ్మతి తెలపనివారివి, వలస వెళ్లినవారివి, కోర్టు కేసులున్న ఇళ్లను మొదటి విడతలో మినహాయించింది. వీటి స్థానంలో సొంత స్థలాలున్న వారికి, రెండో విడతలో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తి చూపిన వారికి అవకాశం కల్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* రైతు గుండెల్లో మీటర్లు

4. అఫ్గాన్‌లోని గుడిని విడిచి రాను.. తేల్చిచెప్పిన ఓ హిందూ పురోహితుడు

ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన అఫ్గానిస్థాన్‌ నుంచి బయటపడేందుకు అక్కడి పౌరులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కిక్కిరిసిపోయిన విమానాల్లో ప్రయాణించేందుకు ఎగబడుతున్నారు. కొందరు విమాన పైభాగాన ఎక్కి ప్రయాణించి.. ప్రాణాలు కోల్పోయారు. ఇలా.. ఏదో విధంగా దేశం దాటి వెళ్లాలని యత్నిస్తున్నారు. కానీ అఫ్గాన్‌లోని ఓ హిందూ పురోహితుడు మాత్రం దేశం విడిచి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. అఫ్గాన్‌ వదిలి వెళ్లే అవకాశం వచ్చినా.. తిరస్కరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అమెరికాలో బూస్టర్‌ డోసుకు పచ్చ జెండా!

అమెరికాలో కొవిడ్‌-19 టీకాకు సంబంధించి బూస్టర్‌ డోసుకు త్వరలోనే పచ్చజెండా ఊపే అవకాశం కనిపిస్తోంది. రెండో డోసు పొందిన 8 నెలల తర్వాత దీన్ని వేసే వీలుంది. కరోనాలోని ప్రమాదకర డెల్టా వేరియంట్‌.. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారి నుంచి ప్రజలకు దీర్ఘకాల రక్షణ కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వయసుతో సంబంధం లేకుండా అమెరికన్లందరికీ మూడో డోసును సూచించే వీలుందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Corona: ఒక్క కేసుకే దేశమంతటా లాక్‌డౌన్‌

6. Fire Accident: కోరుట్లలోని షాపింగ్‌మాల్‌లో అగ్నిప్రమాదం

జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఓ షాపింగ్‌ మాల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలో ఉన్న ఆనంద్‌ షాపింగ్‌ మాల్‌లోని వస్త్ర దుకాణంలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి పెద్ద ఎత్తున వ్యాపించ భవనం మొత్తం అంటుకున్నాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే నాలుగు అంతస్తులకు మంటలు వ్యాపించడంతో షాపింగ్‌ మాల్‌లోని సామగ్రి అంతా కాలి బూడిదైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆఖర్లో ఆపద్బాంధవులు

టాప్‌ ఆర్డర్‌లో బ్యాట్స్‌మెన్‌ పరుగులు సాధిస్తే.. వేన్నీళ్లకు చన్నీళ్లలా ఏదో కొన్ని పరుగులు సాధిస్తే గొప్ప అన్నట్టుండేది భారత క్రికెట్లో లోయర్‌ఆర్డర్‌ బ్యాటింగ్‌. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. గత ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో సిరీస్‌ నుంచి మన టెయిలెండర్ల ప్రదర్శన మెరుగైంది. సిడ్నీలో మూడో టెస్టులో 102 పరుగులకే 3 వికెట్లు పడితే వికెట్‌కీపర్‌ పంత్‌ (97).. జట్టును ఆదుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* టీమ్‌ఇండియా బౌలింగ్‌ అత్యుత్తమం: సచిన్‌

8. ఎన్టీఆర్‌ కోసం హిందీ నుంచేనా?

కొన్నాళ్లుగా అగ్ర కథానాయకుల చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయి లక్ష్యంగానే రూపొందుతున్నాయి. చేస్తున్న సినిమా ఒక భాషకంటూ పరిమితం కాకుండా... అన్ని భాషలకి చేరువ కావాలనే లక్ష్యంతోనే వాటిని పట్టాలపైకి తీసుకెళుతున్నారు. ఓటీటీ వేదికలు... సామాజిక అనుసంధాన వేదికల్లో డబ్బింగ్‌ చిత్రాలకి పెరుగుతున్న ఆదరణనే అందుకు ప్రధాన కారణం. పాన్‌ ఇండియా స్థాయి నిర్మాణానికి తగ్గట్టుగానే నటీనటుల ఎంపిక జరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఎంత కష్టానికి అంత మెదడు

కసరత్తులతో కండలు పెరుగుతాయి. శ్రమ చేయకపోతే క్షీణిస్తాయి. ఇది మెదడు సైజుకూ వర్తిస్తుందా? మన సంగతేమో గానీ చేపల మెదడు విషయంలో ఇది నిజమేనని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మరింత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు చేపల మెదడు సైజు పెరుగుతున్నట్టు తేలింది మరి. అదే మామూలు పరిస్థితుల్లోనైతే పెరగటం కాదు కదా, ఇంకాస్త కుంచించుకుపోతోంది కూడా. లేక్‌ ట్రాట్‌ అనే చేపల మెదడు చలికాలంలో పెద్దగానూ.. ఎండాకాలంలో చిన్నగానూ అవుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

శకల సారం

10. కదలాలమ్మా...కదలాలి!

 ముగ్గురి నేపథ్యాలు, అభిరుచులు, అలవాట్లు... వేరు. ఒకటే పోలికంటే... ఎక్కువ సమయం కూర్చునే ఉంటున్నారు. వారికే కాదు... చాలా మందికి ఇంట్లో, వంటలో ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఎక్కడికి వెళ్లాలన్నా బైకు, కారు.. ఇక శారీరక శ్రమే లేదు. ఇవన్నీ అనారోగ్యాల్ని తెస్తున్నాయి. ఏ శ్రమా లేకుండా రోజులో ఎనిమిది గంటలకు పైగా కూర్చుని పని చేసే వారి జీవితకాలం తగ్గుతోందని అధ్యయనాలూ వెల్లడిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని