Updated : 21 Aug 2021 09:19 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ఇష్టానుసారం అరెస్టులు కుదరవు

చట్టం ప్రకారం అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు అరెస్టులు చేయడం కూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రొటీన్‌ వ్యవహారంగా భావించి అరెస్టులు చేస్తే అది వ్యక్తుల పరపతి, గౌరవానికి చెప్పలేనంత హాని కలిగించినట్టవుతుందని పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛ చాలా ముఖ్యమైనదని, ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఆ అధికారం ట్రాఫిక్‌ పోలీసులకు లేదు: హైకోర్టు

2. నట్లు బిగిస్తుంది..దుకాణం నుంచి సరకులూ తెస్తుంది

టెస్లా ఏఐ డే (కృత్రిమ మేధ రోజు) ప్రారంభం సందర్భంగా సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌.. తాము ఆవిష్కరించబోతున్న మరమనిషి (రోబో) బాట్‌ను పరిచయం చేశారు. ఇది ఒక హ్యుమనాయిడ్‌ (మానవరూప) రోబో. టెస్లాకు చెందిన వాహన కృత్రిమ మేధ ద్వారా ఇది పనిచేస్తుంది. పూర్తి స్వయం చోదిత కంప్యూటర్‌ అయిన ఇది, కెమెరాలు, ఇతర ఏఐలైన న్యూరల్‌ నెట్‌, వస్తువులను గుర్తించడం, అనుకరించడం వంటి పనులను ప్రభావితం చేస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వాజ్‌పేయీ ఫోన్‌ నంబరు ఇవ్వండి!

వారిద్దరూ తెలుగు యువకులు. తాము పనిచేస్తున్న సంస్థ తరఫున 18 ఏళ్ల క్రితం అఫ్గానిస్థాన్‌లో రోడ్లు వేసే పనుల్లో కుదిరారు. అనూహ్యంగా తాలిబన్లకు చిక్కారు. మరణం అంచుల దాకా వెళ్లి అదృష్టవశాత్తు బయటపడ్డారు. వారే... నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం వవ్వేరుకు చెందిన గోని వరదారావు(వరదయ్య), ఆత్మకూరు మండలం అప్పారావుపాళెం వాసి పెమ్మసాని మురళీనాయుడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Afghan crisis: అఫ్గాన్‌లో తాలిబన్ల ప్రతీకారేచ్ఛ

4. ఆటపై తూటా!

టీ20 ర్యాంకింగ్స్‌లో ఆ జట్టుది ఏడో స్థానం. శ్రీలంక, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ ఆ జట్టు కంటే కిందే. టీ20లో వరుసగా 12 విజయాలు సాధించిన ఏకైక జట్టు అదే. పొట్టి క్రికెట్లో అత్యధిక స్కోరు (278/3) ఘనత వాళ్లదే. వన్డే ఆల్‌రౌండర్లలో 2, 4 స్థానాలు వారివే. టీ20 బౌలింగ్‌లో 3, 5 ర్యాంకులు వారి సొంతమే. పై గణాంకాల ప్రకారం ఇదేదో అగ్రశ్రేణి జట్టు అనుకోవచ్చు. కానీ ఈ ఘనతలు అఫ్గానిస్థాన్‌ ఆటగాళ్ల సొంతం. ఇంత ప్రతిభ ఉన్న ఆటగాళ్ల భవితవ్యం ఇప్పుడు ప్రమాదంలో పడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మలిదశలో.. మహదానందంగా..!

గృహ నిర్మాణంలో కొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయి. జనాభాలో వృద్ధుల (సీనియర్‌ సిటిజన్లు) సంఖ్య పెరుగుతుండటంతో వీరి అవసరాలకు అనుగుణంగా నిర్మాణ సంస్థలు రిటైర్‌మెంట్‌ హోమ్స్‌ నిర్మిస్తున్నాయి. ఇంటి డిజైన్‌లో వారికి తగిన సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యేకంగా గేటెడ్‌ కమ్యూనిటీలను అభివృద్ధి చేస్తున్నాయి. నగరంలో చాలాకాలం క్రితమే ఈ పోకడ మొదలైనా.. ఇటీవల మరింత పుంజుకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఏదో ఒకచోటే రిజర్వేషన్‌ ప్రయోజనాలు

6. పోలవరం రివైజ్డ్‌ అంచనాలు..హైదరాబాదే దాటలేదు

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆమోదిస్తుందా అని ఆంధ్రప్రదేశ్‌ ఎదురు చూస్తోంది. ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు కేంద్ర జల్‌శక్తి, ఆర్థిక శాఖ అధికారులను కలిసినప్పుడల్లా తాజా అంచనాకు ఆమోదం తెలపాలని కోరుతున్నారు. కేంద్ర అధికారులూ అలాగే అని తల ఊపుతున్నారు. అయితే సవరించిన అంచనాల దస్త్రం అసలు హైదరాబాదే దాటకపోవడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆ ఆడియో వెనుక గుట్టేంటి?

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడినట్లుగా చెబుతూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న సంభాషణల వెనుక ఉన్నదెవరనేది చర్చనీయాంశంగా మారింది. ఏ ప్రయోజనం ఆశించి వాటిని ప్రచారం చేశారు? ఆడియోలో మాట్లాడిన గొంతులు ఎవరివనే విషయాలు చర్చకు దారితీశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఆ క్షణం జీవితంపై ఆశ కోల్పోయా

8. Asteroid: నేడు భూమికి చేరువగా ‘2016 ఏజే193’ గ్రహశకలం

గంటకు 94వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఒక గ్రహశకలంపై ఖగోళశాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. శనివారం ఇది పుడమికి అత్యంత దగ్గరగా వచ్చి వెళుతుందని అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ తెలిపింది. దీన్ని ప్రమాదకరమైన అంతరిక్ష శిలగా అభివర్ణించింది. అయితే ప్రస్తుతానికి దీనివల్ల ఎలాంటి హాని ఉండబోదని పేర్కొంది. ఆ గ్రహశకలానికి ‘2016 ఏజే193’ అని పేరు పెట్టారు. దాని వెడల్పు 4,500 అడుగులు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అక్రోట్లు తింటే ఆయుర్దాయం పెరుగుదల.. 

అక్రోట్లు (వాల్‌నట్స్‌) తింటే వృద్ధుల్లో ఆయుర్దాయం పెరుగుతుందని హార్వర్డ్‌ యూనివర్సిటీ అధ్యయనం తెలిపింది. ‘‘ఆరోగ్యం మెరుగుపరచుకోవాలనుకొనే వృద్ధులు అక్రోట్లు తినాలి. జీవితకాలం పెరుగుతుంది. వారానికి ఐదు అంతకంటే ఎక్కువ సార్లు (ఒక్కసారికి 28గ్రాములు) తింటే మరణ ముప్పు 14 శాతం, గుండె సంబంధిత వ్యాధుల ముప్పు 25 శాతం తగ్గుతుంది. అంతేకాదు.. వాల్‌నట్స్‌ తినని వారితో పోలిస్తే 1.3 సంవత్సరాలు ఎక్కువ జీవిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Afghanistan: ఎండు పండ్ల ధరలకు రెక్కలు.. 

10. నా ఎదుగుదల.. నీ భిక్ష!

‘నువ్వు చేస్తోంది తప్పు శ్రీ.. అమ్మానాన్నల్ని ఎదిరించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నేనొప్పుకోను’ ఆ మాటతో మొదటిసారి అక్క నచ్చలేదు. ఈ ఐదేళ్లలో ప్రతి నిర్ణయంలో తనుంది. బీటెక్‌ కోర్సు, వేసుకునే డ్రెస్‌, వాడే ఫోన్‌.. ప్రతీ విషయంలో. కానీ ఇప్పుడు అసలు తనెవరు? తన మాటెందుకు వినాలి? అనిపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని