
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
1. పంజ్‌షేర్ పంజా విసిరేనా?
అఫ్గానిస్థాన్‌లోని పంజ్‌షేర్ ప్రావిన్సు ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇంకా తమ అధీనంలోకి రాని ఈ లోయను ఆక్రమించుకునేందుకు తాలిబన్లు సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. భారీస్థాయిలో ఆయుధ సామగ్రితో ఆ ముఠా ఫైటర్లు వందల సంఖ్యలో పంజ్‌షేర్‌కు వాహనాల్లో బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది. సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* మాదకద్రవ్య కర్మాగారంగా అఫ్గాన్
2. మన వంట.. పొరుగింటి పంట
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని ఎప్పటి నుంచో వింటున్నాం. దీని ప్రాధాన్యం ఇటీవల కాలంలో అందరికీ బాగా అవగతమైంది. ముఖ్యంగా కరోనా కాలంలో విటమిన్లు, ప్రొటీన్లతో కూడిన ఆహారం తీసుకోవాలన్న వైద్యనిపుణుల సూచనలు జనాన్ని చాలావరకు చైతన్యవంతులను చేశాయి. కానీ రాష్ట్రంలో ప్రజలు వినియోగించే ఆహార పదార్థాల్లో అత్యధికం ఇక్కడ పండేవి కావు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఎకరా లీజు రూ.8
అడవులను ఆదాయ వనరుగా చూడరాదన్న సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా అటవీశాఖ వ్యవహరిస్తోంది. వేలాది ఎకరాల అటవీ భూములను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎఫ్‌డీసీ)కు అతితక్కువ ధరకు లీజుకిచ్చి ఆదాయం పొందుతోంది. ఈ లీజు ద్వారా సదరు సంస్థ భారీగా సొమ్ములు ఆర్జిస్తున్నా అడవి బిడ్డలకు ఎటువంటి ప్రయోజనం కలిగించడంలేదు. ఓ సామాజిక కార్యకర్త స.హ.చట్టం ద్వారా ఎఫ్‌డీసీ అటవీ భూముల లీజు విషయాన్ని వెలుగులోకి తేవడంతో ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* TS News: వందేళ్లు దాటినా.. చెక్కు చెదరలేదు
4. AP News: సచివాలయాల ఉద్యోగులకు అక్టోబరులో ప్రొబేషన్!
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను అక్టోబరు నుంచి ఖరారు చేయాలని కోరగా ముఖ్యమంత్రి జగన్ అంగీకరించారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 50శాతం మంది సచివాలయ సిబ్బంది శాఖాపరమైన పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని, వారందరి సర్వీసులు రెగ్యులర్ అవుతాయని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. రాజధానికి మరో రాచబాట
రాజధాని పరిధిలోని కీలకమైన జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం పచ్చజెండా ఊపింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎల్‌బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు ఆరు వరుసల రోడ్డుతోపాటు రెండువైపులా మరో ఆరు వరుసల సర్వీసు రోడ్లు రూపుదిద్దుకోనున్నాయి. తొమ్మిది చోట్ల అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. దీనికి నిధుల మంజూరుకు కేంద్రం అంగీకరించింది. ఈ రోడ్లు పూర్తయితే... ఎల్‌బీనగర్ నుంచి జాతీయ రహదారిపై వాహనాలు అంతరాయాలు లేకుండా వెళ్లవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. Evaru Meelo Koteeswarulu: ఎన్టీఆర్‌తో రామ్ చరణ్ చెప్పిన సంగతులివే..!
ఎన్టీఆర్ ప్రశ్నలకు రామ్‌చరణ్ సమాధానం చెబితే ఎలా ఉంటుంది? అసలు ఈ ఇద్దరి మధ్య సంభాషణ ఎలా సాగుతుంది? దాన్నే చూపించింది ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం. ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రసారమవుతున్న ఈ షోకు రామ్‌చరణ్ గెస్ట్‌గా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు రామ్‌చరణ్ సమాధానం ఇవ్వడంతో పాటు మరికొన్ని ఆసక్తికర సంగతుల్ని పంచుకున్నారు. ఆ విశేషాలివీ... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. కోచ్, సీనియర్లు ఏం చేస్తున్నారు?
భారత్‌తో రెండో టెస్టులో మహ్మద్ షమి, జస్‌ప్రీత్ బుమ్రా బ్యాటింగ్ చేస్తుండగా ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అనుసరించిన ‘బౌన్సర్’ వ్యూహం బెడిసి కొడుతుంటే మైదానంలో ఉన్న సీనియర్లు, డగౌట్ నుంచి ఆటను చూస్తున్న కోచ్ సిల్వర్‌వుడ్ ఏం చేస్తున్నారో అర్థం కాలేదని ఆ జట్టు మాజీ సారథి మైకేల్ వాన్ అన్నాడు.రెండో టెస్టు అయిదో రోజు లంచ్ విరామానికి ముందు గంటా 20 నిమిషాల సమయం గత కొన్నేళ్లలో ఇంగ్లాండ్ క్రికెట్లో చూసిన అత్యంత పేలవమైన దశ.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* National Cricket Academy: జాతీయ క్రికెట్ అకాడమీలో కార్పొరేట్ క్లాస్
8. విద్యా సంస్థలకు వంద గజాలలోపు సిగరెట్లు అమ్మితే జరిమానా
విద్యా సంస్థల ప్రహరీల నుంచి వంద గజాల (300 అడుగులు)లోపు ఎక్కడా సిగరెటు,్ల ఇతర పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరగకుండా పక్కా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పాఠశాల, ఉన్నత విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2007-08లో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 21 ప్రభుత్వ శాఖలు పొగాకు నియంత్రణ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. సబ్జెక్టుపై పట్టు.. పరిశోధనకు మెట్టు!
ఇటీవలి కాలంలో ఇంటిగ్రేటెడ్ చదువులకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ప్రత్యేక సంస్థలు...ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ కోర్సులవైపు దృష్టి సారిస్తున్నాయి. ఇంటర్ పూర్తిచేసుకున్నవారు ఇలాంటి కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. సబ్జెక్టుపై గట్టి పట్టుకు, పరిశోధనల దిశగా అడుగులేయడానికి ఈ చదువులు దోహదపడతాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. బిల్‌గేట్స్‌నే బురిడీ కొట్టించాడు!
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, అపర కుబేరుడు బిల్ గేట్స్‌ను పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి రూ.వందల కోట్ల మేరకు మోసం చేశాడంటే నమ్మశక్యమా? కానీ అదే నిజం అంటున్నారు సైమన్ క్లార్క్, విల్ లోచ్ అనే రచయితలు. బిల్ గేట్స్ లాంటి వ్యాపార దిగ్గజాన్ని ఓ పాకిస్థానీ అంత సునాయాసంగా ఎలా మోసం చేయగలిగాడనే విషయాన్ని వారు ‘ది కీ మ్యాన్: ది ట్రూ స్టోరీ ఆఫ్ హౌ ది గ్లోబల్ ఎలైట్ వాజ్ డూప్డ్ బై ఎ క్యాపిటలిస్ట్ ఫెయిరీ టేల్’ అనే పుస్తకంలో పూసగుచ్చినట్లు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Wimbledon: వింబుల్డన్ టోర్నీ.. ఈ ప్రత్యేకతలు తెలుసా..?
-
India News
Sanjay Raut: శివసేనకు మరో షాక్.. సంజయ్‌రౌత్‌కు ఈడీ నోటీసులు
-
Politics News
KTR: యశ్వంత్ సిన్హాకు మద్దతు వెనక అనేక కారణాలు: కేటీఆర్
-
Crime News
Crime News: ఆస్పత్రికొచ్చిన గర్భిణిని పట్టించుకోకుండా పార్టీ.. గర్భంలోనే శిశువు మృతి!
-
India News
Presidential Election: నామినేషన్ వేసిన విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా
-
General News
Telangana news: 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సహాయకులకు రూ.5కే భోజనం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- చెరువు చేనైంది
- Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?