Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 Aug 2021 09:08 IST

1. Joe Biden: మా సైనికుల ప్రాణాలు తీసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటాం: బైడెన్‌

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో జరిగిన పేలుళ్లపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడుల్లో అమెరికా సైనికుల మృతిపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. తమ సైనికుల ప్రాణాలు తీసిన వారిని వదిలిపెట్టబోమని..ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. మృతిచెందిన అమెరికా సైనికులను హీరోలుగా ఆయన అభివర్ణించారు. దాడికి పాల్పడింది తామేనని ఇప్పటికే ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆ ఉగ్రవాద సంస్థ నాయకులను హతమార్చాలని తమ దేశ ఆర్మీని బైడెన్‌ ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కాబుల్‌లో ఉగ్ర ఘాతుకం

2. పాస్‌పుస్తకం కోసం నిరీక్షణ..  మంచంతో వచ్చి నిరసన!

 కొత్త పట్టాదారు పాస్‌పుస్తకం జారీ కోసం ఆ వృద్ధుడు కార్యాలయాల్లో ఎన్నో దరఖాస్తులు ఇచ్చారు. మంచానికే పరిమితమైన తన సమస్యను పరిష్కరించాలని ఎంతోమంది అధికారులకు మొర పెట్టుకున్నారు. అయినా.. అధికారుల నుంచి స్పందన కరవైంది. దీంతో విసిగి వేసారిన ఆ వృద్ధుడు.. బంధువులు, కుటుంబసభ్యుల సహకారంతో మంచంలోనే తహసీల్దారు కార్యాలయానికి వచ్చి వినూత్న నిరసనకు దిగారు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తాజ్‌మహల్‌నూ అమ్మేశారు!

ఈస్టిండియా కంపెనీ పాలన ఆరంభమైన మొదట్లో... అప్పటి స్థానిక బ్రిటిష్‌ అధికారులు ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను చూసి ముచ్చట పడ్డారు. దీని సంరక్షణ కోసం సిఫార్సు చేశారు. ప్రభుత్వం 1815లో కెప్టెన్‌ టేలర్‌ను సంరక్షణ పనుల కోసం నియమించింది. తాజ్‌మహల్‌ అందాన్ని చూసి కన్నుకుట్టిన టేలర్‌... సంరక్షణ బదులు భక్షణ మొదలెట్టాడు. నాణ్యతలేని మరమ్మతులతో అవినీతికి తెరలేపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సర్కారు మారితే రాజద్రోహం కేసులా!

ప్రభుత్వం మారినప్పుడల్లా రాజద్రోహం కేసులు నమోదు చేయడం ఆందోళనకర పరిణామంగా మారిందని గురువారం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.  ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ఛత్తీస్‌గఢ్‌ పోలీసు ఉన్నతాధికారిని రాజద్రోహం కేసు కింద అరెస్టు చేయకుండా ఊరట కలిగిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం పై వ్యాఖ్య చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Vivaha Bhojanambu Review: రివ్యూ: వివాహ భోజనంబు

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నంత మంది హాస్యనటులు మరో ఇండస్ట్రీలో లేరనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. ఇప్పటికీ హాస్యనటులకు కొదవలేదు. ఇక హాస్య ప్రధానమైన చిత్రాలకు బాక్సాఫీస్‌ వద్ద సక్సెస్‌ రేటు ఎక్కువే. చక్కని హాస్యంతో, పంచ్‌లతో సినిమా సాగుతుంటే కాలక్షేపం కోసం రెండు, మూడు సార్లు చూసేవాళ్లూ ఉన్నారు. అలాంటి కామెడీ టైమింగ్‌తో నవ్వులు పంచే నటుల్లో సత్య ఒకరు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Chhattisgarh high court: భార్యతో బలవంతపు శృంగారం.. అత్యాచారం కాదు

 భార్యతో బలవంతపు శృంగారం చేసినా దాన్ని అత్యాచారంగా పరిగణించబోమని చత్తీస్‌గఢ్‌ హైకోర్టు తెలిపింది. ఈ మేరకు భారత శిక్షాస్మృతి 376వ అధికరణ కింద దాఖలైన అభియోగాల నుంచి 37 ఏళ్ల వ్యక్తిని విముక్తి చేసింది. అయితే అతనిపై 377 అధికరణ కింద నమోదైన అసహజ నేరాలతో పాటు ఇతర అభియోగాలు కొనసాగుతాయని పేర్కొంది.  చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య వయసు 18 ఏళ్లు లోపు లేకపోతే.. బలవంతంగా శృంగారం చేసినా అది నేరం కిందకు రాదని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* మత్తు చెల్లింపులపై ఈడీ కూపీ

7. ఏడేళ్లలో రెండు వందల సార్లు ఎముకలు విరిగాయి!

నూటికో... కోటికో ఒక్కరికి వచ్చే అరుదైన వ్యాధి అది... తనకే ఎందుకు వచ్చిందని తలరాతని నిందిస్తూ కూర్చోలేదామ్మాయి.. కాస్త గట్టిగా తాకినా విరిగిపోయే ఎముకల వ్యాధిపై తానే సవాల్‌ విసిరింది... పట్టుదలకు ప్రతిరూపంగా నిలిచింది సాయిప్రజ్ఞ.. తిరుపతి ఐఐటీలో ఎంటెక్‌ చదువుతూ దేశంలో ఆ ఘనత సాధించిన తొలి యువతిగా గుర్తింపు పొందింది... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఇక కష్టమే!

345.. లక్ష్యం కాదిది.. మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్‌కు టీమ్‌ఇండియా సమర్పించుకున్న ఆధిక్యం. తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలి మొదటి రోజే గెలుపు అవకాశాలను దాదాపుగా కోల్పోయిన భారత జట్టు.. ప్రత్యర్థిని త్వరగా పడగొట్టలేక ఓటమి దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌ కోహ్లిసేన చేజారినట్లే. భీకర ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ రూట్‌ సెంచరీతో ఇప్పటికే భారీ ఆధిక్యాన్ని కూడగట్టుకున్న ఇంగ్లిష్‌ బృందం మ్యాచ్‌ను గెలిచేందుకు గట్టి పునాది వేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆరోగ్య బీమా...క్లెయిం తిరస్కరిస్తే...

ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ఇలా అనుకోని విధంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు అయ్యే రూ.లక్షల ఖర్చును ధైర్యంగా ఎదుర్కోవాలంటే.. ఆరోగ్య బీమా పాలసీ ఇప్పుడు ఒక తప్పనిసరి అవసరంగా మారింది. దాదాపు అన్ని బీమా సంస్థలూ తమ ఆరోగ్య బీమా పాలసీదారులకు తమతో ఒప్పందం ఉన్న ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స వెసులుబాటును కల్పిస్తున్నాయి. బీమా సంస్థతో ఒప్పందం లేని ఆసుపత్రిలో చేరినప్పుడు మాత్రం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అమల్లోకి కొత్త ఆస్తి పన్ను

కొత్త ఆస్తి పన్ను విధానాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించినా, ఆందోళనలు చేపట్టినా పాలకవర్గాల నిర్ణయం మారడంలేదు. లిఖితపూర్వకంగా పెద్ద సంఖ్యలో అభ్యంతరాలను తెలియజేసినా వాటిని తోసిరాజని కొత్త విధానంలోనే పన్నులు వేయాలన్న విధానానికి అనుకూలంగా తీర్మానాలు చేస్తున్నారు. ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను విధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష సభ్యులు విభేదించినా స్థానిక సంస్థల్లో ఆధిక్యం కలిగిన అధికార పార్టీ సభ్యులు అనుకూలంగా దాదాపు అన్నిచోట్లా తీర్మానం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని