
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
1. Afghanistan: అఫ్గానిస్థాన్ ఇస్లామిక్ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు
అఫ్గానిస్థాన్ ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఇస్లామిక్ శిబిరాలనే లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేసిన నేపథ్యంలో కాబూల్ విమానాశ్రయాన్ని ఖాళీ చేయాలని పౌరులను అగ్రరాజ్యం హెచ్చరించింది. ఇటీవల కాబూల్ విమానాశ్రయం వెలువల జరిగిన రెండు ఆత్మహుతి దాడుల్లో 13 మంది అమెరికా సైనికులతో పాటు సుమారు 200 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు పాల్పడింది తామే అని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా అగ్రరాజ్యం వైమానిక దాడులకు పాల్పడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. నెత్తురు పోటెత్తుతోంది.. మధుమేహం ముంచేస్తోంది
తెలుగు రాష్ట్రాల ప్రజల్లో నెత్తురు పోటెత్తుతోంది. తెలంగాణలో 15.52 శాతం మంది, ఆంధ్రప్రదేశ్‌లో 22.88 శాతం మంది అధిక రక్తపోటుతో చికిత్స పొందుతున్నారు. ఏపీలో మధుమేహులు కూడా అధికంగానే నమోదయ్యారు. ఇక్కడ 23.10 శాతం మంది ఆ సమస్యతో బాధపడుతున్నారు. తెలంగాణలో ఈ శాతం 6.69గా ఉంది. దేశం మొత్తమ్మీద ఆంధ్రప్రదేశ్‌లో సిఫిలిస్ (సుఖవ్యాధి) కేసులు అధికంగా నమోదయ్యాయి. 2019లో ఏపీలో 10,253 మందికి, తెలంగాణలో 4,809 మందికి ఆ వ్యాధి నిర్ధారణయింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. కొలువు వదిలి.. కలల తీరానికి!
సినిమాల కోసం క్లాసులు ఎగ్గొట్టలేదు... లక్ష్యం మోజులో కెరీర్ నిర్లక్ష్యం చేయలేదు... చదువుతూనే వెండితెర కలలు కన్నాడు. అమ్మానాన్నలు భాషపై మమకారం పెంచితే.. కజిన్ దానికి దారి చూపాడు. కాలేజీలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా అవే చర్చలు! చివరికి లక్షన్నర కొలువు వదిలి చిత్రాల బాట పట్టాడు. తొలి ప్రయత్నంలోనే హిట్ అందుకున్నాడు. తనే ‘రాజరాజచోర’ దర్శకుడు హసిత్ గోలి. తన నేపథ్యం.. కళాశాల సరదాలు.. ఇక్కడిదాకా చేసిన ప్రయాణం అతడి మాటల్లోనే... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. మూడో దశ రావచ్చు.. దూరం.. దూరం..
కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తున్నామంటూ అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అత్యధిక పాఠశాలల్లో కనీసం భౌతికదూరం కూడా పాటించడం లేదు. ఒక బెంచీపై ఒక విద్యార్థినే కూర్చోబెట్టాలనే నిబంధన ఎక్కడా అమలు జరగడం లేదు. ఒక్కో బెంచీపై ముగ్గురు, నలుగురు కూడా కూర్చుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. పోరాడుతున్నారు
ఎప్పటివరకో.. ఎంతవరకో తెలియదు! అద్భుతంగా పోరాటమైతే చేస్తున్నారు మన బ్యాట్స్‌మెన్. అసలేమాత్రం ఆశలు లేని స్థితి నుంచి, ఓటమి లాంఛనమే అనుకున్న దశనుంచి జట్టును ఓ మెట్టు ఎక్కించారు. ఇప్పటికీ ఓటమి ముప్పు స్పష్టంగా ఉన్నా.. ఇంకా ప్రయాణించాల్సిన దూరం చాలానే ఉన్నా... గట్టెక్కడం తేలికేమీ కాకపోయినా.. మిణుమిణుకుమంటూ టీమ్ఇండియాలో ఏ మూలో చిన్న ఆశ! ముప్పు తొలగకున్నా.. మూడో రోజు భారత్‌దే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* Cricket News: అంపైర్ ఎందుకు చెప్తాడు?: గావస్కర్
6. పదో తరగతిలో మళ్లీ మార్కులు
పదో తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల స్థానంలో మళ్లీ మార్కుల విధానాన్ని తీసుకొస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు 2010లో తీసుకొచ్చిన గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికారు. ప్రవేశాలు, నియామకాల్లో ప్రతిభను గుర్తించేందుకు గతేడాది నుంచి మార్కులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఎక్కువమంది విద్యార్థులకు ఒకే గ్రేడ్ వచ్చినప్పుడు ప్రవేశాలు, నియామకాల్లో సమస్యలు వస్తున్నాయని.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. నమ్ముకున్న ప్రజల కోసం భర్తనూ వదలుకొని
భారత స్వాతంత్య్రోద్యమంలో మహిళలనగానే వెంటనే గుర్తుకొచ్చే పేరు ఝాన్సీ లక్ష్మీబాయి! ఆమెది 1857 సిపాయిల తిరుగుబాటు కాలం! కానీ... అంతకంటే దాదాపు మూడు వందల సంవత్సరాల కిందటే... పోర్చుగీసుపై ఒంటరి పోరాటం చేసి... అగ్నిబాణాలతో వారిని పారదోలి... చివరకు భర్త మోసంతో బలైన ధీరవనిత అబ్బక్క! పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. మామధ్య ఏమీ లేదని ఎలా చెప్పాలి?
ఆరునెలల కిందట నాకు పెళ్లైంది. మావారు నన్ను ప్రేమగా చూసుకుంటారు. ఓరోజు ‘నువ్వు ఎవరినైనా ప్రేమించావా?’ అని అడిగారు. అలాంటిదేం లేదన్నా. నిజానికి కాలేజీలో ఉన్నప్పుడు ఒకబ్బాయి ప్రేమంటూ వెంటబడితే సరేనన్నా. సినిమాలకెళ్లాం, సెల్ఫీలు దిగాం. తర్వాత కొన్నాళ్లకి తన పద్ధతి నచ్చక దూరం పెట్టా. నా దృష్టిలో అది ప్రేమే కాదు. దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదనుకున్నా. కానీ మరోరోజు మా ఆయన ‘మన మధ్య ఎలాంటి దాపరికాలు ఉండొద్దు’ అంటూ సోషల్ మీడియా ఖాతాల పాస్వర్డ్లు చెప్పుకుందాం అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. నింగిలోని చుక్కలను తాకేలా..
గగనమే హద్దుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఆకాశహర్మ్యాల కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ఒకదాన్ని మించి మరోటి కట్టబోతున్నారు. నగరంలో ఇప్పటివరకు 42 అంతస్తులే అత్యంత ఎత్తైన నిర్మాణం. దీన్ని మించి కొత్తవి రాబోతున్నాయి. ఇటీవలే నానక్‌రాంగూడలో 44 అంతస్తుల ప్రాజెక్టును ఒక సంస్థ ప్రకటించింది. కోకాపేటలో మరో సంస్థ 55 అంతస్తుల భవనాన్ని కడతామని అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* పెద్దల గది ఏ దిక్కున ఉండాలి?
10. Paralympics: టేబుల్ టెన్నిస్‌లో ఫైనల్‌కు భవీనాబెన్ పటేల్
పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఖాయమైంది. టేబుల్ టెన్నిస్ విభాగంలో భవీనాబెన్ పటేల్ ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణిపై భవీనాబెన్ విజయం సాధించింది. జాంగ్ మియావోపై 3-2 తేడాతో సత్తా చాటింది. దీంతో ఫైనల్‌కు చేరిన భవీనా భారత్‌కు ఓ పతకం ఖరారు చేసింది. పోలియో జయించి పతకానికి ఓ అడుగు దూరంలో నిలిచిన భవీనాబెన్ ప్రయాణం పలువురికి ఆదర్శం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
-
Technology News
Android 12: ఆండ్రాయిడ్ 12 యూజర్లకు గూగుల్ మరో కొత్త యాప్
-
World News
Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
-
India News
Road Safety: ఆ నియమాలు పాటిస్తే.. ఏటా 30వేల ప్రాణాలు సేవ్ : ది లాన్సెట్
-
Sports News
Eoin Morgan: ధోనీ, మోర్గాన్ కెప్టెన్సీలో పెద్ద తేడా లేదు: మొయిన్ అలీ
-
Crime News
Cyber Crime: మీ ఖాతాలో డబ్బులు పోయాయా?.. వెంటనే ఇలా చేయండి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
- Eknath Shindhe: నాడు ఆటో నడిపారు.. ఇకపై మహారాష్ట్రను నడిపిస్తారు..
- YSRCP: గన్నవరం వైకాపాలో 3 ముక్కలాట.. అభ్యర్థి ఎవరో తేల్చేసిన కొడాలి నాని
- BJP: అంబర్‌పేట్‌లో భాజపా దళిత నాయకుడి ఇంట్లో భోజనం చేసిన యూపీ డిప్యూటీ సీఎం
- Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే
- Credit card rules: క్రెడిట్ కార్డుదారులూ అలర్ట్!.. జులై 1 నుంచి కొత్త రూల్స్
- Raj Thackeray: అన్న రాజీనామా.. రాజ్ ఠాక్రే కీలక ట్వీట్