Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 08 Sep 2021 09:17 IST

1. AP Govt: ఇకపై ప్రభుత్వ జీవోలకు ఈ-గెజిట్‌.. ఉత్తర్వులు జారీ

ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు తిరిగి అందుబాటులో ఉంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ‘ఏపీ ఈ-గెజిట్‌’ ద్వారా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జీవో ఐఆర్‌ వెబ్‌సైట్‌ను నిలిపివేసినందున సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలగకుండా వివరాలను ఈ-గెజిట్‌లో ఉంచనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆలయ భూమికి దేవుడే యజమాని

పూజారులకు ఆలయ భూములపై ఎలాంటి యాజమాన్యపు హక్కులు ఉండవని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. వారు దేవాలయ ఆస్తులకు నిర్వాహకులు(మేనేజర్స్‌) మాత్రమేనని పేర్కొంది. రెవెన్యూ శాఖ రికార్డులలోని యజమాని, అనుభవదారును సూచించే గడులలో సంబంధిత దేవుడు/దేవత పేరు మాత్రమే ఉండాలని తెలిపింది. ప్రభుత్వం కానీ, ప్రభుత్వం తరఫున స్థానిక జిల్లా కలెక్టర్లును కానీ ఆలయాల ఆస్తులకు యజమానులుగా పేర్కొనరాదంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ‘బతుకు’నీయడం లేదు

3. దొరికాడు.. సరైనోడు

‘‘స్వింగ్‌కు అనుకూలించే పరిస్థితుల్లో అతడు గొప్పగా బంతులేశాడు. ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ను ఔట్‌ చేసిన డెలివరీ అద్భుతం. రూట్‌ను బుట్టలో వేసిన తీరును చూసి తీరాల్సిందే’’ .. క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ చేసిన ఈ రెండు వ్యాఖ్యాలు ఒకరి గురించే! అతడే శార్దూల్‌ ఠాకూర్‌! ఇంగ్లాండ్‌తో ఓవల్‌లో జరిగిన నాలుగో టెస్టులో శార్దూల్‌ తనలోని మేటి ఆల్‌రౌండర్‌ను చూపించాడు. టెస్టుల్లో భారత్‌కు నాణ్యమైన పేస్‌ ఆల్‌రౌండర్‌ లేని లోటును అతను తీర్చేలాగే కనిపిస్తున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గొట్టం మాత్రే ఇంజెక్షన్‌!

గొట్టం మాత్రే ఇంజెక్షన్‌గా పనిచేస్తే? అదీ జీర్ణాశయంలోకి వెళ్లాక సూది మందు ఇస్తే? చిత్రమే కదా. ఎంఐటీ పరిశోధకులు అలాంటి విచిత్రాన్నే ఆవిష్కరించారు. అదీ తాబేలు స్ఫూర్తితో! కొవిడ్‌-19 విజృంభణతో మోనోక్లోనల్‌ యాంటీబాడీల చికిత్స ప్రాచుర్యంలోకి రావటం తెలిసిందే. ఇవి క్యాన్సర్‌, కీళ్లవాతం వంటి రకరకాల జబ్బులకూ ఉపయోగ పడతాయి. మోనోక్లోనల్‌ యాంటీబాడీలనేవి ప్రొటీన్లు. మన రోగనిరోధకశక్తిని అనుకరించేలా వీటిని రూపొందిస్తుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మనసుకు బాధగా అనిపించింది

వైవిధ్యభరిత మాస్‌ ఎంటర్‌టైనర్‌లకు పెట్టింది పేరు కథానాయకుడు గోపీచంద్‌. ఇప్పుడాయన నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘సీటీమార్‌’. సంపత్‌ నంది దర్శకుడు. కబడ్డీ ఆట నేపథ్యంలో సాగే కథతో రూపొందింది. తమన్నా కథానాయిక. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. ఈ సినిమా ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు గోపీచంద్‌. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* రాజకీయాలపైనా అభిప్రాయం మారింది

6. బోస్‌ కోసం భర్తను చంపి..

స్వాతంత్య్రోద్యమంలో త్యాగగాథలెన్నో! వాటన్నింటిలోకీ భిన్నమైంది... పెద్దగా చరిత్ర పుటలకెక్కనిది నీరా ఆర్య వ్యథ. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ తొలి గూఢచారిగా పనిచేస్తూ, సుభాష్‌ చంద్రబోస్‌ను రక్షించేందుకు తన భర్తనే చంపేసిన సమరయోధురాలు ఆమె. భాగ్‌పత్‌లో (ప్రస్తుత యూపీలోని) 1902లో పుట్టిన నీరా ఆర్య చాలా భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఆమె తండ్రి సేఠ్‌ ఛజ్జుమల్‌ పేరున్న వ్యాపారి. పిల్లలు నీరా, బసంత్‌లను కోల్‌కతాలో చదివించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆ 4 యాప్‌లు మీ మొబైల్‌లో వద్దు

ఎనీడెస్క్‌, క్విక్‌సపోర్ట్‌, టీమ్‌వ్యూయర్‌, మింగిల్‌వ్యూ యాప్‌లను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దని తన వినియోగదార్లకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సూచించింది. ఈ నాలుగు యాప్‌లతో ఖాతాలోని డబ్బు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా కొందరు మోసగాళ్లు మాయమాటలు చెప్పి మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గిలానీ వారసుడు మసరత్‌ ఆలం భట్‌

జమ్మూకశ్మీర్‌లో 2010 నాటి ఆందోళనల ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించిన మసరత్‌ ఆలం భట్‌(50) అతివాద ‘హురియత్‌ కాన్ఫరెన్స్‌’ కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పాకిస్థాన్‌ అనుకూల వేర్పాటువాద నేత సయ్యద్‌ అలి షా గిలానీ (92) వారం రోజుల కిందట మృతిచెందడంతో ఆయన వారసుడిగా సైన్స్‌ పట్టభద్రుడైన మసరత్‌ పేరు ఖరారు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* బగ్రామ్‌ ఎయిర్‌బేస్‌ అప్పగింతకు తాలిబన్ల ప్రణాళిక అవాస్తవం: చైనా

9. Indonesia: జకార్తాలోని జైలులో అగ్నిప్రమాదం.. 41 మంది ఖైదీలు మృతి

ఇండోసేసియా రాజధాని జకార్తాలోని టాంగెరాంగ్‌ జైలులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో జైలులోని 41 మంది ఖైదీలు మృతి చెందారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు జైలు అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బ్లూటూత్‌ కథ

ప్రస్తుతం అంతా బ్లూటూత్‌ పరిజ్ఞానాన్ని వాడుతున్నవారే. స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌ల వంటివన్నీ దీంతో కూడుకున్నవే. హెడ్‌సెట్‌, స్మార్ట్‌వాచ్‌ పరికరాలు బ్లూటూత్‌తో అనుసంధానమై పనిచేసేవే. వీటితో పాటలు వినటం, ఆరోగ్య వివరాలను ఓ కంట కనిపెట్టటం లాంటి పనులన్నీ సులభంగా కానిచ్చేస్తుంటాం. కానీ రేడియేషన్‌ గురించిన భయాలు మదిలో మెదులుతూనే ఉంటాయి. బ్లూటూత్‌ పరికరాలు సురక్షితమేనా? అన్న సందేహం తొలుస్తూనే ఉంటుంది. ఇంతకీ బ్లూటూత్‌ అంటే ఏంటి? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని