Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 13 Sep 2023 16:39 IST

1. Sai Dharam Tej: సాయిధరమ్‌ తేజ్‌ ప్రమాదానికి కారణమదే: మాదాపూర్‌ ఏసీపీ

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, సినీ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి తీగల వంతెన వైపు నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ఆయన తన స్పోర్ట్స్‌ బైక్‌ నుంచి కిందపడిపోయారు. ఈ ప్రమాదం గురించి తాజాగా మాదాపూర్‌ ఏసీపీ స్పందించారు. ప్రమాదం జరిగిన సమయంలో సాయి తేజ్‌  హెల్మెట్‌ పెట్టుకున్నాడని.. మద్యం సేవించలేదని తెలిపారు. రహదారిపై ఇసుక ఉండటం వల్ల బైక్‌ స్కిడ్‌ అయ్యిందని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Sai Dharam Tej: అభిమానులెవరూ ఆందోళన చెందవద్దు..!: చిరంజీవి

2. Biden : ట్రింగ్‌.. ట్రింగ్‌.. హలో నేను బైడెన్‌..!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు నేడు ఫోన్‌ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిన్‌పింగ్‌కు ఫోన్‌చేసి మాట్లాడం ఇది రెండోసారి. ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. అమెరికా-చైనా మధ్య పోటీ వివాదంగా మారకుండా తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడుకొన్నట్లు సమాచారం. ఇప్పటికే వాణిజ్యం, గూఢచర్యం, కరోనా విషయాల్లో చైనా-అమెరికా మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. IIT JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా

 ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది. జేఈఈ మెయిన్ ర్యాంకుల వెల్లడిలో జాప్యం వల్ల.. జేఈఈ అడ్వాన్స్ డ్ ప్రక్రియ వాయిదా వేశారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ షెడ్యూలులో మార్పులు చేసినట్టు ఐఐటీ ఖరగ్‌పూర్‌ ప్రకటించింది. ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం రిజిస్ట్రేషన్లు మొదలు కానున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
4. Taliban: అమెరికా విమానం రెక్కకు తాడుకట్టి ఊయల ఊగిన తాలిబన్లు

అమెరికాపై ఉన్న అక్కసును చైనా మరోసారి వెళ్లగక్కింది. అమెరికా దళాలు అఫ్గానిస్థాన్‌లో ఇప్పటివరకూ మారణహోమం సృష్టించినట్లు పేర్కొంది. చైనా విదేశాంగ శాఖకు చెందిన అధికారి లిజైన్‌ ఝాఓ ట్విటర్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. అఫ్గాన్‌లో అమెరికాకు చెందిన పాడైపోయిన యుద్ధ విమానాలు అందులో కనిపిస్తున్నాయి. అందులోని ఓ విమానం రెక్కకు తాలిబన్లు తాడుకట్టి ఊయల ఊగుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కొవిన్‌లో కొత్త సదుపాయం.. కస్టమర్‌ వ్యాక్సినేషన్‌ స్టేటస్‌ తెలుసుకునే వీలు

కరోనా వ్యాక్సినేషన్‌కు ఉద్దేశించిన కొవిన్‌ మరో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఒక వ్యక్తి వ్యాక్సిన్‌ వేసుకున్నాడా లేదా అనే విషయాన్ని ఒక సంస్థ తెలుసుకునేందుకు వీలుగా కేవైసీ-వీఎస్‌ (నో యువర్‌ కస్టమర్‌/ క్లయింట్‌ వ్యాక్సినేషన్‌ స్టేటస్‌) సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి, ప్రయాణానికి అనుమతివ్వడానికి, హోటల్‌ గదులు ఇవ్వడానికి ముందు ఆయా సంస్థలకు అవతలి వ్యక్తి స్టేటస్‌ తెలుసుకునే సదుపాయాన్ని ఇది కల్పిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Aadhar Number: ఆధార్‌ సంఖ్య మార్చడం కుదరదు

వ్యక్తులకు కేటాయించిన ఆధార్‌ సంఖ్యను మార్చివేసి మరో సంఖ్యను కేటాయించడం సాధ్యం కాదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్‌) దిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఇలాంటివి కనుక ఒక్కసారి అనుమతిస్తే వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్లు మాదిరిగా తమకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్ల కోసం ప్రతి ఒక్కరి నుంచి అభ్యర్థనలు వెల్లువెత్తే అవకాశం ఉందని పేర్కొంది. ఓ వ్యాపారి తనకు కేటాయించిన ఆధార్‌ సంఖ్యను మార్చాలని కోరుతూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Afghanistan: నాకు భయంగా ఉంది.. ఎక్కడ చూసినా వారే కనిపిస్తున్నారు!

అఫ్గాన్‌ను ఆక్రమించుకున్నాక తాలిబన్లు మహిళలపై దాష్టీకాన్ని ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. వారి హక్కుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలోనూ వారికి స్థానం కల్పించలేదు. ఈ విషయంలో నిరసన తెలుపుతున్నవారిని నిర్దాక్షిణ్యంగా అణచి వేస్తున్నారు. మరోవైపు.. దేశవ్యాప్తంగా ఆయా జైళ్లలో బందీలుగా ఉన్న వేలాది నేరస్థులను, తీవ్రవాదులను, తాలిబన్లను విడుదల చేస్తున్నారు. దీంతో వారికి శిక్షలు వేసిన జడ్జిలకు ప్రాణభయం పట్టుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Buddhadeb Bhattacharya: కోల్‌కతా వీధుల్లో.. మాజీ సీఎం మరదలు

ఆమె ఓ మాజీ ముఖ్యమంత్రికి సమీప బంధువు. అంతకుమించి చేతిలో పీహెచ్‌డీ పట్టా.. ఉపాధ్యాయురాలిగా పనిచేసి పదవీవిరమణ.. స్థానిక భాషతో పాటు ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం.. ఇన్ని విశేషాలున్న ఓ మహిళ.. ప్రస్తుతం చెరిగిన జుట్టు, మాసిన దుస్తులతో ఓ ఫుట్‌పాత్‌పై నివసిస్తోంది. అంతేకాదు తోపుడు బండ్ల వారు అందించే ఆహారాన్ని తీసుకుంటూ జీవనం సాగించడం అందర్నీ కలచివేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కడుపునిండా కాదు.. మనసునిండా తినాలి!

ఉరుకులు పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు చాలా మారిపోయాయి. వీలు కుదిరినప్పుడే తినడం, జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని చేజేతులా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. తినడమంటే కేవలం కడుపు నింపుకోవడమే కాదు.. మనసునిండా తినాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే శరీరానికి అవసరమైన శక్తిని ఆహారం ద్వారా పొందగలమని అంటున్నారు. మరి అందుకు ఏం చేయాలి? ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి..? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Sai Dharam Tej: గాయపడిన సాయిధరమ్‌ తేజ్‌.. సీసీ కెమేరా పుటేజీ ఇదే!

సినీ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బైక్‌ రైడింగ్ అంటే ఇష్టపడే ఆయన నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో సాయితేజ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆయన హెల్మెట్‌ ధరించి ఉన్నా, ప్రమాద తీవ్రత కారణంగా గాయాలు బలంగా తగిలాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని