Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 13 Sep 2021 09:06 IST

1. ఏపీలో మళ్లీ కరెంట్‌ షాక్‌!

విద్యుత్‌ వినియోగదారులకు మరో షాక్‌ తగలబోతోందా? 2014-15 నుంచి 2018-19 వరకు అయిదేళ్ల కాలానికి ట్రూఅప్‌ కింద రూ.3,669 కోట్ల భారాన్ని ఇప్పటికే వినియోగదారులపై వేసిన విద్యుత్‌ పంపిణీ సంస్థలు మరో సర్దుబాటు (ట్రూఅప్‌)కు సిద్ధమయ్యాయి. 2019-20లో టారిఫ్‌లో అనుమతించిన వ్యయానికి.. వాస్తవ ఖర్చులకు మధ్య వ్యత్యాసం రూ.2,542.70 కోట్లుగా తేల్చాయి. ఇందులో దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్‌పీడీసీఎల్‌) రూ.1,841.58 కోట్లు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. యాసంగి నుంచి వరి వద్దు

కేంద్ర ప్రభుత్వం ఒక్క కిలో ఉప్పుడు బియ్యం కూడా కొనలేమని తేల్చి చెప్పినందున రాష్ట్రంలోని బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని.. రైతులు ఇకముందు వరి పంట సాగు చేయడం శ్రేయస్కరం కాదని వ్యవసాయశాఖ ఉన్నత స్థాయి సమీక్షలో అభిప్రాయం వ్యక్తమైంది. కేంద్ర ప్రభుత్వం తెగేసి చెప్పిన దరిమిలా, ఇక వచ్చే యాసంగి నుంచి వరి వేయడమంటే, రైతులు ఉరి వేసుకోవడమేననే ప్రగతిభవన్‌లో ఆదివారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అభిప్రాయం వ్యక్తమైందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* చెక్‌.. ఢాం.. ఏడాది కాకుండానే ఛిద్రం

3. US Open: జకోవిచ్‌కు నిరాశ.. యూఎస్‌ ఓపెన్‌ విజేతగా మెద్వెదెవ్‌

యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ పోరులో రష్యా ఆటగాడు డానిల్‌ మెద్వెదెవ్‌ అద్భుతం చేశాడు. తన కేరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు, అర్ధశతాబ్దం తర్వాత కేరీర్‌ గ్రాండ్‌స్లామ్‌ సాధించి చరిత్ర తిరగరాద్దమనుకున్న ప్రపంచ నంబర్‌వన్‌ నోవాక్‌ జకోవిచ్‌కు షాక్‌ ఇచ్చాడు. యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో మెద్వెదెవ్‌ 6-4, 6-4, 6-4 తేడాతో 34 ఏళ్ల జకోవిచ్‌ను ఓడించి అతడి జోరుకు బ్రేకులు వేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆ అంతిమయాత్ర లాహోర్‌ నుంచి కోల్‌కతా దాకా

బ్రిటిష్‌ ప్రభుత్వ హయాంలో రాజకీయ ఖైదీల పరిస్థితి దారుణం! జైళ్లలో సదుపాయాలు, అధికారుల ప్రవర్తన అత్యంత అమానవీయం! బ్రిటిష్‌ ప్రభుత్వం దృష్టిలో రాజకీయ ఖైదీలు మనుషులే కాదన్నట్లుండేది. ఈ పరిస్థితులు మారాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేసి 1929 సెప్టెంబరులో ఇదే రోజున (13న) అమరుడైన జతీంద్రనాథ్‌ దాస్‌ కథ వింటే ఇప్పటికీ ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఏడాది ఫీజులన్నీ ఒకేసారి!

కొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలలు తెరవగానే ఫీజులన్నీ ఏకమొత్తంగా వసూలు చేయడానికి సంసిద్ధమయ్యాయి. ట్యూషన్‌, రవాణా, హాస్టల్‌, ల్యాబ్‌ తదితర రుసుములన్నీ కలిపి ఒకే విడతలో చెల్లించకపోతే కళాశాలకు రానిచ్చేది లేదని తెగేసి చెబుతున్నాయి. దీనివల్ల విద్యార్థుల తల్లిదండ్రులపై రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు భారం పడుతోంది. అంతమొత్తం ఒకేసారి ఎలా చెల్లించగలమని వారు వాపోతున్నారు. జేఎన్‌టీయూ పరిధిలో 148 ఇంజినీరింగ్‌ కళాశాలలున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* చేరే ముందు ఏం చూడాలి?

6. నేనెలా చేస్తానోనని భయపడ్డా

‘‘రీమేక్‌ అనగానే కచ్చితంగా పోలికలు వస్తుంటాయి. కథని, నటీనటులు పోషించే పాత్రల్ని మాతృకతో పోల్చి చూస్తుంటారు. కాబట్టి ఒరిజినల్‌  వెర్షన్‌లోని అందాన్ని చెడగొట్టకుండా.. మనదైన శైలిలో సరికొత్తగా చూపించడం అటు దర్శకుడికి, ఇటు నటీనటులకు సవాలే’’ అంది నటి నభా నటేష్‌. తొలి దశ కరోనా తర్వాత వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ ముందు సందడి చేసిన ఆమె.. ఇప్పుడు రెండో దశ తర్వాత ‘మాస్ట్రో’తో వస్తోంది. నితిన్‌ హీరోగా నటించిన చిత్రమిది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మనకు ఉత్తమాట.. మహారాష్ట్రకు పెద్దపీట

దేశంలో ఏ రాష్ట్రంలోనూ కోచ్‌ ఫ్యాక్టరీలు అవసరం లేదని, దేశీయ అవసరాలకు ప్రస్తుతమున్నవే సరిపోతాయని చెప్పిన కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలోని లాతూర్‌లో మాత్రం రూ.625 కోట్ల వ్యయంతో ఒకదాన్ని ఆగమేఘాలపై ఏర్పాటు చేస్తోంది. 2014 ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణలో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని పక్కనపెట్టింది. 2018లో రైల్వే బోర్డు మంజూరు చేసిన లాతూర్‌ కోచ్‌ ఫ్యాక్టరీని శరవేగంగా ముందుకు తీసుకెళ్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అల్‌ఖైదా చీఫ్‌ జవహరీ బతికే ఉన్నాడా!

 అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై ఘోరమైన ఉగ్రదాడి జరిగి సరిగ్గా 20 ఏళ్ల తర్వాత.. దాదాపు ఏడాది కిందట అనారోగ్యంతో చనిపోయినట్లుగా వదంతులున్న అల్‌ఖైదా అగ్రనేత ఐమన్‌ అల్‌- జవహరీ మళ్లీ ఓ వీడియోలో కనిపించి పలు అంశాలపై మాట్లాడటం సంచలనం రేపుతోంది. 9/11 దాడుల స్మారకదినం సందర్భంగా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ‘సైట్‌’ ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌ శనివారం ఈ వీడియోను విడుదల చేసింది. జిహాదీ బృందాల ఆన్‌లైన్‌ కార్యకలాపాలపై నిఘా పెట్టి ఈ సైట్‌ పనిచేస్తుంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. క్లిక్ దూరంలో.. అశ్లీలం

తెలిసీ తెలియని ప్రాయం.. ఎదగని వయసు.. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఉత్సుకత.. సాంకేతికత అతి వినియోగం వారిని పెడదారిన పయనించేలా చేస్తోంది. వివిధ పరిస్థితుల ప్రభావంతో పలువురు పిల్లలు అశ్లీలత వీక్షణకు అలవాటుపడుతున్నారు. చివరకు బానిసలుగా మారుతున్నారు. ఇది చిట్టి బుర్రలపై పెను ప్రభావాన్నే చూపుతోంది. ఒకప్పుడు పెద్దలకే పరిమితమైన పోర్న్‌.. ఇప్పుడు పిల్లలు కూడా చూసే పరిస్థితులు వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Crime News: కన్న కూతురిపై ఏడాదిన్నరగా అత్యాచారం

10. యూట్యూబ్‌ ఛానెల్‌ పేరునే బాబుకి పెట్టా!

జీవితం సాఫీగా సాగిపోవాలకుంటారు కొందరు. వైవిధ్యంగా ఉండాలని తపన పడతారు మరికొందరు. రెండో కోవకి చెందుతారు సంధ్య. ప్రయాణాలు, వివిధ ప్రాంతాల ఆహారంపై ఇష్టంతో భర్తతో కలిసి ప్రపంచ దేశాలను చుట్టేస్తున్నారు. ఆ విశేషాలను ‘సంయాన కథలు’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా అందరికీ చూపిస్తున్నారు. వారి పర్యటనల విశేషాలను లండన్‌ నుంచి వసుంధరతో పంచుకున్నారిలా... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని