Updated : 05 Oct 2021 09:11 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ముందుంది మూడో ఉద్ధృతి ముప్పు

దేశంలో కరోనా మూడో ఉద్ధృతి ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ నెల నుంచి కేసుల్లో క్రమంగా పెరుగుదల నమోదై.. వచ్చే జనవరి-ఏప్రిల్‌ మధ్య అది తీవ్రస్థాయికి చేరొచ్చని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఇంటాబయట అత్యంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ప్రజలకు సూచించారు. ఈ మేరకు వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు సందీప్‌ మండల్‌, నిమలన్‌ అరినమిన్‌పతి, బలరాం భార్గవ, శమిరణ్‌ పాండాలు రాసిన అధ్యయన పత్రం..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. AP News: విశాఖలో ఏం జరుగుతోంది? పీకే బృందం సర్వేపై ఆసక్తి.!

దేశంలో పలు రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న ప్రశాంత్‌ కిశోర్‌ (పి.కె.) బృందం సభ్యులు నగరంలో సర్వే చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. సర్వే బృందం సభ్యులు రెండు రోజులుగా పలు అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా అధికార వైకాపా నేతలు కొందరు బాహాటంగా వెల్లడిస్తున్న కొన్ని అభిప్రాయాల నేపథ్యంలో స్థానికంగా వాస్తవ పరిస్థితులు ఏమిటో తెలుసుకుంటున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పాండోరా పత్రాల్లో జగన్‌ పేరు ఉండే ఉంటుంది

పన్ను ఎగవేతదారుల జాబితాలను బయటపెట్టిన పాండోరా పేపర్స్‌లో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పేరు కూడా ఉండే అవకాశం ఉందని తెదేపా నేతలు అభిప్రాయపడ్డారు. ‘షెల్‌ కంపెనీలను సృష్టించి అవినీతికి పాల్పడటంలో జగన్‌ దిట్ట. అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. పాండోరా పత్రాల్లో రాష్ట్రం నుంచి ఎవరున్నారో పరిశోధించి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని’ సోమవారం తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆన్‌లైన్‌లో జరిగిన పార్టీ వ్యూహ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* పాండోరా ప్రకంపనలు

4. IPL 2021: చాహల్‌.. ఇప్పుడు కోహ్లీని అడగొచ్చు: అజయ్‌ జడేజా

రాబోయే టీ20 ప్రపంచకప్‌లో తనని ఎందుకు ఎంపిక చేయలేదని టీమ్‌ఇండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ ఇప్పుడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని అడగొచ్చని మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా అన్నాడు. ఆదివారం రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహల్‌ మూడు కీలక వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన జడేజా తన అభిప్రాయాలు వెల్లడించాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Azadi Ka Amrit Mahotsav:  పుర్రె చెప్పిన చరిత్ర

కోహినూర్లూ... కోట్ల సంపదననే కాదు... పుర్రెలు సైతం బ్రిటన్‌కు తీసుకెళ్లి సంబరపడ్డారు తెల్లవారు! రాక్షసంగా మనుషుల్ని చంపి... దాన్ని తమ పైచేయికి ప్రతీకగా జబ్బలు చరచుకున్నారు. పుర్రెలను విజయ ట్రోఫీలుగా ప్రదర్శించుకున్నారు. 1857 సిపాయిల తిరుగుబాటు జరిగి 164 సంవత్సరాలు! ఆనాటి తిరుగుబాటులో ప్రాణాలు కోల్పోయిన ఓ సిపాయి పుర్రె మాత్రం బ్రిటన్‌లో తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తూటాలు దొరకలేదు ఎన్ని కాల్చారో తెలీదు

‘దిశ’ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణలో భాగంగా హైదరాబాద్‌ క్లూస్‌ బృందం నిపుణుడు వెంకన్నను కమిషన్‌ తరఫు న్యాయవాది పరమేశ్వర్‌ సోమవారం విచారించారు. ఎన్‌కౌంటర్‌ సమయంలో తుపాకీ వినియోగించారని నిర్ధారించేందుకు చేతిపై గన్‌షాట్‌ రెసిడ్యూ (తుపాకీ పేలిన అవశేషాలు) ఎలా తీశారని ప్రశ్నించారు. అందుకు వెంకన్న దూది, డిస్టిలరీ వాటర్‌ వినియోగించామని బదులిచ్చారు. 5 శాతం నైట్రిక్‌ యాసిడ్‌ వినియోగించాలని క్రిమినాలజీలో ఉంది కదా.. అలా చేశారా? అని అడిగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* పెట్రో మంట.. తగ్గదంట!

7. జుట్టుకూ కరోనా చిక్కులు!

కొవిడ్‌-19 ఒంట్లో దేన్నీ వదిలి పెట్టటం లేదు. ఊపిరితిత్తుల మీదే కాదు.. గుండె నుంచి మెదడు వరకూ అన్ని అవయవాల పైనా ప్రతాపం చూపుతోంది. కనీసం వెంట్రుకల మీదైనా జాలి చూపటం లేదు. కొవిడ్‌ నుంచి కోలుకున్నాక ఎంతోమంది జుట్టు ఊడిపోవటంతో సతమతమవుతుండటమే దీనికి నిదర్శనం. మంచి విషయం ఏంటంటే- కొద్ది నెలల తర్వాత ఊడిన జుట్టు దానంతటదే రావటం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Ajay Mishra: రెండు నిమిషాల్లో అందరినీ దారికి తెస్తా!

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్ర తీవ్ర స్వరంతో హెచ్చరిస్తున్న వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం నాటి లఖింపుర్‌ఖేరి ఘటనకు 9 రోజుల ముందు (సెప్టెంబరు 25న) ఈ దృశ్యాలు రికార్డయినట్లుగా తెలుస్తోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖేరి లోక్‌సభ నియోజకవర్గంలో అజయ్‌ మిశ్ర పర్యటిస్తుండగా పాలియా అనే ప్రాంతంలో రైతులు నల్లజెండాలతో నిరసన తెలిపినప్పటి వీడియో అది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. TS News: ఆర్నెల్లలోనే రూ. 30 లక్షల ఆదాయం

వ్యవసాయంతోనూ భారీ లాభాలు ఆర్జించవచ్చని నిరూపిస్తున్నారు కల్వకుర్తి మండలం ముకురాల గ్రామ రైతు రాజేందర్‌రెడ్డి. సాగుచేసింది టమాట పంటనే అయినా ఆధునిక పద్ధతులు, ఉద్యానశాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ అద్భుతాలు చేస్తున్నారు. తన 10 ఎకరాల పొలంలో ఎకరాకు రూ. 3 లక్షలు వెచ్చించి శాశ్వతమైన పందిరి వేయించారు. ఓ వేసవి మండుటెండనూ తట్టుకునే ఓ కంపెనీకి చెందిన టమాట విత్తనాన్ని ఎంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Director Krish: దర్శకుడిగా అలాంటి ప్రయాణాన్నే ఇష్టపడతా!

ప్రతి సినిమాకీ ఓ కొత్త అధ్యాయం ఉండాలనుకుంటా. చేస్తున్నది ఒకటే అనిపించకుండా..మరింత ఆసక్తికరంగా మరింత సాహసోపేతంగా అనిపిస్తే ఆ సినిమా ప్రయాణం గమ్మత్తుగా ఉంటుంది. ఓ దర్శకుడిగా అలాంటి ప్రయాణాన్నే నేను ఇష్టపడతా’’ అంటున్నారు క్రిష్‌ జాగర్లమూడి. సాహిత్యాన్ని అమితంగా ఇష్టపడే దర్శకుల్లో ఈయన ఒకరు. ఆయన సినిమాల్లోని మాటలు, పాటలే ఆ విషయాన్ని చాటి చెబుతుంటాయి. తాజాగా ‘కొండపొలం’ నవల ఆధారంగా అదే పేరుతో ఓ సినిమాని తెరకెక్కించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని