Updated : 09 Oct 2021 09:07 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. IPL 2021: భళారే భరత్‌

రెండు దేశాల్లో రెండు దశల్లో అత్యంత సుదీర్ఘంగా సాగిన ఐపీఎల్‌-14 లీగ్‌ దశకు తెరపడింది. చివరి రోజు ఫలితాలతో ప్లేఆఫ్స్‌ బెర్తుల్లో మార్పులేమీ జరిగిపోలేదు. ముందు రోజు టాప్‌-4 స్థానాల్లో ఉన్న జట్లు అలాగే ముందంజ వేశాయి. చివరి ప్లేఆఫ్‌ బెర్తు కోల్‌కతాకే సొంతమైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ కథ ముగిసింది. ఈసారి ప్లేఆఫ్స్‌ చేరకుండానే ఆ జట్టు నిష్క్రమించింది. కోల్‌కతాను వెనక్కి నెట్టి ముందంజ వేయాలంటే 170 పరుగుల తేడాతో గెలవాల్సిన ముంబయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

దంచికొట్టి.. ఇంటికి

2. అమెరికా అణు జలాంతర్గామికి ప్రమాదం

అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. దక్షిణ చైనా సముద్ర గర్భంలో జరిగిన అనూహ్య ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 5 రోజుల క్రితం అమెరికాకు చెందిన సీవూల్ఫ్‌- శ్రేణి అణుశక్తి జలాంతర్గామి యూఎస్‌ఎస్‌ కనెక్టికట్‌ గుర్తుతెలియని భారీ వస్తువును ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. 11 మందికి గాయాలయ్యాయి. ఎవరికీ ప్రాణభయం లేదని యూఎస్‌ పసిఫిక్‌ ఫ్లీట్‌ తెలిపింది. జలాంతర్గామి సురక్షితంగా ఉందని, అందులోని అణు ప్రొపల్షన్‌ ప్లాంట్‌కు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. స్మార్ట్‌ఫోన్‌ కొంటే రూ.6వేలు వాపస్‌: ఎయిర్‌టెల్‌

తమ వెబ్‌సైట్‌ నుంచి స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసిన వారికి రూ.6వేలు నగదు వాపస్‌ ఇస్తామని ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ఈ మొత్తాన్ని మూడేళ్లలో, రెండు వాయిదాల్లో అందించనున్నట్లు శుక్రవారం తెలిపింది. రూ.12వేల వరకు విలువైన మొబైల్‌ స్మార్ట్‌ ఫోన్లు కొన్న వారికి ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. శాంసంగ్‌, షావోమీ, వివో, ఒప్పో, రియల్‌మి, నోకియా, ఐటెల్‌, లావా, ఇన్ఫీనిక్స్‌, టెక్నో, లెనోవో, మోటారోలా బ్రాండ్లకు చెందిన దాదాపు 150కి పైగా స్మార్ట్‌ఫోన్‌ మోడళ్లకు ఈ ప్రయోజనం అందిస్తున్నట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Maha Samudram: ఇక తెలుగు ప్రేక్షకుల్ని వదిలివెళ్లను

రెండు చిత్రాలు ఒకేసారి రావడమంటే.. ఇద్దరు ఒకేసారి గుడిలోకి వెళ్లడం లాంటిది. అయితే దేవుడు ఎవరికి వరమిస్తాడనేది మనం చెప్పలేం’’ అన్నారు సిద్ధార్థ్‌. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ లాంటి విజయవంతమైన చిత్రాలతో లవర్‌బాయ్‌గా పేరు తెచ్చుకున్న హీరో ఆయన. కొన్నాళ్ల విరామం తర్వాత ఆయన తెలుగులో నటించిన కొత్త చిత్రం ‘మహా సముద్రం’. అజయ్‌ భూపతి దర్శకుడు. శర్వానంద్‌ మరో కథానాయకుడు. ఈ సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కలప ఇళ్లు.. తిప్పుకోలేరు కళ్లు!

ఇంటిని అందంగా తీర్చిదిద్దేందుకు ఇంటీరియర్స్‌ను ఎక్కువగా కలపతో చేయిస్తున్నాం... గచ్చు కూడా కలప అయితే మరింత ఆకర్షణీయంగా, విలాసవంతంగా ఉంటుందని మురిసిపోతున్నాం.. అక్కడికే పరిమితం కాకుండా ఇప్పుడు మొత్తం ఇంటినే కలపతో కట్టేయవచ్చు అంటున్నారు నిర్మాణదారులు. సాధ్యమా అనే సందేహాలు వద్దు. ఒకప్పుడు మన పూర్వీకులంతా కలపతో కట్టిన ఇళ్లలో ఏళ్ల తరబడి నివసించినవారే. జనాభాతోపాటు ఆవాసాలు పెరగడంతో కలప కొరత ఏర్పడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

హైటెక్‌ కర్షకులు

6. అదనపు బాదుడు..‘ప్రత్యేకం’!

దసరా పండుగ రద్దీని రైల్వే శాఖ సొమ్ము చేసుకుంటోంది. పండుగ ప్రత్యేక రైళ్లు, తత్కాల్‌ ప్రత్యేకం పేరుతో ప్రయాణికులపై వంద నుంచి రెండు వందల శాతం వరకు అదనంగా ఛార్జీల భారం వేస్తోంది. టికెట్ల ధర పెంపుతో బోగి రకం, దూరం బట్టి ఒక్కో ప్రయాణికుడిపై రూ.200 నుంచి రూ.700, ఆ పైన అదనపు భారం పడుతోంది. కరోనాతో ఆదాయాలు తగ్గి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వారికి వ్యయప్రయాసలు లేకుండా రవాణా సౌకర్యం కల్పించాల్సిన రైల్వే శాఖ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. దేశాధ్యక్షుణ్నే ఢీ కొట్టింది!

యుద్ధభూములు... ఉగ్రవాద అడ్డాలు... ఆమెను అడ్డుకోలేకపోయాయి.. తమ దేశాధ్యక్షుడి అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తూ ‘ఢీ... అంటే ఢీ’ అంటూ 58 ఏళ్ల మారియారెస్సా చేస్తున్న అక్షర సమరం అవినీతికి వ్యతిరేకంగా కోట్ల మందికి పిడికిళ్లు బిగించే శక్తిని అందించింది. నోబెల్‌ శాంతి బహుమతిని అందుకున్న ఈ ఫిలిప్పీన్స్‌ పాత్రికేయ యోధురాలి పోరాట గాథ ఇది... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. TS News: సొంత జాగాల్లో ఇళ్ల పథకం

సొంత జాగా ఉన్న పేదలు ప్రభుత్వ సాయంతో ఇళ్లు నిర్మించుకునే పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఆ పథకం అమలు చేస్తామని బడ్జెట్‌ సందర్భంగా హామీ ఇచ్చామని, దాన్ని 100 శాతం తెస్తామని చెప్పారు. శాసనసభలో శుక్రవారం సంక్షేమంపై జరిగిన లఘుచర్చలో సభ్యులు మాట్లాడిన అనంతరం వారి ప్రశ్నలకు, సందేహాలకు సీఎం సమాధానమిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సెంటు భూమిలో ఇల్లా?

9. HYD: హైదరాబాద్‌- బెంగళూరు మార్గంలో వరద.. 3కి.మీ మేర నిలిచిన వాహనాలు

నగరంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌- బెంగళూరు రహదారిపై వరద నీరు భారీగా నిలిచింది. నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద ఓ లారీ బ్రేక్‌ డౌన్‌ అయి వరదనీటిలో చిక్కుకుంది. ఫలితంగా హైదరాబాద్‌- బెంగళూరు మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. రహదారికి ఇరువైపులా 3 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. అప్పుడు వద్దన్నాడు.. ఇప్పుడు పెళ్లంటున్నాడు!

కాలేజీలో ఉన్నప్పుడు ఒకబ్బాయిని గాఢంగా ప్రేమించా. తన సంతోషం కోసం ఎంతో చేశాను. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ తను వేరే అమ్మాయితో రిలేషన్‌షిప్‌ పెట్టుకొని నన్ను మోసం చేశాడు. చాలా బాధపడ్డాను. చివరికి బ్రేకప్‌ చెప్పేశాను. మూడేళ్ల తర్వాత తను మళ్లీ కాంటాక్ట్‌లోకి వచ్చాడు. తప్పు చేశాను క్షమించమనీ, పెళ్లి చేసుకుందామని అంటున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని