Published : 16 Oct 2021 08:56 IST

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. IPL 2021 Final: నా దృష్టిలో కోల్‌కతానే విజేత: ధోనీ

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నాలుగోసారి టైటిల్‌ ఎగరేసుకుపోయింది. శుక్రవారం రాత్రి దుబాయ్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడిన మ్యాచ్‌లో ధోనీసేన 27 పరుగులతో విజయం సాధించింది. దీంతో ముంబయి ఇండియన్స్‌ (5) తర్వాత అత్యధిక సార్లు టైటిల్‌ సాధించిన జట్టుగా చెన్నై మరో అడుగు ముందుకేసింది. ఈ క్రమంలోనే మ్యాచ్‌ అనంతరం ధోనీ మాట్లాడాడు. ఈ సీజన్‌లో అసలైన విజేత కోల్‌కతా అని అభిప్రాయపడ్డాడు. కరోనా వల్ల ఈ టోర్నీ రెండు భాగాలుగా జరగడం మోర్గాన్‌ టీమ్‌కు కలిసొచ్చిందని చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* IPL 2021 CHAMPION: గర్జించిన చెన్నై సింహాలు

2. AP News: తేలని దుగ్గిరాల పంచాయతీ .. తెదేపా ఎంపీపీ అభ్యర్థి బీసీ కాదన్న కలెక్టర్‌

గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక కొత్త మలుపు తిరిగింది. ధ్రువపత్రాల ఆధారంగా తెదేపా ఎంపీపీ అభ్యర్థి జబీన్‌ బీసీ కాదని జిల్లా పాలనాధికారి వివేక్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. గతంలో తహశీల్దార్‌ ఇచ్చిన నివేదికను కలెక్టర్‌ సమర్థించారు. ఈమేరకు 38పేజీల కుల ధ్రువీకరణ నివేదికను శుక్రవారం ఎంపీపీ అభ్యర్థి జబీన్‌కు, హైకోర్టుకు జిల్లా కలెక్టర్‌ పంపారు. దీంతో దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక వ్యవహారం మళ్లీ మొదటి కొచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బాయ్‌కాట్‌ 996: చైనాలో కొత్త ఉద్యమం

ఒకవైపు అమెరికా సహా పలు దేశాల్లో ‘ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌’ సంక్షోభం కొనసాగుతుంటే.. చైనాలో మరో కొత్త ఉద్యమం మొదలైంది. అక్కడి టెక్‌ ఉద్యోగులంతా.. 996 కల్చర్‌కు వ్యతిరేకంగా ఆన్‌లైన్‌ ఉదమ్యాన్ని ప్రారంభించారు. ఓవర్‌టైం పనివేళలు, వీక్‌ ఆఫ్స్‌ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారు పని చేస్తోన్న కంపెనీలో పనివేళల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ఇలా ఒక డేటాబేస్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులు వారి వివరాలు నమోదు చేయగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Sneha Ullal: మెడలో మంగళసూత్రం.. జూనియర్‌ ఐష్‌ ఫొటోలు వైరల్‌

నీలి రంగు కళ్లు.. ఆకట్టుకునే అందంతో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్యరాయ్‌ను తలపిస్తూ జూనియర్‌ ఐష్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు నటి స్నేహా ఉల్లాల్‌. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న స్నేహా ఇన్‌స్టా వేదికగా తరచూ నెటిజన్లకు చేరువగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే నెటిజన్లకు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం ఉదయం ఆమె కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. ఆ ఫొటోల్లో ఆమె మెడలో మంగళసూత్రం.. నుదిటిన సింధూరంతో సంప్రదాయబద్ధంగా కనిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Social Look: ‘దసరా స్పెషల్‌’.. సినీతారలు పంచుకున్న ఈ పోస్టుల్‌

5. AP News: బన్ని ఉత్సవంలో చెలరేగిన హింస: వంద మందికి గాయాలు

కర్నూలు జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని జైత్రయాత్ర శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభమైంది. ఉత్సవంలో చెలరేగిన హింసలో సుమారు వంద మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆదోనిలోని ఆసుపత్రికి తరలించారు. దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. HYD: కప్పు టీ ₹1,000.. అదీ హైదరాబాద్‌లో!

సాధారణంగా టీ ధర ఎంత ఉంటుంది. పది రూపాయలు. ఖరీదైన కేఫ్‌ల్లో అయితే టీ ధర వందల్లోనూ ఉంటుంది. కానీ, తాజాగా హైదరాబాద్‌లోని ఓ కేఫ్‌ కప్పు టీని రూ. వెయ్యికి విక్రయిస్తోంది. కప్పు టీకి అంత ధర అని ఆశ్చర్యపోతున్నారా? అది అరుదైన టీ పౌడర్‌తో తయారు చేస్తోన్న టీ అండి మరి..! నీలోఫర్‌ కేఫ్.. హైదరాబాదీలకు సుపరిచితమైన చోటే. ఇక్కడ అనేక రకాల టీలు, బిస్కెట్స్‌ను విక్రయిస్తుంటారు. కాగా.. ఇప్పుడు బంజారాహిల్స్‌లోని కేఫ్‌ బ్రాంచ్‌లో ప్రత్యేకమైన, ఖరీదైన టీని పరిచయం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Petrol Diesel Prices: వరుసగా మూడో రోజూ పెరిగిన ఇంధన ధరలు

ముడి చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. ఫలితంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. గత మూడు వారాల్లో డీజిల్‌ ధరలు 18 సార్లు పెరగ్గా.. పెట్రోల్‌ ధరలు 15 సార్లు ఎగబాకాయి. తాజాగా శనివారం లీటర్‌ పెట్రోల్ 36 పైసలు‌, డీజిల్‌పై 38 పైసలు చొప్పున పెరిగాయి. ఈ పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ. 102.80, లీటర్ పెట్రోల్ ధర రూ.109.73గా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. UK MP Stabbed: బ్రిటన్‌ ఎంపీ దారుణ హత్య.. కత్తితో పలుమార్లు పొడిచి చంపిన నిందితుడు

బ్రిటన్‌కు చెందిన ఎంపీ ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ఎసెక్స్‌లోని సౌత్‌ఎండ్‌ వెస్ట్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ డేవిడ్‌ అమీస్‌(69) శుక్రవారం స్థానికంగా లీ- ఆన్- సీలోని ఓ చర్చిలో పౌరులతో వారాంతపు సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆయనపై దాడి చేసి, కత్తితో పలుమార్లు పొడిచాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆయన్ను హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. స్థానిక పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. FAST FOOD: పిజ్జా, చిప్స్‌ తింటున్నారా.. తస్మాత్‌ జాగ్రత్త!

పిజ్జా, చిప్స్‌, పేస్ట్రీ వంటి ఫాస్ట్‌ఫుడ్స్‌ను చూడగానే తినేయాలనేపిస్తుంది కదూ! అయితే.. ఈసారి మాత్రం అవి తినాలంటే ఆలోచించాల్సిందే. ఎందుకంటే.... ఇప్పటి వరకూ ఈ హైలీ ప్రాసెస్ట్‌ ఫుడ్స్‌ తింటే బరువు పెరగడం, మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయనే తెలుసు. ఇప్పుడా జాబితాలోకి జ్ఞాపకశక్తి తగ్గే అవకాశం ఉన్నట్లు తాజా పరిశోధనలో తేలింది. బ్రెయిన్‌, బిహేవియర్‌, ఇమ్యూనిటీ జర్నల్‌ ప్రచురించిన అధ్యయనంలో.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. AP News: టెస్ట్‌ డ్రైవ్‌కు వెళ్తే ... ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ దగ్ధమైంది

గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్లో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ దగ్ధమైంది. ఓ వ్యక్తి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై వెళ్తుండగా సాంకేతిక లోపంతో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో భయాందోళకు గురైన వాహనదారుడు స్కూటర్‌ను అక్కడే వదిలేసి పరుగులు తీశాడు. మంటల్లో స్కూటర్‌ పూర్తిగా కాలిపోయింది. దగ్ధమైన వాహనం విలువ రూ.65వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు. ఒక షోరూమ్‌కు సంబంధించి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ డెమో నిమిత్తం టెస్ట్‌ డ్రైవ్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Viral video: ఫోన్‌ మాట్లాడుతూ మ్యాన్‌హోల్‌లో పడిన మహిళ


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని