Updated : 18 Oct 2021 09:06 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Hypersonic missile: రహస్యంగా భూమిని చుట్టేసిన చైనా క్షిపణి

చైనా మరోసారి దూకుడు ప్రదర్శించింది. అణ్వస్త్ర సామర్థ్యమున్న ఒక సరికొత్త హైపర్‌సోనిక్‌ క్షిపణిని పరీక్షించింది. అది.. దిగువ భూ కక్ష్యలో పయనిస్తూ పుడమి మొత్తాన్ని చుట్టేసింది. ఆ తర్వాత కిందకి దిగి, శరవేగంగా లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. ఇది కొద్దిలో గురితప్పినా.. ప్రమాదకరమైన క్షిపణి రూపకల్పనలో డ్రాగన్‌ చాలావరకూ పట్టు సాధించినట్లు తేటతెల్లమైంది. ఈ రంగంలో చైనా పురోగతి అమెరికా నిఘా వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. తమ అంచనాలను మించి డ్రాగన్‌ ముందడుగు వేసినట్లు తెలుసుకొని నివ్వెరపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Petrol: పెట్రోల్‌, డీజిల్‌ కంటే.. విమాన ఇంధనమే చౌక!

2. తలపాగాకు తగ్గ రంగుల్లో రోల్స్‌ రాయిస్‌ కార్లు!

రోల్స్‌ రాయిస్‌.. ప్రపంచంలోని చాలా కుటుంబాల సగటు ఆస్తి కన్నా ఖరీదైనది. ఇలాంటి కారు ఒక్కటైనా కొనాలని సంపన్నులు సైతం తహతహలాడిపోతారు. అలాంటిది ఓ భారత సంతతి వ్యక్తి మాత్రం తన తలపాగాకు నప్పే రంగుల్లో ఈ కార్లు కొంటున్నారు. ఆయన పేరు రూబెన్‌ సింగ్‌. బ్రిటన్‌లో నివసించే భారత సంతతి కుబేరుడు. తన విలాసాల గురించి సామాజిక మాధ్యమాల్లో ఆయన తరచూ పోస్ట్‌ చేస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షా 18 వేల మంది ఫాలోవర్లు ఆయనకు ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 205 దేశాల సిబ్బందికి ఆమె బాస్‌!

ఆమె చదువుకుంది సాధారణ బీయ్యేనే! అయితేనేం... ప్రపంచంలో అతి పెద్ద న్యాయసేవల సంస్థ డెంటన్స్‌కి చీఫ్‌ పీపుల్స్‌ ఆఫీసర్‌గా నియమితులయ్యారు... ఆమే తెలుగింటి ఆడపడుచు నీలిమ పాలడుగు. ఈ స్థాయి పదవినందుకున్న తొలి భారతీయురాలిగానూ గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా ఆమెను వసుంధర పలకరించింది. వృత్తిపరమైన సవాళ్ల నుంచి అభిరుచుల వరకూ ఆమె మనోభావాలు ఇవీ... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* తండ్రి బాధ్యత అంతటితో తీరిపోదు

4. భూత వైద్యం పేరుతో నమ్మించి అత్యాచార యత్నం.. 

భూత వైద్యం పేరుతో మహిళను నమ్మించి అత్యాచారయత్నానికి ప్రయత్నించడం.. ప్రతిఘటించిందంటూ గొడ్డలితో నరికి చంపడం.. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ప్రతీకారేచ్ఛతో పోలీసుల ఎదుటే కర్రలతో ఆపై నిందితుడిని కొట్టి చంపడం వంటి ఉదంతాలతో ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామం ఆదివారం రాత్రి అట్టుడికింది. కామేపల్లి గ్రామానికి చెందిన వంకాయలపాటి విజయలక్ష్మి అలియాస్‌ విజయ(42) వ్యవసాయ కూలీ మేస్త్రీగా జీవనం సాగిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. T20 World Cup: కూర్పు కుదిరేనా?

ఐపీఎల్‌లో వివిధ జట్ల తరపున ఆడేందుకు విడిపోయిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు మళ్లీ కలవాల్సిన సమయం వచ్చేసింది. లీగ్‌లో ఆయా ఫ్రాంఛైజీల తరపున గొప్ప ప్రదర్శనతో అదరగొట్టిన మన క్రికెటర్లు.. ఇప్పుడు జాతీయ జట్టు తరపున అదే జోరు కొనసాగించాల్సిన తరుణం ఆసన్నమైంది. టీ20 ప్రపంచకప్‌ను పట్టేయాలనే పట్టుదలతో ఉన్న కోహ్లీసేన.. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో పోరుకు ముందు రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. తొలి మ్యాచ్‌లో సోమవారం ఇంగ్లాండ్‌తో తలపడనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Azadi Ka Amrit Mahotsav: అంటరాని గాంధీజీ!

కన్నుమూసేదాకా అంటరానితనంపై అలుపెరగని పోరాటం చేసిన గాంధీజీకి అస్పృశ్యత ఎలా ఉంటుందో ఓసారి స్వయంగా అనుభవమైంది. ఆయన్ను అంటరానివాడిగా భావించి దూరంగా ఉంచారో ఊర్లో! చంపారన్‌... గాంధీని జాతీయోద్యమ నేతగా నిలబెట్టిన చోటు. భారత్‌లో తొలిసారిగా సత్యాగ్రహాన్ని ఆరంభించింది ఇక్కడి నుంచే. ఈ సందర్భంగానే ఆయనకు జీవితంలో మరవలేని అనుభవం ఎదురైంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తొలిరోజుల నాటి సంఘటన ఇది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఈ సైకిల్‌ అసలు పడిపోదు!

హాయ్‌ నేస్తాలూ! మీకు సైకిల్‌ తొక్కడం వచ్చా...! మనం నేర్చుకునేటప్పుడు ఎన్నోసార్లు కిందపడి ఉంటాం... కదూ! బ్యాలెన్సింగ్‌ వీల్స్‌ ఉన్నా... కొన్ని సార్లు కష్టమే... కానీ చైనాలో ఓ అంకుల్‌ సెల్ఫ్‌ బ్యాలెన్సింగ్‌ సైకిల్‌ తయారు చేశాడు. అది అసలు కింద పడనే పడదట.. ఆ విశేషాలేంటో సరదాగా తెలుసుకుందామా! చైనాకు చెందిన జియ్‌ హుయ్‌ జున్‌ అనే హార్డ్‌వేర్‌ ఇంజినీర్‌, ఈ సెల్ఫ్‌బ్యాలెన్స్‌ సైకిల్‌ను తయారు చేశాడు. తనకు దొరికిన ఖాళీ సమయంలో ఈ ప్రాజెక్టు కోసం పనిచేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఏ పుస్తకాలు.. ఎంత మేలు?

8. Dengue Fever: డెంగీకి టీకా?

అప్రమత్తంగా వ్యవహరించకపోతే ప్రాణాంతకంగా మారే డెంగీ జ్వరానికి మన దేశంలో తొలిసారి టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జపాన్‌కు చెందిన తకేడా ఫార్మా తాను అభివృద్ధి చేసిన డెంగీ టీకాను మన దేశంలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ)తో సంప్రదింపులు చేపట్టినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. గృహ రుణాలకు గిరాకీ

అందుబాటు ధరల్లో నివాస గృహాలు లభ్యమవుతుండటం, రుణ రేట్లు తక్కువగా ఉండటంతో  గృహ రుణాలకు గిరాకీ పెరుగుతోందని తనఖా రుణ సంస్థలు చెబుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, తనఖా సంస్థలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు కూడా ఎన్నడూ లేనంతగా అతి తక్కువ రేట్లకే రుణాలు అందిస్తామంటూ ప్రస్తుత పండగ సీజన్‌లో ముందుకొచ్చాయి. కొవిడ్‌-19 రెండో దశ ఉద్ధృతి తర్వాత ఆర్థిక మందగమనం ఏర్పడటంతో, గృహ రుణాలకు గిరాకీ పెంచేందుకు వీలుగా రుణ రేట్లను తగ్గించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Road Accident: జనగామలో ప్రైవేట్‌ బస్సు దగ్ధం.. 

జనగామ జిల్లా నెల్లుట్ల వద్ద ప్రైవేట్‌ బస్సు ప్రమాదానికి గురైంది. షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో ఉన్న 26 మంది ప్రయాణికులు పూర్తిగా బయటపడ్డారు. బస్సు ఛత్తీస్‌గఢ్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం.. చిక్కుకున్న 200 మంది కార్మికులు

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని