Updated : 19 Oct 2021 09:11 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. మహమ్మారికి జోడీ... మధుమేహం!

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మధుమేహం రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు వంటి కారణాలతో కొవిడ్‌కు ముందే భారత్‌లో మధుమేహం కేసులు పెరుగుతూ వచ్చాయి. ప్రపంచంలోని ప్రతి ఆరుగురు మధుమేహ రోగుల్లో ఒకరు భారత్‌లోనే ఉన్నట్లు అధ్యయనాలు చాటుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కరోనా తగ్గినా...

2. Azadi Ka Amrit Mahotsav: అవధ్‌ల్లేని సాహసి

సిపాయిల తిరుగుబాటు అనగానే ఝాన్సీరాణి వీరగాథే గుర్తుకొస్తుంది. అదే సమయంలో ఝాన్సీతోపాటు మరో రాణి కూడా ఆంగ్లేయులపై అలుపెరగని తిరుగుబాటు చేసింది. తెల్లవారెంతగా తాయిలాలు విసిరినా లొంగకుండా.. నేపాల్‌ వెళ్లి ప్రాణాలు కోల్పోయిన బానిస రాణి... బేగం హజ్రత్‌ మహల్‌! స్వాతంత్య్రానికి ముందు ప్రస్తుత ఉత్తర్‌ప్రదేశ్‌లో భాగంగా ఉండేది అవధ్‌ సంస్థానం. ఫజియాబాద్‌లో నిరుపేద కుటుంబంలో జన్మించింది ముహమ్మది ఖానుమ్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెలిసినవారే.. తెగబడుతున్నారు

పరిచయస్తులే కదా.. అనే నమ్మకంతో ఉంటే అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. స్నేహితులే కదా అని చనువిస్తే కామాంధుల్లా మారి కాటేస్తున్నారు. కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన కుటుంబసభ్యులూ కీచకుల్లా మారిపోతున్నారు. ఇలా రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్నవారిలో 99.4 శాతం మంది బాధితులకు తెలిసిన వారే ఉంటున్నారు. వీరిలో బాధితుల ఇరుగుపొరుగు వ్యక్తులు, ఆన్‌లైన్‌ వేదికల్లో పరిచయమైన స్నేహితులు కుటుంబ స్నేహితులు, ఉద్యోగమిచ్చిన యజమాని తదితరులే అధికం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Electric Car: ఒక ఛార్జింగ్‌తో 750 కి.మీ. ప్రయాణం!

యాపిల్‌, ఇతర అంతర్జాతీయ బ్రాండ్ల కోసం స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేసే ఫాక్స్‌కాన్‌ విద్యుత్‌ కార్లను ఉత్పత్తి చేసే ప్రణాళికలను ప్రకటించింది. కాంట్రాక్టు పద్ధతిలో వాహన సంస్థల కోసం విద్యుత్‌ కార్లను ఫాక్స్‌కాన్‌ తయారుచేయనుంది. చైనా, ఉత్తర అమెరికా, ఐరోపా, ఇతర విపణుల్లో వాహన సంస్థలకు కార్లు, బస్సులను ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ ఉత్పత్తి చేస్తుందని, మార్కెట్‌కు అనుగుణంగా ఖాతాదారులు డిజైన్‌, ఫీచర్లను మార్చుకోవచ్చని సంస్థ ఛైర్మన్‌ యంగ్‌ లూ వెల్లడించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Cyber Crime: దోచుకురండి.. పంచుకుందాం

కాల్‌ నేరాలకు ఆలవాలమైన రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌ కేటుగాళ్ల గురించి దేశమంతా తెలుసు. రోజూ వేల మంది ఖాతాలు లూటీ చేస్తున్నా వీరిని ఎందుకు అదుపు చేయలేకపోతున్నారన్నదే ప్రశ్న. శత్రుదేశంలో సర్జికల్‌ దాడులు చేయగలిగినప్పుడు సొంత దేశంలో అరాచకం సృష్టిస్తున్న సైబర్‌ నేరగాళ్లను కట్టడి చేయలేకపోవడమేంటనేది అర్థంకాని అంశం. ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో ఒక్క తెలంగాణ నుంచే దాదాపు రూ. 100 కోట్ల సొత్తు సైబర్‌ నేరగాళ్లు కొట్టేయగా ఇందులో 90 శాతం భరత్‌పుర్‌ ముఠాల పనే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Crime News: ఆస్తులు పంచలేదని.. ‘ఆటోమేటిక్‌’గా కొట్టేసింది 

6. పీజీపైనా ఫీజుల పిడుగు

 జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్‌టీయూహెచ్‌) ఎంటెక్‌ ఫీజుల్ని సైతం భారీగా పెంచింది. గత నెలలో బీటెక్‌, బీఫార్మసీ రుసుములను పెంచిన ఈ వర్సిటీ తాజాగా పీజీ కోర్సుల్లోని సీట్లను నాలుగు రకాలుగా విభజించి, ఫీజుల మోత మోగించింది. ఇప్పటివరకు ఫీజు చెల్లించినా అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) నుంచి వచ్చే ఫెలోషిప్‌ సొమ్ము విద్యార్థులకు చాలా వరకు మిగిలేది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మహిళల కోసం డ్రైవింగ్‌ స్కూల్‌

మహిళాశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో స్త్రీల కోసం ప్రత్యేకంగా మోటారు వాహన శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ఆ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్‌ తెలిపారు. ఈ కేంద్రంలో మహిళలకు రెండు, మూడు, నాలుగు చక్రాల వాహనాల శిక్షణతో పాటు జీవనోపాధి మార్గాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్లకూ ఈ కేంద్రంలో డ్రైవింగ్‌ శిక్షణ ఇప్పిస్తామన్నారు. సోమవారమిక్కడ వారి జీవనోపాధికి బ్యాగుల తయారీలో 45 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భారత సేన జోలికొస్తే షాకే!

సరిహద్దులు దాటి వచ్చి బాహాబాహీకి దిగే చైనా సైన్యానికి చెక్‌ పెట్టేందుకు భారత్‌ రంగం సిద్ధం చేసింది. హద్దు మీరే శత్రువుకు కొర్రుకాల్చి వాత పెట్టే సాధనాలు తయారయ్యాయి. శివుడి చేతిలోని త్రిశూలం ఇప్పుడు భారత బలగాలకు ఆయుధంగా మారింది. కొత్తగా రూపొందిన గ్లౌజులు తొడుక్కొని ఒక్క పంచ్‌ ఇస్తే.. చైనా సైనికుడికి దిమ్మతిరిగిపోతుంది. నయా లాఠీలు తాకితే చాలు.. డ్రాగన్‌ బలగాలు కిందపడి గిలగిలా కొట్టుకోవాల్సిందే. ప్రత్యర్థి ప్రాణాలకు హాని కలిగించని ఈ సాధనాలు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

NREGS: నాకింత... నీకింత!

9. చాదస్తపు జాగ్రత్తలతో చేటే

కరోనా పుణ్యమా అని పరిసరాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం, చేతులకు శానిటైజర్‌ రాసుకోవడం, వస్తువులపై వైరస్‌ సంహారక ద్రావణాన్ని పిచికారి చేయడం.. దైనందిన కార్యక్రమాలుగా మారిపోయాయి! వైరస్‌ కట్టడి సంగతి అటుంచితే, అతి జాగ్రత్తకుపోయి వీటిని అతిగా, తప్పుగా వినియోగించడం వల్ల అనర్థాలు తప్పడంలేదు. పొరపాటున ఇవి నోట్లోకి వెళ్తే ఏమవుతుంది? ఈ సాధనాలతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. T20 World Cup: ఇంగ్లాండ్‌పై ప్రాక్టీస్‌ అదిరింది

టీమ్‌ ఇండియా టీ20 ప్రపంచకప్‌ సన్నాహం ఘనంగా మొదలైంది. తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కోహ్లి బృందం అదరగొట్టింది. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (70 రిటైర్డ్‌ నాటౌట్‌; 46 బంతుల్లో 7×4, 3×6), కేఎల్‌ రాహుల్‌ (51; 24 బంతుల్లో 6×4, 3×6) విధ్వంసం సృష్టించడంతో సోమవారం భారత్‌ 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఓపెనర్లతో పాటు పంత్‌ (29 నాటౌట్‌; 14 బంతుల్లో 1×4, 3×6) మెరవడంతో 189 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

T20 World Cup: 4 బంతులు.. 4 వికెట్లు

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని