Updated : 02 Nov 2021 09:18 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. హుజూరాబాద్‌, బద్వేలు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

తెలంగాణలోని హుజూరాబాద్‌, ఏపీలోని బద్వేలు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించనున్నారు. హుజూరాబాద్‌లో ఉదయం 9.30 గంటలకు తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశముంది. బద్వేలులో మధ్యాహ్నం ఒంటిగంటకు పూర్తి స్థాయిలో ఫలితం వెల్లడికానున్నట్లు అధికారుల అంచనా వేస్తున్నారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

లైవ్ బ్లాగ్‌ కోసం 👆క్లిక్‌ చేయండి

2. PM Modi: విధ్వంసకర వినియోగం ఆపుదాం

తెలివితక్కువ, విధ్వంసకర వినియోగానికి వెంటనే ముగింపు పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. పర్యావరణ అనుకూల జీవనశైలిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, దీన్ని ప్రపంచ కార్యక్రమంగా మార్చాలని సూచించారు. సోమవారం ఆయన గ్లాస్గోలో ‘కాప్‌26’ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని అరికట్టేందుకు భారత్‌ తీసుకుంటున్న చర్యలను, ఈ విషయంలో దేశ వైఖరిని ఆయన విస్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Mumbai Drugs Case: ఫడణవీస్‌ భార్యతో డ్రగ్స్‌ వ్యాపారి ఫొటోలు

మహారాష్ట్ర రాజకీయాలను మాదక ద్రవ్యాల అంశం కుదిపేస్తోంది. మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, ఆయన భార్య అమృతా ఫడణవీస్‌కు డ్రగ్స్‌ మాఫియాతో సంబంధాలు ఉన్నాయంటూ నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) సీనియర్‌ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ సోమవారం ఆరోపించారు. ఈ మేరకు మాదకద్రవ్యాల వ్యాపారి జైదీప్‌ రానాతో ఫడణవీస్‌ దంపతులు దిగిన ఫొటోలను ట్వీట్‌ చేశారు. ‘‘భాజపాకు, డ్రగ్స్‌ దళారుల మధ్య సంబంధాలపై చర్చిద్దాం’’ అని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Anil Deshmukh: మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ అరెస్ట్‌

4. Team India: వేళ్లన్నీ ఐపీఎల్‌ వైపే!
బలమైన జట్టుతో బరిలో దిగి రెండోసారి టీ20 ప్రపంచకప్పును అందుకుంటుందనుకున్న టీమ్‌ఇండియా ఉసూరుమనిపించింది. పేలవ ఆటతీరుతో అభిమానులకు తీవ్ర ఆవేదన మిగిల్చింది. తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ చేతితో చావుదెబ్బ తిన్న జట్టు.. కివీస్‌తో మ్యాచ్‌లోనైనా పుంజుకుంటుందని అంతా ఆశించారు. కానీ ఓటమి నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోని కోహ్లీసేన మరోసారి అవే తప్పులు చేసి మూల్యం చెల్లించుకుంది. ఈ ప్రపంచకప్‌లో రాత్రిపూట మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్‌ కఠినంగా ఉంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
5. నిపా వైరస్‌ మరో మహమ్మారి అవుతుందా?
కరోనా మహమ్మారి మాదిరిగా మరేదైనా వైరస్‌ ప్రపంచ దేశాలన్నిటినీ చుట్టుముట్టే అవకాశం ఉందా? కేరళ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న నిపా వైరస్‌ భవిష్యత్తులో ప్రమాదకారిగా మారుతుందా? దాని నుంచి రక్షణ పొందటానికి మనం ఎలాంటి ఆయుధాలను సన్నద్ధం చేసుకోవాలి అనే అంశంపై బ్రిటన్‌లోని రీడింగ్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్త ఐయాన్‌ జోన్స్‌ తన అభిప్రాయాలను వెల్లడించారు. భవిష్యత్తులో రాబోయే వైరస్‌లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు టీకాలు సన్నద్ధం చేసుకోవడం మంచిదే అయినా అదంత సులభం కాదని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
6. వ్యాయామం అతి వద్దు!
రోగ్యానికి శారీరక శ్రమ అత్యవసరం. ఇదిప్పటి భావన కాదు. చాలాకాలం నుంచీ విశ్వసిస్తున్నదే. చిరు చెమట పట్టేంతవరకు శారీరక శ్రమ చేయాలని మన సనాతన ఆయుర్వేదమూ పేర్కొంటుంది. ప్రత్యేకించి వ్యాయామాలేవీ చేసేవారు కాదు. అప్పటి పనులు, వృత్తులు, జీవనశైలితోనే శరీరానికి తగిన శ్రమ లభించేది. ఇప్పుడలా కాదు. మన పనుల తీరు, జీవనశైలి గణనీయంగా మారిపోయాయి. ఎక్కువసేపు కూర్చొని చేసే పనులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* పుత్తడి కొనే వేళ...

7. రెండు నెలలు... రెట్టింపు వినోదాలు
ఏడాది ఆరంభంలో భారీ బాలీవుడ్‌ చిత్రాలు రాలేదు కానీ చిన్న బడ్జెట్‌ చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. కానీ ఒక్కటీ వావ్‌ అనిపించలేదు. ఇంతలోనే రెండో వేవ్‌ విజృంభించింది. దీంతో సినిమాలన్నీ ఓటీటీ బాట పట్టాయి. థియేటర్లు మొదలయ్యాకా అక్షయ్‌కుమార్‌ ‘బెల్‌ బాటమ్‌’ విడుదలైంది. ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టలేదు కానీ థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలకు కొత్త ఊపిరి పోసింది. మిగిలిన ఈ రెండు నెలల్లో పది చిత్రాలకు పైగా థియేటర్లలోనే విడుదల కానున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
8. చుట్టూ బాడీగార్డులు.. ప్రముఖులతో వాట్సప్‌ గ్రూపులు
నగర శివారుల్లోని మంచిరేవుల ఫాంహౌస్‌లో ఆదివారం రాత్రి పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో మాజీ ఎమ్మెల్యే సహా బడా స్థిరాస్తి వ్యాపారులు, ఇతర రంగాల్లోని ప్రముఖులు ఉండటంతో ఈ వ్యవహారం సంచలనమైంది. పట్టుబడిన 30 మందిని నార్సింగి పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వీరి బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించడంతోపాటు..ఈ నెల 15 వరకు రిమాండ్‌ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

స్టార్‌ నటుడితో నడిరోడ్డుపై కాంగ్రెస్‌ కార్యకర్తల ఫైట్‌

9. మీ మిఠాయి బంగారంగానూ!

ధన త్రయోదశి నేపథ్యంలో మహారాష్ట్రలోని అమరావతి నగరంలో ఓ మిఠాయి దుకాణం ‘సువర్ణ కలశ్‌’ పేరుతో మిఠాయిని అందుబాటులోకి తెచ్చింది. పూర్తిగా 24 క్యారెట్ల బంగారు పూతతో దీనిని తయారు చేయడం విశేషం. మొత్తం 12 కేజీల ‘సువర్ణ కలశ్‌’ మిఠాయి తయారు చేసినట్లు రఘువీర్‌ మిఠాయి దుకాణం నిర్వాహకుడు తేజస్‌ పోపత్‌ తెలిపారు. ఇందుకోసం రాజస్థాన్‌ నుంచి నిపుణుల్ని రప్పించినట్లు వివరించారు. సోమవారం నాటికి ఏడు కేజీల వరకు విక్రయాలు పూర్తయ్యాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
10. NEET Results: రాష్ట్ర విద్యార్థి ‘నంబర్‌ 1’
జాతీయ వైద్యవిద్య అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌)-2021 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అఖిల భారత ర్యాంకుల్లో తెలంగాణ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. జాతీయ ర్యాంకుల్లో ఒకటో ర్యాంకును ముగ్గురు సాధించారు. వారిలో రాష్ట్ర విద్యార్థి మృణాల్‌ కుటోరి అగ్రస్థానం సొంతం చేసుకున్నారు. వీరు ముగ్గురూ నూటికినూరు శాతం మార్కులు సాధించడం గమనార్హం. ఆర్మీ వైద్యుడిగా సేవలందించడం తన లక్ష్యమని, ఇష్టపడి చదివితే మంచి ర్యాంకును సొంతం చేసుకోవడం కష్టంకాదని మృణాల్‌ ‘ఈనాడు’తో తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కారులో నుంచే సినిమా వీక్షణ

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని