Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Nov 2021 09:00 IST

1. T20 World Cup: ఒక్క స్థానం.. మూడు జట్లు

న్యూజిలాండ్‌పై అఫ్గానిస్థాన్‌ గెలవాలి..! భారత్‌లో ఇప్పుడు కోట్లాది అభిమానుల ప్రార్థన ఇది. అఫ్గానిస్థాన్‌.. న్యూజిలాండ్‌ను ఓడిస్తే సెమీస్‌ చేరేందుకు భారత్‌కు మార్గం సుగమం అవుతుంది. అయితే అఫ్గాన్‌ విజయం భారత్‌కు మాత్రమే కాదు.. ఆ జట్టుకు ఎంతో అవసరం. ఎందుకంటే ఆ జట్టూ ఇప్పుడు రేసులో ఉంది. గ్రూప్‌- 2 నుంచి పాకిస్థాన్‌ ఇప్పటికే సెమీస్‌ చేరుకోగా.. మరో స్థానం కోసం భారత్‌తో పాటు న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్‌ పోటీపడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Virat Kohli: ఆదివారం  ఏం జరుగుతుందో చూడాలి : విరాట్‌ కోహ్లీ

2. సీటు వచ్చినా.. ఫీజు కట్టేదెలా..?

రాష్ట్రంలో బోధన ఫీజుల చెల్లింపులో ర్యాంకు పరిమితి ఆంక్షలు బీసీ, ఈబీసీ విద్యార్థుల నాణ్యమైన చదువులకు అడ్డంకిగా మారాయి. మెరుగైన ఇంజినీరింగ్‌ కళాశాలలు, కోరుకున్న సీట్లకు వారు దూరమవుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ర్యాంకులతో సంబంధం లేకుండా కళాశాలకు ఫీజుల నియంత్రణ కమిటీ అనుమతించిన పూర్తి ఫీజులు చెల్లిస్తున్నప్పటికీ.. ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి తీసుకువచ్చిన బీసీ, ఈబీసీ విద్యార్థులకు ర్యాంకుల పరిమితి నిబంధన ఇప్పటికీ కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Petrolium: కేంద్రం ఇచ్చిందే ఊరట

పెట్రోలు, డీజిల్‌ వినియోగదారులకు దేశంలో 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఊరటనిచ్చాయి. వీటిపై ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో.. తామూ సిద్ధమంటూ ముందుకొచ్చి లీటరుకు రూ.7 వరకు అమ్మకపు పన్ను కుదించుకున్నాయి. దీంతో అక్కడ పెట్రోలు, డీజిల్‌ ధరలు గణనీయంగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్‌ సహా కొన్ని రాష్ట్రాలు మాత్రం కేంద్రం ప్రకటించిన ఎక్సైజ్‌ సుంకం, దానిపై విధించే వ్యాట్‌ తగ్గింపునకే పరిమితం కావడంతో ఊరట కొంతమేర మాత్రమే లభించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Karthika masam: కార్తీక మాసంలో ఈ నాలుగూ ఎందుకు పాటించాలి?

‘నకార్తీకే సమో మాసం.. న కృతేన సమం యుగం.. నవేద సద్రసం శాస్త్రమ్‌.. నతీర్థ గంగాయ సమం..’ అంటే  యుగాలలో కృతయుగంతో సమానమైన యుగం, వేదాలకు సమానమైన శాస్త్రం, గంగకు సమానమైనటువంటి నది లేనట్టే.. మాసాల్లో కార్తీక మాసానికి సమానమైనదేదీ లేదని పెద్దల మాట. ఈ మాసం శివుడికి, మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. కార్తీక పురాణంలో కార్తీక సోమవార మహత్యం, కార్తీక పౌర్ణమినందు జ్వాలాతోరణం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఆడవారిపై ఆ కళ్లు

5. Mukesh Ambani: లండన్‌లో అంబానీ హరిత సౌధం

భారత్‌లోనే అత్యంత సంపన్నుడు ముకేశ్‌ అంబానీ తన కుటుంబం కోసం మరో విశాల సౌధాన్ని బ్రిటన్‌లో సిద్ధం చేస్తున్నారని మిడ్‌డే వార్తా సంస్థ పేర్కొంది. లండన్‌లో బకింగ్‌హాంషైర్‌ వద్ద ఉన్న 300 ఎకరాల్లోని ‘స్టోక్‌ పార్క్‌’ అంబానీకి రెండో సౌధం కానుందని  ఆ సంస్థ తెలిపింది. ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో నిర్మించిన ఆకాశహర్మ్యం ‘యాంటిలియా’లో ప్రస్తుతం అంబానీ కుటుంబం ఉంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రూ. 10కే ఏడాదంతా ఓపీ

 గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలందించే దిశగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు ఓపీ సేవలకే పరిమితమైన ఇందులో ఇన్‌పేషెంట్‌ సేవలు కూడా దీపావళి నుంచి అందుబాటులోకి వచ్చాయి. వంద పడకల ఆసుపత్రిలో సాధారణ (జనరల్‌ మెడిసిన్‌, ఆర్థోపెడిక్‌, పిడియాట్రిక్స్‌, ఆప్తమాలజీ, గైనకాలజీ, ఫ్యామిలీ మెడిసిన్‌, ఈఎన్‌టీ, జనరల్‌ సర్జరీ, డెర్మటాలజీ), పది పడకలతో కొవిడ్‌ ఐసోలేషన్‌ ఇన్‌పేషెంట్‌ సేవలు కొనసాగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. గంటకు 740 కి.మీ. వేగం

విమానయానంలో విప్లవం సృష్టించేందుకు అమెరికాలోని ఒట్టో ఏవియేషన్‌ సంస్థ సిద్ధమవుతోంది. ‘సెలెరా 500ఎల్‌’ పేరుతో తీసుకొచ్చిన సరికొత్త బుల్లెట్‌ విమానం ప్రస్తుతం సన్నాహక పరీక్షల దశలో ఉంది. కోడిగుడ్డు లేదా బుల్లెట్‌ రూపులో ఉన్న ఈ బుల్లి విమానం ఇతర లోహ విహంగాలకు భిన్నంగా ఎన్నో ప్రత్యేకతలతో వస్తోంది. విమానం ఉపరితలంపై గాలిని సాఫీగా వెళ్లేలా చేసి రాపిడిని తగ్గించేలా దీన్ని రూపొందించారు. తద్వారా తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం అధిక వేగంతో ప్రయాణించడమే దీని ప్రత్యేకత. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. స్కై విల్లాలు

త్యంత విలాసవంతమైన నివాసాలకు హైదరాబాద్‌ రియాల్టీ చిరునామాగా మారుతోంది. ఆకాశాన్ని తాకేలా నిర్మిస్తున్న హర్మ్యాలతో పాటే కొత్త పోకడలను నిర్మాణ రంగం పరిచయం చేస్తోంది. స్కైవిల్లాల నిర్మాణం ఇప్పుడు హైదరాబాద్‌ మార్కెట్లో సరికొత్త ట్రెండ్‌. నలభై, యాభై అంతస్తులపైన వీటిని చేపడుతున్నారు. అత్యంత విశాలంగా..అన్ని హంగులతో కడుతున్నట్లు బిల్డర్లు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. దగా చేసి వెళ్లిపోతావనుకోలేదు

ఆదివారం సాయంత్రం. ఎప్పట్లాగే రైల్వేస్టేషన్‌కి వెళ్లి నాకిష్టమైన బెంచీపై కూర్చున్నా. ‘హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ నాలుగో నెంబర్‌ ప్లాట్‌ఫాం నుంచి బయల్దేరడానికి సిద్ధంగా ఉంది’ అనౌన్స్‌మెంట్‌ వినపడింది. నా కళ్లల్లోంచి రెండు చుక్కలు బొటబొటా రాలాయి. రైలు కదులుతోంది. అచేతనంగా చేయి ఊపా. రైలు స్పీడందుకుంది. ఆ వేగాన్ని మించి నా మనసు జ్ఞాపకాల్లోకి పరుగెడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పేదల లాయర్‌ వాదిస్తాడు..మనసు గెలుస్తాడు!

10. సినీలాకాశంలో తారాజువ్వలు

రంగుహంగుల దీపావళికి ఎప్పట్లాగే చిత్రసీమలో ప్రచారం పటాకా పేలింది. కొత్త సినిమాల పోస్టర్లు తళతళలాడాయి. కొత్త పాటలు హోరెత్తాయి.కొత్త సినిమాల ప్రకటనలు తారాజువ్వలై ఎగశాయి. పండగ ముందే వచ్చేసింది అంటూ పవన్‌కల్యాణ్‌ ఈ సందడికి తెరలేపారు. అది మొదలు పండగ రోజంతా సెట్స్‌పై ఉన్న సినిమాలు కొత్త లుక్కుల్ని ముస్తాబు చేసి వదిలాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని