Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 08 Nov 2021 09:12 IST

1. ప్రజామోదంలో మోదీనే నంబర్‌ 1

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజామోదం ఉన్న దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరో స్థానానికి పరిమితమయ్యారు. అమెరికాకు చెందిన మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే సంస్థ ఆయా దేశాల్లో నిర్వహించిన తాజా సర్వేలో ప్రజలు ఈమేరకు తమ అభిప్రాయాన్ని తెలిపారు. వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఈ వివరాలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ సర్వే ప్రకారం మోదీ 70 శాతం ప్రజామోదంతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 75 శాతం  హాజరు  ఉంటేనే..అమ్మఒడి  లబ్ధి

అమ్మఒడి పథకం లబ్ధి పొందాలంటే విద్యార్థుల హాజరు కనీసం 75 శాతం ఉండాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 8 నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకు మొత్తం 130 పని దినాలకు 98 రోజుల పాటు బడికి హాజరు కావాల్సి ఉంటుంది. ఇందుకు విద్యార్థుల నుంచి బయోమెట్రిక్‌ విధానంలో హాజరు సేకరించేందుకు పాఠశాల విద్యా శాఖ సన్నద్ధం అవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అమల్లో ఉన్న యాప్‌ పనితీరు అంతంతమాత్రంగా ఉండటంతో క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Zero interest: 0 వడ్డీ చిక్కిపోయింది

3. KCR Press Meet: ఎ‘వరి’ది దగా..?

కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించేవరకు పోరాడతాం. పెట్రోలు, డీజిల్‌ సెస్‌లు విరమించుకోవాలి. మిమ్మల్ని పండుకోనివ్వం, నిలబడనివ్వం. వానాకాలం పంట తీసుకునేవరకు నిద్రపోనివ్వం. ఎవరి మెడలు వంచాలో ప్రజల ముందు పెడదాం. తెలంగాణ హక్కులు, దేశప్రయోజనాల కోసం కేంద్రంతో నిరంతరం పోరాడతాం. బండి సంజయ్‌ చాలా రోజులుగా అతిగా మాట్లాడుతున్నారు. నన్ను వ్యక్తిగతంగా నిందిస్తున్నారు. నా స్థాయి కాదు కాబట్టే నేను పట్టించుకోలేదు. ఇన్నిరోజులు ఓపిక పట్టాను..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Virat Kohli: టీ20 కెప్టెన్‌గా కోహ్లి చివరిసారి.. 

టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించిన టీమ్‌ఇండియా నామమాత్రమైన ఆఖరి మ్యాచ్‌లో సోమవారం నమీబియాతో తలపడనుంది. ప్రపంచకప్‌ అనంతరం టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించిన కోహ్లీకి.. పొట్టి క్రికెట్లో సారథిగా ఇదే చివరి మ్యాచ్‌. కోచ్‌గా రవిశాస్త్రికి కూడా ఇదే ఆఖరి మ్యాచ్‌. సెమీస్‌ దారులు మూసుకుపోవడంతో నిరాశచెందిన భారత జట్టు.. ఆదివారం ఐచ్ఛిక ప్రాక్టీస్‌ సెషన్‌ను రద్దు చేసుకుంది. జట్టు బాధ అర్థం చేసుకోదగ్గదే.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Team India: ఇక మారాలి.. కప్పు కొట్టేలా!

5. ..అలాంటి భర్తకు విడాకులు సబబే

భార్యపై ఎలాంటి భావోద్వేగ బంధం లేకుండా ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక మాత్రమే ఇష్టం పెంచుకున్న భర్త.. ఆమె పట్ల మానసికంగా క్రూరంగా వ్యవహరించినట్లేనని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి భర్తకు భార్య విడాకులు ఇవ్వడం సబబేనంటూ విడాకులు మంజూరు చేసింది. సాధారణంగా పెళ్లయిన మహిళల్లో ప్రతి ఒక్కరూ కుటుంబాన్ని నెలకొల్పుకోవాలని కోరుకుంటారనీ, తమ పరిశీలనకు వచ్చిన కేసులో మాత్రం భర్తకు ఆ బంధాన్ని నిలబెట్టుకోవడంపై ఆసక్తి లేకపోగా అర్థాంగి తెచ్చి ఇచ్చే జీతంపైనే దృష్టి ఉందని పేర్కొంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Gun Fire: జవాన్ల మధ్య గొడవతో కాల్పులు.. నలుగురి మృతి

దీపావళి సెలవుల విషయంలో తలెత్తిన వివాదం కారణంగా నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా పరిధి లింగంపల్లి బేస్‌క్యాంపులో సోమవారం తెల్లవారుజామున జవాన్ల మధ్య వివాదం తలెత్తి.. పరస్పరం కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో బిహార్‌కు చెందిన రాజమణి యాదవ్‌, డంజి, బెంగాల్‌కు చెందిన రాజుమండల్‌ అక్కడికక్కడే మృతి చెందగా..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* మా వాళ్లని జైల్లో పెట్టండి

7. నేటినుంచి పేటీఎం ఐపీఓ

పేటీఎం మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ రూ.18,300 కోట్ల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఇందులో రూ.8300 కోట్ల కోసం తాజాగా షేర్లు జారీ చేస్తున్నారు. ఈ నిధులు మాత్రమే కంపెనీకి వెళ్తాయి. ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద రూ.10,000 కోట్ల విలువైన షేర్లు విక్రయిస్తున్నారు. ఇవి వారికి చెందుతాయి. యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ ఇప్పటికే రూ.8235 కోట్లు సమీకరించింది. ఈనెల 8న ప్రారంభమై, 10న ముగియనున్న ఈ ఇష్యూకు ధరల శ్రేణిని రూ.2080-2150గా నిర్ణయించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. PRO Jobs:  పౌర సంబంధాల రంగంలో ఈ నైపుణ్యాలు ఉండాల్సిందే!

మీరు ఒక వస్తువు లేదా కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. దాని గురించి ప్రజలకు తెలిసేదెలా? మీ వస్తువు/కార్యక్రమం గురించి ప్రజలు ఏం అనుకుంటున్నారో తెలుసుకునేదెలా? వీటికోసం ప్రతి సంస్థకూ పౌర సంబంధాల(పీఆర్‌) అధికారులు ఉంటారు. సంస్థ/ప్రభుత్వం ప్రజోపయోగ సమాచారం ప్రజలకు చేరేలా ప్రచారం చేయడంతోపాటు.. దానిపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించి యాజమాన్యానికి చేరవేయడంలో పీఆర్‌ అధికారులదే ముఖ్యభూమిక.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఇవి సూపర్‌ ఫుడ్స్‌...

9. Ravi Shastri: మళ్లీ కోచ్‌గా రవిశాస్త్రి!

టీమ్‌ఇండియా కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం సోమవారం ముగిసిపోనుంది. ఆ తర్వాత కూడా అతడు కోచ్‌గా ఉండే అవకాశం ఉంది. ఐపీఎల్‌ కొత్త ఫ్రాంఛైజీ అహ్మదాబాద్‌ యాజమాన్యం రవిని సంప్రదించినట్లు సమాచారం. అతడితో పాటు.. టీమ్‌ఇండియా బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌లు భరత్‌ అరుణ్‌, ఆర్‌.శ్రీధర్‌లను ఎంపిక చేసుకునేందుకు ఆ ఫ్రాంఛైజీ సిద్ధమవుతుందట. దాదాపుగా ఏడేళ్లు టీమ్‌ఇండియాతో కలిసి పనిచేసిన శాస్త్రి..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కారు కొట్టేశారు.. మ్యాప్‌లో దొరికేశారు

చోరీకి గురైన కారును సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పట్టుకుని నిందితులను పోలీసులకు అప్పగించారు టెకీలు. ఈ ఘటన సైబరాబాద్‌ పరిధిలో తాజాగా చోటు చేసుకుంది. బాధితుడు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. నాలుగు రోజుల కిందట రూ.30 లక్షల విలువైన కొత్త కారును కొనుగోలు చేశారు. శుక్రవారం రాత్రి గచ్చిబౌలి ఠాణా పరిధిలోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

డిజిటల్‌ ఇంటి నంబర్లు వచ్చేస్తున్నాయ్‌!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని