Published : 03 Dec 2021 08:57 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. భయపెడుతున్న ‘జవాద్‌’ గండం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ఉత్తరాంధ్ర దిశగా కదులుతోంది. శుక్రవారం నాటికి తీవ్ర వాయుగుండంగా.. అనంతరం తుపానుగా బలపడనుంది. ‘వాయుగుండం విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 960 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1,020 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. శుక్రవారం (3వ తేదీ) నాటికి తుపాను (జవాద్‌గా పిలుస్తున్నారు)గా మారి.. వాయవ్య దిశగా ప్రయాణిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వరకు ప్రయాణించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: ఏపీ విపత్తుల నిర్వహణ కమిషనర్‌

2. కరెంటు భారం భారీగానే..!

కరెంటు ఛార్జీల పెంపు ఈ సారి భారీగానే ఉండనుంది. అయిదేళ్లుగా ఒక్కపైసా కూడా ఛార్జీ పెంచనందున నష్టాలు, ఆర్థికలోటు పెరిగిపోయాయని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రభుత్వానికి నివేదించాయి. ఒక్కో యూనిట్‌కు సగటున రూపాయి చొప్పున ఛార్జీలు పెంచితే తప్ప ఆర్థిక కష్టాలు తీరవని డిస్కంలు భావిస్తున్నాయి. యూనిట్‌కు 5 లేదా 10 పైసలు పెంచితే కష్టాలు తీరవని, సుదీర్ఘ కాలం తరవాత పెంచుతున్నందున ఆర్థికంగా చేయూతనిచ్చేలా పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈ సంస్థలు యోచిస్తున్నాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Tiktok: టిక్‌టాక్‌లో చిట్కాలతో నెలకు రూ.కోటి

మైక్రోసాఫ్ట్‌ ఎక్సెల్‌, గూగుల్‌ షీట్స్‌ గురించి చిట్కాలు, మెలకువలు చెబుతూ అమెరికా యువతి ఒకరు భారీగా ఆర్జిస్తున్నారు. ఈ మేరకు న్యూయార్క్‌కు చెందిన కేట్‌ నోర్టన్‌ అనే 27 ఏళ్ల యువతి టిక్‌ టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆన్‌లైన్‌ క్లాస్‌లు బోధిస్తూ నెలకు రూ.కోటికిపైనే సంపాదిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆమెకు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాస్త బోరింగ్‌గా అనిపించే ఎక్సెల్‌, గూగుల్‌ స్ప్రెడ్‌ షీట్స్‌పై పాఠాలు చెప్పేందుకు కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగాన్ని సైతం కేట్‌ వదులుకున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఒమిక్రాన్‌కు తగ్గట్టుగా టీకాలో మార్పులు

ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ కొత్త రకమైన ఒమిక్రాన్‌ను సమర్థంగా ఎదుర్కొనేలా తమ టీకాలో మార్పులు (అప్‌గ్రేడ్‌) చేయడంపై కృషిచేస్తున్నట్లు అమెరికా బహుళజాతి ఔషధ సంస్థ ఫైజర్‌ ప్రకటించింది. ఈ కొత్త రకం టీకా వంద రోజుల్లో అందుబాటులోకి రావొచ్చని వెల్లడించింది. ఈ మేరకు ఫైజర్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్‌ ఆల్బెర్ట్‌ బౌర్లా బీబీసీ వార్తా సంస్థతో మాట్లాడారు. కొవిడ్‌-19ను సమర్థంగా ఎదుర్కొనేందుకు రానున్న సంవత్సరాల్లో ఏటా టీకాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అచ్చొచ్చిన వాంఖడే పిచ్‌పై విరాట్‌ ఇప్పుడెలా ఆడతాడో..!

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ మళ్లీ జట్టుతో కలిశాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్న అతడు నేటి నుంచి ముంబయిలో న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్టులో బరిలోకి దిగనున్నాడు. ఈ క్రమంలోనే తనకు అచ్చొచ్చిన వాంఖడే స్టేడియంలో మరోసారి చెలరేగాలని భావిస్తున్నాడు. కోహ్లీ ఈ మైదానంలో 2016లో చివరిసారి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. అప్పుడు ఇంగ్లాండ్‌తో తలపడిన సందర్భంగా 235 పరుగులు సాధించి పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

IND vs NZ: టీమ్‌ఇండియాకు సిరీస్‌ చిక్కేనా!

6. పట్టుపట్టారు... నాజూకయ్యారు!

యుక్తవయసులో సన్నజాజి తీగల్లా మెరిసిపోతూ... అందంతో, నటనతో లక్షల మంది అభిమానాన్ని కొల్లగొట్టేశారు వీరిద్దరూ. వయసు పైబడింది... రకరకాల కారణాలతో బరువూ పెరిగి పోయారు. ఇంతలో బరువు తగ్గామంటూ నెట్‌లో ఫొటోలు పెట్టి... అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రశంసలతో పాటు... ఆపరేషన్లు చేయించుకున్నారని కామెంట్లు పోటెత్తుతోంటే వాటిని కొట్టిపారేస్తూ... తమ రహస్యాలను బయటపెట్టారు. స్థూలకాయులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న స్మృతి ఇరానీ, ఖుష్బూ సుందర్‌ ఏం చెబుతున్నారో చూడండి... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఐఐటీ విద్యార్థులపై రూ.కోట్ల జల్లు

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) విద్యార్థులపై కనక వర్షం కురిసింది. గురువారం ప్రాంగణ నియామకాల తొలిరోజే భారీస్థాయిలో వేతనాలు చెల్లించి విద్యార్థులను సొంతం చేసుకునేందుకు పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలు పోటీ పడ్డాయి. కొవిడ్‌కు ముందు ప్యాకేజీల కంటే ఇవి ఎక్కువగా ఉండటం గమనార్హం. రూ.కోటికి పైగా వేతనాలుండే దాదాపు 60 కొలువులు దిల్లీ ఐఐటీ విద్యార్థుల పరమవ్వడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. జిల్‌ జిల్‌ జిగా.. జిగా

కథానాయిక అంటేనే గ్లామర్‌. గ్లామర్‌ అంటేనే కథానాయిక. ఇద్దరు ముగ్గురు కథానాయికల గ్లామర్‌ని కోరుకునే కథలు కూడా కొన్ని ఉంటాయి. అలాంటప్పుడే... చిన్నదో వైపు, పెద్దదో వైపు అంటూ ఆడిపాడుతుంటాడు హీరో. అయితే కథానాయికలు ఎంతమంది ఉన్నా... మధ్యలో జిగేల్‌ రాణి వచ్చి వెళితే కానీ ఆ కథకి ఊపు రాదు, కథానాయకుడికీ ఉత్సాహం రాదు. అంతకంటే కూడా చూసే మాస్‌ ప్రేక్షకుడికీ సినిమా ఆస్వాదన పరిపూర్ణం కాదు. అందుకే దర్శకులు కథ మధ్యలో ఓ ప్రత్యేక గీతానికి చోటిచ్చి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 3 రాజధానుల బిల్లు మళ్లీ మార్చిలో

మూడు రాజధానుల బిల్లును రానున్న మార్చిలో ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెట్టనుందని రాష్ట్ర విద్యుత్తు, అటవీశాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఆయన కుటుంబసమేతంగా కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మల్లన్న దర్శనార్థం వచ్చారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ జగన్‌మోహన్‌ రెడ్డి మరో 20 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలని స్వామిని ప్రార్థించానని పేర్కొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు రాజకీయాల నుంచి విరమించుకోవాలని, ఆయన పార్టీ నిలవాలంటే ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు రావాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆరేళ్లలో.. రూ.8 లక్షలు రావాలంటే

ఆరేళ్లలో.. రూ.8 లక్షలు రావాలంటే  ముందుగా మీ అమ్మాయి భవిష్యత్తు అవసరాలను తగిన ఆర్థిక రక్షణ కల్పించండి. దీనికోసం మీ పేరుపై తగిన మొత్తానికి జీవిత బీమా పాలసీని తీసుకోండి. దీని కోసం టర్మ్‌ పాలసీని పరిశీలించండి. ఆ తర్వాతే పెట్టుబడి గురించి ఆలోచించండి. మీరు మదుపు చేయాలనుకుంటున్న రూ.25వేలను బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌, హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కొత్త సంవత్సరంలో వాతలే

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని