Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 14 Jan 2022 09:08 IST

1. Corona virus: గాలిలో కరోనా 20 నిమిషాలుంటే..

 అధిక ఉష్ణోగ్రతల్లో, పొడి వాతావరణంలో వైరస్‌లు ఎక్కువసేపు మనుగడ సాగించలేవని తాజా అధ్యయనంలో నిపుణులు మరోసారి తేల్చారు! ప్రస్తుతం ప్రజారోగ్యానికి పెను సవాలుగా మారిన కరోనా వైరస్‌ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదని స్పష్టం చేశారు. తక్కువ ఉష్ణోగ్రతలు, తేమతో కూడిన వాతావరణం మాత్రం వైరస్‌లకు అనుకూలంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌ విశ్వవిద్యాలయంలో ఏరోసోల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కరోనా ఉరకలకు మాస్కుతో బ్రేకులు..

2. బండికి బీమా ఇలా!

మన జీవితాల్లో ద్విచక్ర వాహనాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఉపయోగించడం సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా.. ధర, నిర్వహణ.. రెండూ తక్కువగా ఉండటమూ ఇందుకు కారణం. ఇంతటి ప్రాధాన్యమున్న బండికి బీమా చేయించేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి. ఫీచర్లు, తయారీ, మోడల్‌ను బట్టి బైక్‌ ధర మారుతుంటుంది. ద్విచక్ర వాహన ధరపైనే బీమా కవరేజీ ఉంటుంది. కాబట్టి బీమా ప్రీమియం నేరుగా వాహన ధరకే అనుసంధానంగా ఉంటుంది. రూ.లక్ష బైక్‌తో పోలిస్తే రూ.75,000 బైక్‌కు ప్రీమియం తక్కువగానే ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఉచిత వై-ఫైతో ముప్పు!

అంతర్జాల అవసరాలు పెరిగిన ఈ రోజుల్లో.. కొన్ని బహిరంగ ప్రదేశాల్లో ఉచిత వై-ఫై సదుపాయం అందుబాటులో ఉంటోంది. మెట్రో రైల్వే నుంచి విమానాశ్రయం వరకు వివిధ ప్రదేశాల్లో వందలాది మంది దీన్ని వినియోగిస్తుంటారు. అవసరం మాటెలా ఉన్నా.. ఇలా వాడేవారు ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్నట్లే.. ఎందుకంటే వై-ఫై నెట్‌వర్క్‌లోకి సైబర్‌ నేరస్థులు చొరబడుతున్నారు. నెట్‌వర్క్‌లో ఉన్న వారందరి డేటాను తస్కరిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నేను చేసింది తప్పా?? ఒప్పా??

నేను చదువుకొనే రోజుల్లో మా దగ్గరి బంధువు ఒకర్ని నాలుగేళ్లు ప్రేమించాను. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. కానీ మా ఇంట్లో ఈ విషయం చెప్పినప్పుడు ఒప్పుకోలేదు. అతని కుటుంబానికి సంబంధించిన వ్యక్తులెవరూ మా అమ్మానాన్నకి ఇష్టం లేకపోవడంతో ఆ సంబంధం వద్దని గొడవ పెట్టారు. అతడు కూడా మా ఇంట్లో వాళ్లతో మాట్లాడే ప్రయత్నమేమీ చేయలేదు. మా నాన్న అతనితో ఫోన్‌లో మాట్లాడిన మాటలకి కోపం వచ్చి వదిలి వెళ్లిపోయాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తాడేపల్లిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దువ్వాడ నుంచి నారాయణపురానికి చేపల లోడుతో వస్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే నలుగురు కూలీలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్‌ నిత్ర మత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పంచె కడితే.. నాన్నే గుర్తొస్తారు

‘వాసివాడి తస్సాదియ్యా’ అంటూ మరోసారి సందడి చేయనున్నారు నాగార్జున. బంగార్రాజు పాత్రే అందుకు కారణం. ఈసారి ఆయనకి నాగచైతన్య తోడయ్యారు. ఆ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం ‘బంగార్రాజు’. ‘సోగ్గాడే చిన్నినాయనా’కు కొనసాగింపుగా రూపొందిన సినిమా ఇది. సంక్రాంతి సందర్భంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు నాగార్జున. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆన్‌లైన్‌లోకి కోళ్లు.. పందేలు!

పశ్చిమగోదావరి కోడిపందేలు ఆన్‌లైన్‌కెక్కాయి. కొన్ని నెలలుగా కోళ్లను పెంచేవారు వాట్సప్‌ గ్రూపులను ఏర్పాటుచేసి ఖరీదైన కోళ్ల జాతులు, వాటి వివరాలు, డింకీ పందేలలో కోళ్లు కొట్టుకునే వీడియోలతో పెద్దఎత్తున వ్యాపారాలు చేశారు. ఖరీదైన కోళ్లను ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. భీమవరం, పాలకొల్లు, పోడూరు, తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాలకు చెందిన కొందరు వీటిని ఇలా వాట్సప్‌ గ్రూపుల ద్వారా అమ్ముతున్నారు. కోడి రంగు, రకాన్ని బట్టి రూ.50 వేల నుంచి లక్ష వరకు అమ్ముడవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

డీమ్యాట్‌ ఖాతా నామినీ పేరు రాశారా?

8. సోదరి ఆడపడుచుతో యువతిప్రేమాయణం..ఆ తర్వాత ఏమైందంటే..

ద్దరు యువతుల మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. ఈ సంఘటన రాజస్థాన్‌ చురు జిల్లాలోని రతన్‌గఢ్‌లో జరిగింది. హరియాణాలోని జింద్‌ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతి రతన్‌గఢ్‌లోని తన సోదరి అత్తారింటికి ఏడాది క్రితం వచ్చింది. ఈ క్రమంలో తన సోదరి ఆడపడుచు(18)తో ఆమెకు స్నేహం ఏర్పడింది. అది ఇరువురి మధ్య ప్రేమగా మారింది. ఇంట్లో వాళ్లు ఇద్దరూ కలుసుకోకుండా చేశారు. గతేడాది నవంబరులో రతన్‌గఢ్‌కు చెందిన యువతి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. special trains: ప్రత్యేక రైళ్లు పొడిగింపు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా నడిచే పలు ప్రత్యేక రైళ్లను ఫిబ్రవరి వరకు పొడిగించినట్లు మండల రైల్వే అధికారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం- సికింద్రాబాద్‌-విశాఖపట్నం(08579-08580) రైలును ఫిబ్రవరి 2 నుంచి 24వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా విశాఖపట్నం-సికింద్రాబాద్‌-విశాఖపట్నం (08585-08586) రైలును ఫిబ్రవరి 1 నుంచి 23వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మరోసారి డీఆర్‌ఎస్‌ దుమారం.. విరాట్‌ కోహ్లీ ఆగ్రహం

క్రికెట్లో నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్‌)పై మరోసారి దుమారం రేగింది. దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు మూడో రోజు ఆటలో అశ్విన్‌ బౌలింగ్‌లో ఎల్గర్‌ సమీక్షలో నాటౌట్‌గా తేలడమే అందుకు కారణం. సఫారీ రెండో ఇన్నింగ్స్‌ 21వ ఓవర్లో ఎల్గర్‌ ఎల్బీ కోసం జట్టు అప్పీల్‌ చేసింది. మైదానంలో ఉన్న అంపైర్‌ ఎరాస్మస్‌ ఔటిచ్చాడు. కానీ సమీక్ష కోరిన ఎల్గర్‌ కూడా రిప్లేలో మొదట బంతి గమనాన్ని చూసి పెవిలియన్‌ బాట పట్టాడు. కానీ చివరకు బంతి వికెట్ల మీద నుంచి వెళ్తున్నట్లు తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని