Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 15 Jan 2022 09:02 IST

1. IND vs SA : కల చెదిరె..

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో అద్భుత విజయాలు ఉత్సాహాన్నిస్తుండగా.. జట్టుగా సఫారీలు బలహీనపడడం అనుకూలంగా మారగా..దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్‌ విజయానికి టీమ్‌ఇండియాకు ఇంతకుమించిన అవకాశం ఉండదని భావించారంతా! కానీ కల చెదిరింది. పేలవ బ్యాటింగ్‌ కారణంగా ఓ గొప్ప అవకాశం భారత్‌ చేజారింది. తొలి టెస్టులో గెలిచి ఊరించి, రెండో మ్యాచ్‌లో ఓడిన కోహ్లీసేన.. చివరి టెస్టులోనూ భంగపడింది. మూడో రోజు ఆఖరికే విజయానికి బాటలు వేసుకున్న దక్షిణాఫ్రికా.. నాలుగో రోజు ఎలాంటి పొరపాటూ చేయలేదు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* IND vs SA : బ్యాటింగే..!

2. ఆ రెండు కొని అమ్మకి ఇచ్చేవాణ్ని

‘కళ్లు.. కళ్లూ ప్లస్సు...వాళ్లు వీళ్లు మైనస్‌’ అంటూ సినిమా పాటలకు లెక్కల సూత్రాలు బోధించిన మాస్టారాయన. విలన్‌ పరిగెత్తే వేగానికి ... వాడు కింద పడాలంటే ఎన్ని డిగ్రీల కోణంలో వస్తువు విసరాలో చెప్పి... ఫైట్లలో భౌతికశాస్త్రాన్ని చొప్పించిన గురువాయన. సన్నివేశాల్లో రసాయన శాస్త్రాన్ని... మాస్‌ డైలాగుల్లో తత్వ శాస్త్రాన్ని చెప్పగల లెక్చరరాయన. ‘పుష్ప’తో తెలుగు కథను పాన్‌ఇండియా స్థాయిలో చెప్పి మెప్పించారాయన. ఆ విజయానందంలో ఈసారి సంక్రాంతి జరుపుకోనున్న ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ను ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా పలుకరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఊపిరితిత్తులపై ఒమిక్రాన్‌ ప్రభావం తక్కువే!

ఒమిక్రాన్‌ రకం ఊపిరితిత్తులపై చాలా తక్కువ ప్రభావం చూపుతోందని, లక్షణాలు ఎగువ శ్వాసకోశ వ్యవస్థకే పరిమితం అవుతున్నాయని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) వైద్యులు స్పష్టం చేశారు. చాలామందిలో స్వల్ప లక్షణాలే ఉంటున్నాయని పేర్కొన్నారు. 95 శాతం మంది 3-4 రోజులకే కోలుకుంటున్నారని, వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌లో భారీ స్థాయిలో జరిగిన ఉత్పరివర్తనాల వల్ల వ్యాప్తి అధికంగా ఉంటోందన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కొత్త వస్త్రాలతో పోరులోకి..

ధునికత వైపు క్రమంగా అడుగులు వేస్తున్న భారత సైన్యం.. యూనిఫాం విషయంలోనూ కొత్త సొబగులు అద్దుకుంటోంది. వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా 13 లక్షల మంది సైనికుల పోరాట దుస్తుల్లో మార్పు జరిగింది. జవాన్లకు మరింత సౌకర్యం కలిగించేలా, యుద్ధ క్షేత్రంలో శత్రువులను మెరుగ్గా ఏమార్చేలా వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వీటిని తొలిసారి ప్రదర్శించనున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* రన్‌వేపై పక్కపక్కనే!

5. స్వచ్ఛందమంటూనే వసూళ్లకు యత్నం!

టిడ్కో(పురపాలక సంఘాల్లో పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) ఇళ్లకు బ్యాంకులు ఇవ్వాల్సిన రుణాన్ని స్వచ్ఛందం పేరుతో లబ్ధిదారుల నుంచే వసూళ్లు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో టిడ్కో గృహాలను నిర్మిస్తోంది. ఇందులో 300 చ.అ. విస్తీర్ణం గల ఇళ్లను పేదలకు ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 365 చ.అ. ఇంటికి రూ.3.15 లక్షలు, 430 చ.అ. ఇంటికి రూ.3.65 లక్షల రుణాన్ని లబ్ధిదారు పేరు మీద బ్యాంకులు మంజూరు చేయాలి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పండగకు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైలు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ద.మ.రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ మేరకు.. కాకినాడ టౌన్‌ నుంచి సికింద్రాబాద్‌కు ఈ నెల 16, 18 తేదీల్లో రాత్రి 9 గంటలకు రైళ్లు ప్రారంభమవుతాయి. నర్సాపూర్‌-వికారాబాద్‌ రైలు 16, 18 తేదీల్లో రాత్రి 8.50కి ప్రారంభమవుతుంది. మచిలీపట్నం-సికింద్రాబాద్‌ రైలు 17, 19 తేదీల్లో రాత్రి 9.05కి మొదలవుతుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బ్రిటన్‌ ప్రధానికి పదవీ గండం!

బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ రాజకీయ భవిష్యత్తుపై ఒక్కసారిగా కారుమబ్బులు కమ్ముకున్నాయి. కొవిడ్‌ మహమ్మారి కోరలు చాసి వేల మంది ప్రజలను కబళిస్తున్న వేళ అధికారిక నివాసంలో సిబ్బందితో కలిసి విందులు జరుపుకున్నారనే విమర్శలు ఆయన పదవికే ఎసరు తెచ్చేలా ఉన్నాయి. విపక్షంతో పాటు స్వపక్షం నుంచీ రాజీనామా చేయాలన్న డిమాండ్లు అధికమవుతుండగానే మరో వివాదం ఆయనకు చుట్టుకుంది. దేశాధినేత రాణి ఎలిజబెత్‌ భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ మరణంతో దేశమంతా శోకసంద్రంలో ఉన్న సమయంలోనూ..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Bill Gates:బిల్‌గేట్స్‌కు ‘శృంగ’భంగం?

8. బతుకునిచ్చి.. కనుమరుగయ్యావు

నాపై నాకే నమ్మకం లేనప్పుడు.. నువ్వు ఎప్పటికైనా గొప్ప స్థానంలో ఉంటావు అంది. తన మాటలు నిజమయ్యాయి.. కానీ ఆమె నా కళ్ల ముందు లేదు. కార్పొరేట్‌ ఆసుపత్రిలో నర్స్‌ తను. అక్కడే క్యాంటీన్‌లో పనివాణ్ని నేను. ఆమె కళ్లు.. కళగా ఉండే ముఖం.. మాట తీరు.. నన్నాకర్షించేవి. పని కల్పించుకుని మరీ తన చుట్టూ తిరిగేవాణ్ని. ఓ నెలయ్యాక పసిగట్టింది. అప్పట్నుంచి ఎదురుపడితే ఓ చిరునవ్వు విసిరేది. కళ్లతోనే పలకరించేది. నా మనసు ఉప్పొంగేది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Kodi Pandalu: కత్తులు ఎగిరాయి.. కట్టలు తెగాయి..

తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో శుక్రవారం భోగి రోజు పెద్దఎత్తున కోడి పందేలు ప్రారంభమయ్యాయి. వీటిలో పాల్గొనడానికి ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ప్రముఖులు తరలివచ్చారు.  తొలి రోజు రెండు జిల్లాలో దాదాపు 420కు పైగా బరుల్లో పందేలు జరిగాయి. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే తొలిరోజు 12 వేలకుపైగా కోడిపుంజులు మృత్యువాతపడగా.. పందేల్లో రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు చేతులు మారి ఉంటాయని సమాచారం. ఇది కాకుండా 300 వరకు గుండాట బోర్డులు ఏర్పాటు చేశారు. అక్కడ సుమారు మరో రూ.50 కోట్ల వరకు పందేలు కాసినట్లు అంచనా.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కొవిడ్‌ వచ్చిందా..కొత్తపాలసీ ఆలస్యమే

కరోనా సోకిన వారు, కొత్త బీమా పాలసీలు తీసుకోవడం కష్టంగా మారుతోంది. కొవిడ్‌ నుంచి కోలుకుని, నెగిటివ్‌గా తేలిన తర్వాత కనీసం మూడు నెలల తర్వాతే వారు కొత్తగా తీసుకోవాలనుకుంటున్న పాలసీల దరఖాస్తులను బీమా సంస్థలు ఆమోదిస్తున్నాయి. ఇప్పటివరకు ‘కొన్ని నిర్ణీత వ్యాధుల నుంచి కోలుకున్న వారికి (గుండెజబ్బులు, మూత్రపిండ వ్యాధులు, లివర్‌ సిరోసిస్‌ లాంటివి)’ కొత్త పాలసీలు ఇవ్వాలంటే ‘వేచి ఉండే వ్యవధి’ ఆరోగ్య బీమా పాలసీలకు మాత్రమే అమలవుతోంది. ఇప్పుడు ఈ జాబితాలోకి కొవిడ్‌-19 సైతం చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కొలువుండే చోటులో హైదరాబాద్‌ టాప్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని