
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
1. Under 19 world cup: అండర్-19లో సత్తా చాటిన యువభారత్
అండర్ - 19 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో యువభారత్ సత్తా చాటింది. దక్షిణాఫ్రికాపై 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 46.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ నిర్దేశించిన 233 పరుగుల లక్ష్యాన్ని సఫారీ జట్టు ఛేదించలేకపోయింది. 45.4 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 187 పరుగులు మాత్రమే చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. Fire Accident: సికింద్రాబాద్ క్లబ్లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
నగరంలోని సికింద్రాబాద్ క్లబ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో క్లబ్లో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడటంతో క్లబ్ పూర్తిగా దగ్ధమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న 10 అగ్నిమాపక యంత్రాలు దాదాపు 3 గంటలుగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.20 కోట్ల మేర ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. PAN Card: పాన్ కార్డు ఏయే సందర్భాల్లో అవసరం!
పన్ను చెల్లింపుదారులకు లేదా ఆదాయపు పన్ను మదింపుదారులకు ప్రత్యేకమైన గుర్తింపు కార్డుగా పది అంకెల సంఖ్యను ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. భారతదేశంలో పన్ను చెల్లించాల్సిన వారందరూ పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మైనర్, విదేశీయులకు పాన్ కార్డు అవసరమే. పన్ను చెల్లింపుదారుల వివరాలు, టీడీఎస్, టీసీఎస్ క్రెడిట్స్, ఆదాయం, లావాదేవీలు వంటివి పాన్ ద్వారా ఆదాయ పన్ను శాఖ ట్రాక్ చేస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. Subhas Chandra Bose: నేతాజీ కోసం 23 నుంచే ‘రిపబ్లిక్ డే ఉత్సవాలు’
స్వాతంత్య్ర ఉద్యమకారుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని జనవరి 23 నుంచే గణతంత్ర వేడుకలను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఏటా ఈ ఉత్సవాలు జనవరి 24న మొదలవుతాయి. అయితే ప్రముఖ వ్యక్తులకు ప్రాధాన్యం దక్కే విధంగా కేంద్రం ఈ విధంగా మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నేతాజీ జయంతిని పురస్కరించుకొని ఒకరోజు ముందు నుంచే ఈ వేడుకలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. Mental Health: మన శక్తిని హరిస్తున్న ఆశ్చర్యకర విషయాలేవో తెలుసా?
ఆఫీసులో త్వరగా పని పూర్తి చేసి బాస్‌తో శెభాష్ అనిపించుకోవాలని ప్రతి ఉద్యోగి రోజును ప్రారంభిస్తారు. కానీ, ఆఫీసుకెళ్లి పని మొదలుపెట్టగానే ఉన్నట్టుండి నిస్సత్తువ ఆవహించి చేసే పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. శారీరకంగా దృఢంగా ఉన్నా మానసికంగా కుంగిపోతున్నారు. అసలు వేటివల్ల అంత త్వరగా శక్తిని కోల్పోతున్నారు? తీవ్ర ఒత్తిడికి గురై మానసిక ప్రశాంతత కోల్పోవడానికి గల కారణాలేంటి? తిరిగి శక్తిని ఎలా సంపాదించుకోవాలనే విషయాల గురించి తెలుసుకుందామా.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. Ap News: జొన్నలగడ్డలో తెదేపా ధర్నా ఉద్రిక్తం .. చదలవాడకు అస్వస్థత
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో నరసరావుపేట తెదేపా ఇన్‌ఛార్జి చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. గురువారం రాత్రి జొన్నలగడ్డలో వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు మాయం చేశారు. దీంతో శుక్రవారం నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆధ్వర్యంలో వైకాపా శ్రేణులు గ్రామంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. విగ్రహాన్ని మాయం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే పోలీసులను ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. Laptop: ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా?..ఈ జాగ్రత్తలు పాటించండి
ఉన్నచోటు నుంచే పని చేసుకునేందుకు ల్యాప్‌టాప్‌లు ఎంతో సౌకర్యంగా ఉంటాయి. లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ క్లాసుల నుంచి ఆఫీస్ వర్క్ వరకు ఎన్నో రకాలుగా వీటిని ఉపయోగించారు. అయితే కొన్నిసార్లు మనం ఉపయోగించే ల్యాపీలు ఒక్కసారిగా వేడెక్కుతుంటాయి. కారణం తెలుసుకునేలోపే అందులోంచి పొగలు రావడం, లోపలి కాంపొనెంట్లు కాలిపోవడం వంటివి జరుగుతాయి. ఇంతకీ ల్యాప్‌టాప్ వేడెక్కడానికి అసలు కారణం ఏంటి? వేడెక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి? పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. Pakistan: రండిబాబూరండి.. మా దేశంలో స్థిరపడండి!
పాకిస్థాన్‌ను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. విదేశాల వచ్చే నిధులు నిలిచిపోవడం.. దేశీయ వాణిజ్యం క్షీణించడం, పన్నులు సరిగా వసూలు కాకపోవడంతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. బ్యాంకుల నుంచి రుణాలు కూడా దొరక్కపోవడంతో ఇప్పుడు పాక్.. దిక్కుతోచని స్థితిలో ఉంది. అయితే, ఈ సమస్య నుంచి గట్టేందుకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. తమ దేశంలో భారీమొత్తంలో పెట్టుబడి పెట్టే విదేశీయులకు శాశ్వత నివాసం కల్పిస్తామని ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. Virat Kohli : టెస్టు క్రికెట్ నాయకత్వానికి విరాట్ కోహ్లీ గుడ్‌బై
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన ప్రకటన చేశాడు. టెస్టు ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశాడు. దీంతో అన్ని ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగినట్లు అయింది. ఇప్పటికే టీ20 కెప్టెన్సీ వదిలేసిన కోహ్లీని వన్డే నాయకత్వం నుంచి బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే. విరాట్ స్థానంలో రోహిత్‌శర్మను కెప్టెన్‌గా నియమించింది. కెప్టెన్సీకి వీడ్కోలు చెబుతూ విరాట్ కోహ్లీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. China: విద్యార్థులకు బహుమతిగా పందులు.. వాణిజ్యాభివృద్ధికేనట!
సాధారణంగా పాఠశాలల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిస్తే మెడల్స్, పుస్తకాలు, చదువుకు ఉపయోగపడే ఇతర వస్తువుల్ని బహుమతిగా ఇస్తుంటారు. కానీ, చైనాలోని ఓ పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు పందుల్ని బహుమతిగా ఇస్తోంది. దీని వెనుక గ్రామీణ వాణిజ్యంలో వృద్ధి సాధించాలనే దీర్ఘకాలిక లక్ష్యముందని పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.