Published : 17 Jan 2022 09:02 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Night Curfew: రాత్రి కర్ఫ్యూ!

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణకు మరోసారి కఠిన చర్యలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రాత్రి తొమ్మిది గంటల తర్వాత నుంచి కర్ఫ్యూ విధించేందుకు యోచిస్తోంది. విద్యాసంస్థల్లో సెలవులను పొడిగించిన ప్రభుత్వం థియేటర్లు, మాల్స్‌ ఇతర జనసమ్మర్ద ప్రాంతాల్లో ఆంక్షలను అమలు చేయాలని భావిస్తోంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే మంత్రిమండలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కోడిగుడ్డు ఆకారంలో గ్రహం!

ఇప్పటివరకు శాస్త్రవేత్తలు గుర్తించిన గ్రహాలన్నీ దాదాపు గోళాకారంలోనే ఉన్నాయి. కానీ తొలిసారిగా కోడిగుడ్డు ఆకారంలో ఉన్న ఓ గ్రహాన్ని వారు కనుగొన్నారు. దీనికి డబ్ల్యూఏఎస్‌పీ-103బీ అని నామకరణం చేశారు. అది 1,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దాని ఆకృతి శాస్త్రవేత్తలకు ఆసక్తి కలిగిస్తోంది. ఇది ‘ఎఫ్‌ రకం’ నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. ఈ తార.. సూర్యుడి కన్నా చాలా పెద్దగా ఉంటుంది. మాతృ నక్షత్రానికి, డబ్ల్యూఏఎస్‌పీ-103బీ గ్రహానికి మధ్య దూరం 20వేల మైళ్లు మాత్రమే ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అవి మా ప్రాంతాలు.. నిర్మాణాలు ఆపండి

‘భారత సరిహద్దులోని లింపియాధురా, లిపులేక్‌, కాలాపానీ ప్రాంతాలు నేపాల్‌లో అంతర్భాగం. అక్కడ చేపడుతున్న నిర్మాణాలు, రోడ్డు విస్తరణ పనులన్నీ ఇండియా ఆపాలి’ అంటూ నేపాల్‌ ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. సరిహద్దు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. ‘నేపాల్‌తో మా సరిహద్దుల విషయంలో స్పష్టంగా ఉన్నాం. ఎలాంటి సందిగ్ధానికి చోటు లేదు. ఈ విషయమై నేపాల్‌ ప్రభుత్వంతో కూడా చర్చించాం’ అని కాఠ్‌మాండూలోని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తల్లీకొడుకుల్ని విడదీశారు..కోహినూర్‌ను కొట్టేశారు

దాదాపు 200 ఏళ్లు భారతావనిని నిలువు దోపిడీ చేసిన ఆంగ్లేయులు దోచుకుపోయిన సంపదలో.. అత్యంత విలువైన కోహినూర్‌ వజ్రం కూడా ఉంది. ప్రస్తుతం బ్రిటిష్‌ రాణి కిరీటంలో ఒదిగిన ఈ వజ్రాన్ని అతి దారుణంగా కొట్టేశారు. తల్లీకొడుకులను వేరు చేసి... ముక్కుపచ్చలారని పిల్లవాడితో సంతకం చేయించుకొని ఈ వజ్రాన్ని కొల్లగొట్టారు. బ్రెజిల్‌లో వజ్రాల గనులు బయటపడే దాకా... ప్రపంచానికి భారతే వజ్రాల ఖని! ఆ క్రమంలో గోల్కొండ ప్రాంతంలో కోహినూర్‌ వజ్రం వెలుగు చూసిందని అంటుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎందుకిలా..

అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అకస్మాత్తుగా టెస్టు జట్టు సారథ్యాన్ని ఎందుకు వదులుకున్నాడు? బీసీసీఐ పెద్దలతో కోహ్లీకి పొసగకపోవడమే ఇందుకు కారణమా? ప్రపంచ క్రికెట్లోనే మేటి బ్యాటర్‌గా వెలుగొందుతున్న కోహ్లీతో బీసీసీఐ ఇంకాస్త మెరుగ్గా వ్యవహరించాల్సిందా? భారత జట్టుకు దూకుడు నేర్పిన సౌరభ్‌ గంగూలీ.. టీమ్‌ఇండియాను మరో స్థాయికి చేర్చిన విరాట్‌ కోహ్లీల మధ్య పొసగకపోవడమే తాజా క్రికెట్‌ సంక్షోభానికి ప్రధాన కారణమన్న వాదన వినిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సరిలేరు నీకెవ్వరూ..

6. మధుమేహుల్లో గుండె జబ్బుకు ఈ ప్రొటీనే కారణం

మధుమేహం ఉన్న వారిలో గుండె జబ్బు ముప్పును పెంచే ఒక ప్రొటీన్‌ను భారత శాస్త్రవేత్తలు గుర్తించారు. ఔషధాలతో దీని చర్యలను నియంత్రించడం ద్వారా ఈ ఇబ్బందిని అధిగమించొచ్చని వారు పేర్కొన్నారు. తిరువనంతపురంలోని రాజీవ్‌ గాంధీ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ (ఆర్‌జీసీబీ) శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ధమనుల గోడలపై పేరుకుపోయే కొలెస్ట్రాల్‌ పూడికలు చిట్లిపోయినప్పుడు.. మరమ్మతు యంత్రాంగం క్రియాశీలమవుతుంది. దీనివల్ల అక్కడ రక్తం గడ్డలు ఏర్పడతాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ప్రతి నెలాఖరుకు ఖాతాల్లో పింఛను

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) పింఛనుదారులకు శుభవార్త. ఇక నుంచి ప్రతి నెలా చివరి పని దినం రోజున ఆ నెలకు సంబంధించిన పింఛను బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. ఈ మేరకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పింఛను విభాగం ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌ విశాల్‌ అగర్వాల్‌.. ఈపీఎఫ్‌ క్షేత్ర స్థాయి కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు. పింఛను పంపిణీ చేసే బ్యాంకులకు విధివిధానాలను జారీ చేయాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పండగ చిత్రం.. పసందైన గీతం

సంక్రాంతి పండగని సినిమా పండగలా చూసే తెలుగు సినీ ప్రేమికులు చాలామందే! అందుకే పెద్ద పండగకి విడుదలయ్యే సినిమాల జాబితా చాలా పెద్దగానే ఉంటుంది. పండగకి ఎన్ని సినిమాలొస్తే అన్ని చూసేయడం రివాజు. అన్నట్టు పండగంటే కొత్త సినిమాల విడుదలలే కాదు... సెట్స్‌పై ఉన్న కొత్త చిత్రాలకి సంబంధించిన కొత్త ముచ్చట్లు కూడా! సంక్రాంతి పండగ సందర్భంగా ఏ సినిమా లుక్‌ విడుదలవుతుందా? ఏ సినిమాలోని పాటలు విడుదలవుతాయా అని ఆసక్తికరంగా చూస్తుంటారు అభిమానులు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కాదన్నవాళ్లే ప్రశంసించారు!

అందరూ సాఫ్ట్‌వేర్‌ అంటూ పరుగులు పెడుతోంటే.. ఆమె మాత్రం దాన్ని వదులుకుంది. లక్షల రూపాయల వేతనం, ఉన్నతావకాశాలు, భవిష్యత్‌ భరోసా.. ఇవేమీ ఆమెకు తృప్తినివ్వలేదు. దీంతో అభిరుచివైపు అడుగులు వేసి, పేస్ట్రీ చెఫ్‌ అయ్యింది. ఆమె ఈ నిర్ణయం ఎంతోమంది మహిళలకూ ఉపాధినీ చూపుతోంది. విజయవాడకు చెందిన ఉషా పోలు.. తన ప్రయాణాన్ని వసుంధరతో పంచుకున్నారిలా! చిన్నప్పటి నుంచీ కేకులంటే ఆసక్తి. తయారీ తెలియకపోయినా వాటి అలంకరణ పరికరాలను కొనుక్కొని దాచుకునేదాన్ని. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వాట్సప్‌ వైద్యం... చేటు చేస్తుంది!

కరోనా సోకిన వ్యక్తి లక్షణాలు, ఆయనకున్న ఇతర ఆరోగ్య సమస్యలను బట్టి వైద్యులు మందులు ఇస్తారు. కానీ.. కొందరు ఒకరికి రాసిన మందుల చీటీని మరొకరు తీసుకొని వాటినే కొని వాడారు. అలా చేయడం ప్రమాదాలకు కారణమవుతుందని.. అజిత్రోమైసిన్‌ వంటి యాంటిబయాటిక్‌ మందులను విచ్చలవిడిగా వినియోగించడం వల్ల గుండెపై తీవ్ర ప్రభావం పడుతుందని, హృద్రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని