Updated : 18 Jan 2022 09:07 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ఉద్యోగులకు షాక్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వోద్యోగులకు సర్కారు షాకిచ్చింది. ఇంటి అద్దె భత్యం విషయంలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఎదురుచూస్తున్న ఉద్యోగులు హతాశులయ్యారు. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కొత్త వేతన సవరణ ఉత్తర్వులను వరుసగా వెలువరించింది. ప్రధానంగా ఇంటి అద్దె భత్యం విషయంలో ఉద్యోగుల, ఉద్యోగసంఘాల డిమాండును బేఖాతర్‌ చేసింది. అశుతోష్‌ మిశ్ర కమిటీ సిఫార్సులనూ పరిగణనలోకి తీసుకోకుండా సీఎస్‌ కమిటీ సూచనల మేరకే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంటి అద్దె భత్యంలో కోత విధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సారథ్యానికి సిద్ధం

వకాశమిస్తే జట్టు  సారథ్యానికి వెనుకాడనని టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ బుమ్రా ప్రకటించాడు. ‘‘అవకాశం లభిస్తే.. అదెంతో గౌరవం. సారథ్యానికి వెనుకాడే ఆటగాడు ఉండడు. నేనేమీ  భిన్నం కాదు. ఎవరి నాయకత్వమైనా నా శక్తిసామర్థ్యాల మేరకు జట్టుకు సహకారం అందిస్తా. పదవి ఉందా లేదా అన్న పట్టింపు నాకుండదు. జట్టుకు ఎలా సహకారం అందించాలన్న దానిపైనే దృష్టిసారిస్తా. పదవి ఉన్నంత మాత్రాన మార్పేమీ ఉండదు. ముందు నా పని నేను చేయాలి కదా? నేను వీలైనంత సహకారం అందించేందుకు ప్రయత్నిస్తా’’ అని బుమ్రా తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఇలలో చైనా చందమామ

శాస్త్ర పరిశోధన రంగాల్లో చైనా జోరు పెంచింది. భారీగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ‘కృత్రిమ సూర్యుడి’ సాకారం దిశగా ముందడుగు వేసిన డ్రాగన్‌ ఇప్పుడు చందమామపైనా కన్నేసింది. అక్కడి పరిస్థితులను అనుకరించేందుకు ఒక బుల్లి జాబిల్లిని సృష్టించింది. అందులో గురుత్వాకర్షణ శక్తినీ మాయం చేయడం విశేషం. భవిష్యత్‌లో చంద్రుడిపై విస్తృత పరిశోధనలు చేయడానికి వీలుగా దీన్ని సిద్ధం చేసింది. ఇలాంటి సాధనం ప్రపంచంలో మరెక్కడా లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. లక్షణాలున్నా ఆందోళన అవసరం లేదు

‘కరోనా లక్షణాలు కనిపించినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయిదు రోజుల్లో అవి తగ్గుముఖం పడుతున్నాయి. వయసు మళ్లినవారు, ఇతర వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారిలో అప్రమత్తత అవసరం. లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరి.. మూడు రోజులకోసారి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. చికిత్స ప్రారంభించిన అయిదు రోజుల తరవాత పరీక్ష చేయిస్తే సరిపోతుంది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో చాలా అరుదుగా సాధారణ, జలుబు దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి’  అని డాక్టర్‌ లోకేశ్వరరావు ఈదర చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కొత్త జన్యు కారకాల వల్లనే భారతీయుల్లో గుండె వైఫల్యం

5. ‘మెటావర్స్‌’లో రిసెప్షన్‌.. కాబోయే జంట వినూత్న ప్రయత్నం

తమిళనాడులోని ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్టు అసోసియేట్‌గా పనిచేస్తున్న సాంకేతిక నిపుణుడు దినేష్‌ క్షత్రియన్‌కు జనగనందిని అనే యువతితో ఫిబ్రవరిలో ఓ గ్రామంలో వివాహం జరగనుంది. రిసెప్షన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ బంధువులు, మిత్రులు ‘మెటావర్స్‌’ అనే వర్చువల్‌ పద్ధతిలో ఆన్‌లైన్‌లో హాజరయ్యేలా నిర్వహించాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ జంట ఈ మధ్యే తమ ‘అవతార్‌’ల ద్వారా కలుసుకున్న రిహార్సల్‌ వీడియోను దినేష్‌ సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సాగర్‌ తీరంలో ప్రపంచ ఫార్ములా ఈ-రేస్‌

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫార్ములా ఈ-రేస్‌కు తెలంగాణ వేదిక కానుంది. ఫార్ములా వన్‌కు ప్రత్యామ్నాయంగా పూర్తిగా ఎలక్ట్రిక్‌ కార్లతో నిర్వహించే ఈ పోటీలకు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే పారిస్‌, రోమ్‌, లండన్‌, హాంకాంగ్‌, న్యూయార్క్‌, బెర్లిన్‌ తదితర 18 నగరాలు వేదికగా ఉండగా... మరో 60 నగరాలతో పోటీపడి కొత్త వేదికగా భారత్‌ నుంచి తొలిసారిగా హైదరాబాద్‌ ఈ అవకాశాన్ని దక్కించుకుంది. నవంబరు 22 నుంచి ఫిబ్రవరి వరకు ఫార్ములా ఈ-రేసు పోటీలు ప్రపంచవ్యాప్తంగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తెదేపా అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్‌

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కరోనా బారినపడ్డారు. కొవిడ్‌ స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా నిర్ధరణ కావడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చంద్రబాబు ట్వీట్‌ చేశారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు హోంఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల కాలంలో తనకు సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చేవ లేదా? చేతకాదా?

ఆత్రుతగా ఎదురు చూసిన రాత్రి రానే వచ్చింది. ఆనందం, ఉద్విగ్నంతో ఉక్కిరి బిక్కిరవుతున్న మనసుతో అతడు ఆమె మీద చేయి వేశాడు. కానీ... ఉన్నట్టుండి గుండె దడ పెరిగింది. మదిలో ఏదో అలజడి. ఒళ్లంతా చెమటలు. దూరం జరిగాడు. ఏవేవో ఆలోచనలు. మనసులో కోరికైతే ఉంది. శరీరమే సహకరించడంలేదు. ఎంత ప్రయత్నించినా అంగం స్తంభించదేం? తనపై తనకే అనుమానం. తొలి రాత్రి అంతేనేమో! అప్పటికి స్థిమితపడ్డా రెండో రోజూ, మూడో రోజూ అంతే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అన్ని సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేపట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది. తెలంగాణ గురుకులాలు మంచి ఫలితాలను అందిస్తున్న నేపథ్యంలో, గ్రామస్థాయిల్లోంచి విద్యార్థులు గురుకులాల్లో చేరుతున్నారని అభిప్రాయపడింది. వ్యవసాయం తదితర అనుబంధ రంగాల బలోపేతంతో గ్రామీణ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని..పల్లెల్లోని తల్లిదండ్రుల్లో తమ పిల్లల విద్య, భవిష్యత్తు పట్ల ఆలోచన పెరిగిందని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వచ్చేదెవరు.. వెనక్కి తగ్గేదెవరు?

‘నేడే విడుదల’ అంటూ థియేటర్లో కొత్త పోస్టర్‌ ఊరిస్తుంటే సినీప్రియులకు భలే కిక్కొస్తుంటుంది. కానీ, కరోనా పరిస్థితుల వల్ల కొన్నాళ్లుగా విడుదలల విషయంలో స్పష్టత కనిపించడం లేదు. విడుదల తేదీలు ప్రకటించడం.. పరిస్థితులు అనుకూలించక కొన్నాళ్లకి వాయిదా వేయడం.. ఇదే తంతు తరచూ కనిపిస్తోంది. సంక్రాంతి.. వేసవి.. అంటూ విడుదలల విషయంలో నిన్నమొన్నటి వరకు పక్కా ప్రణాళికలతో కనిపించింది తెలుగు చిత్ర పరిశ్రమ. కానీ, కొవిడ్‌ మూడో దశ ఉద్ధృతి వల్ల మరోసారి ఆ ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* మోదీని కొట్టగలను.. తిట్టగలను

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని