Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 22 Jan 2022 09:06 IST

1. వృద్ధ పింఛనుదార్లకు పెద్ద షాక్‌

రాష్ట్ర ప్రభుత్వం కొత్త వేతన సవరణ ఉత్తర్వుల ప్రకారం వృద్ధ పింఛనుదార్లకు పెద్ద షాక్‌ తగిలింది. 70 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసు మధ్య ఉన్న వారికి ఇచ్చే అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ మొత్తంలో కోత పెట్టింది. దీంతోపాటు ఐఆర్‌ కన్నా ఫిట్‌మెంట్‌ తగ్గించడంతో వాస్తవంగా చెల్లించాల్సిన మొత్తం కన్నా ఇప్పటికే వారు అధికంగా తీసుకున్నారని ప్రభుత్వం లెక్క తేలుస్తోంది.  ఇలా తీసుకున్న మొత్తాన్ని రికవరీ చేస్తామని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. మున్ముందు ఇచ్చే డియర్‌నెస్‌ రిలీఫ్‌ (డీఆర్‌ -కరవు సాయం) నుంచి ఈ మొత్తాన్ని మినహాయించుకుంటామని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* మనది ఉద్యోగ మిత్ర ప్రభుత్వమని చెప్పండి

2. ఇన్‌స్టాలో... పైసా వసూల్‌

ఫొటో పెట్టి పోజు కొడతాం.. లైక్‌లు వస్తే మురిసిపోతాం. అప్పుడప్పుడు పోస్టులతో చెలరేగిపోతాం ఇన్‌స్టా అంటే ఇంతేనా? ఫాలోయర్లు ఎక్కువగా ఉండి,  పోస్ట్‌లు సృజనాత్మకంగా ఉంటే దీంతో కాసులు పోగేసుకునే మార్గమూ ఉంది బాస్‌! ఎలాగంటారా? ఫాలోయర్లు ఎక్కువగా ఉంటే కొన్ని సంస్థలు, బ్రాండ్‌లు మిమ్మల్ని సంప్రదిస్తాయి. వాళ్ల ఉత్పత్తులకు సంబంధించిన పోస్ట్‌లు పెడితే డబ్బులిస్తాయి. లేదంటే మీరే వాళ్లని సంప్రదించవచ్చు. పేరున్న తారలైతే ఒక్కో పోస్ట్‌కి వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సమర్పయామి

ఒక దశ వరకు ఆధిపత్యం మనదే ఉంటుంది. విజయం ఖాయమనిపిస్తుంది. కానీ చివరికి చూస్తే ఫలితం మారిపోతుంది. కీలక దశల్లో పట్టు కోల్పోయి మ్యాచ్‌ను ప్రత్యర్థికి అప్పగించేస్తుంది టీమ్‌ఇండియా. దక్షిణాఫ్రికా పర్యటనను గొప్ప విజయంతో ఆరంభించాక.. తర్వాతి మ్యాచ్‌ నుంచి ఇదే వరస! టెస్టుల్లో గెలుపు అవకాశాల్ని ఒడిసిపట్టలేక సిరీస్‌ కోల్పోయిన భారత్‌.. వన్డేల్లోనూ అదే ఫలితాన్నందుకుంది. తొలి వన్డేలో మాదిరే ఒక దశలో తిరుగులేని స్థితిలో నిలిచి, ఉన్నట్లుండి తడబడ్డ భారత్‌.. ఇక పుంజుకోలేకపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అలహాబాద్‌ నరహంతకుడికి మద్రాసు శిక్ష!

‘భారతదేశం సంస్థానాల చిక్కుముడి! ప్రాంతాలు, కులాలు, మతాలుగా చీలిపోయింది. ఎవరి ప్రయోజనాలు వారివే. పక్క రాజ్యంలో ఏం జరిగినా పట్టించుకోరు’ అని బ్రిటిషర్లు భారతీయులపై వేసిన అపవాదును చెన్నపట్నం (చెన్నై) వాసులు పటాపంచలు చేశారు. ఉత్తరాదిన ఉన్న అలహాబాద్‌లో ప్రథమ స్వాతంత్య్ర పోరాట సమయంలో భారతీయ సిపాయిలను ఊచకోత కోసిన తెల్లవాడి విగ్రహాన్ని తమ నగరంలో ఏర్పాటు చేయటాన్ని నిరసించారు. సత్యాగ్రహం చేసి మరీ... ఆంగ్లేయుల హయాంలోనే ఆంగ్లేయుడి విగ్రహాన్ని తొలగింపజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తప్పదు ‘పరీక్ష’.. నీకు నీవే రక్ష!

ఇప్పుడు కరోనా మూడోవేవ్‌ నడుస్తోంది. వైరస్‌ సోకిందా లేదా అని తనిఖీ మొదలు దాని నుంచి బయట పడేందుకు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కువ మంది జ్వరం, దగ్గు, గొంతునొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. కొవిడ్‌ సోకిందా లేదా అనే అనుమానంతో సతమతమవుతున్నారు. జ్వరం మూడ్రోజుల్లో తగ్గకపోతే పరీక్ష తప్పదు. కిట్‌తో స్వీయ తనిఖీ కూడా చేసుకోవచ్చు. పాజిటివ్‌ అని తేలితే నిత్యం కొన్ని పరికరాలతో కుస్తీ పట్టాల్సిన అవసరం ఉంది. జ్వరం, రక్తపోటు, పల్స్‌, ఆక్సిజన్‌ స్థాయి, ఆవిరిపట్టుకోవడం..ఇలా అన్నింటికీ పరికరాలున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* భయపెడుతున్న మూడోదశ

6. ప్రేమకి లేని అభ్యంతరం పెళ్లికెందుకు?

ఒకమ్మాయి, నేను ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. మా విషయం వాళ్లింట్లో తెలుసు. వచ్చే ఏడాది పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. సమస్య ఏంటంటే.. తనకు ఈమధ్య విదేశీ సంబంధాలు వస్తున్నాయట. నన్ను కూడా ఫారిన్‌ ఉద్యోగం వెతుక్కోమంటోంది. నేను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నాకిష్టం. నన్ను వదిలించుకోవడానికే తనలా షరతు పెడుతుందేమో అనిపిస్తోంది. తనంటే నాకు చాలా ప్రేమ. ఆమెని ఎలా ఒప్పించాలి? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Tollywood: విజయంలో ముఖ్యమైన ‘పాత్ర’

పాత్రల పేర్లే సినిమాలకీ పేర్లవుతున్నాయి. విడుదల తర్వాత కథల కంటే ఆ పాత్రలే సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. వాటి హావభావాలు, నడవడికని ప్రేక్షకులు అనుకరించేంతగా ప్రభావం చూపిస్తున్నాయి. ఇటీవల ‘పుష్ప’ చిత్రంలో అల్లు అర్జున్‌ చేసిన పుష్పరాజ్‌ పాత్ర జనంలోకి ఎంతగా వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్‌స్టా రీల్స్‌, మీమ్స్‌ నుంచి యూట్యూబ్‌ పేరడీల వరకూ.. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఈ పాత్ర మేనరిజాన్ని అనుసరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రియల్‌ జోరుకు ఒమిక్రాన్‌ భయం!

ఒమిక్రాన్‌ ప్రభావం స్థిరాస్తి రంగంపై ఏ మేరకు ఉంది? ప్రత్యేకించి నిర్మాణరంగం కొవిడ్‌ మూడోవేవ్‌ కారణంగా ఎలాంటి ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది? గత నెలాఖరు నుంచి కరోనా కేసుల పెరుగుదల మొదలై వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో సహజంగానే ఈ ప్రభావం రియల్‌ ఎస్టేట్‌పైనా కన్పిస్తోంది. ఈ రంగంలో పనిచేసే ఉద్యోగులు, కూలీలు సైతం మహమ్మారి బారిన పడుతున్నారు. దీంతో పని ప్రదేశాల్లో హాజరు 30 శాతం వరకు పడిపోయిందని బిల్డర్లు అంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

శెభాష్‌ సైన్స్‌ టీచరమ్మ!

9. Pushpa: కేశవుడు మనోడే.. మచ్చా!

పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. థియేటర్లలో ఈలలు, గోలలతో సందడి చేస్తోంది.. హీరో అల్లు అర్జున్‌ ఓ రేంజ్‌లో నటనని పండించారు.. ఆయన  పక్కనే ఎప్పుడూ మచ్చా.. మచ్చా..  అంటూ ఉండే కేశవ ఎవరో కాదు మనోడే.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చిన్నకొడెపాకకు చెందిన బండారి జగదీశ్‌ ప్రతాప్‌. అనతి కాలంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని స్టార్‌ హీరో పక్కన నటించి మంచి మార్కులు కొట్టేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Corona Virus: అమ్మకానికి భారతీయుల కొవిడ్‌-19 డేటా!

భారత్‌లోని వేలాది మంది పౌరులకు సంబంధించిన వ్యక్తిగత, కొవిడ్‌ డేటా ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారని, ఇందులో వ్యక్తుల పేర్లు, మొబైల్‌ నంబర్లు, చిరునామాలు, కొవిడ్‌ పరీక్ష నివేదిక వివరాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. ‘‘కొవిన్‌ వెబ్‌సైట్‌ నుంచి డేటా బహిర్గతమైందంటూ వచ్చిన వార్తలను పరిశీలిస్తున్నాం. మేం లబ్ధిదారుల చిరునామా, వారి కొవిడ్‌ పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని సేకరించం. కాబట్టి ఆ డేటా కొవిన్‌ నుంచి వెల్లడి కాలేదని అర్థమవుతోంది’’ అని కేంద్రం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని