
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
1. IND vs SA : ఒక పర్యటన.. ఎన్నో సమస్యలు
ఎన్నో ఆశలతో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది టీమ్ఇండియా. కానీ చివరికి ఇటు టెస్టుల్లో, అటు వన్డేల్లో సిరీస్‌లు కోల్పోయి ఉత్త చేతులతో ఇంటిముఖం పట్టింది. విజయాలు దక్కకపోగా.. బోలెడన్ని సమస్యలను మూటగట్టుకుంది భారత్. ఆ సమస్యల్ని సత్వరం పరిష్కరించుకోకుంటే.. మున్ముందు చిన్నపాటి సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పేలా లేదు. సారథి ఎవరు? భారత క్రికెట్లో కెప్టెన్సీ గురించి చివరగా పెద్ద చర్చ జరిగిందంటే.. సౌరభ్ గంగూలీపై వేటు పడ్డపుడే. మళ్లీ ఇప్పుడు నాయకత్వ మార్పు పెద్ద వివాదంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. అలసత్వం వద్దు.. ఆందోళన వద్దు
వైరస్ బలహీనపడటమో, టీకాల పుణ్యమో.. అదృష్టం కొద్దీ కొవిడ్-19 మునుపటంత తీవ్రంగా బాధించటం లేదు. ఒమిక్రాన్ రకం వైరస్ ఇన్ఫెక్షన్లో మామూలు జలుబు మాదిరి లక్షణాలే కనిపిస్తున్నాయి. పెద్దగా వేధించకుండానే నయమవుతోంది. అయినా అలసత్వం అసలే చూపొద్దు. వైరస్ రకం ఏదైనా జాగ్రత్తలు యథావిధిగా పాటించాల్సిందే. ఇంట్లోనే ఉంటున్నా తగు చికిత్స తీసుకోవాల్సిందే. ఆందోళన చెందకుండా, అవగాహన పెంచుకొని మసలుకుంటే త్వరలోనే మహమ్మారి అంతం ఖాయం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* మహమ్మారి ముగుస్తోందని భావించొద్దు
3. RATCyber Attack: ర్యాట్‌తో బ్యాంకుల లూటీ
సైబర్ నేరగాళ్ల తాకిడికి బ్యాంకులు బెంబేలెత్తిపోతున్నాయి. భద్రతా ఏర్పాట్లన్నీ ఛేదించుకొని సర్వర్లలోకి చొరబడుతున్న నేరగాళ్లు బ్యాంకుల్ని లూటీ చేస్తున్నారు. గంటలపాటు ఈ తతంగం జరుగుతున్నా బ్యాంకు సిబ్బంది పసిగట్టలేకపోవడం కచ్చితంగా భద్రతా వైఫల్యమేనని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది జులై నెల నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో మూడు బ్యాంకుల్లో ఇదే తరహాలో దోపిడీలు జరిగాయి. తాజాగా జరిగిన మహేశ్ కోఆపరేటివ్ బ్యాంకులో ఏకంగా రూ.12.90 కోట్లు కొల్లగొట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. వయసులో చిన్న..ప్రత్యేకతలో మిన్న
పాఠశాల, కళాశాల స్థాయిలోనే ఆ అమ్మాయిలు విశేష ప్రతిభ చాటారు. రాష్ట్రం నుంచి నేడు దేశం గుర్తించే స్థాయికి ఎదిగారు. ఓ బాలిక తన కథల ద్వారా సామాజిక సమస్యలకు అద్దంపట్టగా.. మరొకరు సహజ ఉత్పత్తులతో స్త్రీలకు, పర్యావరణానికి మేలు చేసే శానిటరీ ప్యాడ్లను ఆవిష్కరించారు. ఇంకో బాలిక సైబర్ భద్రతపై తన చుట్టుపక్కల వారికి అవగాహన కల్పిస్తుండగా... మరో విద్యార్థిని ఉన్నత చదువుకు పేదరికం, సౌకర్యాలలేమి అడ్డుకావని నిరూపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. Buddha Venkanna: అదుపులోకి తీసుకుని.. అర్ధరాత్రి విడుదల
మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లపై విమర్శలు చేశారనే ఆరోపణలపై తెదేపా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా పోలీసులు అరెస్టు చేశారని తెదేపా నేతలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల మోహరింపు, తెదేపా కార్యకర్తల ప్రతిఘటనల మధ్య వెంకన్నను ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. సోమవారం రాత్రి వరకు ఆయన్ను విచారించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* New Districts: మళ్లీ తెరపైకి కొత్త జిల్లాలు!
6. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు వైద్య విద్యార్థుల మృతి
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వార్థా జిల్లాలో వంతెన పైనుంచి కారు కింద పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వైద్య విద్యార్థులు దుర్మరణం చెందారు. యావత్మాల్ నుంచి వార్థాకు వెళుతుండగా సోమవారం అర్ధరాత్రి ఘటన జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి వంతెన పైనుంచి కిందపడినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. Subhash Chandra Bose: కాలేజీ గలాటా... మారిన బోస్ బాట
సంపన్న కుటుంబం. తండ్రి బ్రిటిష్ ప్రభుత్వ న్యాయవాది! ఆంగ్లేయులకు విశ్వాసపాత్రుడు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా బాల్యమంతా... దాదాపు తెల్లవారిలా పెరిగాడు. వారితోనే కలసి చదివాడు. అలాంటి సుభాష్‌చంద్ర బోస్... ఆంగ్లేయులకెలా వ్యతిరేకమయ్యాడనేది ఆసక్తికరం! కాలేజీ రోజుల్లో జరిగిన ఓ ఘటన బోస్ బాటను మళ్లించింది. ప్రభావతీబోస్, జానకీనాథ్ బోస్‌ల 14 మంది సంతానంలో తొమ్మిదోవాడు సుభాష్‌చంద్ర బోస్. 1897 జనవరి 23న ఆయన పుట్టే నాటికి జానకీనాథ్ బ్రిటిష్ ప్రభుత్వ ప్లీడర్‌గా కటక్‌లో పనిచేసేవారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. సల్మాన్...మిమ్మల్ని తాకొచ్చా?
సల్మాన్‌ఖాన్‌ను తాకడానికి అనుమతి కోరానంటోంది ప్రగ్యా జైశ్వాల్. ‘కంచె’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఆమె ఇటీవల విడుదలైన బాలకృష్ణ ‘అఖండ’ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకొంది. తాజాగా సల్మాన్‌ఖాన్‌తో కలిసి ఆడిపాడింది. ‘మే చలా..’ అంటూ సాగే వీడియో గీతంలో ఈ జంట సందడి చేసింది. ఇటీవల విడుదలైన ఈ గీతానికి మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా సల్మాన్‌తో నటించిన క్షణాల్ని గుర్తుచేసుకొంది ప్రగ్య. ‘‘సల్మాన్‌ను ఆ పాట సెట్లోనే తొలిసారి కలిశాను. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. గుండె గుండెకో వేగం!
నిరంతరం గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. దీని వేగం అన్నిసార్లూ ఒకేలా ఉండదు. అందరిలోనూ ఒకేలా కొట్టుకోవాలనీ లేదు. రోజంతా మనం చేసే పనులను బట్టి శరీరానికి అవసరమైన ఆక్సిజన్ మేరకు దీని వేగం ఆధారపడి ఉంటుంది. గుండె వేగం ‘నార్మల్’ అనేది వ్యక్తులను బట్టి మారిపోతుంటుంది. వయసు మీద పడుతున్నకొద్దీ మారిపోవచ్చు. గుండె వేగం ఆధారంగా గుండె ఆరోగ్యాన్నీ అంచనా వేయొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. Shopping: రూ.లక్షన్నరతో రెండేళ్ల పిల్లాడి షాపింగ్
వీడియో గేమ్స్ ఆడుకునేందుకు తల్లి స్మార్ట్‌ఫోన్ తీసుకున్న రెండేళ్ల బాలుడు.. పొరపాటున 1700 డాలర్లు(సుమారు లక్షా 27వేల రూపాయలు) విలువైన ఫర్నిచర్‌ను ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. ఈ ఘటన న్యూజెర్సీలో జరిగింది. ప్రమోద్ కుమార్-మధు.. అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు. ఇటీవలే న్యూజెర్సీలో సొంతింటి కల సాకారం చేసుకున్నారు. కొత్త ఇంటి కోసం ఫర్నిచర్ కొనాలని మధు అనుకున్నారు. వాల్‌మార్ట్ యాప్‌లో ఏ వస్తువులు బాగున్నాయో చూస్తూ.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి