Updated : 26 Jan 2022 09:25 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. AP News: ఏపీలో గెజిట్‌ ప్రకారం కొత్తగా ఏర్పాటైన జిల్లాలివే..!

ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రాథమిక నోటిఫికేషన్‌పై సలహాలు, సూచనలు, అభ్యంతరాలు 30 రోజుల్లో తెలియజేయాలని కోరింది. ఇవాళ విడుదల చేసిన గెజిట్‌ ప్రకారం.. ఏపీలో జిల్లాలివే.. శ్రీకాకుళం, మన్యం(పార్వతీపురం), విజయనగరం, అల్లూరి సీతారామరాజు (పాడేరు), విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ(అమలాపురం).. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Republic Day: రాచరికానికి రాంరాం..

భారత స్వాతంత్య్ర దినోత్సవం ఎప్పుడంటే 1947 ఆగస్టు 15 - అని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. అది నిజమే అయినా... ఆనాటితో మనపై బ్రిటన్‌ రాజరికమేమీ తొలగిపోలేదు. ఆ తర్వాతా బ్రిటిష్‌ గొడుగుకిందే ఉన్నాం! 1950 జనవరి 26న భారత ప్రజలకు సంపూర్ణ రాజకీయ స్వాతంత్య్రం లభించింది. బ్రిటిష్‌ రాచరికపు సంకెళ్లను తెంచుకొని భారతావని ప్రజాతంత్రంగా ఉదయించింది. 1947 ఆగస్టు 15న మనకు బ్రిటన్‌ పార్లమెంటు స్వాతంత్య్రం ప్రకటించినా... అది సంపూర్ణ స్వాతంత్య్రమేమీ కాదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Padma Bhushan: పద్మభూషణ్‌ వద్దు..తిరస్కరించిన బుద్ధదేవ్‌ భట్టాచార్య

కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన పద్మభూషణ్‌ పురస్కారాన్ని సీపీఎం సీనియర్‌ నేత, పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య తిరస్కరించారు. ‘‘పద్మ అవార్డు సంగతి నాకు తెలియదు. దాని గురించి ఎవరూ చెప్పలేదు. ఒకవేళ నన్ను ఆ పురస్కారానికి ఎంపిక చేసి ఉంటే.. దాన్ని తిరస్కరిస్తున్నా’’ అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుద్ధదేవ్‌తో పాటు పార్టీ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నట్లు సీపీఎం వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం నుంచి అవార్డులు స్వీకరించడం తమ విధానం కాదని ఆ పార్టీ.. ట్విటర్‌లో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలుగు తేజాలకు పద్మ పురస్కారాలు

4. దేశంలో గాడిదలు తగ్గుతున్నాయ్‌!

వినియోగం తగ్గటం, చోరీలు, మేత భూమి కొరత, అక్రమంగా వధించటం.. ఇలా కారణాలేవైనా దేశంలో గాడిదల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. 2012 నుంచి 2019 వరకు.. అంటే ఎనిమిదేళ్ల వ్యవధిలో గాడిదలు 61 శాతం తగ్గినట్లు ఓ అధ్యయనం తేల్చింది. ‘బ్రూక్‌ ఇండియా’ అనే సంస్థ దేశంలో గాడిదల ఉనికి, ఈ మూగ జంతువులతో చేస్తున్న అక్రమ వ్యాపారాలపై అధ్యయనం చేసింది. దేశంలో గాడిదల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిన మహారాష్ట్ర, గుజరాత్‌, బిహార్‌, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. దేవభూమిలో పంచ రణక్షేత్రాలు!

ఉత్తరాఖండ్‌లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్‌ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 70 నియోజకవర్గాలు ఉండగా.. రెండు పార్టీలూ ఇప్పటికే మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కూడా ఇక్కడ సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని స్థానాల్లోనూ పోటీ హోరాహోరీగా సాగే అవకాశాలున్నప్పటికీ.. ప్రధానంగా ఐదు నియోజకవర్గాలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు

తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో ఎంపీ అర్వింద్‌ చేసిన తప్పునకు శిక్ష తప్పదని అన్నారు. ఎన్నికల సమయంలో ఎంపీగా గెలిపిస్తే కొద్ది రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్‌పేపర్‌ రాసిచ్చి ఓట్లేయించుకున్నారని, మూడేళ్లు గడిచినా పసుపు బోర్డు జాడే లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కడుపులో బిడ్డతో యుద్ధభూమిలో విధులు...

ఒక చేతిలో రైఫిల్‌... మరో చేతిలో పసిబిడ్డ... కడుపులో మరోబిడ్డ! ఆ పరిస్థితుల్లోనూ యుద్ధభూమిలోంచి ఏమాత్రం వెనుకడుగు వేయాలనుకోలేదామె. బిడ్డలను కాపాడుకుంటూనే తల్లిలాంటి దేశం కోసం కార్గిల్‌ యుద్ధక్షేత్రంలో ధైర్యంగా     నిలబడింది కెప్టెన్‌ యషికాహత్వాల్‌త్యాగి. ఈ రోజుకీ సైన్యంలో చేరాలనుకునే   వారికి స్థైర్యాన్ని నూరిపోస్తున్న ఆమె అనుభవాలివి.. భూమికి వేల అడుగుల ఎత్తులో ఉన్న యుద్ధభూమిలో, గడ్డకట్టేచలిలో.. ఊపిరాడేదికాదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఫోన్‌ డిటాక్స్‌

ఫోన్‌ మీ గుప్పిట ఉందా? మీరు ఫోన్‌ గుప్పిట్లో ఉన్నారా? సమాధానం చెప్పటం కష్టమే. మన నుంచి మనల్ని ఫోన్‌ అంత స్మార్ట్‌గా లాగేసుకుంది మరి. ఒక్క క్షణమైనా విడవలేనంతగా పట్టేసుకుంది. దీనికి మరీ ఇంతలా అతుక్కుపోతే ఎలా? కాసేపైనా దీని హస్తాల్లోంచి బయటపడకపోతే ‘టెక్‌ శాంతి’ని దూరం చేసుకున్నట్టే. కంప్యూటర్‌ అయినా, టీవీ అయినా ఇప్పుడు స్మార్ట్‌ఫోనే. గడియారం, కెమెరా, వీడియో రికార్డర్‌, వాయిస్‌ రికార్డర్‌.. ఒక్కటేమిటి సమస్త పరికరాలూ ఫోన్‌లోనే నిక్షిప్తమైపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆలోచనలే ఆదేశాలు!

9. Padma Shri: నటనలో ‘షావుకారు’ సాయంలో ‘చిలకమ్మా మజాకా’

సాయంలో ‘చిలకమ్మా మజాకా’ పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిన కేంద్రం సినిమా పేరుని ఇంటి పేరుగా మార్చుకున్న నటులు ఎంతోమందే. తొలిసారి అలా ఓ సినిమా పేరు ఇంటి పేరుగా మారిపోవడం  ‘షావుకారు’ జానకితోనే మొదలైంది. 400కి పైగా చిత్రాల్లో కథా నాయికగా, క్యారెక్టర్‌ నటిగా గుర్తుండిపోయే పాత్రల్లో ఒదిగిపోయిన ఆమె ఇప్పుడు పద్మశ్రీ షావుకారు జానకి. రేడియో, నాట్య కళాకారిణిగా, నటిగా కళారంగానికి చేసిన సేవలకిగానూ తమిళనాడు ప్రభుత్వం నుంచి ఆమె పద్మ పురస్కారానికి ఎంపికయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. యూనికార్న్‌ క్లబ్‌లో డార్విన్‌బాక్స్‌

హైదరాబాద్‌కు చెందిన హెచ్‌ఆర్‌ (మానవ వనరుల) టెక్నాలజీ సేవల్లో నిమగ్నమైన అంకుర సంస్థ డార్విన్‌బాక్స్‌, ‘యూనికార్న్‌’ క్లబ్‌లో చేరింది. సంస్థాగత విలువ 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.7500 కోట్ల) కంటే అధికంగా ఉన్న అంకుర సంస్థలను యూనికార్న్‌లుగా పరిగణిస్తున్నారు. డార్విన్‌ బాక్స్‌ తాజాగా 72 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.538 కోట్లు) మూలధన నిధులు సమీకరించింది. బిలియన్‌ డాలర్ల సంస్థాగత విలువ ప్రకారం ఈ నిధులు లభించినట్లు డార్విన్‌బాక్స్‌ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని