Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 Jan 2022 09:09 IST

1. CM Jagan: మీ ప్రతిపాదన గొప్పది

వివిధ కేంద్రప్రభుత్వ విభాగాలు, కార్యాలయాలను నడిపించేందుకు సమర్థులైన ఐఏఎస్‌ అధికారుల్ని నియమించాలని ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. పాలనను సజావుగా, నిరాటంకంగా సాగించేందుకు కేంద్రం చేతిలో శక్తిమంతులు, సమర్థులైన అధికారులతో కూడిన బృందం ఉండాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Australia Open: నువ్వు దద్దమ్మవా..? అంపైర్‌పై మెద్వెదెవ్‌ చిందులు

మెద్వెదెవ్‌కు కోపమొచ్చింది. సిట్సిపాస్‌తో సెమీఫైనల్‌ సందర్భంగా అతను చైర్‌ అంపైర్‌ కాంపిస్టోల్‌పై చిందులు తొక్కాడు. స్టాండ్స్‌లో ఉన్న సిట్సిపాస్‌ తండ్రి కొడుక్కి నిబంధనలకు విరుద్ధంగా సూచనలు ఇస్తుండటం, ఎంతకీ అంపైర్‌ స్పందించకపోవడంతో అతను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. విరామ సమయంలో కుర్చీలో కూర్చుని ఉన్న అంపైర్‌ వైపు కోపంగా చూస్తూ.. ‘‘నువ్వేమైనా దద్దమ్మవా? అతడికి తండ్రి శిక్షణ ఇస్తుంటే నీకు కనిపించడం లేదా? నా ప్రశ్నకు జవాబు చెప్పు’’ అంటూ అరిచాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Supreme Court: సుదీర్ఘకాలం సస్పెన్షన్‌ చెల్లదు

అనుచిత ప్రవర్తన పేరుతో చట్టసభల నుంచి సభ్యులను సుదీర్ఘ కాలం పాటు సస్పెండ్‌ చేయడం తగదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. వారిపై విధించే చర్య ఆ సమావేశం(సెషన్‌) వరకే పరిమితం కావాలని తెలిపింది. సస్పెన్షన్‌ కాల వ్యవధి.. కొనసాగుతున్న సమావేశం పరిధిని మించితే దాని ప్రభావం ప్రజాస్వామ్య వ్యవస్థ మొత్తంపై పడుతుందని అభిప్రాయపడింది. విపక్ష సభ్యుల సంఖ్యను అప్రజాస్వామిక పద్ధతుల్లో తగ్గించడం అంటే స్వల్ప మెజార్టీ ఉన్న ప్రభుత్వ మనుగడకు అవకాశం కల్పించినట్లేనని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* AP High Court: న్యాయస్థానంతో ప్రభుత్వం దోబూచులాడుతోంది

4. Telangana News: హైదరా‘బాదుడే’

రాజధాని హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఫ్లాట్ల మార్కెట్‌ విలువలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ శుక్రవారం తుది ప్రతిపాదనలను రూపొందించింది. రిజిస్ట్రేషన్ల ద్వారా ఖజానాకు అత్యధిక రాబడిని అందించే హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలతో పాటు సంగారెడ్డి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో భూములు విలువలు, అపార్ట్‌మెంట్‌ల ధరలు భారీగా పెరిగాయి. కొత్త మార్కెట్‌ విలువలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Keerthy Suresh: నాది ఐరన్‌ లెగ్‌ అన్నారు

ఓ కొత్త కథానాయిక తెరపై మెరిసిందంటే చాలు.. ఆ చిత్ర ఫలితాన్ని బట్టి వారిపై ఓ ముద్ర పడిపోతుంది. తొలి అడుగుల్లోనే వరుస విజయాలు దక్కాయంటే సరేసరి.. లేదంటే హిట్టు మాట వినిపించే వరకు ‘ఐరన్‌ లెగ్‌’ అన్న ముద్ర మోసుకుతిరగాల్సిందే. ఇప్పుడు చిత్రసీమలో స్టార్‌ నాయికలుగా వెలుగులీనుతున్న పలువురు నాయికలు కెరీర్‌ ఆరంభంలో ఇలాంటి విమర్శల్ని ఎదుర్కొన్న వారే. ఇందుకు తాను కూడా మినహాయింపు కాదంటోంది నటి కీర్తి సురేష్‌. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తాను కూడా ‘ఐరన్‌ లెగ్‌’ అన్న ట్యాగ్‌ను మోయాల్సి వచ్చిందని చెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అక్కా అంటూనే..

వాడికి గ్యాడ్జెట్స్‌ అంటే ఇష్టం. తన పుట్టినరోజుకి ఖరీదైన స్మార్ట్‌వాచీని బహుమతిగా ఇచ్చా. వాడికి సినిమాలు, వెబ్‌సిరీస్‌లంటే పిచ్చి. నెట్‌ఫ్లిక్స్‌, ఆహా, అమెజాన్‌ ప్రైమ్‌.. సబ్‌స్క్రిప్షన్‌ అయిపోయిన ప్రతిసారీ నేనే రీఛార్జ్‌ చేసేదాన్ని. కొన్నిసార్లు వాడికి గారంగా గోరుముద్దలు కూడా తినిపించా. ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా తనని సొంత తమ్ముడే అనుకున్నా. ఇవన్నీ వాడిపై నాకెంత అభిమానమో చెప్పడానికే! కానీ.. తనేం చేశాడు? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అదిగదిగో...అదే మా ఇల్లు

7. BJP: సంపదలో భాజపాయే బాద్‌షా.. 51 పార్టీల ఆస్తుల్లో కమలం వాటా 53%

దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా భాజపా అగ్రస్థానంలో ఉంది. 2019-20 సంవత్సరానికి సంబంధించి దేశంలోని ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల లెక్కలకు సంబంధించిన వివరాలపై అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) శుక్రవారం నివేదిక విడుదల చేసింది. మొత్తం 51 పార్టీల ఆస్తులన్నింటిని కలిపి లెక్కించగా రూ.9,117.95 కోట్లు ఉండగా.. ఇందులో ఒక్క భాజపా ఆస్తులే రూ.4,847.78 కోట్లు (53.16%). పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. yediyurappa: ఒంటరితనమే వేదనకు కారణమా?

ఆమె ఓ పెద్దింటి అమ్మాయి. సమాజాన్ని చక్కగా చదివే వైద్యురాలి వృత్తిలో నిమగ్నమైన యువతరం ప్రతినిధి. ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవడం పెను సంచలనం.. దిగ్భ్రాంతికి కారణం. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప మనుమరాలు డాక్టర్‌ సౌందర్య (30) హఠాత్తుగా బలవన్మరణానికి పాల్పడడం ఆమె కుటుంబ సభ్యులను కలచి వేసింది. శుక్రవారం నాటి ఈ ఘటనకు కారణాలు విశ్లేషించే పనిలో అటు మీడియా- ఇటు పోలీసు వ్యవస్థ మునిగిపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. EPFO:‘సర్వర్‌’ సమస్యకు పరిష్కారమెప్పుడు?

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) చందాదారులకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. ఈపీఎఫ్‌వో కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో సేవలు పొందేలా పోర్టల్‌ అందుబాటులోకి తీసుకువచ్చినా గత నెలన్నర రోజులుగా సర్వర్‌ సమస్యలు తలెత్తాయి. ఎప్పుడు సమస్య పరిష్కారమవుతుందో తెలియని పరిస్థితి. దీంతో రోజుల తరబడి సాంకేతిక సమస్యలతో వేతన జీవులు, కార్మికులకు సేవలు నిలిచిపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

SBI: గర్భిణుల నియామక నిబంధనల్లో ఎస్‌బీఐ మార్పులు

10. చంద్రుడిపైకి టయోటా కారు..

చంద్రుడిపై అన్వేషణ కోసం ఒక వాహనాన్ని రూపొందించేందుకు టయోటా సంస్థ సిద్ధమవుతోంది. ఇందుకోసం జపాన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థతో కలిసి కసరత్తు చేస్తోంది. 2040 నాటికి జాబిల్లిపైన ఆ తర్వాత అంగారకుడిపైన ప్రజలు నివసించడానికి తోడ్పడటం దీని ఉద్దేశం. ఈ వాహనానికి ‘లూనార్‌ క్రూజర్‌’ అని పేరు పెట్టారు. కార్లలో ప్రజలు సురక్షితంగా తినడం, పనిచేయడం, నిద్రపోవడం, ఇతరులతో కమ్యూనికేషన్‌ సాగించడం వంటివి చేయగలరు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని