Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 Feb 2022 09:22 IST

1. Ukraine Crisis: ఇప్పుడు సీరియస్‌ పాత్రలో..

వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ..! హాస్యనటుడిగా ఒకప్పుడు ఉక్రెయిన్‌లో అందరినీ కడుపుబ్బా నవ్వించిన ఆయన ఇప్పుడు ‘సీరియస్‌ పాత్ర’లోకి మారిపోయారు. దేశాధ్యక్ష హోదాలో తన సైనికులు, పౌరుల్లో స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ముంచుకొస్తున్న రష్యన్‌ సేనలను ఎదుర్కొనేలా సమాయత్తం చేస్తున్నారు. తనకు పరిచయంలేని ఈ కొత్త ‘పాత్ర’ను అద్భుతంగా పోషించేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఐదేళ్లుగా డాన్‌బాస్‌ ప్రాంతంలో వేర్పాటువాదులతో జరుగుతున్న పోరుతో విసుగెత్తిన ఉక్రెయిన్‌లో శాంతి పవనాలు వీచేలా చూస్తానన్న హామీతో జెలెన్‌స్కీ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Mekapati Goutham Reddy: గౌతమ్‌రెడ్డి శాఖలు ఎవరికి?

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఇంతకాలం ఆయన బాధ్యతలు నిర్వర్తించిన శాఖలు ఇప్పుడు ఎవరికి ఇవ్వనున్నారనేది చర్చనీయాంశమైంది. ఐటీ, పరిశ్రమలు-వాణిజ్యం, పెట్టుబడులు మౌలిక వసతులు, చేనేత జౌళి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖల బాధ్యతలను గౌతమ్‌ నిర్వర్తించేవారు. ఇప్పుడీ శాఖల బదలాయింపు విషయంలో రెండు ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. దంచికొట్టారు.. సిరీస్‌ సొంతం చేసుకున్నారు

బాదుడే బాదుడు. టీమ్‌ ఇండియా చితక్కొట్టేసింది. సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ శ్రేయస్‌ మరోసారి రెచ్చిపోతే.. విధ్వంసక విన్యాసాలతో జడేజా విరుచుకుపడ్డాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంజు శాంసనూ బ్యాట్‌ ఝుళిపించాడు. ఫలితం.. 184 పరుగుల లక్ష్యం సైతం ఉఫ్‌! బ్యాట్స్‌మెన్‌ దంచి కొట్టిన వేళ రెండో టీ20లో శ్రీలంకను చిత్తు చేసిన టీమ్‌ ఇండియా.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను చేజిక్కించుకుంది. శ్రేయస్‌ అయ్యర్‌ (74*) చెలరేగడంతో శనివారం రెండో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆ లెక్కలకి అతీతమైనదే సంగీతం

ఉ అంటావా ఉఊ అంటావా... అంటూ దేశం మొత్తం ఊగిపోయేలా చేశాడు.. దేవిశ్రీప్రసాద్‌. ఆయన బాణీల్లో హుషారు అలాంటిది. ఇటీవల ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ అనే సినిమా చేశారు. శర్వానంద్‌ కథానాయకుడిగా తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం మార్చి 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దేవిశ్రీప్రసాద్‌ శనివారం విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. శత్రుసేన కమ్ముకొస్తున్నా ‘వెన్ను చూపట్లేదు!’

ష్యా ఆయుధ సంపత్తి ముందు ఉక్రెయిన్‌ బలం దిగదుడుపే. అయినా పుతిన్‌ సేన దూకుడుకు అడుగడుగునా అడ్డుకట్టపడుతోంది. ఉక్రెయిన్‌ సైనికులు, ప్రజలు అందుబాటులో ఉన్న ఆయుధాలతో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. కమ్ముకొస్తున్న రష్యా సైన్యాన్ని నిలువరించడానికి ఆత్మాహుతికీ సిద్ధపడుతున్నారు. లొంగిపోవడానికి బదులు పోరాడుతూ మాతృభూమి రక్షణలో ప్రాణాలు వదులున్నారు. ఈ పోరులో నేలకూలిన రష్యన్‌ యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు, పేలిపోయిన యుద్ధట్యాంకులు ఉక్రెయిన్‌ ప్రతిఘటనకు దర్పణం పడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

దిల్లీ చేరుకున్న 28మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

6. మద్యం.. వద్దే వద్దు!

సరదాగా మొదలవుతుంది... అలవాటుగా మారుతుంది... వ్యసనమై వేధిస్తుంది... సంసారాన్ని వీధిన పడేస్తుంది. శరీరాన్ని రోగాలపుట్టగా మారుస్తుంది. అందుకే... మద్యం జోలికెళ్లొద్దంటున్నాయి అధ్యయనాలు. ఉద్యోగం వస్తే పార్టీ...పెళ్లి కుదిరితే పార్టీ... ప్రమోషన్‌ వస్తే పార్టీ...అలా ఎప్పుడో ఒకసారి అంటే సరే.. అనుకోవచ్చు. కానీ, నలుగురు స్నేహితులు కలిసినప్పుడల్లా పార్టీ అంటే..? ఆ పార్టీలో మందు తప్పనిసరి అయితే..? ఇవాళా రేపూ జరుగుతున్నది అదే. వారాంతాల్లోనే కాదు, మామూలు రోజుల్లోనూ కిటకిటలాడే పబ్బులూ బార్లే అందుకు నిదర్శనం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సామాన్యులెవరూ క్రిప్టో జోలికి వెళ్లొద్దు

క్రిప్టోల ద్వారా త్వరగా ధనికులం కావొచ్చని ఎవరైనా దీనిలోకి దిగితే వారు జూదానికి సిద్ధపడినట్లే. ఇందులో సొమ్ములు పెట్టాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం. నష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి చాలా ముఖ్యం. వాటిని భరిస్తూనే జీవితాన్ని సాఫీగా గడపగలగాలి. బాగా ఆస్తులు, విపరీతమైన ఆదాయాలు ఉన్నవారికే ఇది సాధ్యం. సామాన్యులెవరూ క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడి పెట్టవద్దని రిజర్వుబ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నర్‌ రామసుబ్రమణియమ్‌ గాంధీ సూచించారు. వాటి విలువల్లో వచ్చే ఆటుపోట్లతో కలిగే నష్టాలను వారు తట్టుకోలేరని ఆయన అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Ukraine Crisis: వంటనూనె.. సలసల

విజయవాడలోని ఒక కార్పొరేట్‌ మాల్‌లో శుక్రవారం ఉదయం 10 గంటల వరకు లీటరు పామాయిల్‌ ధర రూ.128 ఉండగా.. మధ్యాహ్నం 12 గంటల సమయానికి రూ.149 అయింది. అంటే రెండు గంటల్లోనే  లీటరుకు రూ.21 చొప్పున పెరిగింది. వంట నూనెల ధరలు భగ్గుమన్నాయి. లీటరుపై రూ.10 నుంచి రూ.25 వరకు పెరిగాయి. అదేమంటే అక్కడెక్కడో యుద్ధం అంటగా? అందుకే పెరిగాయనే సమాధానం వస్తోంది. ఈ పెరుగుదల ఎంతవరకో తెలియడం లేదని, కరోనా సమయంలో ధరలకు మించి పెరిగే అవకాశం ఉందంటున్నారని చిల్లర వ్యాపారులు పేర్కొంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నాయనమ్మ పేరు చెడగొట్టద్దని...!

‘చదువులో మార్కులు కాసిని తక్కువైనా ఫర్వాలేదు... సంగీతంలో ఏమాత్రం తగ్గొద్దు’ అని ప్రోత్సహించే సంగీత ప్రేమికుల కుటుంబం ఆమెది. అవసరమైతే అవకాశాలనీ అందించగలరు. తను మాత్రం వాటిని కాదనుకుని అమ్మాయిలు అరుదుగా అడుగుపెట్టే రంగంలోకి వచ్చి రాణిస్తోంది. అలవైకుంఠపురంలో, వకీల్‌సాబ్‌, భీమ్లానాయక్‌, రాధేశ్యామ్‌ వంటి భారీ చిత్రాలకు గిటారిస్టుగా పనిచేసి తానేంటో నిరూపించుకుంది. గానకోకిల పి.సుశీల మనవరాలిగా కాక.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నేరాన్ని నాపై వేసుకుంటే రూ.10 కోట్లు ఇస్తారన్నారు

 కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డిలతో కలిసి వివేకానందరెడ్డిని హత్య చేయించినట్లు వారికి అత్యంత సన్నిహితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనతో చెప్పారని కల్లూరు గంగాధర్‌రెడ్డి సీబీఐకి తెలిపారు. ఆ నేరాన్ని తనపై వేసుకుంటే అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలు రూ.10 కోట్లు ఇస్తారంటూ శివశంకర్‌రెడ్డి ఆఫర్‌ ఇచ్చారని వెల్లడించారు. పులివెందుల వాసి అయిన గంగాధర్‌రెడ్డి.. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలకు అత్యంత సన్నిహిత అనుచరుడిగా ఉండేవారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని