Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 14 May 2022 09:18 IST

1. Andhra News: చెన్నై సంస్థ గుప్పిట్లో ఇసుక

అది 2020 డిసెంబరు 30. చెన్నైలో టర్న్‌కీ ఎంటర్‌ప్రైజ్‌ అనే సంస్థ ఊపిరి పోసుకుంది. వారం తిరక్కముందే 2021 జనవరి 5న ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకాలు, విక్రయాల్ని ఏదైనా కేంద్ర సంస్థకు గానీ, అవి ముందుకు రాకపోతే వేలం ద్వారా ఏదైనా ప్రైవేటు సంస్థకు గానీ అప్పగించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లకే గనుల శాఖ టెండర్లు పిలిచింది. ఎక్కడో హిమాచల్‌ ప్రదేశ్‌లోని శిమ్లాలోను, మధ్యప్రదేశ్‌లోని నిగ్రీలోను రిజిస్టర్డ్‌ చిరునామాలు, దిల్లీలో కార్పొరేట్‌ కార్యాలయం ఉన్న జేపీ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ అనే సంస్థ ఏపీలో ఇసుక తవ్వకాలు, విక్రయాల కాంట్రాక్టు దక్కించుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పురుషులను ‘బట్టతల’ అని పిలవడం లైంగిక వేధింపే!

పనిచేసే చోట ఏ పురుషుడినైనా ‘బట్టతల’ పేరుతో సంబోధిస్తే... అది కచ్చితంగా లైంగిక వేధింపుల కిందకే వస్తుందని ఇంగ్లండ్‌కు చెందిన ఓ ట్రైబ్యునల్‌ శుక్రవారం స్పష్టం చేసింది. వెస్ట్‌ యోర్క్‌షైర్‌ కేంద్రంగా పనిచేసే బ్రిటిష్‌ బంగ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌పై... ఆ సంస్థ మాజీ ఉద్యోగి టోనీ ఫిన్‌ దావా వేశాడు. 24 ఏళ్లపాటు తాను ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ వచ్చానని, సంస్థకు చెందిన సూపర్‌వైజర్‌ తనను బట్టతల అంటూ వేధింపులకు గురిచేశాడని పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. విదేశీ ప్రయాణాల కోసం మూడో డోసు

విద్య, ఉపాధి, వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లే భారతీయులు కొవిడ్‌ టీకా రెండో డోసు తీసుకున్న మూడు నెలల తరవాత ముందు జాగ్రత్తగా మూడో డోసు (బూస్టర్‌) తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఇంతకుముందు రెండో డోసు తరవాత 9 నెలలకు మూడో డోసు తీసుకోవాలనే నిబంధన ఉండేది. దాన్ని గురువారం సడలించిన తరవాత కేంద్రం తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. మూడో డోసు తీసుకున్న వారు వీసా పత్రాలు సమర్పించకుండానే కొవిన్‌ పోర్టల్‌ నుంచి ధ్రువీకరణ పొందేందుకు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నేరుగా గుండెపై ఫ్లూ వైరస్‌ దాడి

 ఫ్లూ వ్యాధితో ముడిపడ్డ గుండె సమస్యలకు మూలాలపై అమెరికా శాస్త్రవేత్తలు కీలక విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. హృదయ కణాలపై ఇన్‌ఫ్లూయెంజా ఇన్‌ఫెక్షన్‌ నేరుగా చూపే ప్రభావమే ఇందుకు కారణమని వారు పేర్కొన్నారు. ఎలుకలపై పరిశోధన ద్వారా దీన్ని నిర్ధారించారు. ఫ్లూ బారినపడ్డ మూషికాల గుండె కణాల్లో సంబంధిత వైరస్‌ రేణువులు ఉండటాన్ని శాస్త్రవేత్తలు గతంలోనే గుర్తించారు. అయితే వీటి ఉనికి వల్లే ఆ జీవుల గుండె దెబ్బతింటోందా అన్నదానిపై వారికి అప్పట్లో స్పష్టత లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తను మంచిదైనా.. నచ్చట్లేదు!

మీరు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడం బాధాకరం. అయినా కష్టపడి పైకి రావడం అభినందనీయం. పెళ్లి అనేది మీ వ్యక్తిగత విషయం. బంధువుల బలవంతంతో ఒప్పుకోవడం మీ పొరపాటు. ఇప్పుడు  చేసేదేమీ లేదు. మీ చేతుల్లో ఉన్నదల్లా పరిస్థితులను అనుకూలంగా మలచుకోవడమే. మీ భార్య మంచిదే అంటున్నారు.. సంతోషంగా లేనంటున్నారు. కారణాలు స్పష్టంగా చెప్పలేదు. ప్రఖ్యాత మానసిక నిపుణుడు జాన్‌ ఎం.గ్యాట్‌మ్యాన్‌ ‘స్నేహం, పరస్పర గౌరవం, ఒకరి సంతోషాన్ని మరొకరు కోరుకోవడం ద్వారానే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నేను చనిపోలేదు.. సమాధిలోకి వెళ్లా!

తాను చనిపోయినట్లు వస్తున్న వార్తలపై స్పందించారు వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి. బతికే ఉన్నానని, 27 మంది వైద్యులు తనకు చికిత్స చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ ద్వీపంలో ఉంటున్న నిత్యానంద.. కొద్దిరోజుల కిందట అనారోగ్యంతో చనిపోయినట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఈ వదంతులపై స్పందిస్తూ నిత్యానంద.. ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. తాను సమాధిలోకి వెళ్లానని, శిష్యులు కంగారుపడొద్దని తెలిపారు. ‘‘నేను చనిపోలేదు. ప్రస్తుతం సమాధిలో(సుప్తావస్థ) ఉన్నాను. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Hyderabad News: హత్యల్లో.. కేజీఎఫ్‌ ఆయుధం!

తాజాగా.. హత్యలు, గొడవలు, దాడులకు నిందితులు ‘సుత్తి’ ఆయుధంగా ఉపయోగించటం చర్చనీయాంశంగా మారింది. మీర్‌పేట్‌ ప్రశాంత్‌హిల్స్‌లో శ్వేతారెడ్డి అనే మహిళ ప్రియుడు యశ్మకుమార్‌ను ఫేస్‌బుక్‌ స్నేహితుడు అశోక్‌తో హత్య చేయించటం సంచలనంగా మారింది. ఈ ఘటనలో నిందితులు సుత్తితో యశ్మకుమార్‌ తల వెనుక భాగంలో పలుమార్లు గట్టిగా కొట్టడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చికిత్స పొందుతూ మరణించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మాతృభాషలో మాట్లాడాలి.. అన్ని భాషల్ని గౌరవించాలి: సుధామూర్తి

మాతృభాషలో మాట్లాడాలి.. అన్ని భాషలను గౌరవించాలని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌, రచయిత్రి సుధామూర్తి అన్నారు. సుధామూర్తి ఆంగ్లంలో రాసిన పుస్తకాన్ని ఆలిండియా రేడియో విశ్రాంత డైరెక్టర్‌ మంజులూరి కృష్ణకుమారి ‘రెండు కొమ్ముల రుషి’ పేరిట తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకావిష్కరణ సభ శుక్రవారం బంజారాహిల్స్‌లోని ‘సప్తపరిణి’లో జరిగింది. సుధామూర్తితోపాటు ‘ఈనాడు’ సంపాదకులు ఎం.నాగేశ్వరరావు, సీఎం సలహాదారు ఏకే ఖాన్‌, ప్రచురణకర్తలు అశోక్‌కుమార్‌, అరవింద్‌ పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అమిత్‌షా జీ.. ఇది కేంద్ర ప్రభుత్వ కపటత్వం కాదా?: ఎమ్మెల్సీ కవిత

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇవాళ తెలంగాణకు రానున్న నేపథ్యంలో తెరాస ఎమ్మెల్సీ కవిత ట్విటర్‌ వేదికగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘రూ.3వేల కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్‌ కమిషన్‌ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు?బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ రూ. 1,350 కోట్లు, జీఎస్టీ పరిహారం రూ. 2,247కోట్ల సంగతేంటి? ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బనానికి మీ సమాధానం ఏంటి? భాజపా ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెరిగిన నిరుద్యోగం, మతపరమైన అల్లర్లపై ఏం చెబుతారు?పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వడివడిగా వనస్థలిపురం వైపు

మెట్రోతో మెరుగైన ప్రజారవాణా.. ఒకవైపు విజయవాడ జాతీయ రహదారి.. మరోవైపు సాగర్‌ హైవే.. ఓఆర్‌ఆర్‌తో ప్రధాన రహదారులతో అనుసంధానం..ఫ్లైఓవర్లు, అండర్‌పాసులతో తొలగిన ట్రాఫిక్‌ ఇక్కట్లు.. చేరువలో మల్టీఫ్లెక్స్‌లు, షాపింగ్‌ మాల్స్‌... అన్నింటికీ మించి బడ్జెట్‌ ధరల్లో వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌, గేటెడ్‌ కమ్యూనిటీలో విల్లాలు లభిస్తుండటంతో తూర్పు హైదరాబాద్‌ను అందుబాటు ధరల స్థిరాస్తి మార్కెట్‌గా భావిస్తున్నారు. నివాసయోగ్యమైన ప్రాంతంగా స్థిరాస్తులను కొనుగోలు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని