Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 16 May 2022 09:08 IST

1. మైలేజీ తగ్గితే జీతం నుంచి రికవరీ

బస్‌ మైలేజీ తగ్గినందుకు బాధ్యత వహించాలని.. అదనంగా వినియోగించిన డీజిల్‌కు అయిన వ్యయాన్ని జీతం నుంచి రికవరీ చేస్తామని పేర్కొంటూ ఆర్టీసీ డ్రైవర్లకు కొన్ని జిల్లాల్లో డిపో మేనేజర్లు తాఖీదులిస్తున్నారు. అయితే మైలేజీ తగ్గడానికి కారణాలను పరిశీలించకుండా నేరుగా జీతం నుంచి రికవరీ చేస్తామనడం ఏమిటని డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. విశాఖపట్నం నగర పరిధిలోని సింహాచలం, అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి డిపోనకు చెందిన కొందరు డ్రైవర్లకు ఇటువంటి తాఖీదులు ఇచ్చినట్లు బయటపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మూడేళ్లలో ఏం చేశారు?

2. ప్రైవేటు ప్రాక్టీసుకు వీల్లేదు!

 ఇక నుంచి నియమితులయ్యే ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయడానికి వీల్లేదు. కొత్తగా చేపట్టబోయే నియామకాల్లో ఈ మేరకు నిబంధన అమలుచేయనున్నారు. ఇప్పటికే పనిచేస్తున్న వైద్యులకు ఈ నిబంధన వర్తించదు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన ప్రతిపాదిత దస్త్రంపై తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది. ఈ అంశం సహా నియామకాల్లో పాటించాల్సిన మార్గదర్శకాలపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయని వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బిర్యానీ బిల్లు రూ.3 లక్షలు..

బిర్యానీ కోసం రూ.3లక్షలు చెల్లించినట్లు నకిలీ బిల్లు పెట్టాడో కాంట్రాక్టర్‌. ఈ  ఘటన పశ్చిమబెంగాల్‌లోని కత్వా సబ్‌డివిజనల్‌ ఆస్పత్రిలో జరిగింది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా సౌవిక్‌ ఆలం ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను చూసి షాకయ్యారు. బిర్యానీ కోసం దాదాపు రూ.3 లక్షలు వెచ్చించినట్లు ఓ కాంట్రాక్టర్‌ బిల్లు దాఖలు చేశాడు. కింగ్‌షుక్‌ అనే కాంట్రాక్టర్‌ ఆస్పత్రికి వివిధ రకాలైన వస్తువులను సరఫరా చేస్తాడు. ఫర్నిచర్‌, ఫార్మసీ, కారు ఖర్చుతో పాటు అనేక ఇతర బిల్లులను కలిపి సుమారు రూ.3 కోట్లు పెట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తుపాకీకి ఎదురొడ్డి... నేతాజీని కాపాడి!

ఆయన రక్తం ఇవ్వమని అడిగారు. ప్రతిగా స్వాతంత్య్రం ఇస్తామన్నారు. ఇంకేం ఇనుప కండలు... ఉక్కు నరాలు కలిగిన వేల మంది యువకులు పొలోమంటూ ఆయన్ని చేరుకున్నారు. వారితో ఒక సైన్యమే తయారైంది. తన మాతృభూమిని ఆంగ్లేయ సంకెళ్ల నుంచి విముక్తం చేస్తానన్న యుగపురుషుడిని ఆ సైన్యంలోని ఒక సైనికుడు అమితంగా ఆరాధించాడు. ఆయన చుట్టూ ఒక కోటలా నిలిచాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. టర్న్‌కీ సూత్రధారి శేఖర్‌రెడ్డే

ఆంధ్రప్రదేశ్‌లోని ఇసుక తవ్వకాలు, వ్యాపారాన్ని గుప్పిట్లో పెట్టుకున్న టర్న్‌కీ ఎంటర్‌ప్రైజ్‌ సంస్థ.. తమిళనాడులో ఇసుక దందాలకు పేరొందిన శేఖర్‌రెడ్డిదేనని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. ఆ సంస్థ డైరెక్టరు బోసాని శ్రీనివాసరెడ్డి శేఖర్‌రెడ్డికి వ్యాపార భాగస్వామి, అత్యంత సన్నిహితుడని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో శేఖర్‌రెడ్డికి సంబంధించిన వందల కోట్ల రూపాయల నోట్ల కట్టలు, బంగారాన్ని ఆదాయ పన్నుశాఖ స్వాధీనం చేసుకుందని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* దోమల మందుకూ డబ్బుల్లేవ్‌!

6. పుతిన్‌కు తీవ్ర అనారోగ్యం..!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నారని, రక్త కేన్సర్‌తో ఆయన ఆరోగ్యం దెబ్బతిందని బ్రిటన్‌ మాజీ గూఢచారి క్రిస్టఫర్‌ స్టీల్‌ వెల్లడించారు. దీనిని ఉక్రెయిన్‌ యుద్ధంతో ముడిపెడుతూ అమెరికాకు చెందిన ఒక మేగజీన్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘కచ్చితంగా ఆయన అనారోగ్య సమస్య ఏమిటనేది తెలియదు. అది నయమయ్యేదేనా, కాదా అనేదీ తెలియదు. కానీ యుద్ధ సమీకరణాల్లో అదీ ఒక భాగమే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఈ టూరిస్ట్‌ గైడ్‌ ఫీజు రూ.కోట్లు

అమెరికా అధ్యక్షుడు మొదలు అంతర్జాతీయ స్థాయి కోటీశ్వరుల వరకు విహార యాత్రలకు వెళ్లాలంటే ఈమెను సంప్రదిస్తారు. ఆ పర్యటనను వారికి మరువలేని జ్ఞాపకంగా మార్చేస్తుందీమె.  అందుకే తనను గైడ్‌గా ఎంచుకోవడానికి కోట్ల రూపాయలు చెల్లించడానికి సిద్ధపడతారు.   అమెరికాకు చెందిన 35 ఏళ్ల జాక్వెలిన్‌ సియన్నా ఇండియా  ఇంత గుర్తింపు ఎలా తెచ్చుకుందంటే... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అప్పులపై ఆంక్షలు సడలించండి

రాష్ట్రంలో నెలన్నరగా అప్పుల సేకరణపై ప్రతిష్టంభన నెలకొంది. ఫలితంగా అభివృద్ధి, సంక్షేమంపై తీవ్ర ప్రభావం పడుతోందని, తక్షణం ఆంక్షలు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని మరోసారి కోరింది. ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్‌ నిర్వహణ (ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ -ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం ప్రకారం, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నా రాష్ట్ర అభివృద్ధి రుణాలపై ఆంక్షలు విధించడంపై సరికాదని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రాజశేఖర్‌ ప్రోత్సాహం వల్లే చేశా!

‘‘నటిగా కొనసాగుతున్న రోజుల్లో ఎదురుగా నలుగురు ఉన్నారంటే అక్కడ తినేదాన్ని కూడా కాదు. మేకప్‌ రూమ్‌కి వెళ్లిపోయేదాన్ని. ఇప్పుడు ఎంత మంది ఉన్నా ఇది కావాలని ధైర్యంగా చెబుతా. దర్శకత్వం, నిర్మాణం మొదలుకొని ఎడిటింగ్‌ వరకు అన్ని పనులూ నాకు తెలుసు. దానికి కారణం రాజశేఖర్‌ అందించిన ప్రోత్సాహమే’’ అన్నారు జీవిత రాజశేఖర్‌. నటిగా వెండితెరపై తనదైన ముద్ర వేసిన ఆమె... దర్శకురాలిగా పలు విజయాలు అందుకున్నారు. తన భర్త రాజశేఖర్‌ కథానాయకుడిగా ‘శేఖర్‌’ తెరకెక్కించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అవుతారా... డ్రోన్‌ పైలట్‌!

ఇప్పుడు సందర్భం ఏదైనా సందడంతా డ్రోన్లదే. పెళ్లి బాజా, సినిమా షూటింగ్‌, రసాయనాల పిచికారీ, ఏరియల్‌ సర్వే, ఔషధాల సరఫరా, విత్తనాలు చల్లడం... ఇలా అన్ని వ్యవహారాలనూ డ్రోన్లు చక్కబెట్టేస్తున్నాయి. వీటికి మార్గనిర్దేశం చేస్తే చాలు. పక్కాగా పని పూర్తయిపోతుంది. అయితే ఇవి లక్ష్యం దిశగా దూసుకుపోవాలంటే ఏం చేయాలి? ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించేవాళ్లే డ్రోన్‌ పైలట్లు. ప్రస్తుతం వీరికి గిరాకీ పెరిగింది. అందువల్ల ఆసక్తి ఉన్నవారు ఈ రంగంలో రాణించవచ్ఛు ఇందుకోసం పెద్ద విద్యార్హతలేమీ అవసరం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని